చెప్పాలని ఉందా?

ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?

అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.

ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!

139 Comments

  1. సత్య మూర్తి

    ఆర్య,
    శ్రీ పిస్సార్
    అప్పారావు రచించిన
    నాట్యశాస్త్రం (గుప్తభావప్రకాశికసహితం) hard copy
    పుస్తకం లభ్యత తెలిపి కొనుగొలుకై సహయపడగలరు.
    సత్యమూర్తి

  2. M. Aruna

    నమస్తే అండి

    పుస్తకాల మీద అభిప్రాయాలు రాయాలి అని తపన…ఎలా అన్నది తెలియట్లేదు..ఎక్కువగా…వాట్సాప్ grps లో చర్చించడమే
    ఒక దిశా నిర్దేశం చేయగలరు

    1. సౌమ్య

      అరుణ గారికి, ఇక్కడ ఉన్న కొన్ని వ్యాసాలు చూడండి, ఆపైన మీరు ఆల్రెడీ గ్రూపుల్లో చర్చిస్తున్నాను అన్నారు, చర్చలనే కలిపి ఓ వ్యాసంగా మార్చి editor@pustakam.net కు పంపండి.

  3. Jagannadhacharyulu.b

    “పలనాటి కవుల చరిత్ర”గురించి పి.ఆర్. తమిరిగారి వ్యాఖ్య క్లుప్తంగా బాగుంది.

  4. చైతన్య

    మీ పుస్తకం వేదిక చాలా పుస్తకాలను సవివరంగా పరిచయం చేస్తుంది…తెలుగు విద్యార్థులు చదవాలిసిన వాటిలో మేటిది.
    http://sskchaithanya.blogspot.com

  5. M.Rangacharyulu

    ఈ website చాలా బావుంది. తెలుగు సాషిత్యపిపాసకులకు సౌకర్యంగా ఉంది.

  6. VSTSayee

    http://www.andhrabharati.com/kIrtanalu/annamayya/index.php

    తాళ్లపాక పదసాహిత్యము: అన్నమాచార్యుల, పెదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల సంకీర్తనలు “ఆంధ్రభారతి”లో పైనచెప్పిన లింకువద్ద వెదకుటకు, చదువుటకు వీలుగా ఉంచాము.
    వీటిలో కొన్నింటికి ఆడియోలు ఉన్నాయి; కొన్నిరోజులలో వాటిని వినుటకు అందుబాటులోనికి తెస్తాము.

    ఇప్పటికే “ఆంధ్రభారతి”లో ఉన్న తాళ్లపాకకవుల రచనలు –
    అన్నమాచార్యుల “శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము” – http://andhrabharati.com/shatakamulu/vEMkaTEshvara/index.html
    అన్నమాచార్యుల “శృంగార మంజరి” – http://andhrabharati.com/kAvyamulu/shRiMgAra_maMjari/index.html
    పెదతిరుమలాచార్యుల “వేంకటేశ శతకము” – http://andhrabharati.com/shatakamulu/vEMkaTEsha/index.html
    పెదతిరుమలాచార్యుల “సుదర్శన రగడ” – http://andhrabharati.com/dEshi/ragaDalu/sudarSana_ragaDa.html

    మిగిలిన లభ్యరచనలన్నింటినీ డిజిటైజ్ చేస్తున్నాము – వాటినికూడా త్వరలోనే అందుబాటులోనికి తెస్తాము.

    మీ సూచనలు పంచుకోప్రార్థన.

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి

  7. Penchalaiah Vaddi

    సర్
    మీ దగ్గర వున్న పిడిఎఫ్ అమరకోశం పంపగలర?

  8. వాడపల్లి శేషతల్పశాయి

    http://www.andhrabharati.com/itihAsamulu/bhAratamu/index.html

    కవిత్రయప్రణీత శ్రీమహాభారతము – ఆదిపంచకము (ఆది, సభా, ఆరణ్య, విరాట, ఉద్యోగపర్వములు) ఆంధ్రభారతిలో పైనచెప్పిన లింకువద్ద చదువుకోవచ్చును. మిగతా పర్వము లన్నింటినీ త్వరలోనే అందుబాటులోనికి తెస్తాము.

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి.

  9. సువర్చల చింతలచెరువు

    జీవితంపై ఇష్టం కలిగించేలా వేకువనే భూపాలరాగంలా తట్టిలేపే జీవనగీతాలు వారణాసి నాగలక్ష్మి గారి “వేకువపాట”లోని కథలు. నిరంతరం ఆలపించాల్సిన ఓ పాట జీవితం అంటారు రచయిత్రి. జీవితమే ఓ పాట అయినప్పుడు , శృతితప్పని రాగాలకోసం నిరంతరం మనం చేయాల్సిన మానసిక సాధన ఎంత ముఖ్యమో చెప్పేవే ఈ కథలు.
    పాటకోసం గొంతునెలా సవరించుకుంటామో, మనుగడ కోసం కూడా మన మనస్తత్వాలని సవరించుకోవాలన్న గొప్ప పాఠం వేకువపాట.
    ఇందులో కథలు పాఠకుల్ని ఆలోచనల్లో పడేసి ఎక్కువ సమయాన్ని తీసుకునేవికావు. ప్రతి కథనీ చదువుతూనే మనమెలా ఉండాలో నిశ్చయమైపోయేలా ఉంటాయి. అలాగనీ కథనమంతా గాంభీర్యంతో, సమస్యల్ని భూతద్దాలతో చూపించి “ఇంత కఠినంగా ఉంటుందా జీవితం!?” అనిపించేలా ఉండదు. మనసైన మాటలతో నెమ్మదిగా సర్దిచెప్తున్న ధోరణిలో ఉంటుంది. విభిన్న కథాంశాలైనప్పటికీ భాషలో ఆర్ద్రత, మృదుత్వం వీడకుండా, రచయిత్రి మానసిక పరిపూర్ణత కథలనిండా తొణికిసలాడుతూ జీవితంపై ప్రేమని పెంచేలాఉంటుంది. మన చేయిపట్టుకొని నడిపించేలా ఉంటుంది. కొన్ని కథల్లో పదశైలి హాయిగా, ఆహ్లాదంగా, నిండైన భావుకతతో సరికొత్తగా మనసు చిగురించేలా ఉంటుంది. మరి అంత చక్కని, చిక్కని కథనంతో సాగే ఈ కథల సంపుటి “వేకువపాట” ని మనకు అందించినందుకు వారణాసి నాగలక్ష్మి గారికి అభివాదాలు!!

  10. Nagabhushanam Sunkara

    Andhra Jyothy – ViViDha
    09-Nov-2015

    http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MTEwOTExMDkwMTMzMjc5ODMuanBn&day=20151109

    శ్రీశ్రీ బుద్ధిగా హోంవర్క్‌ చేశాడు

    పర్లాకిమిడిలో పుట్టి విజయనగరం, విశాఖపట్నంలోచదువుకుని లండన్‌లో స్థిరపడిన సాహితీ పిపాసి గూటాల కృష్ణమూర్తి. అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు సాహితీ రంగాలకు ఆయన చేసిన సేవలుఎనలేనివి. తన లండన జీవితం నుంచి శ్రీశ్రీ మహాప్రస్థానం చేతిరాత ప్రతి ప్రచురణ వరకూ వివిధ అంశాలపై చెదరని జ్ఞాపకాలతో తొమ్మిది పదులు దాటిన వయస్సులోనూ ఆయన గలగలా మాట్లాడారు. గూటాల కృష్ణమూర్తితో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రెండు గంటలకుపైగా చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలివి….

  11. Anil battula

    సొవియట్ తెలుగు పుస్తకాలు ఈ క్రింది బ్లాగ్ లొ ఉచితంగా చదువుకొవచ్హు.
    Read Soviet Telugu translations for free in below blog link.
    బ్లాగ్ లింక్: http://sovietbooksintelugu.blogspot.in/

  12. sanatha kumar reddy

    vijayawada lo pusthaka pradharsana jaruguthundhi bhari ga…350 stalls last year kanna ekkuva….last year kanna ekkuva days jan strt nundi 27 r 29 varaku anukunta…pusthaka priyulaki pandaga la vuntadhi go nd enjoy dear readers…:-)

  13. Bhanu Prakash

    శ్రీకాకుళం జిల్లా కైఫియత్ లు తెలుగు లో ఎక్కడ దొరుకుతాయో ఎవరైనా చెప్పగలరు. మొన్న నే ఎవరొ ఫేస్ బుక్ లో తెలుగు అన్ని జిల్లాల కైఫియత్ లు షేర్ చేసారు ఎంత వెదికినా దొరకడం లేదు.

  14. రవి

    సంస్కృత పుస్తకం భరతముని నాట్యశాస్త్రానికి పుల్లెల రామచంద్రుడు గారి తెలుగు వ్యాఖ్యానం ఈ సంవత్సరం విడుదల అయ్యింది. వెల 650/-. ఆసక్తి ఉన్న వాళ్ళు పుస్తకాల అంగళ్ళను సంప్రదించండి.

  15. Sowmya

    ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు మరణించారు.
    వార్త: http://www.andhrajyothy.com/Artical.aspx?SID=45865&SupID=31
    ఆవిడ సాహితీ కృషి గురించి తూలిక.నెట్ ఆంగ్ల వెబ్సైటులో వ్యాసం ఇక్కడ: : http://thulika.net/?p=1570

  16. sreenivasudu

    ఆర్యా,
    నా పేరు శ్రీనివాసుడు, నేనొక చదువరిని.

    మీ జాలగూడులో పేరు నమోదు చేసుకుని, ఏదైనా చెప్పాలంటే ఎలా? నమోదు బొత్తాం కనబడలేదు. అందుకే మీ విద్యుల్లేఖకు వ్రాస్తున్నాను.

    ఫణిహారం వల్లభాచార్య రచన ‘‘మెరీనా, ఓ మెరీనా’’ కథ ఎక్కడ లభ్యమగునో చెప్పవలసినదిగా మనవి.

    ఖలీల్ జీబ్రాన్ రచన ‘‘జీసస్ ది సన్ ఆఫ్ మ్యాన్’’ ను తెలుగులో ఎవరైనా అనువదించారా? తెలిసినచో దయచేసి చెప్పగలరు.
    Jesus the Son of Man —– Author: Kahlil Gibran

    అలాగే మరొక్క విన్నపం,
    ఓ ముప్ఫై, నలభై ఏళ్ళకు పూర్వం ఎమెస్కో పాకెట్ సీరీస్ లో గ్రంథచౌర్యం ఇతివృత్తముగా వొక అధ్భుతమైన వ్యంగ నవల వెలువడింది. అయితే, దాని పేరు నాకు గుర్తు లేదు. సాహితీ మిత్రులెవరైనా అది చదివినట్లయితే దాని పేరును తెలియజేయగలరు.

    మప్పిదాలతో
    శ్రీనివాసుడు.

  17. శ్రీనివాసుడు

    ఆర్యా,
    నా పేరు శ్రీనివాసుడు, నేనొక చదువరిని.

    ఫణిహారం వల్లభాచార్య రచన ‘‘మెరీనా, ఓ మెరీనా’’ కథ ఎక్కడ లభ్యమగునో చెప్పవలసినదిగా మనవి.

    ఖలీల్ జీబ్రాన్ రచన ‘‘జీసస్ ది సన్ ఆఫ్ మ్యాన్’’ ను తెలుగులో ఎవరైనా అనువదించారా? తెలిసినచో దయచేసి చెప్పగలరు.
    Jesus the Son of Man —– Author: Kahlil Gibran

    అలాగే మరొక్క విన్నపం,
    ఓ ముప్ఫై, నలభై ఏళ్ళకు పూర్వం ఎమెస్కో పాకెట్ సీరీస్ లో గ్రంథచౌర్యం ఇతివృత్తముగా వొక అధ్భుతమైన వ్యంగ నవల వెలువడింది. అయితే, దాని పేరు నాకు గుర్తు లేదు. సాహితీ మిత్రులెవరైనా అది చదివినట్లయితే దాని పేరును తెలియజేయగలరు.

    మప్పిదాలతో
    శ్రీనివాసుడు.

    1. ఏల్చూరి మురళీధరరావు

      శ్రీనివాసుడు గారికి
      నమస్కారములతో,

      మీ యీ లేఖను నేను ఈరోజే చూశాను. ఈ పేజీకి ముందువెనుకలలో దీనికి ఎవరైనా ఇప్పటికే సమాధానం వ్రాసి ఉంటే మన్నించండి. మీరడిగిన వ్యంగ్య నవల శ్రీ నండూరి పార్థసారథి గారి సాహిత్య హింసావలోకనం.

  18. bhanukemburi

    పుస్తకం డాట్ నెట్ వారికి నా నమస్కారాలు, అసలు పుస్తకాలు యెలా చదవాలి,యెలా చదివితే వాటిలొని విషయాలని మనం గుర్తుపెట్టుకోవచ్చు, యెలా చదివితే మనం కూడా భవిష్యత్తు లొ పుస్తాకాలు రాయగలం ఇలాంటివి చెప్పే పుస్తకాలు యెమైనా ఉన్నాయా, నా ఈ ప్రస్నా చదివి నీ పుస్తకం నీ ఇష్టమంవచ్చినట్టూ చదువుకొ అది కూడా యెవరైనా రాస్తారా అని అనుకొ వచ్చు, ఒక వేల యెవరైనా రాస్తెయ్ చెప్పగలరు, లెదా నా ప్రస్నకి మీ కామెంట్స్ రూపం లొ నైనా సమాధానం ఇవ్వగలరు.
    ఈ ప్రస్న మంచిదా కాదా అని అనుమానం ఐతెయ్ ఉంది కాని అడగక ఉండలేని తనం నాకు చిన్నప్పటినుంచి ఉంది..సహ్రుదయం తో చెప్పగలరు

  19. bhanuprakash

    @పరుచూరి శ్రీనివాస్ గారు మీరిచ్చిన వివరాలకి క్రుతజ్ఞతలు, ఆ పుస్తకాలు ఆన్లైన్ లొ గాని లెదా హైదరబాద్ లొ గాని బెంగులూరు లొ గాని యెక్కద దొరుకుతాయొ చెప్పగలరు

  20. bhanukemburi

    పుస్తకం దాట్ నెట్ వారికి నమస్కారం, నాకు వాల్మీకి రామయణం 24000 శ్లోకాలు వాటి తాత్పర్యం తెలుగు లో ఉండే పుస్తకం కావాలి, అలాంటి బుక్ యేదైనా ఉంటె అది యెక్కడ దొరుకుతుందొ చెప్పగలరు.

    1. పరుచూరి శ్రీనివాస్

      > వాల్మీకి రామయణం … తాత్పర్యం తెలుగు లో ఉండే పుస్తకం కావాలి
      తెలుగువాళ్ళ అదృష్టమేమంటే పుల్లెల శ్రీరామచంద్రుడుగారు తెలుగుదేశంలో పుట్టడం! ఆయన ఒక్కరే గత 50-60 ఏళ్లలో చేసిన పని, ముఖ్యంగా సంస్కృతంలో వున్న పుస్తకాలని సరళమైన తెలుగులో, అదికూడా ఒక్క అచ్చుతప్పూ లేకుండా అందించడం, అన్ని యూనివర్సిటీలు కలిపి కూడా చేయలేకపోయాయి. ఆయన 6 సంపుటాలలో – సుమారు 4500 పేజీలు – “బాలానందినీ” వ్యాఖ్యానంతో చేసిన “శ్రీమద్రామాయణం” చూడండి. ప్రతి శ్లోకానికి తెలుగు తాత్పర్యం కూడా వుంటుంది. మార్కెట్లో తేలికగా దొరుకుతుంది.

  21. Purnima

    అమెజాన్.ఇన్ వాళ్ళు హింది పుస్తకాల సెక్షన్ మొదలెట్టారు. అంటే, నాబోటి వాళ్ళకి పెద్ద పండుగన్న మాట. హింది పుస్తకాలను దొరకపుచ్చుకోడానికి నానాయాతనా పడేవాళ్ళకి ఇదో పెద్ద ఊరట. రీసెంట్ లాంచ్ కాబట్టి, కలెక్షణ్ మరీ ఎక్కువగా లేదు. ఉన్నంతలో నేను వెతుకుతున్నవి బానే కనిపించాయి.

    లింక్ ఇది.

Leave a Reply