2012లో నేను, పుస్తకం, నా పుస్తకాలు

గత సంవత్సరం పుస్తకం.నెట్‌తోనూ, పుస్తకాలతోనూ నా అనుబంధం కొద్దిగా ఒడిదుడుకులతోనే సాగింది. వారం వారం పరిచయాలు వ్రాయటానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అక్టోబరువరకూ వ్రాస్తూ వచ్చానుగానీ నవంబరునుంచి అనేకకారణాల వల్ల సమయం దొరకటం కష్టంగా ఉంది. నా కోడి, కుంపటి లేకపోయినా పుస్తకం ప్రపంచంలో మామూలుగానే తెల్లవారుతూ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది, హడావుడి పడటం లేదు గానీ, రాయటం లేదన్న అపరాధభావం లోపల్లోపల కొద్దిగా పీకులాడుతూనే ఉంది. ఐనా కుదరటం లేదు. పరిచయం చేద్దాం అనుకొంటున్న పుస్తకాల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. (వెనక్కి తిరిగి చూసుకొంటే 2012లో నేను వ్రాసిన పరిచయాలు/ వ్యాసాల సంఖ్య 36. సంవత్సర ప్రారంభంలో నేను ఉద్దేశించింది నెలకు మూడు పరిచయాలు వ్రాద్దామని. ఆ లెక్కన నేననుకొన్నన్ని వ్రాశానన్న మాటే. కాకపోతే కొద్దిగా తొందరపడ్డానన్న మాట 🙂

2012 ప్రారంభంలో ఇండియా పర్యటనలో కొన్న పుస్తకాలలో ఎందుచేతోగాని జీవిత చరిత్రలు కొద్దిగా ఎక్కువగానే చేరాయి (ఎందుచేతో కాదులే, ఆత్మకథల పట్ల నాకు కొద్దిగా పక్షపాత మెక్కువ కాబట్టీ – ఈ మధ్య చాలా ఆత్మకథలు ప్రచురించబడ్డాయి కాబట్టీనూ). నేను ఈ సంవత్సరం పుస్తకంలో చేసిన పరిచయాల్లో కూడా చాలా ఆత్మకథలు ఉన్నాయి. 2012 విజయవాడ పుస్తకమహోత్సవంలోనూ, ఒంగోలు, హైదరాబాదు పర్యటనల్లోనూ పుస్తకాలు బాగానే చేరాయి. శ్రీయుతులు దేవినేని మధుసూదనరావు, సి.వి. సుబ్బారావు, పూర్ణిమ, నవీన్, సాకం నాగరాజ, కోట పురుషోత్తం, నవోదయా రామ్మోహనరావు వంటి మిత్రులు చాలా పుస్తకాలు అందించారు. అన్నీ నాతో తెచ్చుకోలేకపోతే, ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువమిత్రుఢు చక్రవర్తిగారు చాలా వ్యయప్రయాసలకోర్చి కొన్ని పుస్తకాలు తెచ్చిపెట్టారు. వీరందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కినిగెలో తెలుగు పుస్తకాలు చదవటం మొదలుబెట్టాను. నిర్జనవారధి పుస్తకాన్ని వెంటనే చదవాలని కోరిక పుట్టటం దీనికి ప్రేరణ. ఐప్యాడ్‌మీద కినిగె తెలుగు పుస్తకాలు చదువుకోవటానికి అనువుగానే ఉన్నాయి.

పుస్తకాల లిస్టు కొంత వరకూ జాగ్రత్తగానే వ్రాశాను కాని, తరువాత కుదరలేదు. జ్ఞాపకమున్నంతవరకూ జాబితా ఇస్తున్నాను. పూర్వంలాగానే తెలుగు పుస్తకాలగురించి, ఇప్పటికే పరిచయం చేసిన ఇంగ్లీషు పుస్తకాల గురించి వివరణలు ఇవ్వటం లేదు. *గుర్తు ఉన్నవి ఇంతకు ముందే పరిచయం చేసిన పుస్తకాలు.

కథా సంకలనాలు

1 *మూడో ముద్రణ – చంద్ర కన్నెగంటి

2 ఆ నేల, ఆ నీరు, ఆ గాలి – వేలూరి వేంకటేశ్వరరావు (ఈ పుస్తకానికి వాసిరెడ్డి నవీన్ గారి ముందుమాట ఇక్కడ, పుస్తకంపై నిడదవోలు మాలతి గారి వ్యాసం ఇక్కడ)

3 అమెరికాకమ్మ కథలు – వంగూరి చిట్టెన్‌రాజు

4 అమెరికా తెలుగు కథానిక (పదవ సంకలనం)

5 జాజిమల్లి – కే.ఎన్. మల్లీశ్వరి

6 *ఆనందమే అందం – పొత్తూరి విజయలక్ష్మి

7 *హాస్యకథలు – పొత్తూరి విజయలక్ష్మి

8 *మా ఇంటి రామాయణం – పొత్తూరి విజయలక్ష్మి (పొత్తూరి విజయలక్ష్మి గారి రచన గురించిన పరిచయం ఇక్కడ)

9 *భట్టిప్రోలు కథలు – నక్కా విజయరామరాజు

10 ఎన్నో రంగుల తెల్ల కిరణం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి (ఈ పుస్తకంపై ఒక బ్లాగు టపా – ఇక్కడ)

11 మొలకల పున్నమి – వేంపల్లి గంగాధర్ (ఈ కథల గురించి పత్రికల్లో కొన్నాళ్ళ క్రితం వచ్చిన కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమీక్ష ఇక్కడ)

12 తర్జని – కరుణ రచనలు

13 పెత్తనం – కె.ఎన్.మల్లీశ్వరి

14 హాస్టల్ కథలు – బి. సీతారాములు

15 కథల అత్తయ్య గారు – నిడదవోలు మాలతి

16 కథ-2011

17 రెండేళ్ళ పద్నాలుగు – మధురాంతకం నరేంద్ర

18 న్యూ బాంబే టైలర్స్ — మహమ్మద్ ఖదీర్‌బాబు

19 ద్రోహవృక్షం – డా. వి. చంద్రశేఖరరావు

20 నేనూ మా కాంతం – మునిమాణిక్యం

21 యథార్థ దృశ్యాలు – మునిమాణిక్యం

22 కాంతం కాపురం – మునిమాణిక్యం

23 కాంతం కథలు – మునిమాణిక్యం

24 పురాణం సుబ్రహ్మణ్యశర్మ కథలు

25 చింతలవలస కథలు – మూలా రవికుమార్

26 చందనపు బొమ్మ – అరుణ పప్పు

27 కానుక – వసంత వరప్రసాద్‌లకు (దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్)

28 మనసున మనసై (దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్)

నవలలు

29 *మన్యంరాణి — వంశీ

30 *ప్రేమలేఖ – పొత్తూరి విజయలక్ష్మి

31 తన్హాయీ – కల్పనా రెంటాల

32 దేవుడిచ్చిన భర్త – కందుకూరి బసవరాజు

33 ఆకాశదేవర – నగ్నముని

అనువాదాలు

34 సూర్యుడి ఏడో గుర్రం – ధర్మవీర్ భారతి (ఈ పుస్తకంపై తృష్ణ గారి బ్లాగులో పరిచయం ఇక్కడ)

35 గుల్జార్ కథలు – (అనువాదం – మృణాళిని)

36 బషీర్ కథలు

37 *బాల మేధావి – (అనువాదం – శ్రీమతి ఏ.సి.కృష్ణారావు, పాలగుమ్మి పద్మరాజు)

వ్యంగ్యం, చమత్కారం

38 రామప్ప రభస – వట్టికోట ఆళ్వారుస్వామి

39 జానకితో జనాంతికం – దువ్వూరి వేంకటరమణశాస్త్రి

40 కోమలి గాంధారం — మృణాళిని

41 ప(ఫ)న్… (?) – అబ్బూరి వరదరాజేశ్వరరావు (పుస్తకం పేరు సరిగ్గా గుర్తు లేదు; వరదరాజేశ్వరరావుగారు నిజజీవితంలో వేసిన జోకులకు బాపుగారు బొమ్మలు వేశారు; ఛాయాదేవిగారు సంకలనం చేశారు)

42 సరదాకి – మంగు రాజగోపాల్

43 టేకిటీజీ – ఫణి డొక్కా (ఈ పుస్తకంపై వచ్చిన ఒక పరిచయం ఇక్కడ)

కవిత్వం

44 *పొద్దు – రంధి సోమరాజు

45 *శివసాగర్ కవిత్వం (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన మరో పరిచయం ఇక్కడ)

46 విద్యార్థి కవిత్వం – వి.ఆర్ విద్యార్థి

47 ఆట కదరా శివా – తనికెళ్ళ భరణి

నాటికలు

48 గార్ధభాండం – తనికెళ్ళ భరణి

49 గోగ్రహణం – తనికెళ్ళ భరణి

50 లంకాదహనం – ఎల్బీ శ్రీరాం

51 హుష్ కాకి– ఎల్బీ శ్రీరాం

52 పద్మవ్యూహం – ఎల్బీ శ్రీరాం

53 గజేంద్రమోక్షం – ఎల్బీ శ్రీరాం

ఆత్మకథలు, జీవిత చిత్రణలు, చరిత్ర

54 ఎన్టీఆర్‌తో నేను – హెచ్.జె. దొర

55 పోలీసు సాక్షిగా – ఉద్యోగవిజయాలు – రావులపాటి సీతారామారావు (ఒక పరిచయం ఇక్కడ)

56 మాట-ముచ్చట – ధర్మభిక్షం

57 * సినిమా పోస్టర్ – బి.కె.ఈశ్వర్

58 సురవరం – మెడోస్ టైలర్ ఆత్మకథ (ఒక పరిచయం ఇక్కడ)

59 శ్రీశ్రీ విశ్వం

60 భరణి 25యేండ్ల పండగ

61 ఎగరేసిన ఎర్రని జెండా – కామ్రేడ్ చంద్రం గురించి

62 తుమ్మపూడి – సంజీవదేవ్ (ఒక పరిచయం ఇక్కడ)

63 సంజీవదేవ్ — తేజస్వి

64 కల్నల్ సి.కె. నాయుడు (ఒక పరిచయం ఇక్కడ)

65 *అధ్యాపకుడి ఆత్మకథ – డాక్టర్ కండ్లకుంట అళహ సింగరాచార్యులు

66 కొప్పులవారి కతలూ… కబుర్లూ – డాక్టర్ కొప్పుల హేమాద్రి (ఒక పరిచయం ఇక్కడ)

67 *కనకపుష్యరాగం – పొణకా కనకమ్మ

68 *నేనే బలాన్ని – టి.ఎన్ సదాలక్ష్మి బతుకు కథ – గోగు శ్యామల

69 బెంగళూరు నాగరత్నమ్మ — శ్రీరాం /టి. పద్మిని (అను) (ఒక పరిచయం ఇక్కడ)

70 చే, a primate – సాహితీమిత్రులు

71 నింగీ, నేలా, నేనూ – డా. ప్రయాగ మొహనమురళీ కృష్ణ

72 మార్పు చూసిన కళ్ళు – భండారు శ్రీనివాసరావు

73 చుక్కా రామయ్య జ్ఞాపకాలు

74 రజనీ భావతరంగాలు – బాలాంత్రపు రజనీకాంతరావు (ఒక పరిచయం ఇక్కడ)

75 *నిర్జన వారధి – కొండపల్లి కోటేశ్వరమ్మ

76 నవ్యాంధ్రము – అయ్యదేవర కాళేశ్వరరావు

77 *కొత్త కెరటాలు

78 వ్యక్తిత్వ వికాసానికి సంఘటనే మూలం – కోట పురుషోత్తం

79 ఎందరో మహానుభావులు – వింజమూరి అనసూయాదేవి

80 అమ్మకి జేజే! నాన్నకి జేజే! గురువుకి జేజే! – (సం: నామిని)

81 బంజారాల జీవనం, సంస్కృతి — రామావత్ కుసుమకుమారి

82 సరదాల పరదాలు కె.రామచంద్రమూర్తి

83 *దొంగదాడి కథ – సాహితీ మిత్రులు

84 టీచర్ కథా కమామిషు – కత్తి నరసింహారెడ్డి (ఒక పరిచయం ఇక్కడ)

85 పప్పులు బెల్లాలు – కోట పురుషోత్తం

86 నాకు నచ్చిన టీచర్ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్

87 నేను చదివిన పుస్తకం – (కూర్పు – వనం సంపత్‌కుమార్ రావు, డా. ఆర్. సీతారామారావు)

కార్టూన్లు

88-90 సరసి కార్టూన్లు – 1,2,3 (సరసి కార్టూన్ల పై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ)

91,92 * బాపు కార్టూన్లు 1,2

93 తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు – తలిశెట్టి రామారావు (ఒక పరిచయం ఇక్కడ)

94 బాలి కార్టూన్లు

సాహితీ వ్యాసాలు

95 కవులూ గాథలు — ఆండ్ర శేషగిరిరావు /మలయవాసిని

96 తల్లీ నిన్ను దలంచి – పాపినేని శివశంకర్ (ఈ పుస్తకం గురించి ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ)

97 గీతగోవిందం — డా. సాయికృష్ణ

98 గజల్ సౌందర్య దర్శనం — పెన్నా శివరామకృష్ణ

99 నేను చదివిన పుస్తకం – (కూర్పు – వనం సంపత్‌కుమార్ రావు, డా. ఆర్. సీతారామారావు)

100 సంభాషణ – కె. శ్రీనివాస్ (ఒక పరిచయం ఇక్కడ)

101 సాహిత్యవ్యాసాలు – చలసాని ప్రసాద్

102 చలసాని ప్రసాద్ రచనలు

103 సహిత – ఓల్గా

104 ఓల్గా తరంగాలు – ఓల్గా సాహిత్య సమాలోచన

105 అద్దంలో విద్యార్థి – వి.ఆర్ విద్యార్థి కవితా సమాలోచన

106 కథలూ గాధలూ – చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి (కొంతవరకు)

107 బీనాదేవి రచనా సర్వస్వం (చాలావరకు).

English

Autobiographies/ historical

1 * Romancing With Life – Dev Anand

2 *Raga n Josh – Sheila Dhar

3 *Among the Heroes — Jere Longman 107

4 *Naked Olympics — Tony Parrottet — 73

5 Can’t Is Not An Option – Nikki Haley

Nikki Haley nee Randhawa, descendant of Punjabi immigrants to US, is the Republican Governor of South Carolina. This autobiography is largely a political biography focusing more on her improbable initial win in her run to be a state representative, humiliation in the South Carolina House by the speaker and his cronies for fighting for transparency in legislative voting and her subsequent successful run for the Governor job. Very little here of her own background, growth and development.

6 A Voice In The Box – My Life In Radio – Bob Edwards

I used to wake up listening on the alarm-radio to Bob Edwards, the anchorman for the National Public Radio Morning News program. This is his biography with some interesting anecdotes and a recounting of his bitter parting from NPR. Bob Edwards now has a show on Satellite Radio and is on my local public radio on Sundays.

7 Rather Outspoken – Dan Rather

I used to get my evening news from Dan Rather on CBS News (he succeeded Walter Cronkite during my first year in US). This is his biography with some interesting anecdotes and a recounting of his bitter parting from CBS. Dan Rather also now has a show on Satellite Radio.

8 Washington Burning – Les Standiford

A very interesting book about how Washington, the Federal City was built, later burnt by British, and rebuilt. The political personalities, the architect that shaped the city and its two famous buildings – the White House and Capitol. Amazed at the documentation available about these events. Once again I lament about how we have difficulty reconstructing what happened in our land even 50 years ago.

9 Thirty Seconds Over Tokyo – Ted Lawson

After the Pearl Harbor, America decided to show Japan what it can do and carried out a daring mission of bombing over Tokyo. Ted Lawson was one of the participants in that air raid. His plane crashed while he was returning and he ended up in China under Japanese occupation. He was helped by the Chinese underground resistance before being able to return to US.

10 Amelia Earhart – Kathleen Winters

When I first took the Weschler Intelligence Test, one of the questions on it to test the fund of knowledge was, Who was Amelia Earhart? This is the story of the pioneering woman pilot with many accomplishments who mysteriously disappeared in the Pacific Ocean. The author actually paints a slightly negative portrait.

11 The Fires: How a Computer Formula, Big Ideas, and the Best of Intentions Burned Down New York City – and Determined the Future of Cities – Joe Flood

A Fascinating read. The New York City Fire Department decided in the 1960s to take the help of the scientific analysis and management of the Whiz Kids from the RAND Corporation to streamline and modernize its department. Joe Flood argues that the well meaning actions of these analysts was responsible for eventual decline of the city, the fires in Bronx in the 1970s and the destruction of vast sections of the city. He mixes history, sociology and biographies as he leads us thru the events. We learn quite a bit about urban planning, fire fighting, power brokers and grand visions.

12 Dreamland – David K Randall

A very interesting book about the science of sleep and dreams. From my professional perspective, it is written rather for the layman.

13 Indian Food – A Historical Companion – K.T. Achaya

Got interested in this book after reading about it in Pustakam. When I asked Purnima to help get it from Flipkart, she generously gifted it to me. As I tried to read it during traveling in India, I had a little difficulty in finishing it.

14 Five Great Short Stories – Anton Chekhov

What else is there to say about the great master?

Novels

15 * The Watch – Joydeep Roy-Bhattacharya

16 * The Sense of an ending – Julian Barnes

17 * Velva Jean Learns to Drive – Jennifer Niven

18 * Velva Jean learns to fly – Jennifer Niven

19 * In High Places — Arthur Hailey

20 * My Son’s Father – Nadine Gordimer

21 * Home – Toni Morrison

22 * The Perfect Gentleman – Imran Ahmad

23 * Water for Elephants – Sara Gruen

24 Riding Lessons – Sara Gruen

25 Flying changes – Sara Gruen

Two novels by the author of Water for Elephants, detailing two episodes of the life of Anne Marie Zimmer. As a teenager, she was a talented aspiring Olympic equestrian with a magnificent horse. Then she meets with a terrible accident and gives up riding. After her marriage fails, she returns to her parents’ horse farm with her teenage daughter to confront life and mortality. Interesting characters and situations with a little mystery thrown in. Good reads.

26 Leela’s Book – Alice Albinia.

An interesting book takes the motifs of Ganesha, Vedavyasa and Leela through the ages and then sets them up in modern Delhi and its tumultuous mix of social, religious and political tensions.

27 American Dervish – Akhtar Ayad.

A tale of a young Muslim boy of Pakistani parents growing up in Wisconsin with his atheist, alcoholic, philanderous and brilliantly successful father, his sensitive mother, and an aunt – really his mother’s friend Mina, a recent immigrant divorcee from Pakistan living with them. It is at once a novel about coming of age, about religion and fundamentalism, and, more importantly, the role of a woman in a patriarchal society. Well written.

28 Calico Joe – John Grisham

Grisham’s recent book is about two baseball players: Joe Castle, young, talented and gifted hitter on the raise and Warren Tracey a pitcher, alcoholic and abusive and on his way down. Tracey’s beanball seriously injures Joe Castle and ends his career. Tracey’s son, Paul was a fan of Joe Castle and watches in horror as his hero is injured. Thirty years later, he seeks out and meets Joe Castle. Later, he arranges for Joe Castle to meet Warren Tracey, who is on his death bed. As always with Grisham, an interesting read.

29 Lunatics – Dave Barry and Alan Zweibel

Essentially a slap-stick comedy novel. Made me laugh. (I have been a Dave Barry fan for decades)

30 Albert Nobbs – George Moore

A novella by George Moore about a woman who spends her life masquerading as a man all her life, employed as a waiter in a hotel on the verge of financial ruin. Made into a film couple of years ago and got Glenn Close an Oscar nomination.

31 Mr and Mrs Smith – Cathy Dubowski

A married couple in love live in a suburban home. Unknown to each other, they are employed as professional assassins working for different groups. They both get new assignments where their targets are – each other. This was made into a film starring Brad Pitt and Angelina Jolie sometime back.

Poetry

32 Horizon – Selected poems of V.R. Vidyarthi (N.S. Rahul, Tr)

You Might Also Like

23 Comments

  1. 2012 – నా పుస్తక పఠనం | పుస్తకం

    […] చదివిన పుస్తకాల గురించి జంపాల చౌదరి గారి టపా చూశాక నాకూ అలాంటి ఒక టపా రాయాలన్న […]

  2. Koppula Hemadri

    జంపాలగారూ,
    నా పుస్తకాన్ని సమీక్షించినది ‘అమరశ్రీ’గారు కదూ! ఆ సమీక్ష నాకైతే ఓ కిక్కిచ్చింది! ఒకటి రెండు పుటల కతలు కూడ చాలమందికి నచ్చుతాయన్నమాట! నిజం చెప్పాలంటే (అబద్ధాలు చెబుతానని కాదు!)- నేనైతే అంతకన్న పెద్ద కతలు కాని, వ్యాసాలు కాని వ్రాయనేలేను!
    ఈ సందర్భంగా అమరశ్రీగారికి మీద్వారా ధన్యవాదాలు. నాకు పుస్తకం.నెట్ ను పరిచయం చేసిన జయశ్రీ మధుసూదనులకు కూడ!
    – Hemadri

  3. పద్మవల్లి

    @@<>

    Exactly!!!

    1. Jampala Chowdary

      ??

    2. పద్మవల్లి

      నా జీవితాన్ని మార్చుకోవటంకోసమో, వేరే ప్రయోజనంకోసమో నేను ఈ పుస్తకాలు చదవలేదు. పుస్తకాలు చదవటం నాకు ఇష్టం కనుక, పుస్తకాలు నన్ను అనేక రకాలుగా రంజింపచేస్తాయి కనుక, పుస్తకాలు నా మానసిక ప్రపంచాన్ని విస్తృతం చేసి, విస్మయ విభ్రమానందాలు కలిగిస్తాయి కనుక , పుస్తకాలు నన్ను ఆలోచింపచేస్తాయి కనుక, పుస్తక పఠనం నా వ్యసనమూ, నా వ్యక్తిత్వంలో భాగమూ కనుక, నేను పుస్తకాలు చదువుకుంటాను.
      ——————————————————————————————————————————–

      Sorry, I quoted these lines from your reply, they have been clipped. That is exactly how I feel ‘why I read the books’, not necessarily to learn something or change something in me. Not Always.

  4. తృష్ణ

    జంపాల గారూ, మీ జాబితా చూసి నేను క్రిందటేడు కొన్న పుస్తకాలన్నీ కూడా పూర్తి చేయాలని గాఠ్ఠిగా అనుకుంటున్నానండి 🙂
    (రెండే అయినా) పై జాబితాలో నా బ్లాగ్ టపాలకు కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు.

  5. zilebi

    హమ్మయ్య,

    జంపాల గారి ద్వారా మరో టపా మేటరు కి సరి పడేంత కామెంటు లాగేసా!

    Very good observation and detailed explanation. Thank you శ్రీ జంపాల గారు.

    చీర్స్
    జిలేబి.

  6. నాగరాజు

    jampAla gAru: “మెడోస్ టేలర్ ఆత్మకథ చదివాను”
    Do you mean Phillip Meadows Taylor, the author of “Confessions of a Thug” and “Tara” ?

    1. Jampala Chowdary

      అవును. The story of my life పుస్తకాన్ని తిరుపతి రాజాచంద్ర ఫౌండేషన్‌ వారు ప్రచురించారు.

    2. Jampala Chowdary

      పై జాబితాలో చంద్రలత గారు ఈ పుస్తకంపై చేసిన సమీక్షకు లంకె ఉంది.

  7. Jampala Chowdary

    ఇప్పుడే గుర్తొచ్చిన ఇంకో రెండు పుస్తకాలు
    ఇరాక్ డైరీ – కవన శర్మ
    హాసరేఖలు – శంకరనారాయణ

    గమనిక: మూడో ముద్రణ, న్యూ బాంబే టైలర్స్ 2011లో ప్రూపుల దశలో, 2012లో అచ్చు పుస్తకాలుగా చదవటంతో రెండు జాబితాలలోనూ ఉన్నాయి. A Voice In The Box – My Life In Radio 2011 డిసెంబరు 31న ఇండియా ప్రయాణంలో మొదలుపెట్టి, 2012 జనవరి 1న ముగించాను. రెండు జాబితాల్లో కాకుండా ఏదో ఒకదానిలోనే ఉంచి ఉండవలసింది.

  8. Koppula Hemadri

    నా పుస్తకం ‘కొప్పులవారి కతలూ… కబుర్లూ’ చదివినందుకూ, సమీక్షించినందుకూ ఆనందంగా ఉంది. మీకూ దేవినేని దంపతులకూ చిన్నిపూలు. – హేమాద్రి

    1. Jampala Chowdary

      నమస్కారం హేమాద్రిగారూ.
      మీ పుస్తకం సమీక్షించింది అమరశ్రీ గారు, నేను కాదు.

  9. పద్మవల్లి

    మీరు చదివిన పుస్తకాలు జాబితా చూస్తూనే కన్నుల పండుగగా ఉంది. ఇందులో పావు భాగమైనా నేనెప్పుడు చదవగలుగుతానో…

  10. zilebi

    జంపాల గారు,

    ఒక ప్రశ్న, ఈ పుస్తకాల లిస్టులో ఏదైనా ఒక్క పుస్తకం పేరు చెప్పండి, ‘ఆ పుస్తకం చదవకుండా ఉండి ఉంటే మీ జేవితం లో ఫలానా మార్పు ౨౦౧౨ లో జరిగి ఉండేది కాదేమో ‘ అట్లా అనిపించిన పుస్తకం ఏదైనా ఉందా ?

    జిలేబి.

    1. Jampala Chowdary

      ఈ జాబితాలో లేదు.
      అలాటి మార్పులు కలిగించిన వృత్తిపరమైన పుస్తకాలు, ఇతరత్రా (పత్రికలు, ఇంటర్నెట్ వగైరా) 2012లో చాలానే ఉన్నాయి.

      నా జీవితాన్ని మార్చుకోవటంకోసమో, వేరే ప్రయోజనంకోసమో నేను ఈ పుస్తకాలు చదవలేదు. పుస్తకాలు చదవటం నాకు ఇష్టం కనుక, పుస్తకాలు నన్ను అనేక రకాలుగా రంజింపచేస్తాయి కనుక, పుస్తకాలు నా మానసిక ప్రపంచాన్ని విస్తృతం చేసి, విస్మయ విభ్రమానందాలు కలిగిస్తాయి కనుక , పుస్తకాలు నన్ను ఆలోచింపచేస్తాయి కనుక, పుస్తక పఠనం నా వ్యసనమూ, నా వ్యక్తిత్వంలో భాగమూ కనుక, నేను పుస్తకాలు చదువుకుంటాను. ఈ జాబితాలో చాలా పుస్తకాలవల్ల నాకు ఇంతకుముందు తెలీని చాలా విషయాలు పరిచయమయ్యాయి. అదంతా పనికిరాని పరిజ్ఞానమే అయినా, అప్పుడప్పుడు వాటివల్ల కొన్ని వెసులుబాట్లు, కొంత ఆనందమూ కలుగుతూ ఉంటాయి. అవి అయాచితమైన బోనస్‌లు. ఎప్పుడో ఎక్కడో ఇంతకు ముందు చదివిన పుస్తకానికి సంబంధించిన విషయం ఏదో హఠాత్తుగా తారసపడుతూ ఉంటుంది. అప్పుడు కలిగే ఆనందం వేరు.

      కాకతాళీయమైన ఒక కథ. గత ఫిబ్రవరిలో రెయిన్‌బో ఎఫ్.ఎంలో సుమనస్పతిగారు ఇంటర్వ్యూ చేస్తూ “ఈ చదవటం వల్ల లాభం ఏముంటుంది” అన్నారు. సమాధానంగా “లాభం ఉంటుందని కాదు, ఆనందాన్ని కలిగిస్తాయని, కొత్త విషయాలు తెలుస్తాయి అని చదువుతాను. ఈ మధ్యే సురవరం అని మెడోస్ టేలర్ ఆత్మకథ చదివాను, దానివల్ల నాకు ఏ రకమైన ఉపయోగం ఉంటుందని అనుకోను. కానీ ఇంకెప్పుడో, ఏదో సందర్భంలో ఆ పుస్తకంలో విషయాలకి ఇంకోచోట లంకె కలుస్తుంది. అప్పుడు వచ్చే ఆనందం వేరే” అన్నాను. ఆరు నెలల తర్వాత ఇండియాకు మరలిపోతున్న ఒక మిత్రునితో చికాగోలో మాట్లాడుతున్నాను. అతను మైసూరులో ఒక మాజీ రాజాగారి ఎస్టేట్‌లో పనిచేయటానికి వెళుతున్నాడు. కాసేపు మాట్లాడాక హఠాత్తుగా నాకు అర్థమయ్యిందేమిటంటే అతను వెళ్తున్నది సురపురానికి. ఆ పుస్తకంలో ఉన్న యువరాజు మనవడి దగ్గర ఇతను పని చేయబోతుంది. ఒకసారి ఇతను సురపురంలో ఉండగా తన తాత సమాధి, ఇతర జ్ఞాపకాలు వెదుక్కొంటూ మెడోస్ టేలర్ మనవడు వచ్చేట్ట. ఇలా చాలా వివరాలు చెప్పాడు.
      దీనివల్ల నాకు లాభం ఏమొచ్చింది అని మాత్రం అడక్కండి. సంధ్య ఎవరు అని చెలాన్ని అడిగిన మిత్రుడు గుర్తొస్తాడు.

  11. Mula Ravi Kumar

    Feeling ashamed to confess that I am not able to read much. I got this feeling after knowing that Jampala Chowdary Garu read many books including the one written by me!!!.

  12. రహ్మానుద్దీన్ షేక్

    🙂

  13. Vasu

    అయ్య బాబోయ్ .. రమణ గారు కోతి కొమ్మచ్చి లో ఎవరి గురించో చెప్పినట్టు మీరు వొరేషియస్ రీడర్ అన్నమాట .

    1. Jampala Chowdary

      రమణగారు చెప్పింది మా మేనమామ గురించే 🙂

  14. డా. మూర్తి రేమిళ్ళ

    oke okka maata.. asooya ga vundi, Mimmalni (kaadu mee list ni) chustunte…. nenoo chalaa konnanu / sampaadinchenu 2012 lo kanee chadivina percentage takkuva !

    inspired by you, hope to improve in 2013.

  15. Ismail

    My Score: Telugu – 1 3 16 31 43 69 75:-)

Leave a Reply