The Language Web – Reith Lectures 1996

మొదట అసలు Reith Lectures ఏమిటో కొంచెం చెప్పి తరువాత అసలు సంగతికొస్తాను. రీత్ లెక్చర్స్ – 1948లో నుండీ ఏటేటా బీబీసీ వారు నిర్వహించే రేడియో ప్రసంగాలు. ప్రతి ఏడాదీ ఏదో ఒక రంగంలో విస్తృత అనుభవం గడించిన ప్రముఖులు ఒకరు తమ రంగంలోని పరిశోధనాంశాల గురించి సామాన్యుల భాషలో ఒక ఐదారు ప్రసంగాలు చేస్తారు. ఈ సంప్రదాయం బీబీసీ రేడియో కు మొదటి డైరెక్టర్ జనరల్ అయిన సర్ జాన్ రీత్ పేరుమీద మొదలయింది. తత్వ శాస్త్రం మొదలుకుని కంప్యూటర్ల దాకా వివిధ అంశాల మీద ఇప్పటికి ప్రసంగాలు వచ్చాయి.

ఇక ప్రస్తుత విషయానికొస్తే, “The Language web” అన్నది బ్రిటన్ కు చెందిన ప్రముఖ భాషావేత్త Jean Aitchison 1996లో భాష ఉద్భవం, ఉపయోగం, దానిలో వచ్చిన, వస్తున్న మార్పులకి కారణాలు – ఇత్యాది అంశాలపై ఇచ్చిన ఐదు ప్రసంగాల సమూహం. ఒక్కొక్క ప్రసంగాన్నీ తీసుకుని – కొంచెం వివరంగా వ్రాస్తాను.

Lecture one: A Web of Worries :
“మన భాష పాడైపోతోంది” అనో, “మన భాష మారిపోతోంది” అనో – బాధపడిపోవడం గురించి ప్రస్తావిస్తూ, కాలనుగుణంగా భాష మార్పు చెందడం ఎంత సహజ పరిణామమో వివరించడం ఈ ప్రసంగం ముఖ్య లక్ష్యం. భాషలో సహజంగానే కొన్ని నియమాలు, ఒక పద్ధతీ గట్రా క్రమంగా ఏర్పడతాయి… అయితే, కొన్ని నియమాలు బలవంతంగా రుద్దబడతయి అంటూ మొదలుపెడతారు ప్రొఫెసర్ జీన్. సహజంగా ఏర్పడేవంటే -“పిల్లి ఎలుకను చంపింది” అన్నా “ఎలుకను పిల్లి చంపింది” అన్నా దాన్ని మనం ఒకేలా అర్థం చేసుకుంటాము కదా ..అలాంటిది సహజ నియమం. అయితే, ఫలానా విధంగా చెప్పడం “స్టాండర్డ్” భాష, ఫలానా విధం తప్పు… అని పెట్టే ఆంక్షలు అసహజమైనవి అంటారు ఇందులో (ఈ అన్వయాలు నావి. వివరాలకి లెక్చర్ వినండి/చదవండి). భాష కాలక్రమంలో మార్పు చెందడాన్ని కొందరు “బద్దకం” (పలకడానికి బద్దకమేసి..అంటే పెళ్ళి పెల్లి అవడం టైపు అనుకోవచ్చేమో తెలుగులో) అంటారు, కొందరు “భ్రష్టు పట్టడం” (అంటే కొన్ని వాక్య నిర్మాణాల్లో మార్పు రావడం – హ్యాపీగా ఫీలవ్వడం, హ్యాండివ్వడం వంటివి) అంటారు. కొందరు పరిసరాల నుండి రోగంలా అంటించుకోవడం అంటారు (అంటే, ఇతర భాషల్నుంచి పదాలు అప్పుతీసుకోవడం వంటివి – మొబైల్ ఫోన్, కంప్యూటర్ వంటివి). నిజానికి ఇక్కడ నేను ఇచ్చిన ఉదాహరణలు అంత complimentary toneలో లేవు కానీ, ప్రొఫెసర్ జీన్ వాదనలో – ఇలాంటి మార్పుల వల్ల భాషలోని irregularities regularize అవుతాయి అంటారు. నేనిక్కడ ఈ ఉదాహరణలు ఇవ్వడానికి కారణం – అది చదువుతూ ఉంటే, ఇలాంటివి కూడా అవ్వొచ్చుగా! అనిపించడం.

“At any time, in any language, a number of potential change-points exist. Anomalies tend to get smoothed out, as with the tidying up of past tenses and plurals… … So more and more old forms are wiped away, as new, regular forms flood in. But this is not disintegration. Sweeping up old oddments is good housekeeping, or rather, good language-keeping. Gradual neatening up of patterns is inevitable and essential. In this way, the mind avoids becoming overloaded with unpredictable oddments… … … But finally, I would like to stress again that we need to understand language, not try to control it.”
(…లెక్చర్ లోని ఒక ఉదాహరణ: “In this century, “gelded” and “girded” have mostly replaced “gelt” and “girt” as the past tense forms of “geld” and “gird”, and many people don’t even realise a change has
occurred.”)
-ప్రధానంగా ఈ ప్రసంగంలో రచయిత్రి వాదనను పై వాక్యాలు, ఉదాహరణలు సంక్షిప్తీకరిస్తాయని నా అభిప్రాయం. జనబాహుళ్యం నోళ్ళలో కాలక్రమంలో కొన్ని నిలుస్తాయి, కొన్ని పుడతాయి, కొన్ని పోతాయి- అది సహజం, దాని గురించి గగ్గోలు పెట్టాల్సిన పనిలేదు అని సారాంశం మొత్తానికి. అయితే ఇందాక నాకు అనిపించినట్లు, భాషని enrich చేసే మార్పులతో పాటు మరో రకమైన మార్పులూ జరిగే అవకాశం లేకపోలేదు కదా! (చూసే చూపును బట్టి అదే మార్పు కొంతమందికి గొప్ప amalgam గా తోచవచ్చును. అది వేరే సంగతి).

ప్రసంగం ఇక్కడ, ప్రసంగ పాఠం ఇక్కడ.

Lecture two: A Web of Deceit
ఈ ప్రసంగం – “భాష ఎలా పుట్టింది” అన్న అంశంపై శతాబ్దాల బట్టి ప్రాచుర్యంలోకి వచ్చిన సిద్ధాంతాలు, భావాలు -వీటి గురించిన విశ్లేషణలతో సాగుతుంది. రెండువేల ఏళ్ళ నాడే మొదలైందట భాషపుట్టుక గురించి థియరీలు కనిపెట్టడం. ఒక దశలో ఎవరు పడితే వారు వేలంవెర్రిలా వివిధ సిద్ధాంతాలతో స్వైరవిహారం చేస్తూ ఉంటే, 1866లో అప్పటికి లింగ్విస్టిక్స్ గురించిన ప్రముఖ సంస్థ అయిన Linguistic Society of Paris ఆఖరుకి అసలుకి ఆ అంశంపై పరిశోధనే నిషేదించిందట అప్పట్లో!! అయితే, ఇటీవలి కాలంలో మళ్ళీ ఆ అంశంపై పరిశోధన జరుగుతోందని అంటారు ప్రొఫెసర్ జీన్ (ఇటీవలి అంటే 1980లు,90ల కాలం అనమాట). భాష అసలెందుకు పుట్టింది అనే ప్రశ్నతో మొదలుపెట్టారు. సమాచార ప్రసారం కోసం – అన్నది ప్రధానమైన వాదన. అయితే అన్నింటినీ కేవలం మాటల్లోనే వ్యక్తపరచగలమా? లేదు. అలాగే, సమాచార ప్రసారమొక్కటే కారణం కానక్కర్లేదు. మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చు – అవి మామూలు పలకరింపులు కావొచ్చు, పోచికోలు కబుర్లు కావొచ్చు, అవతలి మనుషుల్ని తిట్టడానికి కావొచ్చు, పొగడ్డానికి కావొచ్చు, మోసం చేయడానికి కావొచ్చు…ఇలాగ చాలా కారణాలు ఉండొచ్చు. ఈ అవసరాలు మనుషులు సృష్టించగలిగే శబ్దాలతో కలిసి క్రమంగా రకరకాల శబ్దతరంగాలు ఏర్పడి క్రమంగా భాష రూపొంది ఉండవచ్చు అంటారు. మళ్ళీ ఈ శబ్దాల పుట్టుక గురించి కూడా కొన్ని థియరీలు ఉన్నాయి – ప్రకృతిలో వినవచ్చే శబ్దాల ఇమిటేషన్లతో పుట్టాయనీ, అరుపులు-కేకల నుండి పూట్టాయనీ – ఇలాంటివి. ఇక్కడ నుంచి మొదట పదాలు పుట్టి, ఆ తరువాత ఒక వ్యాకరణం ఏర్పడి ఉండవచ్చు అంటారు. వ్యాకరణం ఏర్పడ్డం ఎలాగైందో speculate చేస్తూ – “In language change today optional patterns become habits. Then the habits become obligatory. Our best guess is that something similar happened at the origin of language.” అంటారు. ఒక విధంగా ఈ మొత్తం ప్రసంగాల ముఖ్య వస్తువును ఈ వాక్యం చెబుతుందని నా అభిప్రాయం. ఇలాగే కొనసాగుతూ,
“But in general preferences become tendencies, tendencies become habits, and habits become rules. This provides some clues as to why languages do not fly apart in crazy ways. The human mindset pushes our thoughts in certain directions. Language possibly language neatened itself up with rules only gradually. … … Language was probably at first messy and only partially structured, but acquired more and firmer rules as it became more complex.”
-అంటూ ముగిస్తారు ఈ టాపిక్. అదీ విషయం. ప్రసంగం ఇక్కడ, పాఠం ఇక్కడ.

Lecture three: Building the web
ఈ ప్రసంగంలో ముఖ్యాంశం – పిల్లలు భాష ఎలా నేర్చుకుంటారు? అన్నది. “Language has a biologically organised schedule; children everywhere follow a similar pattern.” అన్న వాక్యం ఈ ప్రసంగం చెప్పబోయే విషయాలని ముందే సమ్మరైజ్ చేసేస్తుంది. పిల్లలు భాషని ఎలా నేర్చుకుంటారు? అన్న విషయం గురించి చాలా కాలంగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు భాషా శాస్త్రవేత్తలు. ఈ ప్రసంగంలో – ఈ పరిశోధనల గురించిన సారాంశం కనిపిస్తుంది. ఆరువారాల వయసుకి పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఆర్నెల్ల వయసుకి ఎంత భాషా జ్ఞానం అబ్బుతుంది? ఏడాదయ్యేసరికి ఎంత అబ్బుతుంది? వీటిగురించి జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న myths ఏమిటి? ఈ సహజ పరిణామాలు దేని వల్ల అభివృద్ధి చెందకపోవచ్చు? ఈ వివిధ దశల్లో పిల్లలు భాష నేర్చుకోవడంలో ఎలాంటి తప్పులు చేస్తారు? వాటిని ఎలా సరిదిద్దుకుంటారు? తప్పొప్పుల క్రమంలో వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం, మనుషుల పాత్ర ఏమిటి? – ఇలాంటి ప్రశ్నలకి ఈ ప్రసంగం ద్వారా కొన్ని జవాబులు తెలుస్తాయి. ఇదంతా – ఇంగ్లీషు చుట్టే తిరిగినా కూడా, ఇతర భాషల్లో కూడా పరిణామక్రమాలు ఇలాగే ఉంటాయి అని తేలిందట.

“Language is an example of maturationally controlled behaviour, Lenneberg pointed out – behaviour which is pre-programmed to emerge at a particular stage in an individual’s life, providing the surrounding environment is normal. … ….. Just as bees learn fast to distinguish flowers from say balloons or bus-stops, so human
children are preset by nature to pick out natural language sounds. … …. Yet most people find it easier to learn languages when they’re young, so a sensitive period may exist – a time early in life when acquiring language is easiest and which tails off gradually, though never entirely. … … A tuning in hypothesis is another possibility. At each age a child is naturally attuned to some particular aspect of language.”
… ఈ వాక్యాలు ఈ ప్రసంగం సారాంశాన్ని చెబుతాయని నా అభిప్రాయం. ఇటీవలి కాలంలో Computational Models for Child Language Acquistion అన్న విషయం పై విరివిగా పరిశోధనలు చేస్తున్నారు (ఈ ప్రసంగాల నాటికి ఆ ఆలోచనలు ఇప్పుడంత పాపులర్ కాలేదనుకుంటాను.) కనుక, రాబోయే కాలంలో ఈ విషయంపై మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలియవచ్చు.

ప్రసంగం ఇక్కడ, పాఠం ఇక్కడ.

Lecture four: A web of words
ఈ ప్రసంగంలో మనుషుల పదసంపద గురించి, చిన్నప్పటి నుండీ క్రమంగా అది ఎలా అభివృద్ధి చెందుతుందో చెబుతారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి పదం నోట్లో నానుతున్నా బయటకి రాకపోవడం, ఒక్కోసారి ఒకదానికి బదులు ఇంకొకటి రావడం – ఇలాంటి సందర్భాలని తల్చుకుంటూ మన పదసంపదకీ, మన మస్తిష్కంలో పదాల మధ్య ఏర్పడే mapping గురించీ, పదాలకి ఉండే అర్థాల గురించి – ఇలా వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. పదాల మధ్య సంబంధాలు, వాటి అర్థాలు, కొత్తపదాలు కనిపెట్టడం : ఇదంతా పిల్లల్లో ఎలా ఉంటుందో, క్రమంగా ఎలా ఎదుగుతుందో ఆసక్తికరమైన పరిశోధనాంశాలు జత చేస్తూ చెప్పారు.

“But the human word-web involves much more than a set of prototypes. It’s multidimensional. Each word is an intersection point at which numerous strands meet….How these word-clusters form in people’s minds has long been a puzzle. But the answer may be quite simple…”

అని ఒక పక్క అంటూనే ఒక పదానికి ఇంకో పదం కంఫ్యూజ్ కావడం, ఏదో ప్రమాదంలో మెదడు దెబ్బతిన్న వారి పదసంపదలో వచ్చే మార్పులూ -ఇలాంటి వాటిని అధ్యయనం చేయడం ద్వారా పరిశోధకులు మనిషి మెదడుకూ-పదసంపదకూ ఉన్న సంబంధాన్ని ఎలా కనుక్కుంటున్నారో కూడా కొంచెం అవగాహన కలిగిస్తుందీ ప్రసంగం. పదాలకి, వాటి శబ్దాలకి మధ్య గల సంబంధం గురించి చెబుతూ – “The human word-web is not two-dimensional or even three-dimensional; it’s multi- dimensional.” అని అన్న ముక్క ఈ వ్యాసాన్ని సమ్మరైజ్ చేస్తుంది నా దృష్టిలో.

ప్రసంగం ఇక్కడ, పాఠం ఇక్కడ.

Lecture five: The World wide web
ఈ ప్రసంగంలో చర్చించే అంశం – మనం సృష్టించుకున్న భాష చేతుల్లో మనమే బందీలయ్యే పరిస్థితుల గురించి. కాంప్లికేటెడ్ భాషలో మాట్లడ్డం/రాయడం వల్ల అది అర్థం కాక ఇక అక్కడేం జరుగుతోందో ఆలోచించలేకపోవచ్చు. లేదంటే పదాలకి మన మెదడులో ఏర్పరుచుకున్న పదచిత్రాల బంధనంలో పడి కొన్ని సార్లు ఆలోచనాశక్తి పరిమితం కావొచ్చు (ఈ రెండో అంశం – భాష మన ఆలోచనలపై ఎలాంటి పరిమితులు విధించగలదు? అన్న దాని గురించి మరింత వివరంగా, ఈ నేపథ్యాలు లేని మనబోటి వాళ్ళ కోసం రాసిన Through the Language Glass పుస్తకం గురించి ఇదివరలో ఒకసారి పరిచయం చేశాను.)
ఇంకా ఇంటర్నెట్ ఇంటింటి అవసరంగా మారని రోజుల్లో –
“As speakers we behave in our use of language like surfers on the World-Wide Web. Those who browse in this extensive computer network soon find time runs out, just as it would if a spider were to try and cover the whole network of its own web. In the circumstances, we narrow down the number of tracks we go along, and select a few recurring routes.”
-అని చెప్పడం నాకైతే ఆసక్తికరంగా అనిపించింది.

ప్రసంగం చివ్వర్లో భాషలు అంతరించిపోవడాన్ని గురించి ప్రస్తావిస్తూ –
““Worry about words,” the writer AP Herbert once said. “For whatever else you may do, you will be using words always. All day, and every day, words matter. Before you die the aeroplane may be as out of date as the rickshaw . . . But words will still matter.” He was quite right to tell us to worry about words. But, I’d like to add, it’s important to worry about them in the right way.”

-అంటూ ముగించారీ ప్రసంగాలని.

ప్రసంగం ఇక్కడ, పాఠం ఇక్కడ.

ప్రసంగాలు దీర్ఘకాలంగా వివిధ వ్యక్తులు జరుపుతున్న పరిశోధనల గురించి (పరమ) సంక్షిప్తంగా చెప్పినవే అయినా కూడా – ఎక్కడా బోరు కొట్టడం కానీ, అర్థం కాక బుర్ర గోక్కోవడం కానీ లేదు. ప్రొఫెసర్ జీన్ ఇలాగ “పాపులర్” భాషలో రాయడం/ప్రసంగించడంలో నిపుణురాలు అనుకుంటాను. ఈవిడ రాసిన పుస్తకం Understand Linguistics మొట్టమొదటిసారిగా భాషాశాస్త్రం అధ్యయనం చేయడంలోకి అడుగుపెడుతున్న వారికి చక్కటి పరిచయం కలిగించే పుస్తకం. ఇలాంటి పుస్తకాలు మరెన్నో కూడా వ్రాశారీవిడ. ఈ అంశాలపై ఆసక్తి గల వారు, ఇంకా ప్రాథమిక దశలో ఉన్న వారు ఈవిడ పుస్తకాలు చదివితే ఆ రంగం పట్ల ఒక అవగాహనా, బోలెడు ప్రశ్నలూ, అనుమానాలూ, వాటిని నివృత్తి చేసుకోవడానికి కావాల్సిన నేపథ్యమూ పొందుతారు (ఫలశ్రుతన్నమాట). 🙂

ప్రస్తుతం చెప్పిన ప్రసంగాలతో సహా, రీత్ లెక్చర్లు అన్నీ ముందే చెప్పినట్లు ఏ నేపథ్యమూ లేకపోయినా కూడా అర్థమయ్యే విధంగా రూపొందించబడ్డాయి. ఇవి బీబీసీ రేడియో వారి వెబ్సైట్లో ఇప్పటికి ఆడియోరూపంలోనూ, దాని తాలూకా వచన రూపంలోనూ వినవచ్చు/చదవవచ్చు. ఈ లెక్చర్ల గురించిన వికీ పేజీల జాబితా ఇక్కడ చూడవచ్చు. వీటిల్లో కొన్ని పుస్తకాలుగా వచ్చాయి. అలా పుస్తకంగా వచ్చిన వాటిల్లో భారత సంతతికి చెందిన ప్రముఖ న్యూరోసైంటిస్టు వి.ఎస్.రామచంద్రన్ పుస్తకం “The Emerging Mind” కొన్నాళ్ళ క్రితం చదివాను. నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో అదొకటి. “The Language web” కూడా పుస్తకంగా విడుదలైంది. దానితాలూకా గూగుల్ ప్రివ్యూ ఇక్కడ చూడవచ్చు. పుస్తకం వర్షన్లో – ఈ లెక్చర్ల గురించి పత్రికల నుండీ, ప్రజల నుండీ వచ్చిన స్పందనలూ, కొన్ని అంశాల గురించి వివరణలతో నోట్సూ జతచేసినట్లు ఉన్నారు.

పదే పదే చెబుతున్నాను అనిపించినా మరొక్కసారి వక్కాణించవలసిన సంగతి: ఈ వ్యాసాలు/ప్రసంగాలు కానీ, ఇక్కడ ప్రస్తావించిన పుస్తకాలు కానీ : అచ్చమైన పరిశోధకులకి కాదు. ఎక్కడో ఒక చోట మొదలుపెట్టబోయే వారికీ, అలాగే మామూలుగా ఈ అంశాలపై ఆసక్తి కలిగి ఉన్నా – పరిశోధనలూ గట్రా పై ఆసక్తిలేని/తీరికలేని/ఓపికలేని వారికి మాత్రమే. అలాగని ప్రశ్నలూ అవే వేసి, సందేహాలు అవే తీర్చేసే గైడ్ల లాగా కాదు. నామట్టుకు నాకు ఇలాంటివి చదివినప్పుడల్లా – “అలా అంటారేంటి…అదెలా సాధ్యం?” అనుకునేవీ …”అవునా, మరైతే ఇలా చేస్తే ఏమవుతుంది?” అనుకునేవి, ఇలా రకరకాల తరహా అనుమానాలు వస్తాయి. General Outline కోసం పనికివచ్చే పుస్తకాలు/ప్రసంగాలివి. లోతుగా వెళ్ళాలంటే లోతుగా చదవడం మినహా తేలిక మార్గం లేదు మరి, దేనికైనా! 😉

You Might Also Like

2 Comments

  1. మారిపోతున్న భాష – పురోగమనమా? తిరోగమనమా? | పుస్తకం

    […] ఇచ్చిన BBC రేడియో లెక్చర్ల సంకలనం The language web అన్న పుస్తకం చదివాకా – ఆవిడ రాసిన […]

  2. The Emerging Mind – మెదడు ఎలా పని చేస్తుంది? | పుస్తకం

    […] “The Language Web” ప్రసంగాల గురించి ఇదివరలో ఇక్కడే పరిచయం చేశాను. అది రాస్తున్నప్పుడే మళ్ళీ ఈ పుస్తకం […]

Leave a Reply