పుస్తకం
All about booksపుస్తకభాష

April 12, 2012

Addicted to war – చర్చా పరిచయం

More articles by and »
Written by: సౌమ్య and Purnima
Tags:

‘Addicted to war’ అన్నది అమెరికా దేశం విదేశాల్లో నడిపిన యుద్ధాల గురించి ప్రాథమిక అవగాహన కలిగించడానికి రాసినది. ఇద్దరం దాదాపు ఒకే సమయంలో ఈ పుస్తకం చదవడం చేత ఈ పుస్తకాన్ని మా సంభాషణ ద్వారా పరిచయం చేస్తున్నాము.

******

పూర్ణిమ: నువ్వు రెకమెండ్ చేసిన Addicted to War అనే గ్రాఫిక్ నవల చదివాను. I’ve mixed feelings about it. నేను అన్నీ కలగాపులగంగా చెప్తానేమో, అందుకని నువ్వే మొదలపెట్టు. నీకీ పుస్తకం ఎలా అనిపించింది?

సౌమ్య: నచ్చింది అనడం కంటే – ఆలోచింపజేసింది అనడం సబబు. ఆలోచింపజేయడం వల్ల నచ్చింది అనుకో, అది వేరే విషయం. ఒకే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న దేశం గత ఆరేడు దశాబ్దాలలో ఎన్ని యుద్ధాల్లో పాల్గొనింది? ఎన్నింటిని తానుగా మొదలుపెట్టింది? ఆ కథంతా తెలుసుకోవాలంటే మాములుగా చదవాల్సి వచ్చేదానికంటే తక్కువ సమయంలో టూకీగా విషయం చెప్పింది కదా. పైగా, నాకు నచ్చిన విషయం – రిఫరెన్సులు ఇవ్వడం. నాకు మా చెడ్డ చిరాకు ఊరికే గాల్లో చరిత్ర పాఠాలు చెప్పే వాళ్ళంటే.

పూర్ణిమ: నిజమే. ఒక గ్రాఫిక్ నవలలో రిఫరెన్సెస్ ఇస్తారని నేను అనుకోలేదు. ఇహ, నువ్వన్న “తక్కువ సమయంలో సూటిగా విషయాన్ని చేరవేయడం” అనేది ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం అనుకోవచ్చు. ఇదే టాపిక్ తీసుకొని, అన్ని రిఫరెన్సులతో కలిపి చాలా పెద్ద పుస్తకమే రాయచ్చు. కానీ అలా రాస్తే, చదివేవారెంత మంది? అందుకని కావాల్సిన సమాచారాన్ని, అది చేదు వాస్తవాలను గుర్తిస్తున్నా, తీయటి పాకం పట్టి నోటికందించారు.

సౌమ్య:  ఈ పుస్తకం ప్రధానంగా అమెరికాలో పిల్లలకి ఉద్దేశించింది అనుకుంటాను.  అందుకే, వీలైనంత సులభ గ్రాహ్యమైన భాషలో, వీలైనంత క్లుప్తంగా చెప్పారు.  అక్కడ పిల్లలు స్కూల్లో చదివే చరిత్ర పాఠాల్లో ఇవన్నీ ఎంత వరకూ చెబుతారో మరి, నాకు అంతగా ఐడియా లేదు. అలాగే,  పెద్దలైనా చాలా మంది ఈ విషయాలు గమనించరు అనుకుంటాను. అమెరికన్లూ, అనమెరికన్లూ కూడా.

పూర్ణిమ: పిల్లలకన్నా ముఖ్యంగా పెద్దవాళ్ళకి అవసరం ఇలాంటి పుస్తకాలు. మనం కళ్ళు మూసుకోగానే, మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా మాయమైపోతుందన్నట్టు వ్యవహరించే ఎవరికైనా చెంపపెట్టు ఈ పుస్తకం అని నాకు బలంగా అనిపిస్తుంది. ఇహ నువ్వన్నట్టు, అనమెరికన్లకూ ఈ పుస్తకం ముఖ్యమైనదే.

నేను ఒకట్రెండు తరగతులతో ఉండగా, గల్ఫ్ వార్ మొదలైంది. మేమప్పుడు నాలుగైదు కుటుంబాలు కలిపున్న కాంపౌండులో అద్దెకి ఉండేవాళ్ళం. రోజూ ఆఫీసులకు వెళ్ళే ముందు, వచ్చీ రాగానే రేడియో వార్తలు వింటూ నాన్నావాళ్ళూ తెగ మాట్లాడేసుకునేవారు. ఆ తర్వాత పరోక్షమే అయినా, కార్గిల్ యుద్ధం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ పైన, అంతా షరా మామూలే! మొన్న ఆఫ్ఘాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఎంత నిర్లిప్తంగా ఉన్నానో, అలా ఎలా ఉండగలిగానో నాకే అర్థం కాదసలు. ఇహ, మన దేశంలో బాంబు బ్లాస్టులైతే రొటీన్ లో భాగం అనిపించేంతగా ఉంది పరిస్థితి. సో, ఒకలాంటి స్థబ్దతలో ఉన్న నన్ను కొంచెం తట్టిలేపిందనే చెప్పాలి ఈ పుస్తకం.

సౌమ్య: అవును. నేనూ సాధారణంగా అలాగే నిర్లిప్తంగా ఉండిపోతాను అనిపిస్తుంది. నిర్లిప్తంగా ఉండిపోవడం క్రైం అయితే కావొచ్చు కానీ, నిర్లిప్తులు అంతా క్రిమినల్స్ కానక్కర్లేదు :).  కానీ యుద్ధాల్లో గెలుపులని ఏదో పెద్ద అచీవ్మెంట్ లాగ చెప్పుకుంటూ వచ్చే చరిత్ర పాఠాలు పుట్టించే అసహ్యం కంటే, ప్రత్యేకం వర్తమానం లో “భయం పై యుద్ధం” అనో ఇంకేదో అనో చెప్పుకుని స్వలాభం కోసం చేసే యుద్ధం ఇంకా అసహ్యం పుట్టిస్తుంది నాకు.  అందుకు కాబోలు, ఈ పుస్తకం నాకు నచ్చడం…. అలాగని, మొత్తానికే అమెరికా ఎం చేసినా ద్వేషించాలి అని కాదు అనుకో, అది వేరే సంగతి.

పూర్ణిమ: ఆ నిర్లిప్తతకి కారణాలు ఉండే ఉంటాయి. నేను పైన చెప్పకుండా మిస్ చేసిన పాయింట్. రేడియో వార్తలు వస్తుంటే  (అంటే విజువల్స్ లేవు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది మనకి కనిపించదు) క్రియేట్ అయిన ఒక సీరియస్ వాతావరణం – “ఓహ్.. ప్రపంచంలో మరో చోటే గానీ, మనలాంటి వాళ్ళు ఎంతమంది ఆపదలో చిక్కుకుపోయారే!” అన్న వాతావరణం బలంగా అనిపించింది. అసలుకైతే ఒక యుద్ధాన్ని వీలైనంత టెలికాస్ట్ చేస్తుంటే కలగాల్సిన బాధ కలగకపోగా, “వాటెవర్..” అని అనిపించేస్తోంది. ఎలా ఎందుకు అన్నది ఎవరైనా బా చెప్పగలరేమో.

కానీ, ఇలాంటి ఒక అలటర్నేట్ మీడియా చాలా అవసరం. To make us sit and think about facts. నేను టాపిక్ మొత్తంగా హైజాక్ చేసే ముందు, ఈ పుస్తకం గురించి నీ ఆలోచనలు గబగబా చెప్పేయ్య్.. 🙂

సౌమ్య:  సరే, పుస్తకం అమెరికన్లని ఉద్దేశించినది అని ముందే చెప్పా కదా. వీళ్ళ జీతాల నుంచి మిలటరీ బడ్జెట్ కోసం డబ్బులు కట్ చేయడం నుంచి, స్కూళ్ళలో ప్రాథమిక అవసరాలకి ఉండే బడ్జెట్ ని మాత్రం ఇవ్వకపోవడం అన్న ఐరనీ తో మొదలైంది కదా – నిజానికి ఇది యుద్ధ కాంక్ష లో … మన ప్రజల సంగతి మనం మొదట చూడాలి అన్న సంగతి మర్చిపోయి, బయటి దేశాలని ఉద్దరిస్తాం అని వెళ్ళడంలో ఉన్న వైరుధ్యాన్ని చెబుతున్నట్లు అనిపించింది నాకు. ‘స్వయం తీర్ణా, పరాం స్తారయతి’ అని మొన్న చదివాను. సొంత దేశంలో ప్రజల బాగోగులు చూస్కోలేని వారు, పక్క దేశాల బాగు కోసం పని చేస్తున్నారు అని నమ్మడం కొంచెం కష్టంగా లేదూ? ఆలోచించండి! అని ఈ పుస్తకం చెప్పదలచుకుంది అని నా ఉద్దేశం.

పూర్ణిమ: మళ్ళీ పరాయి వాళ్ళని ఉద్ధరించటం మామూలుగా కూడా కాదు. “తగాదా తీర్చండయ్యా” అంటూ ఎవరూ వచ్చి అడక్కపోయినా, వీళ్ళ స్వప్రయోజనాల కోసం, ఎవరి మధ్య చిచ్చు రగులుతున్నా, దానికి ఇంకా ఆజ్యం పోసి, దాంట్లో చలి కాచుకోవడం అన్నది ఉంది చూశావూ.. అది ఈ పుస్తకం చాలా అంటే చాలా బాగా హైలైట్ చేసింది. కొన్ని “hit the nail on its head” lines ఉన్నాయి చూడు. ఉదా: Sign the deal or I’ll bomb you. They give the whole picture! అంటే మాటలను ఎలా package చేస్తారంటే.. కొంచెం కంపు కొట్టే పోలిక. But can’t help it. పుష్పక విమానం సినిమాలో కమల్ హాసన్ చేసే చెత్త పాకేజింగ్ పని గుర్తుందా? – అలా అన్న మాట. I felt, there was special effort on the authors’part to emphasize that, all that’s (being) said is what was (being) meant.

సౌమ్య:  గ్రాఫిక్ పుస్తకం, అందునా క్లుప్తతని డిమాండ్ చేసే పుస్తకం. కనుక, ఆ “స్పెషల్ ఎఫర్ట్ “ తప్పనిసరి అనుకుంటాను. బహుసా, ఇలాంటి అంశాలు రాస్తున్నప్పుడు  చదువరులని ఆకట్టుకోవాలంటే ఆ ప్యాకేజింగ్ అవసరం ఏమో.  విచిత్రం ఏమిటి అంటే – ఒక గూగుల్ స్టోరీ అనో, ఒక స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రో, ఇంకేదో కంపెనీ విజయ యాత్రో…. ప్రచారమైనంత తేలిగ్గా ఇలాంటి విషయాలు రాసిన పుస్తకాలు ప్రచారం కాబడవు. ఎందుకో మరి. ప్రధానంగా ఈ ఒక్క కారణం కోసమే నేను ఈ పుస్తకం గురించి పరిచయం చేద్దాం అనుకున్నది.

పూర్ణిమ: 1992లో వచ్చిన మొదటి ఎడిషన్ నుండి సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించడానికి కొత్త ఎడిషన్ తీసుకురావటం బాగా అనిపించింది. ముఖ్యంగా, పాలు పోసుకొని పెంచుకున్న పాము తననే కాటేయడం అనే అధ్యాయం ఉంది కదా! ఎంత కాదనుకున్నా,

“Few people anywhere in the world, including the Middle East,support Bin Landen’s terrorist methods. But most people in the Middle East *share his anger* at the United States. They are angry at the U.S for supporting corrupt and dictatorial regimes in the region, for supporting Israel at the expense of the Palestinians and for imposing U.S. dictates on the Middle East through military might and brutal economic sanctions.”

అన్న దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు.

సౌమ్య: అవును. ఈ పుస్తకం ఉద్దేశ్యాలలో ఇది కూడా ఒకటి  అనుకుంటా…. తెలిసినా మరిచిపోయిన విషయాలని గుర్తు చేసి కొంచెం ఆ దృష్టి తో ఆలోచిస్తే,  చాలా చోట్ల అమెరికాపై ద్వేషం ఎందుకుందో అర్థం అవుతుంది అని చెప్పడం…

పూర్ణిమ: ఒకే. ఇప్పుడిక ఈ పుస్తకంలో నాకు నచ్చని విషయాలు:

౧. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా, మొదలవ్వటంతోనే డబ్బులు దోచేసుకుంటున్నారో అంటూ మొదలవ్వటం నాకు నచ్చలేదు. యుద్ధం వల్ల కలిగే అన్ని రకాల దుష్ప్రాణాలనూ – ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సమస్యలు – పరిచయం చేస్తూనే, టాక్స్ ఎక్కువ కడుతున్నారన్న విషయాన్ని కావాల్సిన దానికన్నా ఎక్కువ నొక్కి చెప్పారని నాకనిపించింది.

ఒళ్ళు హూనం చేసుకొని నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బును ఎవడో దోచుకుపోతే బాధేస్తుంది, కోపమొస్తుంది. అది అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రపంచం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు, దస్కం దోపిడీలకన్నా జరుగుతున్న అత్యంత హేయమైన దోపిడి, ప్రాణదోపిడి. (అలాంటి ఓ పదం ఉందనుకోను.) ఇంతముందు యుద్ధానికి వెళ్ళినవాడు తిరిగొస్తాడో లేదో తెలీదు. ఇప్పుడు, పక్కనున్న బేకరికి వెళ్ళినవాడో, రైల్వే స్టేషన్‍ వెళ్ళినవాడో తిరిగొస్తాడో లేదో చెప్పలేకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉందీ పరిస్థితి. అమెరికన్లు కూడా సెప్టంబర్ 11, 2001 ను చూశారు. ఒసామా చనిపోయినప్పుడు కొందరు వీధుల్లోకి వచ్చి గంతులేసి ఉండచ్చు గానీ, ఆ దాడుల్లో నిజంగా పోగొట్టుకున్నవాళ్ళు మళ్ళీ అంతే బాధపడ్డారు. When you loot someone of their wealth, you can give it back. But looting someone of their loved ones, the loss can be never be restored. అందుకని టాక్స్ అంటూ మొదలై, ముగిసే సరికి నాకు నచ్చలేదు.

సౌమ్య: పుస్తకం ఉద్దేశ్యం, దాని టార్గెట్ ఆడియన్స్ వేరు కదా. ఇక్కడ టార్గెట్: యుద్ధాన్ని తప్పుపట్టడానికి ప్రత్యేకమైన కారణాలు లేని ఒక  నిర్లిప్త అమెరికన్ కుటుంబం కావొచ్చునని నా ఊహ. వారిని దృష్టిలో ఉంచుకుని ఇదంతా చెప్పాలి అని ఆలోచిస్తే, వాళ్ళ జీవితంలో యుద్ధం ప్రభావం వల్ల మారిన అంశాలతోనే మొదలుపెట్టాలి కదా. టాక్సు కోతలు, స్కూళ్ళలో సబ్సిడీల లేమి – వీటితో మొదలుపెట్టి వీటన్నింటికీ కారణం ఇదీ! అని చెబితే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు అనుకుని ఉంటారు అని నా అభిప్రాయం.

పూర్ణిమ : అనుకో. అయినా కూడా.

౨. ఇంత విలువైన సమాచారం, బోలెడన్ని ఆలోచనలను ఇచ్చిన పుస్తకంలో లొసుగులు వెతకటం సబబు కాదేమో. అయినా, నాకీ కథలో పాత్రలకు ఈ విషయాలన్ని తెల్సుకొని మనకి చెబుతున్నారా? లేక మనతో పాటు తెల్సుకుంటున్నారా? అన్నది స్పష్టంగా అనిపించలేదు. ఒక్కో విషయం, ఒక్కో విషయం తెలుస్తున్న కొద్దీ.. పాఠకునిలో కలిగే ప్రతిస్పందనలన్నీ ఏదైనా ఒక పాత్ర ద్వారా వినిపిస్తూ ఉంటే ఇంకా బాగుణ్ణు అని అనిపించింది.

సౌమ్య: అవును. ఈ విషయం నేనూ ఒప్పుకుంటాను. ఆ తల్లీ-కొడుకు ల మధ్య డైలాగ్ సరిగ్గా నడవలేదు. పైగా, వీళ్ళిద్దరే పాత్రలా? ఇంకో ఘోస్ట్ పాత్ర ఉందా? అనిపించింది నాకు చాల చోట్ల.  ఎక్కడో మధ్య మధ్యలో – “ఓహ్, నాకీ విషయం తెలీనే లేదు సుమీ” అని ఒక పాత్ర అంటుంది కానీ, నిజంగా ఇది సంభాషణలా లేదు. కానీ, ఆయా విషయాలు చెబుతున్నప్పుడు వాడిన ఇలస్ట్రేషన్లు నాకు నచ్చాయి. దానితో నేను ఇది పట్టించుకోలేదు.

౩. భారత్-పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై అమెరికా వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు పై ప్రస్తావనే లేకపోవటం కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. ఈ లెక్కన అమెరికా చేస్తున్న ఇంకెన్ని విషయాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడలేదో?!

సౌమ్య: సగటు అమెరికన్ జీవితంపై ప్రభావం చూపిన యుద్ధాల లెక్కలో భారత్-పాకిస్తాన్ ల మధ్య ఉన్న అంశాలు రావు కదా మరి 🙂 అసలుకి మనిద్దరం చదివిందే దాదాపు పదేళ్ళ నాటి ఎడిషన్. ఆ లెక్కలో ఇప్పుడు కొత్త ఎడిషన్ వస్తే ఇంకెన్ని ఉంటాయో!!

పూర్ణిమ: నిజమే. అమెరికన్లను నిద్రలేపే ప్రయత్నం కదూ! ఇందులో నన్ను చాలా కలవపరచిన విషయం ఒకటి, వియత్నాంలో యుద్ధం చేసిన సైనికుల ఒక రకమైన మానసిక రుగ్మతతో బాధపడ్డం. ఒకరి నిర్ణయాలకు ఇంకెవ్వరో బలి అవుతూ ఉంటారు కదా.

బైదవే.. చైనా మిలిటరి గురించి మనవాళ్ళు రాసిన ఒక పుస్తకం చదివాను, రెండేళ్ళ క్రితం. పుస్తకం పేరు: The Dragon’s Fire – Chinese Military Strategy and Its Implications for Asia. కొంచెం సీరియస్ పుస్తకమే. అమెరికా తర్వాత, లేక అమెరికాతో సమానంగా మిలిటరి వ్యవస్థలో చైనానే పోటీపడగలదు అనుకుంట. వాళ్ళు ప్రస్తుతానికి మాత్రం గుట్టు చప్పుడు కాకుండా, తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. మరి ఆ సమన్వయం ఎంతకాలం ఉంటుందో? వాళ్ళు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారా అన్నది కాలమే చెప్పాలి. ఈ అంశంపై ఆసక్తిగల వాళ్ళు నేను చెప్తున్న పుస్తకాన్ని చూస్తారని చెప్తున్నాను.  ఏదేమైనా ఒక మంచి పుస్తకం చదివించినందుకు థాంక్స్. ఈ అంశంపై ఒక అవగాహన కలిగింది నాకిప్పుడు. థాంక్యూ.

సౌమ్య: చాలా థాంక్స్ అండీ పూర్ణిమ గారూ, ఇలా చర్చిద్దాం అన్న ఆలోచన తెచ్చి దాన్ని అమలుపరచినందుకు. ఎటొచ్చీ, మనం మనమే అనుకోవాల్సిందే గానీ, శాంతిస్వరూప్ గారు రారు. 😉

******

పుస్తకం వివరాలు:
Addicted to war
Joel Andreas
కొనుగోలు లంకెలు ఇక్కడ .
పుస్తకం ఈ-పుస్తకంగా ఉచితంగా చదివేందుకు కూడా లభ్యం. లంకె ఇక్కడ.
పుస్తకం గురించిన వికీ పేజీ ఇక్కడ.

**Update**
ఈ పుస్తకం తెలుగులో యుద్దోన్మాది అమెరికా పేరుతో తెలుగులో వచ్చింది. దీన్ని మంచిపుస్తకం సురేష్ గారు అనువదించారు. జనవిజ్ఞానవేదిక మరియు లిఖిత కలిసి సంయుక్తంగా ప్రచురించారు. వెల 100 రూపాయలు. అవే బొమ్మలు అనుమతి తీసుకొని ఉపయోగించారు. ఆంగ్ల పుస్తకం మరియు తెలుగు అనువాదం రెండు కూడా మంచి పుస్తకం వారి వద్ద లభిస్తాయి. పుస్తకం కావాల్సిన వారు మంచిపుస్తకం వారిని సంప్రదించవచ్చు.About the Author(s)

సౌమ్య


Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..7 Comments


 1. Raghu

  Well read people like you by now should have known “Socratic Method”. You guys used it in a really good way.Well done. (btw,No Pun Intended)


 2. సౌమ్య

  “ఆంగ్ల పుస్తకం మరియు తెలుగు అనువాదం రెండు కూడా మంచి పుస్తకం వారి వద్ద లభిస్తాయి.”
  నాకో సందేహం – ఆంగ్ల పుస్తకం అంతా అమెరికన్ చదువరులను దృష్టిలో ఉంచుకునే సాగుతుంది కదా, తెలుగు అనువాదం చేసినప్పుడు తెలుగు నేపథ్యానికి తగ్గట్లు మార్పులేమీ చేయలేదా? ఈ పుస్తకం – అమెరికన్ స్కూళ్ళలో చెప్పే అమెరికా కీ, ఇది రాసిన వాళ్ళ ప్రకారం అమెరికా అంటే ఎమిటి? అన్నదానికీ ఉన్న తేడాని టర్గెట్ చేసిందని నా అభిప్రాయం. అలా, తెలుగు అనువాదంలో – మనవాళ్ళ దృష్టిలో అమెరికా అంటే ఏమిటి? ఈ పుస్తకం ప్రకారం అమెరికా అంటే ఏమిటి? అన్న తేడా హైలైట్ చేసారా? లేదంటే సూటిగా అనువాదం చేశారా?


  • ఎంతో కొంత శ్రమ, సమయం వెచ్చించి పుస్తకాలను మాకు తోచిన రీతిలో, మా limited knowledge and understandingతో పరిచయం చేశాక, ఇలా “పనికొచ్చే” inputs వస్తే భలే సంతోషంగా ఉంటుంది. Sincerity లేని అభినందన, constructive కాని criticism తో ఏం చేసుకోలేం కదా, ఎటూ.

   Glad to know that there’s Telugu translation of this book. Congratulations to Suresh gaaru and manchi-pustakam team for their good work.


 3. ఒసామా బదులు ఒబామా అని అచ్చు తప్పు పడింది. ఒసామా చనిపోయినప్పుడు అని ఉండాలనుకుంటాను, పూర్ణిమ సంభాషణలో.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 
 

 

నాలుగు Will Eisner పుస్తకాలు

రెండేళ్ళ క్రితం అనుకుంటాను Will Eisner గీసి, రాసిన A Contract with God and Other stories అన్న నాలుగు గ్రాఫిక్ కథల స...
by సౌమ్య
0

 
 

Science and Philosophy: Discoveries in Comics

మే నెలలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శించినపుడు అక్కడ ఉన్న Barnes and Noble ప...
by అసూర్యంపశ్య
1

 
 

Stupid Guy Goes to India – Yukichi Yamamatsu

కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించి చదివి, గ్రాఫిక్ నవలల పై నాకున్న ఆసక్త...
by సౌమ్య
3