పుస్తకం
All about booksపుస్తకభాష

December 8, 2010

ఇడిగిడిగో బుడుగు

More articles by »
Written by: Jampala Chowdary
Tags: , ,

రాసినవారు: జంపాల చౌదరి
**********************
మీకు తెలుసో లేదో గానీ, అప్పుడెప్పుడో మాయమైపోయిన బుడుగు ఈ మధ్యే మళ్ళీ జనాల మధ్య కొచ్చాట్ట. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నరైనా మరి ఇప్పటి దాకా నాకీ సంగతి తెలీనే లేదు. ఎక్కడా ఎవరూ మాట్లాడుకోగా విననూ లేదు. ఇవాళ అకస్మాత్తుగా వాడు, వాడి స్నేహితులతో కనిపిస్తే హాస్చెర్యపడి ఆనందపడి పడిపోయి లేచి ఘాట్ఠిగా పట్టేసుకొని వాళ్ళ కబుర్లకీ, చేష్టలకీ, వేషాలకీ ఎగిరెగిరి నవ్వుతుంటే, పక్కనున్నవాళ్ళంతా నన్ను కొద్దిగా వింతగా అనుమానంగా చూశారు. ఐతేనేం, ఇన్నేళ్ళ తరువాత కనిపించిన పాత నేస్తాలు, మరి.

నా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక దినపత్రికలో రోజూ మూడు నాలుగు ఫ్రేములతో బుడుగు కార్టూన్లు (ఇప్పుడు డెయిలీ స్ట్రిప్ అంటున్నాం చూడండి, అదన్న మాట) వస్తుండేది. బుడుగూ, సీగేనపెసూనాంబా, దీక్షితులు ఇంకా నలుగురు అరడజెను పిల్లల్ని వెంటేసుకొని రోజూ తెగ అల్లరి చేస్తుండేవారు. దేశంలో పొలిటీషియన్లు అనబడే పెద్దాళ్ళు అల్లరి చిల్లర పనులు చేసినప్పుడు వాళ్ళని చూసి ఇంకా రెచ్చిపోయేవారు. ఒక ఏడాది తరవాత కాబోలు ఆ కార్టూన్లు ఆగిపోయాయి. అప్పటికి బాపు గారు సాక్షి సినిమా తీయడం మొదలెట్టేసినట్టున్నారు. ఈ కార్టూన్లలో బహుకొద్ది అప్పుడప్పుడు సావనీర్లలోనూ, మిత్రుల కలెక్షన్లలోనూ కనిపించినా, అన్నీ కలిసి ఒక్కచోట చూడటం ఇదే మొదలు. జాగ్రత్తగా ఈ పని చేసింది విజయవాడలో ఉండే గంధం అనే బాపు గారి అభిమాని. మచ్చుకి నాలుగు పానెల్స్ చూడండి. ఇట్లాంటివి నూటయాభై పేజీల్నిండా ఈ పుస్తకంలో ఉన్నాయి మరి. నవ్వు ఆరోగ్యానికి మంచిదన్న మాట నిజమే ఐతే, ఈ పుస్తకం మొదలెట్టాక మీ అంత ఆరోగ్యవంతులు బహు తక్కువ మందే ఉంటారు.

ఇడిగిడిగో బుడుగు
బాపు కార్టూన్లు
సేకరణ, కూర్పు: గంధం
ప్రచురణ: రెయిన్‌బో ఆర్ట్ సిరీస్, విజయవాడ 94401 83460
విశాలాంధ్ర, నవోదయాలలో దొరుకుతుంది
తొలి ప్రచురణ: మే 2009
154 పేజీలు.
రూ. 100

********************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.12 Comments


 1. v.v.prasada rao

  1967 lo anukuntaanu….bapu budugu chetha modati saari naaku chakkiliginthalu pettinchaadu. manasu baaga lenappudu vaadine gurthu chesukuntaanu.idigidigo budugu anagaane ulikki paddaanu….


 2. jyoti

  budugu chinnapuudu eppudo chadivanu.chala rojula taruvata ekkada chadivi anandam vesindi


 3. […] ఇడిగిడిగో బుడుగు – బాపు: బుడుగు + బాపు… అస్సలు చెప్పక్కరలేదు! […]


 4. […] *ఇడిగిడుగో బుడుగు *ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ గురించిన పుస్తకం ఒకటి. *రాయలసీమ రాగాలు (తెలుగు అకాడెమీ ప్రచురణ) *ఇస్మైల్ హైకూలు […]


 5. చౌదరి జంపాల

  ఇవ్వాళ బాపు గారి పుట్టినరోజు.
  ఆయనకు మరెన్నో బోల్డన్ని ఏళ్ళ పాటు ఆరోగ్యమూ, ఆనందమూ, మనకు మరిన్ని మనోజ్ఞమైన చిత్రాలూ కోరుకొందాం.


 6. చౌదరి జంపాల

  @లలిత (తెలుగు4కిడ్స్): ఆ కార్టూను ఈ పుస్తకంలో లేదు.


 7. “వచ్చిన వాడు ఫల్గుణుడు” అంటూ బుడుగు బాణం వెయ్యబోయి చేతకాక పోతే బుడుగే అంటాడో సీగాన పెసూనాంబ ఎక్కిరిస్తుందో కాని, “వీచినది ఎదురు గాలి!” అనడం గుర్తుంది.
  బుడుగు మళ్ళీ వస్తే తప్పకుండా పుస్తకాల అరలోకి ఆహ్వానించవలసిందే.
  ఈ విషయం తెలియచేసినందుకు Thanks.
  రెండో పేజీలో footnote ఇప్పుడే గమనించాను.
  బావుంది.


 8. తెలియజేసినందుకు కృతఙ్ఞతలు. ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొని రావాల్సిన పుస్తకాల్లో మొదట్లో చేర్చాను.


 9. Swathy

  అవును ..చాలా రోజులయింది ఈ నేస్తాల కబుర్లు విని ….

  Thanks for sharing 🙂


 10. లలిత

  నా దగ్గర బుడుగు 1,2 ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా బుడుగు కార్టూన్ల పుస్తకమా ! అయితే తప్పకుండా కొనుక్కోవాలి  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

బాపుతో మేము

వ్యాసకర్త: శంకర్ (సత్తిరాజు శంకరనారాయణ) (డిసెంబర్ 15, బాపు గారి పుట్టినరోజు సందర్భంగా, ...
by అతిథి
0

 
 

బాపు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు

వ్యాసకర్త: భానుమతి ****** నమస్తే. నా పేరు భానుమతి. బాపు గారి అమ్మాయిని. నాకు మీ అందరితో కొన...
by అతిథి
44

 
 

ఓ బాపు బొమ్మ కథ

  గతవారం బాపుగారి మరణానంతరం ఫేస్‌బుక్‌లో చాలామంది స్నేహితులు బాపు గారి ఫొటోలు, బొమ...
by Jampala Chowdary
13

 

 

శ్రీ బాపు గారికి విశ్వనాథ అభినందన – ఒక పేరడీ

రాసిన వారు: శ్రీరమణ (ఈ వ్యాసం 1982 నాటి ఒక ఆంధ్రజ్యోతి వార పత్రిక సంచిక లోనిది. బాపు గారి...
by పుస్తకం.నెట్
14

 
 

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. త...
by అతిథి
0

 
 

మళ్ళీ బాపు కొంటె బొమ్మలు

నా హౌస్‌సర్జెన్సీ ఐపోతున్న రోజుల్లో (సెప్టెంబరు, 1979) నవోదయా వారు కొంటె బొమ్మల బాపు అం...
by Jampala Chowdary
4