2012లో చదివిన పుస్తకాలు

పుస్తకం.నెట్లో మేం చేసిన ప్రయత్నాల్లో కొన్ని హిట్ అయ్యాయి. కొన్ని ఫట్‍మన్నాయి. కానీ అటూ-ఇటూ కాకుండా వేలాడుతున్న ప్రయత్నాల్లో ఇది – గడిచిన ఏడాదిలో మీరేం చదివారు? – ఉంది. ఇలా చదివిన పుస్తకాల జాబితాలు పంచుకోవటం (పాఠకులకి) కొందరికి బడాయి పోతున్నట్టుంది. మరికొందరికి హాస్యాస్పదంగా ఉంది(ట). “ఎవరేమనుకుంటారో?” అన్నది మెదడులో దొలిచేస్తున్నప్పుడు రాయటం కష్టం. అందుకని ఈసారి దీనిపై ఫోకస్ కూడా వేయలేదు.

ఎంత ఆలోచించినా ఇలాంటి జాబితాల వల్ల ఏ మిన్ను విరిగి ఎవరి మీద పడుతుందో అర్థం కావటం లేదు. విమర్శించటంలో తప్పులేదుగానీ, అది ఎంతో కొంత పనికిరావాలి. ఓ ఐదారేళ్ళ క్రితం చంద్రహాస్ అనే బ్లాగర్ “Books of the year” అన్న జాబితాలు రాసి ఉండకపోతే ఆంగ్ల సాహిత్యంపై మక్కువతో పాటు శ్రద్ధ నాకు కలిగేది కాదు. అయితే, ఇక్కడ నేను పంచుకుంటున్న జాబితా మాత్రం ఎవరినో ఉద్దరిస్తున్నాన్న గొప్పతో కాదు. పూర్తి స్వార్థంతో. ఈ జాబితా చూసి, ఇంతకన్నా చక్కని రచయితలనో లేక further readingsనో ఎవరన్నా తెలియజేయలేకపోరా అన్న ఆశతో.

ఆంగ్లం:

Fiction:

*Sorcerer’s Apprentice – Tahir Shah: అద్బుతమైన పుస్తకం. భారతదేశాన్ని ఇంతిలా పరిచయం చేయగలరని నేను ఎప్పుడూ అనుకోలేదు.

*Umrao Jan Ada – Ruswa: ఏదో బజ్‍లో మెమొరీస్ ఆఫ్ గీషా పుస్తకంపై చర్చ మొదలై అది మెల్లిగా ఉమ్రావ్ జాన్ వరకూ పోతే, అప్పటికి సినిమా కూడా చూసుండని నేను, పట్టుపట్టి కుష్వంత్ సింగ్ చేసిన ఈ అనువాదాన్ని కొనుక్కొచ్చుకుని చదివాను. అనువాదం చాలా పేలవంగా ఉంటుందిగానీ, ఉమ్రావ్ కథ మాత్రం గొప్పగా ఉంటుంది. మూడు సినిమాలు చూసినా (రేఖ, ఐశ్వర్య నటించిన బాలీవుడ్ చిత్రాలు కాక ఒక పాకిస్థాన్ సినిమా కూడా వచ్చింది ఈ కథను ఆధారంగా చేసుకొని) పుస్తకం చదివిన అనుభూతే వేరు.

*Life of Pi – Yann Martel: అల్లెప్పుడో చదివిన పుస్తకం, మొన్నీ మధ్య సినిమా విడువదలవ్వటంతో, అది విడుదలయ్యాక ఈ రచన ద్వార రచయిత దేవుని గురించి లేవనెత్తే ప్రశ్నల గురించి ఏదో చర్చ వచ్చి, మళ్ళీ చదివాను. ఆ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు దొరికాయి. అయితే, మొదటసారి చదివినప్పటికన్నా ఈసారి ఈ రచనలో కొన్ని నచ్చలేదు.

*Indigo – Satyajit Ray: రేగారి సినిమాలు కొన్ని చూశాక, ఆయనెంత గొప్ప కథకులో అర్థమయ్యాక, ఒక విదేశి మిత్రునికి కానుక ఇద్దామని ఈ పుస్తకం కొని, కథలు చాలా చాలా నచ్చేసి, పుస్తకం నా దగ్గర అట్టే పెట్టేసుకున్నాను. ఒకే ఒక్క ముక్క – రే రాక్స్!

*Chanakya’s Chant – Ashwin Sanghi: మడిసన్నాక కాతంత ఆటవిడుపు ఉండాలోయ్ – అని ఎవరూ అనని మాటలు నాకే వినిపించి, నేను చదివే సాహిత్యానికి భిన్నంగా ఉండే ఈ రచనను చదివాను. నేను పూర్తి చేయటమే ఈ పుస్తకానికి ఓ కాంప్లిమెంట్. అయితే ఈ రచనతో నాకున్న పేచీలు ఒకటీ అరా కాదు! మళ్ళీ ఇలాంటివి చదవకూడదని ఒట్టు పెట్టుకున్నాను.

*Breaking the bow – Various authors: ఇదో బ్రహ్మాండమైన పుస్తకం అని అనిపించింది చదివినప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం అనిపిస్తుంది. ఇలా రెండు ముక్కల్లో తేల్చడం కుదరదుగానీ, ఎప్పుడో ఒక పరిచయమే రాస్తాను.

*Collected Plays Vol 1 – Girish Karnad: ఇదీ find of the year నాకు! బెంగుళూరు సాహిత్యోత్సవంలో అనుకోకుండా కనిపించిన గిరీష్ కర్నాడ్ నాటకాల సంపుటాలను కొంచెం తటపటాయిస్తూనే కొన్నాను. కానీ చదివాక మాత్రం మహాద్భుతంగా అనిపించాయి. వీటిని చదివేటప్పటికి ఆరారగా ఎ.కె.రామానుజన్ రాసిన Folktales, collected essays చదవటం మూలనేమో, ఇవి మరింతగా నచ్చేశాయి. ఒక్కో నాటకం నన్ను ఒక్కో మైకంలో ముంచేసింది.

*Partition – Sketches and Stories – Saadat Hasan Manto: సియా హాషియేకు ఆంగ్లానువాదం. కూడికూడి హింది చదువుకోగలిగే వీలున్నా, అనువాదం వదిలి ఎంచక్కా మూలమే చదువుకోవడం మేలు.

*Four Screenplays: Smiles of a Summer Night / The Seventh Seal / Wild Strawberries / The Magician – Ingmar Bergman: “సినిమాలా? నేనా?” అనే నేను మరో మాట మాట్లాడకుండా మొత్తం పుస్తకం పూర్తి చేయడమే కాకుండా, ఈ సినిమాలు కూడా చూసానట్టే.. ఇంకా చెప్పాలా, బెర్గ్మెన్ మాజిక్ నుండి తప్పించుకోవడం కష్టమని. Amazing story teller!

*Aandhi – A scenario: Gulzar: ఆంధీ సినిమా నాకు ఇష్టమైన సినిమాల్లో ఒకటి. దాని స్క్రీన్ ప్లే కదా అని చదవటం మొదలెట్టాను. అసలైతే కథ చదువుకోడానికి బానే ఉందిగానీ, ఒక్కసారి ఈ కళ్ళతో సంజీవ్‍ను చూశాక, ఇక ఆ పాత్రకు మన ఊహల్లో ఇంకెవ్వరూ ఉండలేరని నాకనిపించింది. మాటిమాటికి సినిమా కళ్ళముందుకొచ్చేసరికి మళ్ళీ సినిమా చూడక తప్పలేదు.

కోర్సు-ఎరా.కాం లో చేసిన కోర్సులో భాగంగా చదివిన పుస్తకాలు:

*Grimm — Children’s and Household Tales – మొదట చదివినప్పుడు కథలు బాగానే ఉన్నాయనిపించినా, ప్ర్రొఫెసర్‍గారు పాఠాలు చెప్పాక, మరింతగా నచ్చేశాయి.

*Carroll — Alice’s Adventures in Wonderland and Through the Looking-Glass : చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పుస్తకం ఇప్పుడు చదవటం ఒక మంచి అనుభవం అయితే, ప్రొఫెసర్‍గారు చూపించిన అద్దంలో నుండి చూడ్డం మరింత ఆలోచింపజేసింది. కార్రొల్ గురించి అనేక విషయాలు చెప్తూ, వాటిని రచనలో చూపించే ప్రయత్నం హైలైటు. ఆలిస్ ముందు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత చక్కగా దోస్త్ అయిపోయింది.

*Stoker — Dracula: కోర్సులో చదివిన అన్ని పుస్తకాల్లోకి నాకు బాగా నచ్చిన పుస్తకం. స్టోకర్‍గారికి దెబ్బకు అభిమానిని అయిపోయాను. ఆపై వాంపైర్లు, వేర్‍వుఫుల గురించి ప్రొఫెసర్‍గారి కబుర్లు విన్నాక నాకు అమాంతంగా ఇలాంటి రచనలపై గౌరవం పెరిగిపోయింది. (అంటే స్టెఫిని మేయర్ రాసిన ట్వైలైట్ లాంటి వాటి గురించి కాదు.)

*Shelley — Frankenstein: ఇక్కడకు వచ్చేసరికి పాకం బాగా ముదిరింది. కోర్సు మొదలుపెట్టాక విశ్లేషణాత్మకంగా చదవగలిగిన పుస్తకం ఇది. అయితే, ప్రొఫెసర్‍గారు ఇంకెన్నో కొత్తకొత్త తీరులు చూపించారులే! ఒక రచనగా మాత్రం నాకిది చాలా నచ్చింది.

*Poe – The Tell Tale Heart and Other Stories: అసలైతే ’పో’ను చాలా శ్రద్ధగా చదివేసి, ఏదేదో చేద్దామనుకున్నాను గానీ ఆ వారం అంతగా చదవటం కుదర్లేదు. అయినా, పో ను చదవటం భలే ఉంటుంది, ఎప్పుడైనా!

*Wells — The Island of Dr. Moreau, The Invisible Man, “The Country of the Blind,” “The Star”: వెల్స్ పుస్తకాలు ఇంతకు ముందెప్పుడూ నేనేవీ చదవలేదు. మొదటిసారి ఈ కోర్సు పుణ్యమా అని చదివాను. The Country of the Blind నాలో ఎంతగా పాతుకుపోయిందంటే, తీరిక దొరికితే ఆ కథను గురించే ఆలోచిస్తూ ఉంటాను. భలేంటి కథ!

*Burroughs & Gilman — A Princess of Mars & Herland:  పట్టుబట్టి చదవడానికి ప్రయత్నించానుగానీ మధ్యలో వదిలేశాను.

Non-Fiction:

*The Men Who Killed Gandhi – Manohar Malgoankar: ఇదో అపురూపమైన పుస్తకం. దాచుకోదగ్గ పుస్తకం. చదవాల్సిన పుస్తకం.

*Mahatma Gandhi – Romain Rolland: ఇది కూడా ఒకానొక బెంగుళూరు ట్రిప్‍లో కొన్నాను. బాగుంది.

*Anandi Gopal  – S.M. Joshi

*Thinkers of the East – Idries Shah: తాహిర్ షాహ్‍ను చదివీ చదవగానే ఇదిరీస్ షాహ్ పుస్తకాలు దొరికినవి దొరికినట్టు మొదలుబెట్టాను. ఒకసారి చదివి పక్కకు పెట్టేసే రచనలు కావు ఆయనవి. పక్కనే ఉంచుకోవాల్సిన పుస్తకాలు. చదివాను. చదువుతున్నాను.

*The Sufis – Idries Shah: సుఫీల విధివిధానాల గురించిన వ్యాసాలుంటాయి ఇందులో. అర్థం చేసుకోవడం కష్టమే! అయినా చదువుతూ పోయాను.

*Tales of Dervishes – Idries Shah: ఇవి చిన్న చిన్న కథలు. భలే గమ్మత్తుగా ఉంటాయి. అర్థం అయీ కానట్టూ, లోలోపల ఇంకేదో ఉన్నట్టు. ఒకసారి చదివిన కథ మళ్ళీ చదివితే ఎంత కొత్తగా అనిపిస్తుందో!

*The Book I won’t be writing – H Y Sharada Prasad

*An Artist’s quest – Hebbar: పై పుస్తకం ద్వారా హెబ్బర్ గురించి తెల్సింది. అదృష్టంకొద్దీ ఈ పుస్తకం ఈ-బుక్‍గా కొని చదివాను. చిత్రలేఖనం గురించి నాకేం తెలీదుగానీ, హెబ్బర్ చిత్రలేఖనంపై చూపిన శ్రద్ధ, నేర్చుకోడానికి పట్టిన పట్టు నాకు ప్రేరణను ఇచ్చాయి.

*Abdul Gaffar Khan – Faith is a battle – D.G.Tendulkar: శారదా ప్రసాద్‍గారి పుస్తకం వల్లే ఈ పుస్తకం గురించి కూడా తెల్సింది. పుస్తకం దొరకటంపై నేను దాదాపుగా ఆశలు వదిలేసుకున్నా, ఓ సహృదయులు లైబ్రరి నుండి తెచ్చి ఇచ్చారు. అబ్దుల్ గఫర్ ఖాన్ గురించే కాక, పాఠాన్ల గురించి, భారత స్వాతంత్రోద్యమంలో వారి పాత్ర గురించి చాలా విషయాలు తెలుస్తాయి.

*Because he is – Meghana Gulzar: గుల్జార్ గారి అమ్మాయి, వాళ్ళ నాన్న గురించి రాసిన పుస్తకం. నాలాంటి గుల్జార్ అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం!

*Kasab – The face of 26/11

*A shot at History – My Obsessive Journey to Olympic Gold – Abhinav Bindra

*Sachin – Tribute to a legend

*Addicted to War

*A mighty heart – Mariane Pearl

*World is a comedy – Kurt Tucholsky: సౌమ్య ఇచ్చిన పుస్తకం. భలేగా ఉందిలే! మరో సటైరిస్ట్ పరిచయం అయినందుకు బోలెడు సంతోషం.

*Performing without a stage – Robert Weschsler

*Hindi / Urdu – An Artificial Divide: లింగ్విస్ట్స్ కు సంబంధించిన పుస్తకాలేవో వెతుకుతుంటే కనిపించింది. హింది, ఉర్దూ మధ్య తేడా కేవలం రాజకీయపరంగా సృష్టించినవే అన్న వాదన చాన్నాళ్ళ బట్టీ వింటూ ఉన్నాను. హింది, ఉర్దూల మధ్య సారూప్యాలను టెక్నికల్ గా చూపే పుస్తకం. కొన్ని చోట్ల అర్థం చేసుకోడానికి కష్టపడ్డా, చదివినంత వరకూ కొత్త విషయాలు తెల్సుకున్నాను.

*The story of our food – T K Achaya

సాంకేతికం:

*Effective Java: జావా మీద నిత్యం పనిజేసేవాళ్ళకి ఈ పుస్తకం తప్పనిసరి అని నా అభిప్రాయం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజుల పుస్తకాలంటే “హలో వల్డ్” మాత్రమే కాదు. ఒక భాషకు గ్రామర్, సింటాక్స్ కు మించి ఆ భాషను వాడుతున్న కమ్యూనిటి దానికిచ్చే కొత్త అర్థాలను, వాడుకులను ఎలా ఉపయోగించుకోవాలో తెలియజెప్పటానికి ఈ పుస్తకమని ముందుమాటలో ఉంటుంది. వాటి తెల్సుకొని, ప్రాక్టీస్ చేయాలంటే ఇది చదవాల్సిందే!

*Pragmatic Software Testing: ఒక ముక్కలో చెప్పాలంటే -there’s nothing pragmatic about this book. సుబ్బరంగా లైట్ తీసుకోవచ్చు.

*Experiences of Test Automation: ఆటోమేషన్ లో కొన్ని కేస్ స్టడీస్ ను పరిచయం చేసే ప్రయత్నం. బాగుంది. 

*Learn Python the Hard way: అసలుకే ప్రోగ్రామింగ్ లాగ్వేంజ్ తోనూ పరిచయం లేకపోతే ఇంత కన్నా చక్కని పుస్తకం ఉండదు. అయితే, వేరే లాంగ్వేజెస్ వచ్చి, ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలంటే మాత్రం, ఇది లైట్.

Alone Together – Sherry Turkle

తెలుగు:

*మహిళావరణం- బాపూగారు ఈ పుస్తకం గురించి చెప్పారు. అనుకోకుండా విశాలాంధ్రలో దొరికింది. ఇరవైయవ శతాబ్దంలో తెలుగునాట ప్రముఖ స్తీలను గురించి పరిచయ వ్యాసాలు. అరుదైన పుస్తకం.

*సాక్షి – పానుగంటి – ఇంకో find-of-the-year! పుస్తకం కొని చాన్నాళ్లైనా “అమ్మో.. అంత తెలుగే! నేనేం చదువుతా” అనుకుంటూ మూలన పడేశాను. ఎందుకో ఒకసారి ప్రయత్నించి చూద్దామనుకున్నాక, పానుగంటి తెలుగు కాస్త రుచి తగిలాక, మరి వదల్లేకపోతున్నాను. వాక్యాలే నాగుపాములంత పొడువు, చట్టుక్కున సరమాగో గుర్తువచ్చేస్తారు నాకు. వ్యంగ్యానికి వ్యంగ్యం. తెలుగు రాకపోతే నేర్చుకొని మరీ చదవాల్సిన రచన! పానుగంటీ.. నమో నమః!

*శ్రీపాద అనుభవాలూ,జ్ఞాపకాలూనూఈ రచయిత గురించిగానీ, ఈ రచన గురించిగానీ కొత్తగా చెప్పుకోడానికి ఏం మిగిలింది?

*ఇంట్లో ప్రేమ్‍చంద్: ప్రేమ్‍చంద్ గురించి వారి భార్య శివరాణి రాసిన “ఘర్ మె ప్రేమ్‍చంద్” పుస్తకానికి తెలుగు అనువాదం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతగారి పుణ్యమా అని దీని తెల్సుకున్నాను. ప్రేమ్‍చంద్ గురించి మాత్రమే కాదు, అప్పటి లిటరరీ లాండ్‍స్కేప్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఆపకుండా చదివించే రచన.

హింది:

*దస్తావేజ్ – 1 – సాదత్ హసన్ మాంటో: ఇది మరో find of the year నాకు! మాంటో రాసిన సియా హాషియే చదివాక, ఆయన రచనలన్నీ చదవాలని నిశ్చయించుకున్నాను. ఢిల్లీ రాజ్‍కమల్ ప్రకాశన్ వారు ప్రచురించిన మాంటో ఐదు సంపుటాలు కొన్నాను. అందులో మొదటి భాగం పూర్తిచేశాను. తప్పక చదవాల్సిన రచయితల్లో ముందుండాలి మాంటో, నన్ను అడిగితే!

*వికలాంగ్ శ్రద్ధా కా దౌర్ – హరిశంకర్ పార్సాయిఈయన కూడా find of the yearయే! ప్రేమ్‍చంద్, హరివంశ్ రాయ్ బచ్చన్లను దాటుకొని ఇంకెవ్వరైనా హింది / ఉర్దూ రచయితల గురించి తెల్సుకోవాలని, వాళ్ళని చదవాలన్న ప్రయత్నాలలో భాగంగా ఈయన పరిచయమయ్యారు. వ్యంగ్య రచనలలో వీరికి వీరే సాటి. మొన్నటి బుక్ ఫేర్‍లో వీరి రచనా సంపుటాలను కొనడం మిస్సయ్యాను.

*ఏక్ గధె కి వాపసీ – కృష్ణ చందర్: ఇంటర్నెట్లో ఎక్కడో పి.డి.ఎఫ్ దొరికితే ఈ రచన చదివాను. బాగా నచ్చింది. భారతదేశ యాత్రకు బయలుదేరిన గాడిద స్వగతం ఇది. మన సామాజిక స్థితిగతులపై పదునైన విమర్శ చేస్తూనే బా నవ్విస్తారు.

*ప్రేమ్‍చంద్ కథలు: అడపాదడపా ప్రేమ్ చంద్ కథలు చదువుతూనే ఉన్నా, మళ్ళీ “ప్రేమ్‍చంద్ ప్రతినిధి కహానియా” పేరిట వచ్చిన సంపుటి చదివాను. ప్రేమ్చంద్ కథనంలో విలక్షణత ఏంటంటే, అతి సాధరణ స్థితిగతులు, అతి సాధారణ పాత్రలను తీసుకొని కూడా ఏదో ఒక చక్కని “పాయింట్”ను బాగా హైలైట్ చేస్తారు.

*పుఖ్‍రాజ్ – గుల్జార్: గుల్జార్ కవితలు కొన్ని. నాకు బాగా ఇష్టమైనవే!

*రావి పార్ – గుల్జార్: గుల్జార్ కథలు. మళ్ళీ చదివాను, ఈ సారి మరింత శ్రద్ధగా.

*త్రివేణి – గుల్జార్: మూడు పంక్తుల కవితలు. కొంతమంది వీటిని హైకూలతోనో, మరివేటితోనో పోలుస్తూ ఉంటారు. అట్లాంటివేం పెట్టుకోకుండా చదివితే, భలేంటి కవిత్వం ఉంటుంది ఇందులో కూడా.

అంతే సంగతులు!

You Might Also Like

14 Comments

  1. pavan santhosh surampudi

    ఎప్పటిదో మూడేళ్ళనాటి వ్యాసం.. వేరేదో పనిపై వెతుకుతూంటే కనిపించి చదివాను.. కానీ కామెంటు ఎందుకు చేస్తున్నానంటే //ఈ జాబితా చూసి, ఇంతకన్నా చక్కని రచయితలనో లేక further readingsనో ఎవరన్నా తెలియజేయలేకపోరా అన్న ఆశతో.// అని రాసిన పూర్ణిమ గారి మాటలే కారణం.
    ఉమ్రావ్ జాన్ అదా పుస్తకాన్ని ఆంగ్లానువాదం కొనుక్కుని చదివి, కుష్వంత్ సింగ్ అనువాదం పేలవంగా ఉంది-కథ చాలా గొప్పగా ఉందన్నారు కదా. అందుకే తెలుగులో దాశరథి రంగాచార్య చేసిన అనువాదాన్ని సూచిద్దామని. చాలా బాగా అనువదించారాయన. విశాలాంధ్రవాళ్ళు (అనువాద సాహిత్యం అంటూ దేవుని పేరిట అన్న మరో నవలతో కలిపి వేశారు) సాహిత్య అకాడమీ వాళ్ళూ కూడా అమ్ముతున్నారీ పుస్తకాన్ని. తేలికగానే దొరకవచ్చు. అయితే చాలా బాగా చేశారు ఆయన అనువాదం. నవల మొదట్లో వచ్చే ఓ ఉర్దూ కవితను అనువదించేందుకు ఆయనా, ఆయన స్నేహితుడు నార్ల చిరంజీవి ఎన్ని తంటాలు పడ్డారో రాసినదే సాక్ష్యం అందుకు. బావుంటుంది, చదివి చూడండి.

  2. bala

    Ammo anni chadivarandi meeru….

  3. gsrammohan

    ఒక్క ఏడాదిలో ఇన్ని చదివేశారా…ఈర్ష్యగా ఉంది సుమీ!

  4. BHAVANI

    namaste

    MUGHALAI DARBAR gunchi cheppagalara/? telugu lo kavali .ekkada dorukutundi.
    dhanyavadamulu

  5. vijaya

    పూర్ణిమా, ఈ ప్రయత్నం ఖచ్చితంగా బాగుంది. నాకు చదవటం ఇస్టం కాని ఏమి చదావాలో పెద్దగా తెలీదు. నేను ఇక్కడ తెలుసుకుని చదివిన పుస్తకాలు, దాని వలన నా మీద పడ్డ ప్రభావం, నేను పొందుతున్న లాభాలు సాక్షిగా చెప్తున్నా…నా లాంటి వాళ్ళకి ఇది మార్గ దర్శి లాంటిది!అన్నట్టు 2012 లొ నేను చదివిన పుస్తకాలు లో చాలా వరకు మీరు నాకు బుక్ ఫైర్(2011) లో రిఫెర్ చేసినవే, స్వాతి తో కలిసి నాకు కొన్ని పుస్తకాలు సూచించారు, గుర్తు ఉందా?’వనమాలి, 24 గంటలు, జానకితో జనాతికం, విశ్వ దర్శనం, ఇల్లాలి ముచ్చట్లు, అతడు అడవిని జయించాడు,విరాట్’… ఇవన్నీ 2012 లో నేను చదివిన వాటిలో మంచి పుస్తకాలు. మీలాంటి వాళ్ళ ప్రయత్నం, రిఫరెన్స్ లేకపోతే నాకు ఈ పుస్తకాలు తెలిసేవి కావు.

    1. Purnima

      మనం కల్సి తిరిగిన బుక్ ఫెయిర్ నాకు గుర్తుంది, విజయ గారు. మీ కామెంట్‍కు ప్రత్యేకంగా థాంక్స్. self-doubtలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రోత్సాహమే అవసరం. మళ్ళీ థాంక్స్.

  6. తృష్ణ

    పూర్ణిమ గారూ, ఈ మేఘనా గుల్జార్ పుస్తకం కొన్నేళ్ల క్రితం బొంబాయి లో ఓ బుక్ ఫైర్ లో చూసాను.. మళ్ళీ ఎక్కడా కనబడలేదు.. వెతుకుతూనే ఉన్నా.. ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా..?

    1. Purnima

      I’ve been seeing this book everywhere. Surprised that you didn’t come across it. I bought the book from Landmark, Banjara Hills. It was with flipkart.com folks for long time, looks like they now have only ebook.

      You may give it a try here:
      http://www.infibeam.com/Books/info/Meghna-Gulzar/BECAUSE-HE-IS/8129103648.html

      Don’t opt for the e-book version, because the hardcover has quality pictures, which ebook can never boast of.

    2. తృష్ణ

      thanks purnima garu for the info. I haven’t seen in landmark.
      yes, those beautiful pictures still linger in my mind because of which i have not forgotten the book yet 🙂

  7. జాన్ హైడ్ కనుమూరి

    ఎలా చదివేస్తారండీ ఇన్ని పుస్తకాలూ!!

  8. చంద్రహాస్

    కాకతాళీయంగా మీకు ఆంగ్ల సాహిత్యం అంటే మక్కువతోపాటు శ్రద్ధ కలిగించిన blogger పేరూ నాపేరూ ఒకటే. తర్వాత మా ఇద్దరికీ సామ్యం లేదు. ప్చ్.
    చాలా మంచి పుస్తకాలే చదివారు. అదృష్టవంతులు.
    Chanakya’s Chant పై మీ తూటా సరిగ్గా, బాగానే పేలింది.
    శ్రీపాద వారి గురించి కొత్తగా చెప్పడానికి ఇంకా ఏం మిగిలింది అనకండి. చాలా చాలా వుంది. ఆయన నాటకాలేవీ ఇంతవరకు చదవకపోతే మొదలు “రాజరాజు” నాటకం చదవండి. ఆశ్చర్యపోతారు. ఆయన కథల చక్రవర్తి. అది తెలుగు జగమెరిగిన సత్యం, నిస్సందేహంగా. నాటకాలు చదివిన తర్వాత అవి రాయడంలోకూడా వారు చక్రవర్తే అని తప్పక అనుకుంటారు. రాజరాజు నాటకాన్ని పరిచయం చేయాలని కుతూహలంగావుంది. చూద్దాం ఎప్పుడు వీలవుతుందో.

    1. వీరభద్రం

      <<>>>

      దీని ఈ-బుక్ దొరుకుతుందా?

  9. నిషిగంధ


    *Breaking the bow – Various authors: ఇదో బ్రహ్మాండమైన పుస్తకం అని అనిపించింది చదివినప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం కొంచెం అనిపిస్తుంది. ఇలా రెండు ముక్కల్లో తేల్చడం కుదరదుగానీ, ఎప్పుడో ఒక పరిచయమే రాస్తాను. ”

    Can’t wait for this one! 🙂

  10. mallina narasimharao

    2012 లో నేను చదివిన పుస్తకాల గుఱించి

    శ్రీమద్రామాయణము వాల్మీకి కవి ప్రణీతము తెలుగు అర్థ తాత్పర్యాలతో గీతా ప్రెస్ వారిది . మొదటగా సుందర కాండము పూర్తి చేసాను. తరువాత బాల, అయోధ్యాకాండములు, అరణ్యకాండము పూర్తి అయినవి. ప్రస్తుతం కిష్కింద కాండములో ఉన్నాను. మళ్ళీ ఒకసారి సుందరకాండము కూడా చదవాలని ఉన్నది. తరువాత యుద్ధ,ఉత్తర కాండములు పూర్తి చేయవలసి ఉన్నది. చదువుతుంటే సంస్కృతం నేర్చుకొంటున్నట్లుగా ఉండి చాలా సంతోషముగా ఉన్నది.

Leave a Reply