కాపీరైట్స్ & వ్యాసకర్తలకు సూచనలు
కాపీరైట్స్:
- ‘పుస్తకం’లో ప్రచురించిన రచనలపై సర్వ హక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి.
- ఇదివరకే ఆయా రచయితల బ్లాగుల్లోనో, ఇతర అంతర్జాల సైట్లలోనో ప్రచురింపబడ్డ వ్యాసాలు తిరిగి పుస్తకంలో ప్రచురించడానికి పంపవద్దు. ఇంతకు ముందు ప్రింటు పత్రికల్లో ప్రచురించబడిన రచనలను ‘పుస్తకం’లో ప్రచురించేటపుడు, అందుకు అవసరమైన అనుమతులను రచయితలు, రచయిత్రులు పొందాలి. అలా పొందినట్లుగా వారు పుస్తకానికి సమాచారం అందించాలి.
- ‘పుస్తకం’లో ప్రచురించబడ్డ రచనలను రచయితలు తమ తమ స్వంత బ్లాగులలో రెండు వారాల తరువాత ప్రచురించుకోవచ్చు. పుస్తకం’లో ప్రచురితమైన తమ రచనలను (అవి మొదటిసారిగా పుస్తకంలోనే ప్రచురితమైన పక్షంలో) రచయితలు తమ బ్లాగుల్లో కాక, అంతర్జాలంలో ఇతర చోట్ల మళ్ళీ ప్రచురించదలిస్తే, రచననంతటినీ కాకుండా, అందులో కొన్ని భాగాలను మాత్రమే ఉటంకిస్తూ, ‘పుస్తకం’లోని పూర్తి రచనకి లింకు ఇస్తే బాగుంటుంది.
- ‘పుస్తకం’లో ప్రచురించబడిన తమ రచనలను అచ్చు పత్రికలకు పంపదలచుకొంటే, ఆ రచన ‘పుస్తకం’లో ముందుగా ప్రచురించబడిందని ఆయా పత్రికల సంపాదకులకు రచయితలే తెలియజేయాలి. వేరే పత్రికకి ‘పుస్తకం’లో ప్రచురించబడిన రచనలని పంపేముందు – ఆయా పత్రికల ప్రచురణ విధానాలను తెలుసుకోవలసిన బాధ్యత పూర్తిగా రచయితలదే. ‘పుస్తకం’లో తమ రచన ప్రచురించబడిన సంగతి వేరే పత్రికలకు తెలియజేయకపోయినట్లైతే – తదనంతర పరిణామాలన్నిటికీ ఆ రచయితే బాధ్యత వహించాలి. ‘పుస్తకం’ వారు తాము పంపిన, తమకు అందిన ఆన్ని ఈమెయిళ్లనీ, రచయితలతో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలనీ భద్రపరిచి ఉంచుతారు.
- తమ రచనలలో ఫొటోలుగాని, ఆడియోగాని, వీడియోగాని, మరేదైనా తమకి సొంతం కాని సమాచారాన్ని వాడినట్టైతే, ఆ సమాచారపు కాపీహక్కుల వివరాలను, హక్కుదారుని నుండి పొందిన అనుమతి వివరాలను రచయితలు ‘పుస్తకం’ సంపాదక వర్గానికి తెలియజేయాలి. కాపీహక్కులు కలిగిన కంటెటుని తగిన అనుమతులు లేకుండా వాడుకొన్న రచనలు ‘పుస్తకం’లో ప్రచురణార్హం కావు.
- ‘పుస్తకం’లో ప్రచురించే రచనలలో చిత్రాలు, ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, లేదా ఇతర సమాచారం వంటి సందర్భోచితమైన అదనపు కంటెంటును ‘పుస్తకం’ సమకూర్చుకొని, తగు అనుమతులు పొంది ఆయా రచనలలో ఉపయోగిస్తుంది. అటువంటి కంటెంటుని వాడుకోవడానికి అవసరమైన అన్ని అనుమతులూ ‘పుస్తకం’ వారు ‘పుస్తకం’ కోసం మాత్ర్రమే పొందుతారు. సదరు రచనలను రచయితలు ఎక్కడైనా మళ్ళీ ప్రచురించదలిస్తే, అదనపు కంటెంటు అనుమతుల విషయమై రచయితలు ‘పుస్తకం’ వారిని సంప్రదించవలసి ఉంటుంది.
- ఆయా వ్యాసాల రచయితలు కాక, వేరెవ్వరూ ‘పుస్తకం’లో ప్రచురితమైన రచనలను ముందుగా ‘పుస్తకం’ అనుమతి పొందకుండా అంతర్జాలంలోగాని, వేరెక్కడైనాగానీ వాడుకోరాదు. రచయితలు కాక, వేరే పత్రికలుగాని, సంస్థలుగాని – ‘పుస్తకం’లో ప్రచురించబడిన రచనలని తిరిగి ప్రచురించదలచుకొన్నా, లేదా వేరే రకంగా ఉపయోగించదలచినా – ‘పుస్తకం’ వారికి తెలియజేస్తే, అయా రచయితలని సంప్రదించి ‘పుస్తకం’ వారికి రచయిత నిర్ణయాన్ని తెలియజేస్తుంది.
- కాపీహక్కులు, అనుమతులకు సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను editor@pustakam.net అనే ఈమెయిలైడీకి ఈమెయిలు పంపడం ద్వారానే చెయ్యాలి. ఈ విషయమై ‘పుస్తకం’ లోని వివిధ పేజీలకు వ్యాఖ్యల ద్వారా పంపే సందేశాలను ‘పుస్తకం’ పరిశీలించదు. ఇతర పద్ధతుల ద్వారా పంపే ఉత్తరాలను, ఇతర ఈమెయిలైడీలకు పంపే ఈమెయిళ్ళను కూడా ‘పుస్తకం’ పరిశీలించదు.
వ్యాసకర్తలకి సూచనలు:
- మీ వ్యాసాలకూ, వాటికి వచ్చే స్పందనలకూ మీదే భాద్యత. పుస్తకం.నెట్ కీ సంబంధం ఉండదని గమనించగలరు. ప్రచురణ విషయంలో మాదే తుది నిర్ణయం.
- తెలుగులో రాసే వ్యాసాలు తప్పనిసరియై యూనికోడులోనే ఉండాలి.
- మీ వ్యాసాన్ని అర్థం చేసుకోడానికి ఉపకరిస్తాయనుకుంటే యధేచ్ఛగా బయటి సైట్లకి లింకులు ఇవ్వవచ్చు. కానీ, వీలైనంత వరకు మీ బ్లాగులకి లింకు ఇవ్వడం తగ్గించండి, ఇక్కడి వ్యాసం అర్థం చేసుకోడానికి అక్కడి వ్యాసం దోహదపడుతుందని మీరు భావిస్తే తప్ప.
- వీలైనంత వరకు సరళమైన, గౌరవమైన భాషను వాడేందుకు ప్రయత్నించండి. పుస్తకం.నెట్ బాధ్యతలపైన పూర్తి సమయం వెచ్చించేవారు ఎవరూ లేనందున టైపోలు, వ్యాకరణదోషాల వంటివి ప్రతిసారీ సరిచూడడం సాధ్యపడదు. ప్రూఫ్ రీడింగ్ బాధ్యత రచయితదే.
- వ్యాసం నిడివి పై ఎలాంటి ఆంక్షలూ లేవు.
- ఏ భాషా పుస్తకం గురించైనా ఇక్కడ రాయవచ్చు. వీలైనంత వరకూ వ్యాసం తెలుగులో ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీషు భాషా వ్యాసాలు కూడా పంపవచ్చు. (ఉదా: తెలుగు రచనల అనువాదాల గురించి ఇంగ్లీషులో చెప్తే ఎక్కువ మంది చేరే అవకాశం ఉందనిపిస్తే, అలానే రాయచ్చు)
- మీ వ్యాసాలను పంపవలసిన చిరునామా: editor@pustakam.net
హైమావతి. ఆదూరి.
పుస్తక సంపాదకులకు , నమస్కారం!
ఆర్యా!
వేమన సతం గురించీ సమీక్షావ్యాసం , అలాగే చాలా శతకాలు ఉన్నాయికదా! వాటి గురించీ వ్యాసాలు వ్రాసి పంపవచ్చాండీ!
సౌమ్య
తప్పకుండా పంపండి. editor @ pustakam.net ఈ ఐడీ కి వర్డ్ డాక్యుమెంట్ లో టైపు చేసిన వ్యాసాన్ని పంపండి. ఒకట్రెండు రోజుల్లో స్పందిస్తాను.
prasad
నేను కవిని..పాటలు రాస్తూ ఉంటాను నా పాటలు ఇక్కడ పోస్ట్ చేయచ్చ ?
Venkatesh
మీరు రాసే పాటలు వీడియో రూపంలో నా ఛానెల్ లో పోస్ట్ చేసుకోవచ్చు. RV Radiant Vibes YouTube Channel
సంప్రదించగలరు
pavankumar kodam
నేను ఇటివల కవిత్వం పుస్తకం వేసాను. సమీక్షకు ఎలా పంపించాలి
సౌమ్య
పుస్తకం.నెట్లో నిలయ సమీక్షకులు లేరండి. మీ పుస్తకాన్ని ఎవరికైనా ఇచ్చి వాళ్ళు దాన్ని గురించి రాస్తే మేము పుస్తకం.నెట్లో దాన్ని పోస్ట్ చేసేందుకు పరిశీలించగలము.
KT VENUMADHAV
ఫొటోస్ ఎలా అప్లోడ్ చెయ్యాలి?
Admin
Send us an email with the photos and their explanation
kameswari yaddanapudi
ఒక కవిపై కాని రచయితపై కాని కొన్ని ఆలోచనలను, కొత్తకోణం నుంచి వ్యాసంగా వ్రాసి పంపవచ్చా? ఒకే ఒక పుస్తకంపైనే వ్రాయాలా?
సౌమ్య
రాయవచ్చండి.
NAGARJUNA REDDY
పుస్తకం వారికి ముందు గా నా అభిననందనలు నీను ఉద్యొగరీత్యా చాలా పల్లిటూర్లు తిరుగుతుంటాను , ప్రతీ ఊరిలొ యెన్నొవిషయాలు తెలుసుకుంటాను మీరు అనుమతి ఇస్తె వారి పద్దతలు , అలవాట్లు , మాందలికాలు , సంప్రదాయాలు మొదలైనవి సక్షిప్థంగా వ్రాసి పంపగలను , అవకాశం ఇస్తారని ఆశిస్తూ … మీ అభిమాని , నాగర్జున రెడ్డి ,
సౌమ్య
నాగార్జునరెడ్డి గారికి: పుస్తకం.నెట్ పై మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ వెబ్సైటులో వచ్చే వ్యాసాలు పుస్తకాలకి సంబంధించినవి..ప్రపంచ సాహిత్యంలో ఏ అంశం గురించి అయినా మీరు మాకు వ్యాసాలు పంపవచ్చు. అయితే, సంస్కృతి, సంప్రదాయాల గురించిన వ్యాసాలకి ఇది వేదిక కాదని గమనించగలరు. అందుకు ఇతర వెబ్ పత్రికలు ఉన్నాయి.
ravi
వ్యాసాలు ,సమీక్షలు కొత్త పుస్తకాల గురించే రాయాలా? పాత వాటి గురించి రాసినా పర్వాలేదా?
పుస్తకం.నెట్
@ravi: మీకు ఏ పుస్తకం నచ్చితే దాని గురించి రాయొచ్చు. ఒక్కసారి వ్యాసకర్తలకు సూచనలు చూసి, దానికణుగుణంగా రాస్తే చాలు.
Balivada
Congrats … feeling glad to notice a good work here. I will join my hands to do some contribution.
Regards
Balivada
aparna
pustakam.net aditor gariki
pustakam .net lo Dr E Vedavyasa gari books kuda pettandi .edi ma request.
సత్యవతి
పుస్తకం నెట్ ఎడిటర్ గారికి
నేను తెలుగులో భుమిక పేరుతో ఒక స్త్రీవాద పత్రిక నడుపుతున్న విషయం మీకు తెలుసుననే భావిస్తున్నాను.మీరు మీ వెబ్సైట్
లో వివిధ రచయితల రచనలు పబ్లిష్ చేస్తున్నారు.
వీటిల్లో కొన్నింటిని మీ మరియు ఆయా రచయితల అనుమతితో భూమికలో పునహ్ ప్రచురిచవచ్చా??
భూమికను చాలా మంది చదువుతారు.
మీ సమాధానం కోసం ఎదురుచూస్తాను.
సత్యవతి
Satish
naaku ee site chala nachindi. Nenu kuda indulo voka puta avvalani vundi. kani telugu lo sambhashana cheyyatam elago thelupagalaru. telugu lo type cheyyatam elago naaku theliyaledu.
సౌమ్య
Satish garu: You can type in Telugu using lekhini.org
rajeshwari
ksamiMchAli ” pustakaM ” tappu vachchinaMduku
rajeshwari
నమస్కారములు మీ పుస్తం బాగుంది మీకు కవితలు వ్యాసాలు కధలు పంపాలంటే ఎలా ? తెలుగు Font ఉందా ? దయచేసి తెలుప గలరు
పుస్తకం.నెట్
రాజేశ్వరి గారికి – పుస్తకం లో కథలు, కవితలు వేసుకోబడవు. పుస్తకాలకి సంబంధించిన వ్యాసాలు మాత్రం ప్రచురించబడతాయి. ఎలాంటివి రాయొచ్చో – మా గురించి – పేజీ చూస్తే మీకు అవగాహన వస్తుంది.
ధన్యవాదాలతో – పుస్తకం.నెట్
purushothamarao
mana telugu kavula kavithalu english lOki anuvadinchi pampachcha?
vari permission jatha chesi