2012 – నా పుస్తక పఠనం

2012లో చదివిన పుస్తకాల గురించి జంపాల చౌదరి గారి టపా చూశాక నాకూ అలాంటి ఒక టపా రాయాలన్న కోరిక కలిగింది. అయితే, దానికర్థం నేను ఆయనకి పోటీగా రాస్తున్నా అని కాదు :-). కొందరు భావించునట్లు – గొప్పలు పోవడం కోసమూ కాదు. ఎవరికి వారికి ఏం చదివాము? అని సింహావలోకనం చేసుకోవడం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను కనుక, ఆ చేసుకోవడమేదో పదుగురికీ కనబడేలా చేసుకోవడంలో నేరం-ఘోరం ఏదీ లేదని కూడా నమ్ముతున్నాను కనుకా, ఈ టపా రాయాలని నిర్ణయించుకున్నాను. (ఇలా జాబితాలు పెట్టడం సెల్ఫ్-డబ్బా కోసం అని కొందరిలా వక్రంగా ఆలోచించుకుంటూ పోతే, ప్రతీదీ మన గొప్ప మనం చెప్పుకోవడానికి రాస్తున్నట్లే కనిపిస్తుంది. చూసే కళ్ళని బట్టి చూసే వస్తువు మారుతుంది అన్నది వేరే విషయం!)
***
మా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోని తెలుగు పుస్తక సంపదని గుర్తించినందువల్ల అనుకుంటాను, గత ఏడు చాలా తరుచుగా మంచి పుస్తకాలు చదివినట్లు తోచింది. మంచికి ఇక్కడి నిర్వచనం – నాకు నచ్చినవి, కొన్ని సందర్భాల్లో నాకు చాలా విషయాలు తెలిపినవి, మరి కొన్ని సందర్భాల్లో “ఇది చదివి నేను చాలా మంచి పని చేశాను” అన్న భావన కలిగించినవి – అన్నీ ఉన్నాయి అని. నాకు గుర్తున్నంతలో, ఇదిగో నా జాబితా: (పుస్తకం.నెట్లో నేను గానీ, ఇతరులు గానీ పరిచయం చేసిన పుస్తకాలకి లంకెలు జతచేస్తున్నాను)

తెలుగు పుస్తకాలు:

కథలు:
* తొలి తెలుగు కథలు – భండారు అచ్చమాంబ
-ఆట్టే ఆకట్టుకోలేదు శైలి పరంగా. అయితే, విషయపరంగా వందేళ్ళ క్రితమే అచ్చమాంబగారు గొప్ప ఫెమినిస్టులా తోచారు 🙂 (ఫెమినిజం అంటే ఏవిటో తెలియని వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు – అనుకునే వారికి..అవునండి, క్షమించండి.)

నవలలు:
* బలిపీఠం, రంగనాయకమ్మ : ఆ సినిమా నాకిష్టం. ఇన్నాళ్ళకి నవల చదవగలిగాను. నచ్చింది.
* తొలి ఉపాధ్యాయుడు – చింగిజ్ ఐత్మాతోవ్ : బాగా నచ్చింది. ఉపాధ్యాయుడి పాత్ర వెంటాడింది.
* వారసులు – మాదిరెడ్డి సులోచన : నవల కథ, కథనం, భాష – అన్నీ ఆకట్టుకున్నాయి. వీలు వెంబడి మాదిరెడ్డి సులోచన ఇతర నవలలు చదవాలి అనుకుంటున్నాను.
* ధరంవీర్ భారతి నవలిక “సూరజ్ కా సాత్వ ఘోడా” కు తెలుగు అనువాదం “సూర్యుడి ఏడవ గుర్రం” – సినిమా చూసి నవలకి వచ్చా. నాకు చాలా నచ్చింది నవల కూడా.
* పునర్జన్మ – విశ్వనాథ : ఆపకుండా చదివించింది. అయితే, ఇదివరలోనే విన్నవించుకున్నట్లు, నేను నవలగానే చదివా. ఐడియాలజీ దృష్టితో చదవలేదు.
* హాహాహూహూ – విశ్వనాథ (re-reading) : అదేమిటో, ఎన్నిసార్లు చదివినా బోరు కొట్టదు!
* పి.సత్యవతి గారి చిన్న నవల – “మర్రినీడ” : ఈ నవల కంటే కూడా దీనికి అనుబంధంగా ఇచ్చిన రెండు కథలు నచ్చాయి నాకు.
* పునరాగమనం – స్వాతి శ్రీపాద
* శుభలేఖ – మహీధర రామమోహనరావు
* కొన్ని యండమూరి నవలలు – నిశబ్దం నీకూ నాకు మధ్య, ఆనందో బ్రహ్మ, డేగ రెక్కల చప్పుడు: చివరిది ఆపకుండా చదివించింది.
* కొన్ని మధుబాబు నవలలు : కాలక్షేపానికి బానే ఉన్నాయి. కానీ, ప్రస్తుతానికి ఏం చదివానో పేర్లు కూడా గుర్తులేవు. ఒక ఐదారు నవలలన్నా మినిమం చదివినప్పటికీ.

ఆత్మకథలు, జీవిత చరిత్రలు, యాత్రాకథనాలు వగైరా:
* శ్రీపాద – అనుభవాలూ,జ్ఞాపకాలూనూ
* ముక్కోతి కొమ్మచ్చి
– నాకు నచ్చినవి, తప్పకుండా ఇతరులెవరైనా అడిగితే సూచించేవి అయిన పుస్తకాలివి రెండూనూ.
* భీమాయణం (HBT, 2012): అసలు కథ కంటే బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. వాటికోసమైనా పుస్తకం కొనుక్కోవాలి.
* మహిళావరణం – సంపాదకులు: వోల్గా, వసంత కన్నాభిరాన్, కల్పన కన్నాభిరాన్ : ఈ పుస్తకం గురించి నా కంప్లైంట్లు నాకున్నా కూడా, చాలా విలువైన పుస్తకం (నాకు!)
* కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ “నిర్జన వారధి” : చాలా స్ఫూర్తిదాయకమైన కథ.
* “అభ్యుదయ చలనచిత్ర రథసారథి” గూడవల్లి రామబ్రహ్మం: కొన్ని చోట్ల మరీ నాటకీయంగా అనిపించినా కూడా, రామబ్రహ్మం గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మంచి పుస్తకం
* చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర – పరవస్తు లోకేశ్వర్
* తొలినాటి గ్రామఫోన్ గాయకులు – రెండో భాగం : చాలా మంది తొలితరం గాయకుల గురించిన వివరాలు తెలిసాయి.
* భండారు అచ్చమాంబ సచ్చరిత్ర – కొండవీటి సత్యవతి : అచ్చమాంబ గారి జీవితంపై నేను చదివిన ఏకైక పుస్తకం కనుక, నాకు ఇది విలువైనదే!
* గోరాతో నా జీవితం – సరస్వతి గోరా : ఇది చదివాక నాకు సరస్వతి గారిపై విపరీతమైన ఆరాధనాభావంకలిగింది!
* రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్ర
* సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి -సావిత్రీబాయి ఫూలే జీవితం, ఉద్యమం
-పుస్తకాలు రెండూ ఓ మోస్తరుగా ఉన్నాయి కానీ, వీళ్ళ జీవితాలు మాత్రం స్ఫూర్తిదాయకం.

వ్యాసాలు:
* బైబిల్ కథలు – ఎమ్బీయస్ ప్రసాద్ :ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
* పి.సత్యవతి గారి వ్యాసాలు “రాగం భూపాలం” : చాలా సంయమనంతో రాసిన ఫెమినిస్టు సాహిత్య పరిచయ వ్యాసాలు.
* వ్యాఖ్యావళి – నండూరి రామమోహనరావు: ఎన్నో విషయాల గురించి సులభగ్రాహ్యంగా రాసిన సంపాదకీయాలు.

నాటకాలు వగైరా
* గోరాశాస్త్రి నాటకం – “ఆనంద నిలయం : సంభాషణల్లోని హాస్యం నాకు నచ్చింది.
* నేనూ, సావిత్రీ బాయిని (మరాఠీ మూలం: సుషమా దేశ్ పాండే; తెలుగు అనువాదం: ఓల్గా)

ఆంగ్ల పుస్తకాలు:

ఆత్మకథలు, జీవిత చరిత్రలు, ఇతర స్వీయానుభవాలు:
* Struggle for existence: Mamatha Banerjee : కరెక్టుగా మమత బెనర్జీ ఇప్పుడెలా ఉందో అప్పుడూ అలాగే ఉండేదని అర్థమైంది 🙂
* The Untold story of Kasturba: wife of Mahatma Gandhi – పుస్తకం రాసిన విధానం అంత నచ్చలేదు. కస్తూర్బా గురించి చదువుతున్నట్లు కాక, గాంధీ గురించి చదువుతున్నట్లు ఉంది.
* Bob Hope రాసిన My Life in Jokes (ఇది ఆత్మకథ కాదు…కానీ, ఆ పంథాలోనే సాగుతుంది): ఎంటర్టెయినింగ్!
* A Window on the wall: Quit India Prison Diary of a 19-Year-Old – H.Y.Sharada Prasad: చాలా ఆసక్తికరమైన పుస్తకం. ఆయన అంత చిన్నవయసులో ఇంత ఆలోచించగలిగారు అంటే ఆశ్చర్యమే. పుస్తకంలో అన్నింటికంటే బాగా నచ్చిన అంశం – చక్కటి ఎడిటర్ యొక్క పనితనం.
* Change – Mo Yan : ఆయనకి నోబెల్ వచ్చిందని చదివా. పుస్తకం పరవాలేదు. మో యాన్ శైలి మాత్రం ఆసక్తిని రేకెత్తించింది.
* The PhD Grind – Philip J. Guo : పరిశోధనా విద్యార్థుల జీవిత కథ. సాధారణంగానే ఉన్నా, నాకు చాలా నచ్చింది.
* Daughters of Maharashtra
* My Autobiography – Charles Chaplin: ఛాప్లిన్ కి కథ చెప్పడం గొప్పగా వచ్చు. అది తన కథైనా సరే, మరోటైనా సరే!

కథలు

* కన్నడ రచయిత మాస్తి వెంకటేశ అయ్యంగార్ కథలకు ఆంగ్లానువాదాలు: కొన్ని కథలు నచ్చాయి.

నవలలు:
* శివరామ కారంత్ కన్నడ నవలలకి ఆంగ్లానువాదాలు: Choma’s Drum, The Shrine, Return to Earth, Mookajji’s Visions, The Headman of the little hill. : కారంత్ రచనా శైలి నాకు చాలా నచ్చింది. అందుకే ఆ మధ్య కొన్నాళ్ళూ ఇలా వరుసబెట్టి ఆయన రచనలనే చదివాను. మళ్ళీ ఎప్పుడో రెండో సీజన్ మొదలుపెట్టాలి.
* Siddartha -Herman Hesse: అంతగా ఆకట్టుకోలేదు.
* Chetan Bhagat “Revolution 2020″ : పర్వాలేదు.
* Unbearable Lightness of being – Milan Kundera : కథ, కథనం నాకంత గొప్పగా అనిపించలేదు కానీ, వచనం మాత్రం చాలా నచ్చింది.
* Anandi Gopal – జీవితచరిత్ర-నవల: జీవిత చరిత్ర నవలీకరించడం అన్న ప్రక్రియపై నాకు ఆసక్తి లేకపోవడం కొంతవరకూ నా మీద పని చేసింది కానీ, అయినాకూడా పుస్తకం మాత్రం ఆపకుండా చదివించింది. అలాగే రోజుల తరబడి ఆనంది రోజూ గుర్తొచ్చింది.
* కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి కన్నడ నవలలు – వంశవృక్ష, సాక్షి ల ఆంగ్ల అనువాదాలు : రెండూ గొప్పగా ఉన్నాయి!
* Secret of the Nagas – Amish : కథనం ఆట్టే గొప్పగా లేకపోయినా, కథ మాత్రం చాలా క్రియేటివ్.
* The Pregnant King – Devadutta Patnaik :ఆపకుండా చదివించింది.
* The Krishna Key – Ashwin Sanghi : డా విన్సీ కోడ్ కి క్రియేటివ్ రీమేక్ లా ఉంది. మెమెంటో ని గజినీగా తీసినట్లు.
* The Sense of an Ending – Julian Barnes

వ్యాసాలు
* Deep Focus: Reflections on Cinema – Satyajit Ray
* The Language Web – Jean Aitchison

కార్టూన్లు, ఇతర బొమ్మల పుస్తకాలు
* Stupid Guy Goes to India – Yukichi Yamamatsu
* Amul’s India: Based on 50 years of Amul’s advertising
* Cecil and Jordan in Newyork – Gabrielle Bell
* Addicted to War: Why the U.S. can’t kick militarism
* Sita’s Ramayana
* Secrets of the Earth : Aika Tsubota

నాటకాలు, స్క్రీన్ ప్లే వగైరా:
* Life of Galileo – Bertolt Brecht
* గుల్జార్ సినిమా ఆంధీ స్క్రీంప్లే
* Henrik Ibsen నాటకాలు: A Doll’s House, An Enemy of the People, Ghosts, The Wild Duck
* Man and Superman – G.B.Shaw
* Magic: G.K.Chesterton
– నిజం చెప్పాలంటే, మొత్తంగా అన్ని నాటకాలూ నాకు చాలా నచ్చాయి.

భాషాశాస్త్రం గురించినవి
* Understanding Linguistics – Jean Aitchison
* The Articulate Mammal: An introduction to Psycholinguistics – Jean Aitchison
– రెండూ గొప్ప పుస్తకాలు ప్రాథమిక అవగాహన కోసం చదివేవారికి!
* Philosophies of Language and Linguistics: Ralph A.Hartman
* The Word and the world: India’s contribution to the world of language – B.K.Matilal (ఇంకా పూర్తవలేదు)

ఇతరాలు:
* Women Writing in India – Volume 1 (Editors: K.Lalitha, Susie Tharu)
* Nonsense Rhymes – Sukumar Ray

చదవలేక వదిలేసినవి కొన్నీ, సాంకేతిక పుస్తకాలు కొన్నీ ఉన్నాయి కానీ, ఇక్కడికి ఆపుతున్నా ఈసారికి.

You Might Also Like

4 Comments

  1. పద్మవల్లి

    వావ్. మంచి పుస్తకాలు. నేను ఇందులో కొన్నే చదివాను. కొన్ని బహుశా చదవనేమో కూడా. అలా షేర్ చేస్తూ ఉండండి, మాకు రిఫెరెన్స్గా పనికొస్తాయి.

    నేను కూడా నేను చదివిన పిడికెడు పుస్తకాలూ, ఒక కేటలాగ్ లా రాయాలని 2012 చివరిలోనే మొదలెట్టాను. 2013 పూర్తయ్యేలోగా రాయగలిగితే చాలు. 🙂

  2. ..nagarjuna..

    OMG… ఇన్ని పుస్తకాలా !

  3. Krishna

    మంచి పుస్తకాలు చదివారు.

    వీటిలో నేను చదివినవి:
    ముక్కోతి కొమ్మచ్చి – మొదటి భాగం తో పోలిస్తే, రెండు, మూడు భాగాలు సినీ రంగం పై కేంద్రీకృతం ఐ ఉన్నట్టు అనిపించింది…
    The sense of an Ending – బాగా నచ్చింది..తానేం రాయలనుకున్నాడో బాగా తెలిసి అంత కంటే ఒక్క పదం కూడా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు అని నమ్మకం ఉన్న రచయితా విశ్వాసం ముఖ్యంగా నచ్చింది..
    Secret of the Nagas – మొదటి భాగం తో పోలిస్తే రచనా శైలి కొద్దిగా ఇంప్రూవ్ ఐనట్టు అనిపించినా, కథ కు కావలసినంతగా, పేరు లో ఉన్న రహస్యం కథనం లో లేదు అనిపించింది..
    The Krishna Key ద వించి కోడ్ రీమేక్ ఆ? అదే రచయితా గతం లో అదే కాన్సెప్ట్ (రీమేక్) తో అనే నవల కూడా రాసాడు మరి….

    1. సౌమ్య

      అవునండీ, Rozabal Line ఒక విధమైన రీమేక్. ఇది ఇంకో విధమైన రీమేక్. కాకపోతే, ఈ తాజా నవలలో పాత్రల చిత్రణలు కూడా డా విన్సీ కోడ్ నవలను గుర్తుకు తెస్తాయి. అయితే, రెండూ (డావిన్సీ కోడ్ ను కలుపుకుని మూడూ) నాకు నచ్చాయి అనుకోండి…అది వేరే సంగతి.

Leave a Reply