Latest news for ?author_name=pustakam.net
ఆగస్టులో మాలతి గారు బెంగళూరు వచ్చినప్పుడు మేము కలిసి వెళ్ళి శివరాజు సుబ్బలక్ష్మి గారిని కలిసాము. ఆరోజు ఆవిడని కలిసిన అనుభవం రాయాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను. ఆ మధ్య కి వెళ్ళి వచ్చాక, [?author_name=pustakam.net] ఎందుకోగానీ సుబ్బలక్ష్మి గారు గుర్తొచ్చారు. దానితో, ఇన్నాల్టికి, ఆరోజుటి అనుభవాల్ని రాస్తున్నాననమాట. అక్కడికి వెళ్ళేముందు నాకు ఆవిడ గురించి తెలిసింది మూడు మార్గాల ద్వారా : 1. మూలా సుబ్రమణ్యం - తన ?author_name=pustakam.net "ఏటి ఒడ్డున" సంకలనం లో రాసిన "శివరాజు సుబ్బలక్ష్మి గారితో" కవిత. 2. కౌముదిలో అనుకుంటాను - ఓసారి ఓ వ్యాసం చదివాను 3. మాలతి గారు చెప్పడం ద్వారా. - అయినప్పటికీ, ఆమె గురించి నేనేమీ పెద్దగా తెలుసుకోలేకపోయాను. She is an interesting person అన్న ఒక్క విషయాన్ని తప్ప. ?author_name=pustakam.net కానీ, అక్కడికి వెళ్ళింతరువాత - "she is an interesting person" అనిపించింది. సుబ్బలక్ష్మి గారు కూడా ఓ రచయిత్రి అన్న విషయం - మాలతి గారు చెప్పారు కానీ, అక్కడికి వెళ్ళాక, ఆవిడ తన వద్ద ఉన్న తన పుస్తకాలని మాకు చూపించాకా అర్థమైంది - ఆరోజుల్లో ఆవిడ తరుచుగానే రాసేవారని. మాలతి గారు ఆవిడతో మాట్లాడుతూ, ఆవిడ కథల గురించీ ఆవిడ ఆలోచనల్ను తెలుసుకుంటు ఉన్నారు. నేను ఆమె కథలు, నవలలు ఏవీ చదవలేదు (అసలు నాకు తెలిసిందే అక్కడైతేనూ!!). ఆవిడ చెప్పేది వింటూ ఉంటే, ఓ పక్క - ఆవిడ భావజాలంతో నాకు పొసగదేమో అనిపించీంది. రెండు తరాల తేడా ఉన్నందువల్ల కాబోలు. అయినప్పటికీ, ఆవిడ ఎలా రాసారో చదవాలన్న కుతూహలం మాత్రం మరింత పెరిగిపోయింది. బాధాకరమైన విషయం ఏమిటీ అంటే ఇప్పుడు ఆమె రచనలు ఒక్కటీ ప్రచురణలో లేవట. మరిప్పుడెలా చదివేది? ఈసారి వాళ్ళింట్లో తిష్ట వేసి చదువుకోవల్సిందే. దాదాపు ఎనభైఅయిదేళ్ళ వయసులో ఇప్పటికీ ఆవిడ తరుచుగా రాస్తూనే ఉంటారనీ, కానీ, దేనికీ పంపరనీ - వాళ్ళబ్బాయి చెబుతూ ఉంటే. . . "వాట్!" అని నోరెళ్ళబెట్టాను. అలాగే, తామిద్దరి కథ (మిస్టర్ అండ్ మిసెస్ బుచ్చిబాబు) ను ఆత్మకథలాగా రోజు కొన్ని పేజీలు రాస్తున్నానని చెప్పి, ఒకట్రెండు పిట్టకథలు చెప్పారు వాళ్ళిద్దరి మధ్య జరిగినవి. రచయిత్రి అన్నది ఆమెలో ఒక కోణం మాత్రమేనని ?author_name=pustakam.net, పక్కగదిలో వరుసగా పేర్చి ఉన్న పెయింటింగ్స్ ని చూశాక అర్థమైంది. అన్ని పెట్టి ఉంటే, నేను ఈ ఇంట్లోవాళ్ళకి కళాపోషణ ఎక్కువేమో అనుకున్నా కానీ, అవన్నీ ఆవిడ గీసినవట!! ఇప్పటికీ తరుచుగా గీస్తూ ఉంటారని వాళ్ళబ్బై చెప్పాడు. నిజం చెప్పొద్దూ -నాకు చాలా నచ్చేశాయి ఆ పెయింటింగ్స్. బాపు చిన్నప్పుడు బొమ్మలేయడం ఎలాగో చూపారట ఈవిడ - ఆయన వీళ్ళకి చూట్టం అట. పెయింటింగ్స్ వేయడం ఒకరకం - ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీతో - సూపర్బ్! అది ఒక కోణమా - ఎనభైఅయిదేళ్ళ వయసుకి, ఇప్పటికీ ఆవిడ చాలా హుషారైన మనిషి. వంటపని సమస్తం ఆవిడే చేస్తారు. మాకు కాఫీ కూడా పెట్టిచ్చారు - నేను సుబ్బలక్ష్మి గారి కాఫీ తాగానొచ్! :) మాట్లాడుతూ ఉంటే సమయమే తెలీలేదు. నేనింకా వెళ్ళేముందు భయపడ్డాను - ఇంత పెద్దవాళ్ళతో నేనేం మాట్లాడతాను, బోరు కొడుతుందేమో అని. కానీ, అలాంటిదేం లేదు, భలే కలిసిపోయారు. మళ్ళీ రమ్మని ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. :) ఒక్క మాటలో చెప్పాలంటే - ఆమెతో మాట్లాడుతూ ఉంటే, నాకు ఎనర్జీ పెరిగిపోయింది. అంతతేలికగా మర్చిపోగల వ్యక్తి కారు-అసలు మర్చిపోలేని వ్యక్తి, నన్నడిగితే.