2011 లో నేనూ, పుస్తకం, నా పుస్తకాలు

2010వ సంవత్సరం నవంబరు ఆఖరు వారంలో, థాంక్స్‌గివింగ్ డే దీర్ఘవారాంతంలో నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. మిత్రుడు వాసిరెడ్డి నవీన్ ఇండియా నుంచి వస్తున్న మిత్రులతో పంపిన కొన్ని పుస్తకాలు అప్పుడే అందాయి. వంశీ ఆకుపచ్చని జ్ఞాపకం పుస్తకం చూసి ముచ్చటపడిపోయి పుస్తకం.నెట్‌కు ఒక వ్యాఖ్య పంపాను. ఆ వెంటనే బాపుగారి ఇడిగిడిగో బుడుగు చేతికొచ్చింది. ఆ పుస్తకం చూడగానే దానిగురించీ వ్రాయాలనిపించింది. తరువాత వారం అరుణ ఇండియానుంచి వస్తూ బోలెడు పుస్తకాలు తీసుకొచ్చింది. అవి కాక, అంతకుముందే మిత్రులు పంపించినవి, నేను నా అభిప్రాయం రాద్దామనుకొని బద్ధకిస్తున్నవి, రాస్తానని చెప్పినవి కొన్ని పుస్తకాలు అలమరల్లోంచి గుర్రుగా చూస్తూ కనిపించాయి. ఆ బకాయిలు చెల్లించేద్దామనిపించి మరి కొన్ని వ్రాశాను. నెల తిరిగేటప్పటికి పుస్తకానికి పుస్తకాల గురించి వ్రాయటం అలవాటుగా మారిపోయింది. వారానికి ఒకటి పోస్ట్ చేస్తే ఒక నెలకు సరిపడా పరిచయాలు రెడీ అయిపోయాయి. సౌమ్య, పూర్ణిమలు కాదనకుండా ప్రతీదీ పోస్ట్ చేయడానికి ఒప్పేసుకుని, ప్రూఫులు వాళ్ళే దిద్ది, ఫార్మాట్ చేసిపెట్టి ప్రచురిస్తున్నారు. పుస్తకంలో అతిథి స్థాయినుంచి, ఆస్థాన రచయితస్థాయికి మారిపోయాను.

soc.culture.indian.telugu రోజుల్లోనో, తెలుసా రోజుల్లోనో వారంవారం ఒక కథ పరిచయం చేద్దామని సంకల్పించాను కానీ కుదరలేదు. ఇప్పుడు తెలుగు నాడి పని ఎలాగూలేదు కాబట్టి కొన్నాళ్ళపాటు ఇష్టమైన పుస్తకాల గురించి వారంవారం వ్రాద్దాంలే అనుకొన్నాను. ఎలాగూ నాలుగువారాలకు సరిపడా ముందే వ్రాసేశాను కదా, ఇబ్బంది ఉండదులే అనుకొన్నాను. ప్రతి బుధవారమూ పోస్ట్ చేద్దామని ప్లాను. రెండు మూడు నెలలు బాగానే గడిచాయి. మామూలుగా ఉండే పని ఒత్తిళ్ళ వల్లా, బద్ధకం వల్లా, నెమ్మదిగా నాలుగువారాల కుషనూ ఖాళీ అయిపోయింది. వారాంతంలో వ్రాద్దామంటే కుదిరేది కాదు. సోమవారం వస్తుందంటే డెడ్‌లైన్ భయమే. అప్పుడప్పుడూ సౌమ్యకు శుక్రవారందాకా సాగదీసిన వారాలు ఉన్నాయి. సౌమ్య పర్వాలేదు లెండీ అనేసి మిగతా పోస్టుల షెడ్యూలు మార్చుకునేది. నవంబర్లో పుస్తకం సైటు డార్క్ ఐనప్పుడు, వారికంటే పెద్ద బ్రేక్ నేనే తీసుకొన్నాను. మధ్యలో ప్రయాణాలు, చేతికి ఆపరేషను, మామూలు ఈతిబాధలు వగైరాలన్నీ ఉన్నా, ఎట్లా ఐతేనేం, 2011లో పుస్తకం సైటుకు 52వారాలకు 52 పరిచయాలూ వ్రాయగలిగాను. ఐనా, వ్రాయాలనుకొన్న పుస్తకాల జాబితా పెరుగుతూనే ఉంటుంది.

నాకు నేనే పెట్టుకొన్న డెడ్‌లైన్లు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా, వ్రాసినవన్నీ సరదాపడే వ్రాశాను; నచ్చిన పుస్తకాలు, విషయాలు నేస్తాలతో పంచుకొంటున్న ఆనందంతోనే వ్రాశాను. ఇంతకు ముందు మంచి పుస్తకం చదివినప్పుడు ఎక్కువమందితో ఆ ఆనందం పంచుకోవటానికి వీలుండేది కాదు. పుస్తకం సైటు ఇప్పుడు ఆ కొరతను తీరుస్తుంది. నాకు చాలా ఆనందాన్నిస్తుంది. పుస్తకంలో మిగతా మిత్రులు పరిచయం చేస్తున్న పుస్తకాల గురించి తెలుసుకోవటం చాలా ఉత్తేజకరంగా ఉంటూంది.

దాదాపు ఇరవయ్యేళ్ళపాటు పత్రికలకు సంపాదకత్వం వహించటంతో ఎక్కడ ఏం చదివినా, ఇది నా పత్రికకూ, పాఠకులకు ఎలా ఉపయోగపడుతుంది అన్న ఆలోచన ఎప్పుడూ వెనకాల తారట్లాడుతూ ఉండేది. దాని బదులు ఇప్పుడు బాగున్న ఏ పుస్తకం చదువుతున్నా, ఈ పుస్తకాన్ని అందరికీ పరిచయం చేయటం ఎలా అన్న ఆలోచన వస్తూంది. ఐతే నాకోసం చదువుకుంటున్న పుస్తకాల గురించే వ్రాస్తున్నాను. పూర్వం రోజుల్లో వ్యాసానికి పేజ్‌వ్యూల కౌంటర్లు ఉన్నప్పుడు, నేను చాలా ఇష్టంగా చదివి ఇంకా ఇష్టంగా రాసిన పరిచయాల్ని చాలా తక్కువమంది చదవిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకోసారి, మామూలుగా వ్రాశాననుకొన్న కొన్ని పరిచయాలు ఎక్కువమందిని ఆకర్షించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకొంటే గత సంవర్సరం చదివిన పుస్తకాలు తక్కువే. ఇతర కారణాలకు తోడు పుస్తకానికి పరిచయాలు వ్రాయటానికి వెచ్చిస్తున్న కాలం కూడా ఒక కారణం కావచ్చు. రెండు దశాబ్దాలు పుస్తకంకోసం 2010లో కథాసంకలనాలు చాలా చదివినట్లు, ఈ సంవత్సరం ప్రత్యేకమైన పనులు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

ఈ సంవత్సరం చాలా మంది మిత్రులు నాకు పుస్తకాలు అందించారు. పుస్తకప్రియులు, స్నేహశీలి దేవినేని మధుసూదనరావుగారితో పరిచయమయ్యింది; ఆయన పనిగట్టుకొని చాలా పుస్తకాలు పంపించారు. మార్చ్ లో కిండిల్ కొనుక్కొని కన్నెగంటి రామారావు సాయంతో ఆబగా చాలా పుస్తకాలతో నింపాను కాని, దానితో ఒక్క పుస్తకమే చదివాను. కినిగె పుస్తకాలు రెండు చదివాను. ప్రింటయ్యీ మార్కెట్లో లేకుండా మాయమైన ఎం.ఎస్.రెడ్డి ఆత్మకథని ఇంటర్నెట్లో బూట్‌లెగ్ ప్రతి వివరాలు ఒక మిత్రుడు ఇవ్వగా చదివాను. ఇన్నయ్యగారి పలు పుస్తకాలు ఎలక్ట్రానిక్ కాపీలుగానే చదివాను. కొన్ని తెలుగు పుస్తకాలు కూడా ప్రచురణకు ముందు ఎలక్ట్రానిక్ కాపీలుగా వచ్చాయి.

గత సంవత్సరం చదివిన పుస్తకాల జాబితా గుర్తున్నంతవరకూ ఇస్తున్నాను. వీటిలో చాలా పుస్తకాలను నేను ఇక్కడ పరిచయం చేశాను. కొన్నిటిని ముందు ముందు పరిచయం చేయాలన్న కోరిక ఉంది. అందుచేత, పుస్తకాల గురించి పెద్దగా మాట్లాడ్డం లేదు.

English:

1. At Home: A short history of private life – Bill Bryson
2. I am a Stranger Here Myself – Notes on Returning to America – Bill Bryson చాలా కాలం ఇంగ్లండులో ఉండి అమెరికా తిరిగి వచ్చిన బిల్ బ్రైసన్ అమెరికన్ జీవితాన్ని కొత్త కళ్ళతో పరిశీలిస్తూ రాసిన హాస్యపు కాలంస్.
3. The Judas Gate – Jack Higgins – థ్రిల్లర్ నవల
4. How wars end: why we always fight the last battle – Gideon Rose – గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి గానీ, గతంపై పెడుతున్న శ్రద్ధ ఒకోసారి మనల్ని వర్తమానాన్ని సరిగ్గా అంచనా వేయనివ్వదు అని చెప్తుంది ఈ పుస్తకం.
5. Predictably irrational : the hidden forces that influence our decisions-Dan Ariely. మానవుడు తార్కికజీవి అని అనుకొంటాం కానీ చాలా పనులు తర్కానికి అతీతంగా చేస్తూ ఉంటాం. కొన్నిచోట్ల రూపాయి గురించి బేరాలాడేవాళ్ళం, ఇంకోసారి వందల రూపాయలగురించి పట్టించుకోము. ఎందుకు అలా చేస్తాం అన్న విషయాలను పరిశోధిస్తుంటాడు డాన్ యారియేలీ. చాలా ఆసక్తికరమైన పుస్తకం.
6. Limitations – Scott Turow మా ఊరి రచయిత; లాయరు; న్యాయస్థానాల చుట్టూ తిరిగే ఇతివృత్తాలతో, మంచి నాటకీయమైన పుస్తకాలు వ్రాస్తాడు.
7. The Burden of Proof – Scott Turow
8. 21 essential American short stories : క్లాసిక్ అమెరికన్ కథానికలు
9. Howards End – E.M. Forster : మర్చంట్ ఐవరీలు సినిమాగా తీశారు. మారుతున్న విక్టోరియన్ సమాజం ఇతివృత్తం
10. Moonwalking with Einstein : the art and science of memory – Joshua Foer
11. Maharanis : the extraordinary tale of four Indian princesses – Lucy Moore
12. Nickel and Dimed: on (not) getting by in America – Barbara Ehrenreich – ఫ్రీలాన్సు రచయిత్రి, కాలమిస్టు. మూడు నగరాలలో కనీస వేతనపు ఉద్యోగాలు (ఫాక్టరీ కార్మికురాలు, ఇళ్ళు తుడిచే మెయిడ్, వాల్మార్ట్ స్టోర్ క్లర్క్), ఒకోచోటా ఒక నెల పాటు, ఆ జీతంతోనే బతుకుతూ, పని చేసింది. అలాంటి ఉద్యోగాలు చేస్తున్న వారు కష్టపడి పని చేస్తున్నా వారి కనీస అవసరాలు కూడా తీరకపోవడం గురించి చర్చను లేవదీసిన పుస్తకం. ఈ పరిస్థితి భారతదేశంలోనూ ఉంది.
13. Stealing Mona Lisa : a mystery – Carson Morton : సరదాగా చదివించిన క్రైం నవల
14. The Submission – Amy Waldman
15. The Accidental Billionaires: the founding of Facebook – Ben Mezrich: Social Network చిత్రానికి ఆధారం.
16. A Voice in the Box: My Life in Radio – Bob Edwards. చాలా ఏళ్ళపాటు National Public Radio (NPR) ఉదయం ప్రోగ్రాము హోస్టుగా రోజూ నన్ను పొద్దున్నే నిద్రలేపిన బాబ్ ఎడ్వర్డ్స్ ఆత్మకథ.
17. Mithunam and Other Stories – K Chandrahaas, KK mahOpaatra
18. MS – A Life in Music – TJS George: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవిత కథ
19. The Spirit of Lagaan – Satyajit Bhatkal
20. Tiger’s Tale – Mansur Ali Khan Pataudi as told to Kenneth Wheeler
21. Catch 22 — Joseph Heller

తెలుగు:

కథలు:

ఆ కుటుంబంతో ఒక రోజు – జె యు బి వి ప్రసాద్
శ్యామ్‍యానా – మెడికో శ్యామ్ (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
అమెరికా ఇల్లాలి కథలు -చిమట కమల,
అమెరికా ఇల్లాలి కథలు -జొన్నలగడ్డ శ్యామల
కొండ కతలు – పేటశ్రీ
వేలుపిళ్ళై, మరి రెండు కథలు – సి. రామచంద్రరావు
మిత్తవ – మంచికంటి వెంకటేశ్వరరావు (ఈ పుస్తకం పై DTLC వారి సమీక్ష ఇక్కడ)
గజ ఈతరాలు – గొరుసు జగదీశ్వరరెడ్డి (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
గుండ్లకమ్మ తీరాన – కాట్రగడ్డ దయానంద్
మిథునం- శ్రీరమణ (మిథునం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు)
హనుమచ్ఛాస్త్రికథలు – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
జుమ్మా – వేంపల్లె షరీఫ్
వేల్చేరు చంద్రశేఖర్ కథలు (ఈ పుస్తకం గురించి వివినమూర్తి గారి అభిప్రాయలు ఇవిగో)
దివాణం సేరీవేట – పూసపాటి కృష్ణంరాజు
కథ 2010 (ఈ పుస్తకంపై DTLC సమీక్ష ఇక్కడ)
బీరకాయపీచు – కొడవటిగంటి కృష్ణమూర్తి
కలియుగ కృష్ణార్జునులు – పులిగండ్ల విశ్వనాథరావు
సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు
త్రిపుర కథలు – త్రిపుర
న్యూ బాంభే టైలర్స్, ఇతర కథలు – ఖదీర్‌బాబు
మూడో ముద్రణ — చంద్ర కన్నెగంటి
కృష్ణారెడ్డిగారి ఏనుగు — (అను) శాఖమూరు రామగోపాల్ (ఈ పుస్తకం ముందుమాట ఇక్కడ చదవండి)
సరిహద్దు – గొర్తి బ్రహ్మానందం
మా దిగువ గోదావరి కథలు – వంశీ
అరుదైన క్షణం – విన్నకోట రామచంద్ర కౌండిన్య
తానా తెలుగు కథ – (సం) ఏ.ఎస్. మూర్తి
కథాసాగర్ – (సం) ఎం.డి. సుభాన్
నూరేళ్ళ తెలుగు కథ – మహమ్మద్ ఖదీర్ బాబు

నవలలు
నేనూ-చీకటీ – కాశీభట్ల వేణుగోపాల్ (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన పరిచయం ఇక్కడ)
రామరాజ్యానికి రహదారి – పాలగుమ్మి పద్మరాజు
సత్యభామ – యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
వాళ్ళు… వీళ్ళు… పారిజాతాలు — చంద్రలత
మహి – కుప్పిలి పద్మ
ఇంద్రధనస్సు – వల్లంపాటి వెంకటసుబ్బయ్య
కళ్ళు తెరిచిన సీత – రంగనాయకమ్మ
తేరా నామ్ ఏక్ సహారా?! – నరేష్ నున్నా (మరో పరిచయం ఇక్కడ)
మరో హృదయం, మరో ఉదయం – డా. కనుపూరి శ్రీనివాసులు రెడ్డి

చరిత్ర
కథలు-గాథలు – దిగవల్లి వెంకట శివరావు
ఆనాటి గుంటూరు జిల్లా – ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ / ఎన్. ఇన్నయ్య (అను)
సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు -బంగోరె
భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు (ఈ పుస్తకంఫై ఒక పరిచయం ఇక్కడ)

జీవిత కథలు
సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు – ఎన్.ఇన్నయ్య (ఈ పుస్తకం ఒక వ్యాసం ఇక్కడ)
నేను కలిసిన ముఖ్యమంత్రులు, మానవవాదులు – ఎన్ ఇన్నయ్య (ఈ పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ)
స్వర్ణయుగ సంగీతదర్శకులు (1931-1981) – పులగం చిన్నారాయణ
మధుమురళి – అనితర సాధ్య గాన రవళి
మా నాన్నగారు -(సం) ద్వానా శాస్త్రి
పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
కవి సంధ్య; ‘మో’ కవితా వీక్షణం
శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు షష్టిపూర్తి సంచిక
బొమ్మా బొరుసూ
బాపు బొమ్మల కొలువు

ఆత్మకథలు
నెంబర్ వన్ పుడింగి – నామిని
నా జీవిత చరిత్ర – విన్నకోట వెంకటేశ్వరరావు
గురవాయణం – డా. గురవారెడ్డి
ముక్కోతి కొమ్మచ్చి – ముళ్ళపూడి వెంకటరమణ (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి
యాత్రాస్మృతి – దాశరథి కృష్ణమాచార్య
నా రేడియో అనుభవాలు – శారదా శ్రీనివాసన్ (ఈ పుస్తకం గురించిన చర్చ ఇక్కడ)
ఆత్మచరితము – ఏడిదము సత్యవతి
ఇదీ నా కథ – మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి
నా యెఱుక – అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (ఆదిభట్ల వారి జీవితచరిత్ర గురించి ఇదివరలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ)
నా అమెరికా అనుభవాలు – వేమూరి వెంకటేశ్వరరావు
అమ్మమ్మ చదువు – సుధామూర్తి

కవిత్వం
పణవిపణి – నళినీకుమార్
శబ్బాష్‌రా శంకరా! – తనికెళ్ళ భరణి (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ)
నక్షత్ర దర్శనం – తనికెళ్ళ భరణి(ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ)
తెలుగమ్మ శతకం – జొన్నలగడ్డ రామలింగేశ్వరరావు
శరద్ద్యుతి – శొంటి శారదాపూర్ణ
నీ కోసం – డా. కనుపూరి శ్రీనివాసులు రెడ్డి
శివతాండవం – సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు
వానలో కొబ్బరి చెట్టు – హెచ్చార్కె

సంకలనాలు
మాతృషోడశి (అమ్మపదం -2) – (సం) ఘంటసాల నిర్మల
తెలుగు పద్యమూ – మా నాన్న – కోట పురుషోత్తం
మా అన్న డాక్టరు వెంకట సుబ్బయ్య – సాకం నాగరాజ
వైతాళికులు – ముద్దుకృష్ణ (వ్యాసం రెండో భాగం ఇక్కడ)

అనువాదాలు
చివరకు మిగిలింది – (అను) ఎం.వి.రమణారెడ్డి
విరాట్ – స్టెఫాన్ త్స్వైక్ (దీనిపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు – ఇక్కడ మరియు ఇక్కడ)
గీతాంజలి – (అను) డా. కనుపూరి శ్రీనివాసులు రెడ్డి

తత్వం
ప్రతీచి లేఖలు – శొంటి శారదాపూర్ణ
సూతపురాణం (వచనం) – రెండు భాగాలు – త్రిపురనేని రామస్వామి చౌదరి /బి.రామకృష్ణ

Flipkart.com
All Categories
Books
Mobiles & Accessories
Computers
Cameras
Games & Consoles
Movies & TV Shows
Music
MP3 Players & iPods
Personal & Health Care
Home & Kitchen
TVs & Video Players
Pens & Diaries

వ్యాఖ్యానం
రామాయణంలో హనుమంతుడు – ఉషశ్రీ (ఈ పుస్తకం గురించి చంద్రహాస్ గారి వ్యాసం ఇక్కడ చదవండి)
మృచ్ఛకటికం – బేతవోలు రామబ్రహ్మం (వ్యాఖ్యానం)

You Might Also Like

4 Comments

  1. p.babji

    సర్, నాకు ఎంతో సాహిత్యం తో పరిచయం ఉందని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను ,కాని మిమ్మల్ని, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీరు చదువుతున్న సాహిత్యాన్ని చూస్తూ ఉంటె నాకు చాలా సిగ్గు గా ఉంది. మీరు పరాయి దేశం లో ఉంటూ మీ సాహిత్యాభిలాష నాకు అసూయ గా ఉంది.

  2. buchi reddy

    sir
    i want talk to you about some telugu books– plz call me
    thanks

    buchi reddy
    9494579966
    hanamkonda@aol.com

  3. రామ

    మేము చదువుకుంటే ఇంకా బాగుంటుంది కాని, మా తరపున మీరు చదివి చాల వాటికి పరిచయాలు వ్రాసి, ఎప్పటికైనా ఇవి చదవాలని కోరిక పుట్టించినందుకు జంపాల గారికి కృతఙ్ఞతలు.

  4. ఆ.సౌమ్య

    ఏంటండీ ఇవన్నీ చదివారా! చాలావాటికి సమీక్షలు రాసారా! నేనింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోతున్నాను…ఇదెలా సాధ్యం! ఎప్పటికైనా నా వల్ల అవుతుందా!

    2011 లో నేను చదివిన పది పుస్తకాలకే చాలా గొప్పైపోయాను…ఇప్పుడు మీ లిస్ట్ చూసాకా సిగ్గేస్తోంది. Hats off to you sir!

Leave a Reply