పుస్తకం
All about books


In The Spotlight

Dharmapuri Mullapudi-venkata-Ramana-1 veekshanam gold_ribbon keshavereddy

 
 
 

Dharmapuri
0
comments
చరిత్ర

శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర – డా. సంగనభట్ల నరసయ్య

Posted  February 26, 2015  by  అతిథి

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర అనే ఈ పుస్తకాన్ని శ్రీ సంగనభట్ల నరసయ్యగారు రచించారు. పుట్టిపెరిగిన వూరి మీద అందరికీ అభిమానం వుంటుంది. ఆ వూరు ఎంత సాధారణమైనదైనప్పటికీ అక్కడ పెరిగినవాడు ఎంత సామాన్యుడైనప్పటికీ తన జన్మభూమి గురించి చెప్పవలసి వస్తే పులకించిపోయి మాట్లాడటం సహజం. అటువంటి పులకింతని చూడటం వినడం ఎప్పుడూ ముచ్చటగానే వుంటుంది. అటువంటిది ఆ వూరు సాధారణమైనది కానపుడు, మహాపుణ్యక్షేత్రమైన “ధర్మపురి” అయినపుడు, ఆ చెప్తున్న వ్యక్తి […]

Full Story »

Mullapudi-venkata-Ramana-1
0
comments
పుస్తకలోకం

రమణ గారి రచనలు – నేను

Posted  February 24, 2015  by  సౌమ్య

(గమనిక: ఇది పుస్తకాల గురించి కాదు. ఇది ఏదో ఒక పుస్తకం గురించో, రమణగారి గురించో కాదు. ఏదో, ఆయన రచనలతో నేను ఏర్పరుచుకున్న అనుబంధం గురించి, వాటి గురించి నాక్కలిగిన self-realization కథ అని చెప్పవచ్చు.) *** కొన్నాళ్ళ క్రితం”కొసరు కొమ్మచ్చి” చదివాను. ఈ మధ్యనే ఒక ఫ్రెండు హార్డు కాపీ ఇవ్వడంతో మళ్ళీ మధ్య మధ్య తిరగేశాను. శ్రీదేవి గారు ఇంకా రమణగారి కుటుంబ సభ్యులు, స్నేహితులు రాశారనగానే, బాపు గారు కూడా రాశారనగానే […]

Full Story »

veekshanam
0
comments
జాల పఠనం

వీక్షణం-124

Posted  February 23, 2015  by  పుస్తకం.నెట్

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్) ****** తెలుగు అంతర్జాలం డా. కేశవరెడ్డి కి కాసుల ప్రతాపరెడ్డి నివాళి, […]

Full Story »

gold_ribbon
0
comments
పురస్కారాలు-సత్కారాలు

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం

Posted  February 21, 2015  by  పుస్తకం.నెట్

(వివరాలు తెలిపినందుకు తమ్మినేని యదుకుల భూషణ్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) ******* యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, నాణాల పరిశీలనతో శాతవాహన శక కాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. సంస్కృతం మీద గల పట్టుతో ఎన్నో బ్రాహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించారు. పన్నెండు గ్రంథాలు రచించారు. […]

Full Story »

keshavereddy
0
comments
రచయితల గురించి

కేశవరెడ్డి సంస్మరణ సభ

Posted  February 20, 2015  by  పుస్తకం.నెట్

తేదీ – 22 ఫిబ్రవరి, ఆదివారం సమయం – ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు స్థలం: ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్ నిర్వహణ: అనిల్ బత్తుల, కేశవరెడ్డి మిత్రులు, అభిమానులు

Full Story »

footsteps
0
comments
ఆంగ్లం

In the Footsteps of Gandhi – Catherine Ingram

Posted  February 20, 2015  by  అతిథి

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసం మొదట చినవీరభద్రుడు గారు సెప్టెంబర్ 2014లో ఫేస్బుక్ లో పోస్టు చేసారు. తిరిగి పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) ***** కొన్ని పుస్తకాలు మనతో చాలాకాలం పాటు ఉంటాయి గాని, వాటి గురించి పట్టించుకోం. కాని హటాత్తుగా ఎప్పుడో ఒక్కసారి వాటిని చేతుల్లోకి తీసుకోగానే కొత్త ప్రపంచమొకటి చేతుల్లో ప్రభవిస్తుంది. పద్మం వికసించిన రోజున నాకు తెలీదని కవి అనుకున్నట్టే, ఆ పుస్తకం కొన్న […]

Full Story »

bookworm2014
0
comments
పుస్తకలోకం

2014లో నా పుస్తక పఠనం

Posted  February 18, 2015  by  సౌమ్య

జంపాల చౌదరి గారి స్ఫూర్తి తో నేను కూడా నేను గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఓ చిన్న నోట్ రాసుకుందాం అని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాది లో నేను చదివిన ఏకైక తెలుగు పుస్తకం “కొసరు కొమ్మచ్చి”. ఈ పుస్తకం లోని వ్యాసాలు అన్నీ, ప్రధానంగా ఎం.బీ.యస్.ప్రసాద్ గారి వ్యాసం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఆంగ్ల పుస్తకాల వివరాలు: నవలలు: * The Good life elsewhere by Vladimir Lorchenkov (Tr: Ross […]

Full Story »

veekshanam
0
comments
జాల పఠనం

వీక్షణం-123

Posted  February 16, 2015  by  పుస్తకం.నెట్

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్) ****** తెలుగు అంతర్జాలం ప్రముఖ రచయిత డా. కేశవరెడ్డి గారు శుక్రవారం […]

Full Story »

fbf
4
comments
పుస్తక ప్రదర్శన

ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ 2014 – నా అనుభవం

Posted  February 13, 2015  by  సౌమ్య

కొన్నాళ్ళ క్రితం నేను ఫ్రాంక్పర్ట్ బుక్ ఫెయిర్ కు వెళ్ళాను (అక్టోబర్ 2014లో). 2012 లో ఒకసారి వెళ్ళాను కానీ, అప్పటితో పోలిస్తే ఈ సారి కొన్ని అంశాలు నాకు ఆసక్తికరంగా అనిపించాయి. అప్పట్నుంచి నేను గమనించిన విషయాల గురించి రాద్దాం అనుకుంటూన్నా కుదర్లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి హిందూ పత్రిక లో చదివిన ఒక వార్త మళ్ళీ దీని వైపుకి లాగింది నన్ను. దాని సారాంశం ఏమిటంటే, “అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్” అన్న ఎనిమిది […]

Full Story »