చెప్పాలని ఉందా?-2
ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?
అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.
ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!
ఇప్పటి వరకూ వచ్చిన వ్యాఖ్యలను ఇక్కడ చూడండి..
K. Chandrahas
Landmark sale పొడిగించారు. నిన్న సోమాజిగూడ షాపుకెళ్తే, అక్కడ తెలిసింది సేల్ ఇంకొన్నాళ్ళుంటుందని. ఈరోజు బంజారా హిల్ల్స్ రోడ్ నంబరు 12 షాపుకెళ్తే, పుస్తకాల రేట్లు ఇంకా slash చేశారు. ఇంతకుముందు రు.199, రు.99, రు.49 అని పుస్తకాలు అమ్మారు. ఇప్పుడు రు.199 తీసేశారు. అన్నీ రు.99, రు.49. పైగా రు.99కి తగ్గించినవి ఐదు పుస్తకాలు కొంటే రు.399 మాత్రమే. ఈ రోజు 5 పుస్తకాలు కొన్నాను. వాటి అసలు వెల రు.2000. నేను చెల్లించింది రు.399. మంచి పుస్తకాలు. చాలా ఆనందంగా వుంది. మళ్ళీ వెళ్ళాలి.
dvenkat
అనిసెట్టి సుబ్బారావు పై ఒక వ్యాసం ‘సాక్షి’ లో ఇక్కడ చదవండి
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=29384&Categoryid=1&subcatid=3
సౌమ్య
ఆదివారం సాయంత్రం ఐదుగంటలకి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వంగూరి చిట్టెన్ రాజు గారి “అమెరికాకమ్మ కథలు” పుస్తకావిష్కరణ, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలకు ఆత్మీయ సత్కారం జరగనున్నాయి. వివరాలకి >a href=”http://pustakam.net/wp-content/uploads/2011/10/Akakamma-kathalu-Book-Reelase-Invitation-Hyderabad.pdf”>ఇక్కడ చూడండి.
పుస్తకం.నెట్
“2005లో మల్లాది వారి శతజయంతి సందర్భంగా.. ప్రముఖ రచయితలు వివిధ పత్రికలలో వ్యాసాలు, పద్యాలు, గేయాల రూపేణా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పరమపదించినప్పుడు అర్పించిన నివాళులను, కొంతమంది ఈ తరం రచయితలు వారి గురించి రాసిన వ్యాసాలను “ఏ. పీ. సినీ రైటర్స్ అసోసియేషన్” వారు సంకలనంగా ప్రచురించారు. అదే “మణి దీపం”. సంకలన బాధ్యతను సినీ గీత రచయిత కులశేఖర్ వహించారు. ఆ మణి దీపపు కాంతి రేఖల్లో కాసిని ఇక్కడ..”
http://kothavakaya.blogspot.com/2011/10/blog-post_18.html
dvenkat
ఈ మధ్య చదివిన మంచి కోట్ ‘పుస్తకాలు చదవని వారికి పుస్తకాలు చదవలేని వారికి తేడా లేదు.’
Srinivas
మీ పోస్టంగ్స్ చాలా బావున్నవి. సర్! మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ప్రారంభంలో వ్రాసిన దూరం అనే నవల ఎక్కడ లబిస్తుందో తెలియచేయగలరని మనవి
జంపాల చౌదరి
Purnima:
You beat me to it.
YOSSARIAN LIVES!
50th anniversary of the first publication of Catch-22!
http://en.wikipedia.org/wiki/Catch-22
Purnima
For Catch-22 fans..
an animation series!
http://www.thenewsignificance.com/2011/10/11/will-rycroft-catch-22-anniversary-animation/
50th anniversary post in NPR:
http://www.npr.org/2011/10/13/141280833/catch-22-a-paradox-turns-50-and-still-rings-true?ft=1&f=1032
సౌమ్య
మద్రాసు లిటరరీ సొసైటీ లైబ్రరీ గురించి నిన్న హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం: ఇక్కడ
dvenkat
ఏనుగుల వీరాస్వామయ్య పై ఒక వ్యాసం సాక్షి లో
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=28166&Categoryid=1&subcatid=3
murthy
ఇది పుస్తక సంబంధమైన విషయం కాకున్నా ఒక మామూలు గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యం, యువకులలో ఉన్న భక్తి కి సంబంధిచిన మంచి కార్యక్రమం కాబట్టి అందరూ చూసి ఆనందిచదగిన వెబ్ సైట్ . మీకు నచ్చితే ఈ ఐ డి ని గూర్చి అందరికీ తెలుపగలరు.
http://www.dasaraburugupalli.blogspot.com
Srinivas
సార్ నాకు మల్లాది గారి “దూరం” నవల కావాలి.దయచేసి అడ్రెస్ ‘thotakuri@rediff.com’ అనే మైల్ కి పంపగలరు.
Srinivas
ఇంకోటి, ఇది రాయడం గురించి-
http://harpers.org/archive/2007/02/0081387
Srinivas
మీ పిల్లల కోసం చదవండి –
http://www.guardian.co.uk/lifeandstyle/2011/sep/10/alice-ozma-dad-read-every-night
పుస్తకం.నెట్
సహాయం కావాలి!
పుస్తకాల షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఫలానా ఊరులోనో, ప్ర్రాంతంలోనో పుస్తకాల అమ్మకపు స్థలాలు తెలియాలి కదా! అందుకని, పుస్తకం.నెట్ పుస్తకాల విక్తయ స్థలాల జాబితా తయారుచేసి అందరికీ అందుబాటులో ఉంచాలని సంకల్పించింది. తొలి విడతలో తెలుగు పుస్తక విక్రేయతలకు ప్రాధాన్యం. ఏ ఊరిలోనైనా సరే.. తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండే షాపులూ, లేక లైబ్రరీల వివరాలు ఈ కింది విధంగా పంచుకుంటే చాలా సహాయం చేసినవారవుతారు.
పుస్తకాలయం పేరు:
చిరునామా:
ఫోన్ / ఈమెయిల్:
టైమింగ్స్:
ఎలాంటి పుస్తకాలు:
వెబ్‍సైటు:
పై వాటిలో అన్ని వివరాలూ లేకపోయినా పర్లేదు. మీ ఊరికొస్తే ఏ పుస్తకాల షాపులకి తిప్పుతారో గబగబా ఆలోచించేసుకొని ఇక్కడ వ్యాఖ్యలు చేసేయండి. లేదంటే, editor@pustakam.net కు మెయిల్ చేయండి. నెనర్లు!
(చర్విత చర్వణమైనా పర్లేదు.. మీకు తోచినవి చెప్పండి..)
డా. మూర్తి రేమిళ్ళ
Bangalore Book Exhibition-2011 Bangalore loni PAlace grounds lo avutondi.Sep 2nd to Sep 11th, 2011.
chaalaa shops and alsmost chaalaa langauage books vunnayi. ofcourse and obviously, dominated by Kannada. just started on 2nd and nenu 3rd na visit chesenu. mottam choodadaaniki time saripoledu i am going to go 1-2 times again to complete.
sahitya akademi lo chaala old and valuable telugu books koodaa dorikeyi.
specific ga telugu shops yemaina vunnaayo levo teleedu. nenu choosina 40-50% lo levu.
will report in detail after seeing again.
i tried to post this in BOOK EVENTS but was not successful.
డా. మూర్తి రేమిళ్ళ
దెయ్యాలు వల్లించిన వేదం ..శ్రీ శ్రీ “అనంతం”
తెలుగు సాహితీ మిత్రులారా !
నేను ఇలా అంటే కొందరికి కోపం వస్తుందేమో కానీ ఇది నిజం…ఈ మధ్యే నేను శ్రీ శ్రీ రాసిన అనంతం పుస్తకం చదివేను. హెడ్డింగ్ చూసి కంగారు పడకుండా, నేను చెప్పేది చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.
శ్రీ శ్రీ ని పనిగట్టుకుని విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ, ఈ పుస్తకం చదివేక నాకు కలిగిన అభిప్రాయం ఇది ..
దెయ్యాలు వల్లించిన వేదం ..శ్రీ శ్రీ “అనంతం”
Please see in my blog murthyremilla.blogspot.com and offer your comments
డా. మూర్తి రేమిళ్ళ
మూర్థి గరు, కౌటిల్య గారు, థె ళస్త్ భ్రహ్మిన్” బుక్ తెలుగు వెర్షన్ వుంటె యెక్కద దొరుకుతుందొ చెప్పగలరా ? నెను బెంగుళూరు లొ వున్నాను. ఇక్కద దొరక లెదు. మొన్న హైదరాబాద్ విశాలాంధ్ర అంద్ చాలా బుక్ షాప్స్ లో వెతికేను కానీ దొరకలేదు. కౌటిల్య గారూ, మీరు పాత పుస్తకాలు చాలా సంపాదిస్తారు కనుక మీరే చెప్పగలరు. ఇది 2002 రెలీజె. త్రన్స్లతెద్ తొ ఎంగ్లిష్ ఇన్ 2007. Yఎవరైన కొని నాకు వి పి పి లొ పంపగలరా ?
Purnima
What the heck! Let a book remain a book, in whichever format. Hearing sound effects and songs while reading classics on eBooks would rob the reader of his solitude, which is the whole fun in reading.
I wish this venture turns out to be a disaster!
మూర్తి
తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను గూర్చి నేను సమీకరించిన వివరాలు భక్తిపుస్తకం.బ్లాగ్ స్పాట్.కాం లో ఉంచుతున్నాను. పుస్తకమిత్రుల అమూల్యాభిప్రాయాలు కోరుతూ.
bhaktipustakam.blogspot.com
పుస్తకం.నెట్
Some features added to pustakam.net:
1. Post notification through email: You may now subscribe to the posts through your email id. A new page has been created.
2. RSS feeds for particular contributors’ post: You may now subscribe to your favourite reviewers’, (say a Jampala gaaru or a Ravi), articles through RSS feeds. Use the link at the end of the article to subscribe
3. You would now get to see a brief bio of the registered members of the site, at the end of their every article. (Members’ info is yet to be populated.)
4. You may now subscribe for follow up comments on any post, through email. You can see a check box at the end of the comments box.
More changes to follow. For time being, these are the ones. Please provide your feedback on these.
మూర్తి
@ సౌమ్య గారికి, దయచేసి స్కాన్ చేసిన కాపీ లింక్ ఇవ్వరా. లేకపోతే పేపర్ లో వచ్చిన తేదీ చెప్పినా సరే! ప్లీజ్.
మూర్తి
@జంపాల చౌదరి గారు. నాకూ తెలీదు మాలతి గారు చెప్పాలనిల ఉందిలో రాసిన క్రింది వ్యాఖ్య చూడండి
(dated on 14 june 2010)
malathi అన్నారు..
చెప్పాలని ఉంది!
ఈనాడు వసుంధర పేజీలో పుస్తకం.నెట్ నిర్వాహకులు, పూర్ణిమ, సౌమ్య లమీద వ్యాసం ఇప్పుడే చదివేను. చాలా బాగుంది. వారిద్దరికీ మనఃపూర్వకంగా అభినందనలు చెప్పాలని ఉంది. చెప్పుతున్నాను.
సౌమ్యా, పూర్ణిమా, మీరిద్దరి కృషి శ్లాఘనీయం.
– నిడదవోలు మాలతి
సౌమ్య
యక్కలూరి శ్రీరాములు గారి “నా సీమ నాటికలు” పుస్తకావిష్కరణ 28వ తేదీ అనంతపురంలో జరుగుతుంది. వివరాలకు ఇక్కడ చూడండి.
సౌమ్య
మూర్తి గారికి: ఆ వ్యాసం ఇప్పుడు ఈనాడులో దొరకదు. వాళ్ళ ఆర్కైవ్లలో మూణ్ణెల్ల నాటి వ్యాసాలు మాత్రమే ఉంచుతారు.
ravi
@koutilaya gaaru,naa mail id:ravi_darbha@yahoo.co.in
Thanks
జంపాల చౌదరి
ఈనాడులో వ్యాసం ఎప్పుడు వచ్చింది?
మూర్తి
ఈనాడు వసుంధర పేజీలో పుస్తకం.నెట్ మీద వచ్చిన వ్యాసం నేను చదవలేకపోయాను. దయచేసి ఎవరైనా పుణ్యాత్ములు లంకె పెట్టగలరా.. (స్కాన్ కాపీ అయినా పర్లేదు)
కౌటిల్య
రవి గారూ, తప్పకుండా..మీ మెయిలు ఇవ్వండి….ఆలోపు పైన శాయిగారు ఇచ్చిన లింకునుంచి డౌన్లోడు చేసుకోండి…
విజయ్ గారూ, “రామాయణ కల్పవృక్షం” నవలకాదండీ…..పద్యకావ్యం…మొత్తం ఆరుకాండలూ, ఆరు పుస్తకాలు….హైదరాబాదు నవోదయా వారి దగ్గర దొరుకుతుంది…ఆరువందలనుకుంటా…ప్రయత్నించండి..
డా. మూర్తి రేమిళ్ళ
దెయ్యాలు వల్లించిన వేదం ..శ్రీ శ్రీ “అనంతం”
తెలుగు సాహితీ మిత్రులారా !
నేను ఇలా అంటే కొందరికి కోపం వస్తుందేమో కానీ ఇది నిజం…ఈ మధ్యే నేను శ్రీ శ్రీ రాసిన అనంతం పుస్తకం చదివేను. హెడ్డింగ్ చూసి కంగారు పడకుండా, నేను చెప్పేది చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.
శ్రీ శ్రీ ని పనిగట్టుకుని విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ, ఈ పుస్తకం చదివేక నాకు కలిగిన అభిప్రాయం ఇది ..
దెయ్యాలు వల్లించిన వేదం ..శ్రీ శ్రీ “అనంతం”
డా. మూర్తి రేమిళ్ళ
ఎవరో గుర్తు లేదు కానీ, రంగనాయకమ్మ ‘రామాయణ విష వృక్షం’ పుస్తకం దొరకడం లేదు అనీ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అనీ అడిగేరు .. నిన్ననే హైదరాబాద్ వెళ్ళినప్పుడు విశాలాంద్ర లో చూసేను. చదివినంత మాత్రాన తప్పు లేదేమో అసలు ఆవిడ ఏమి రాసిందో చదువుదాము, కొనుక్కోవలాలనుకున్నాను కానీ ఎందుకు ఆ విషపు ఆలోచనల్ని బుర్రలోకి ఎక్కించుకోవడం అని వదిలేసేను. నా మీద నాకు నమ్మకం లేదా ఎందుకు చదవడానికే భయపడడం అని కూడా అనుకున్నాను కానీ ధైర్యం చెయ్యలేదు.
murthy
వనవాసి నవల ఇప్పుడే చదవటం అయ్యింది. కానీ నా చేతులు గానీ నా మనసు గానీ ఆ పుస్తకాన్ని వదలటానికి ఇష్టపడటం లేదు. రచయిత తాను చెప్పదలచుకొన్న విషయం తప్ప మరొకటి అస్సలు చెప్పలేదు. తన గురించి కూడా నవల మెత్తం చదివినా మనకు తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. పుస్తకం.నెట్ కు కృతజ్ఞతాభివందనములు. చదవని పుస్తకప్రియులు ఉంటే “ఆలస్యం అమృతం విషం”.
ravi
thanks koutilya garu,naa mail id kavalante istanu
విజయ్
నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన “రమాయణ కల్పవృక్షం” నవల కొని చదవాలని ఉన్నది. కాని ఎక్కడా దొరకలేదు. ఈ బ్లొగ్ చూసి కొంత ఆశ కలిగింది. ఏవరైనా వివరములు తెలిపి సహాయ పడగలరు.
మందాకిని
ఛాయావాద కవిత్వంలో మహాదేవీవర్మ కవిత్వం చాలా బాగుంటుంది.కనిపించని ఒక నాయకునిపై అనురాగాన్ని చక్కగా చూపిస్తారు.
ప్రస్తుతం పుస్తకాల పేర్లు గుర్తులేవు కానీ, ఆవిడ ప్రసిద్ధ కవయిత్రి కాబట్టి మీకు సులభంగానే దొరకవచ్చు ఆవిడ రచనలు.
ఒక కవిత నాకు బాగా నచ్చి తెలుగులో నేను అనువదించుకొన్నది మీకు ఆసక్తి ఉంటే చూడండి.
http://mandaakini.blogspot.com/2009/02/blog-post.html
Purnima
హింది సాహిత్యంతో సాన్నిహిత్యం ఉన్నవారికో ప్రశ్న: హరివంశ్ రాయ్ బచ్చన్ గారి ’మధుశాల’ చదివిన దగ్గర నుండి, అలాంటి కావ్యాలు, ముఖ్యంగా ’ఛాయావాద్’లో రాసిన కవుల గురించి ఎవరైన చెప్పగలరా? గూగుల్‍లో వెతికితే దినకర్ లాంటి వారు తెలియవచ్చారు కాని.. నా అనుమానాలు నాకున్నాయి. Love, romance, tragic మూలమైన కవితలను, కవుల గురించి తెలిస్తే చెప్పండి. ముఖ్యంగా పాత తరం కవులు. please..