పుస్తకం
All about booksపుస్తకభాష

September 8, 2012

The PhD Grind

More articles by »
Written by: సౌమ్య
Tags:
pg-hack-on-box.large

ఒక్కొక్కమారు ఒక్కో పుస్తకం – నిజానికి చాలా సాధారణంగా ఉన్నా కూడా మనసుని బలంగా తాకుతుంది. అందులోని అనుభవాలు మన దైనందిన జీవితంలోనో, మన స్నేహితుల జీవితాల్లోనో తరుచుగా జరిగేవి అయితే, ఇది మరీనూ. వీళ్ళు ఎవరో గానీ, నా కథే చెబుతున్నారు అనిపిస్తుంది. అలాంటి అనుభవం Philip Guo రాసిన “The PhD Grind” అన్న పుస్తకం వల్ల కలిగింది. అతని వెబ్సైటులో ఉచితంగా లభ్యమయ్యే ఆ పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం.

ముందుగా పుస్తకం నేపథ్యం: ఫిలిప్ ఈ ఏడాదే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్సులో పీ.హెచ్.డీ పట్టా అందుకున్నాడు. ఆరేళ్ళ తన పీ.హెచ్.డీ ప్రయాణంలో పరిశోధక విద్యార్థిగా తన అనుభవాలను వివరిస్తూ గత జూన్ లో రాసిన “పీ.హెచ్.డీ గ్రైండ్” విశేష ఆదరణ పొందింది. విశేష ఆదరణ అంటే – బహుసా పరిశోధక విద్యార్థుల మధ్యనేమో అని కొట్టిపారేయకండి. విద్యార్థులే కాదు, అధ్యాపకులు, ఇతరత్రా అండర్-గ్రాడ్ లు, పీ.హెచ్.డీ చేయాలి అనుకునేవాళ్లు, చేసాక నా వల్ల కాదు అని మధ్యలో మానేసిన వాళ్ళు, తమ పిల్లలు పీ.హెచ్.డీ చేయాలి అనుకునే తల్లిదండ్రులు, ఈ పరిశోధక విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళంతా కాక, మామూలు “civilians” – ఇలా వివిధ నేపథ్యాల వారు ఈ పుస్తకాన్నిఈ రెండు నెల్ల లోనే విశేషంగా ఆదరించారు. ఇదీ పుస్తకం నేపథ్యం.

The Ph.D. Grind, a 122-page e-book, is the first known detailed account of an entire Ph.D. experience. Within its first month of release (July 2012), over 50,000 people—professors, research scientists, current and prospective Ph.D. students, and professionals in a variety of fields—have already read it and collectively sent me hundreds of email responses.”
– పైన కోట్ చేసిన ప్రకటన లాంటి పరిచయంలో “first known detailed account of an entire PhD experience” అన్నది ముఖ్యాంశం ఈ పుస్తకం ఇంత తక్కువ కాలంలో ఇంత పేరు పొందడానికి.

వివరాల్లోకి వెళ్తే: ఫిలిప్ ఏం.ఐ.టీ. లో డిగ్రీ, పీజీలు అయ్యాక, కంప్యూటర్ సైన్స్ లో పీ.హెచ్.డీ చేయాలి అనుకున్నాడు. సాధారణంగా అతను తెలివైన విద్యార్థి అని ఆసరికే మనకి అర్థమవుతుంది (ప్రొఫైల్ చూస్తే కొంచెం అవగాహన వస్తుంది లెండి). సరే, మొత్తానికి స్టాన్ఫోర్డ్ కి వస్తాడు. అక్కడ నుంచి వరుసగా అతని పరిశోధక జీవితంలోని తరువాతి ఆరేళ్ళూ ఎలా గడిచాయో చాప్టర్ల వారీగా ఉంటుంది. మొత్తం కథ అంతా నేను చెప్పేస్తే మరీ అన్యాయంగా ఉంటుంది కానీ, క్లుప్తంగా విషయం ఏమిటంటే – అతని ప్రయాణంలో చాలా పీ.హెచ్.డీ ప్రయాణాల లాగానే ఒడిదుడుకులు ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ల తరువాత కానీ, అతనికి అసలు తన థీసిస్ దేనిమీద రాసుకోవాలి? అన్న అవగాహన రాలేదు. అలాగని అతగాడికి తెలివి తేటలు లేవని కాదు. అతగాడిది దురదృష్టం అని కూడా కాదు. అయితే, అతని ఆనందాలు, విషాదాలు, అనుకున్నది అవ్వక చతికిలబడ్డం, అంతా బాగానే ఉన్నా ఫలానా రంగంలో రివ్యూవర్లకి నచ్చేలా ఎలా ప్రెజెంట్ చేయాలి? వంటి అంశాలు తెలియక పేపర్ సబ్మిషన్లు రిజెక్ట్ కావడం, క్రమంగా అతను కొత్త కొత్త పరిచయాలు పెంచుకుంటూ, తన ఆలోచనలు వారితో పంచుకుంటూ, గంటలకి గంటలు అదేపనిగా తన ఐడీయాలు నిజాలు కావడానికి కృషి చేస్తూ ముందుకు సాగిన విధానం అతని మాటల్లో చదివితే చాలా ఆసక్తికరంగా, స్పూర్తివంతంగా ఉండింది. ఈ సందర్భంలోనే ఒకచోట అతను అన్న ముక్క – కేవలం పరిశోధక విద్యార్థులకే కాదు, ఎంతో కొంత సృజనాత్మకంగా ఆలోచించగలిగి, అక్కడే ఆగిపోయే అందరికీ వర్తిస్తుంది.

‎”This journey has taught me that creative ideas mean nothing without the extreme effort to bring them to fruition: showing up to the office, getting my butt in the seat, grinding hard to make small but consistent progress, taking breaks to reflect and refresh, then repeating day after day for over two thousand consecutive days. However, grinding smart is just as important as grinding hard. It’s sad to see students blindly working themselves to death on tasks that won’t get favorable results: approaching a research problem from an unwise angle, using the wrong kinds of tools, or doing useless errands. Grinding smart requires perceptiveness, intuition, and a willingness to ask for help.”

ఇక, పరిశోధక విద్యార్థులు చదువుకుంటూ “అవునవును” అనుకునే తరహా జ్ఞాన గుళికలకి కొదువేమీ లేదు :-) ఇక్కడ నాకు అన్నింటికంటే నచ్చిన అంశం ఏమిటంటే, ఇతగాడు “స్టార్ పర్ఫార్మర్”, మహా వీర మేధావి, యువ జీనియస్ – కాకపోవడం! అలాంటి వారు చాల మందిలో కొందరుంటారు. వాళ్ళ కథలు చదివి స్పూర్తి పొందటంలో తప్పులేదు కానీ పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. వారితో పోలిస్తే, నాకు ఫిలిప్ కథ కొంచెం సగటు విద్యార్థి కథలా అనిపించింది. ఇతని విద్యార్థి జీవితంలో అపజయాలు ఉన్నాయి, గెలుపు పిలుపులూ ఉన్నాయి. అందుకే ఈ పుస్తకం నాకు ప్రధానంగా నచ్చడమూ, స్పూర్తి కలిగించడమూనూ! (అన్నట్లు, కేవలం విద్యార్థి జీవితం మాత్రమే ఉంటుంది ఈ పుస్తకంలో. ఇతరత్రా అంశాలేవీ కనబడవు.)

నేను CACM పత్రిక వెబ్సైటు చూస్తూ ఉంటే, వారి బ్లాగుల సెక్షన్లో Philip Guo రాసిన “The PhD Grind: Main Grinds and Side Grinds” అన్న వ్యాసం కనబడ్డది. సాధారణంగా అక్కడ కనబడే తరహా వ్యాసాలతో పోలిస్తే వ్యాసం, రాసిన వ్యక్తి భిన్నంగా ఉండడంతో, ఏమిటో చూద్దామని అక్కడ ప్రస్తావించబడ్డ పుస్తకం వద్దకి వచ్చాను. వచ్చాక అలా ఏకబిగిన పూర్తి చేసాకే ఆపాను :-) చిన్న పుస్తకమే కానీ, మనసుకి చాలా దగ్గరగా వచ్చిన పుస్తకం. Emotional Connect బాగా అనుభవించిన పుస్తకం. ఇంతకీ, ఇదొక వ్యక్తిగత అనుభవం మాత్రమే. అందరికి ఇవే ఎదురవుతాయని కాదు. ఇదే గొప్ప అనుభవం అని కూడా కాదు. ఉన్నంతలో నిజాయితీగా, తేలిక భాషలో రాసాడు అతను ఈ పుస్తకాన్ని. పరిశోధక విద్యార్థులుగా ఉన్న వారికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది ఈ పుస్తకం. ఇలాగ ఇంత వివరంగా పీ.హెచ్.డీ జీవితం ఎలా ఉంటుంది? అని రాసిన కథలు చాలా తక్కువ. పీ.హెచ్.డీ కామిక్స్ వెబ్సైటు పదేళ్ళ బట్టీ ఉంది…వాళ్లీమధ్య సినిమా కూడా తీసారు. నేను వాటిని విపరీతంగా అభిమానిస్తాను కానీ, ఎంతైనా దానిలో ముందు వ్యంగ్యానికి, అతిశయోక్తి కి పెద్ద పీట. కానీ, ఈ పుస్తకం ఆత్మకథ. ఇలాంటివి తరుచుగా చదివే అవకాశం ఉంటే బాగుంటుంది (కనీసం నాకు!). అప్పుడెప్పుడో కవన శర్మ గారు అనుకుంటా …మన దేశంలో రిసర్చి స్కాలర్ల జీవితాల ఆధారంగా కథలో, నవలో ఏదో ఒకటి రాసారు…బాగా చిన్నప్పుడు మా ఇంట్లో చూసినట్లు గుర్తు. పేరు ఇప్పుడు తట్టడం లేదు. ఎవరన్నా తెలిస్తే చెబుదురూ…

ఈ పుస్తకం గురించి ఇందులోని అంశాల గురించి కాస్త వివరంగా చర్చించిన ఒక ఆంగ్ల పరిచయం ఇక్కడ.About the Author(s)

సౌమ్య3 Comments


 1. రానారె

  ఇలాంటిదే మరో పుస్తకం Joker in the Pack.
  అంశం – IIM Bangaloreలో ఒక మధ్యతరగతి విద్యార్థి అనుభవాలు.


 2. సౌమ్య గారూ, అది కవనశర్మ గారు వ్రాసిన “అమెరికా మజిలీ కథలు” పుస్తకం.


  • సౌమ్య

   కాదండీ – అది అమెరికా గురించి కాదు. బహుశా ఆ పుస్తకం పేరు “వడ్డించే మనవాళ్ళ కథలు” అనుకుంటా… లేదంటే నేనే రెంటి మధ్యా కంఫ్యూజ్ అయ్యానో మరి. నేను చెప్పిన పుస్తకంలో కథ ఇండియన్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఇప్పుడు మీరన్నాక గుర్తొస్తోంది: మా ఇంట్లో ఒక పుస్తకం: “బ్రెయిండ్రెయిన్ అను అమెరికామజిలీ కథలు, వద్దించే మనవాళ్ళ కథలు” అని ఉండేది. అయితే, ఆ “బ్రెయిన్ డ్రెయిన్ …” బహుశా నేను అన్న కథేమో. వివరాలు చెప్పినందుకు థాంక్స్.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
AmmaAligindiCover

సీనియర్ సిటిజెన్స్ కథలు – “అమ్మ అలిగింది”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************ ‘వాణిశ్రీ‘ అనే కలం పేరుతో సుప్రసిద్ధులైన సి.హె...
by అతిథి
0

 
 
glasscastle

The Glass Castle

వ్యాసకర్త: Nagini Kandala ********** మనిషి మనుగడకి అవసరమైనవి ఏమిటి అని ఎవరైనా అడిగితే ముందుగా రోటీ,క...
by అతిథి
0

 
 
hindutvainvitation

Book Release Invitation: Hindutva or Hind Swaraj

Book launch of “Hindutva or Hind Swaraj” by U.R.Ananthamurthy, translated from Kannada by Keerti Ramachandra and Vivek Shanbag, will be released on June 1st, 2016, in Bangalore. Further details, as follows.  
by పుస్తకం.నెట్
0

 

 
honestseason

The Honest Season – Kota Neelima

Review by: Tapan Mozumdar I finished reading ‘The Honest Season’ by Kota Neelima in about 7 hours spread over 3 days. The book has 24 chapters, a prologue, and an epilogue. Considering the volume, this is probably one of th...
by అతిథి
0

 
 
mystery2015

The Best American Mystery Stories – 2015

During my medical college days in Guntur, my reading would often include mystery stories, usually in small paperback anthologies, rented for about 25 paise a week from the Kumar Book Stall in Arundelpet. Many of them had the na...
by Jampala Chowdary
0

 
 
papineni1

మనిషి అస్తిత్వపు పెనుగులాటకి ప్రతిఫలనాలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [ఈ తరం కోసం … అరసం (ఆం. ప్ర) సమర్పిస్తోన్న కథా స్రవంతి సీరీస్ ...
by అతిథి
2