2010 – నా పుస్తక పఠనం కథ

మళ్ళీ ఒక సంవత్సరం ముగిసింది. మళ్ళీ మన ఫోకస్ వచ్చేసింది 🙂 గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది కాస్త ఎక్కువగా చదివినా, ఈ ఏడాదిలో చేసిన డిస్కవరీలు ఎక్కువ, చదివిన వాటికంటే. ఎప్పట్లాగే, అష్టదిక్కుల్లోనూ కొండలకు మల్లే చదవాల్సిన/చదవాల్సినవి అనిపించిన పుస్తకాల జాబితా పైపైకి వెళ్ళిపోతూనే ఉందనుకొండి, అది వేరే విషయం. పాయింటుకొస్తే, ఈ ఏడాది మంచి పుస్తకాలు, పిచ్చి పుస్తకాలూ, పాపులర్ పుస్తకాలు, కథలూ, నవల్లూ, వ్యాసాలూ – ఇలా అన్ని రకాలవీ స్పృశించాను. వీలైనంతవరకూ, గుర్తున్నంత వరకూ, వాటిని తల్చుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

కథలు:
మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి
పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కథలు, మిట్టూరోడి కథలు – నామిని
మిసెస్ అండర్స్టాండింగ్ – బ్నిం
అలసిన గుండెలు – రాచమల్లు రామచంద్రారెడ్డి
రావికొండలరావు కథలు
సొదుంజయరాం కథలు
మధురాంతకం రాజారాం – బాలల కథలు
ఆలూరి బైరాగి కథలు
మంత్రనగరి – పి.సత్యవతి కథలు
మా పసలపూడి కథలు – వంశీ
మదనపల్లె రచయితల సంఘం కథలు
‘ది సన్స్’ – కాఫ్కా
అసిమోవ్ కథలు – లాస్ట్ ఆఫ్ ది రోబోట్స్
అసిమోవ్ ఫాంటసీ కథలు.
-వీటిలో ఒక్కొక్కరి కథలలోనూ కొన్ని నచ్చినవీ, కొన్ని నచ్చనివీ ఉన్నా కూడా, ప్రధానంగా ఇవి చదువుతున్నప్పుడు భాష ఒక్కొక్కరిదీ ఒక్కొక్కలా ఉండటం గమనించాను. వీటిలో నేను బాగా ఇష్టపడ్డ కథాంశాలు – పి.సత్యవతి గారివి. ఫెమినిస్టు కథల్లో కూడా ఇంత హాస్యం, వ్యంగ్యం ఉంటుందని ఊహించలేదు.

అలాగే, రా.రా. అలసిన గుండెలు, సొదుం జయరాం కథలు రెండూ – సూటిగా, ఎక్కువ వర్ణనలూ అవీ లేకుండా చదివించాయి. ఇలాగే వర్ణనలు లేకుండా ఉన్నా కూడా, శివరాజు సుబ్బలక్ష్మి గారి కథలు మాత్రం అక్కడక్కడా అయోమయం కలిగించాయి – మరీ కథన వేగం ఎక్కువై. కవిగారు కథలు రాస్తే ఎలా ఉంటాయో బైరాగి కథలు అచ్చంగా అలాగే అనిపించాయి. ఒక్కోచోట చదువుతూ ఆ కథా లోకంలోనే ఉండిపోవాలి అనిపించింది. ఇక కాఫ్కా కథలు : నేను ఆయన కథలు మరిన్ని చదవాలి అనిపించేలా చేశాయి. బహుశా ఈ ఏడు చదువుతానేమో!

ఇన్ని కథల్లోనూ నేను మళ్ళీ మళ్ళీ విజిట్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నవి – నామిని కథలు, పి.సత్యవతి కథలు, పసలపూడి కథలు, అసిమోవ్ కథలు.

నార్ల చిరంజీవి – భాగ్యనగరం నాటిక : చాలా నచ్చింది
అలాగే, ఇటీవలే రీ-విజిట్ చేసిన చిన్నప్పటి రష్యన్ కథల అనువాదాల పుస్తకాలు: అప్పటిలాగానే ఎంజాయ్ చేస్తూ చదివాను. “అమర్ చిత్ర కథ” సిరీస్ చదవడం మొదలుపెట్టాను. కొన్ని చిన్నప్పుడు చదివినవి. కొన్ని కొత్తవి. బాగున్నాయ్!!

నవలలు:

చేతన్ భగత్ – టూ స్టేట్స్ ఆఫ్ మై మ్యారేజ్
ఎ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మ్యాంగోస్
కరణ్ బజాజ్ నవలలు- Keep off the grass మరియు Johnny Gone Down.
ఆశ్విన్ సంఘీ నవల – The Rozabal Line
సిడ్నీ షెల్డన్ నవల్లు – The other side of midnight మరియు Tell me your dreams
Immortals of Meluha – Amish (ఇతనితో పుస్తకం.నెట్ జరిపిన ఇంటర్వ్యూ ఇక్కడ చూడొచ్చు)

అడివి బాపిరాజు: అంశుమతి, నరుడు
రా.రా. పిల్లల నవల: విక్రమార్కుని విడ్డూరము
పిలకా గణపతి శాస్త్రి : అందని చందమామ
సొదుం జయరాం నవల :అగమ్యం
యండమూరి నవల – కాసనోవా 99
కొమ్మూరి సాంబసివరావు నవల – 444
మూణ్ణాలుగు కొవ్వలి నవలలు

-వీట్లో, ఆశ్విన్ సంఘీ నవల అన్నింటికంటే బాగా నచ్చింది. తరువాత, జానీ గాన్ డౌన్, కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లోడింగ్ మాంగోస్. తక్కిన ఆంగ్ల నవలలు ఒకసారికి బానే ఉన్నాయి. ఇక, బాపిరాజు గారి నవల్లలో అంశుమతి పెంచిన అంచనాలని నరుడు తగ్గించేసింది. బహుశా ఈ ఏడు ఆయనవేమన్నా చదువుతానేమో. రా.రా. పిల్లల నవల చాలా నచ్చింది. ‘అందని చందమామ’ కూడా ఆపకుండా చదివించింది. యండమూరి, కొమ్మూరి, కొవ్వలి నవల్లు – సరిగ్గా కాలక్షేపానికి అద్భుతంగా పనికొస్తాయని అర్థమైంది. సొదుం జయరాం నవల కంటే కథలే బాగున్నాయ్ నాకు. అమీష్ నవల బాగుంది రెండో భాగం ఎప్పుడొస్తుందో అని చూస్తున్నాను.

జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు:

దుర్గాభాయ్ దేశ్ముఖ్ జీవిత చరిత్ర: ఇంద్రగంటి జానకీబాల
సరోజినీ నాయుడు జీవిత చరిత్ర: పద్మినీ సేన్ గుప్తా రచనకు కుందుర్తి తెలుగు అనువాదం
దాదాసాహెబ్ ఫాల్కే : బాపు వాత్వే
The Boy Who Harnessed the wind – విలియం కంకాంబ్వా అన్న బాలుడి కథ
ఎం.ఆర్.పాయ్ జీవిత చరిత్ర
దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పై ఒక మొనోగ్రాఫ్ – ఐ.వి.చలపతి రావ్
పూసపాటి ఆనందగజపతి రాజు మోనోగ్రాఫ్
టు సర్ విద్ లవ్ – ఐ.ఆర్.బ్రైత్వైట్
Devadasi and the saint: Life and times of Bangalore Nagaratnamma – వీ.శ్రీరాం.
నాన్న-నేను: బుజ్జాయి
-వీటిల్లో దుర్గాభాయ్ దేశ్ముఖ్ పుస్తకం చాలా స్పూర్తి కలిగించేదిగా ఉన్నా, మరీ చిన్నగా అనిపించింది. సరోజినీ నాయుడు పుస్తకం – అసలు పూర్తి చేయలేకపోయాను, అందులో అది జీవిత చరిత్ర కంటే కూడా కవితా విమర్శలాగా అనిపించడంతో. ఫాల్కే పుస్తకం, ఎం.ఆర్.పాయ్ పుస్తకం – నేను చదివినంతలో మంచి బయోగ్రఫీలు. అలాగే, నాన్న-నేను ఆపకుండా చదివించింది. విలియం కంకాంబ్వా కథ, నాగరత్నమ్మ జీవితచరిత్ర, టు సర్ విద్ లవ్ కూడా-ఆపకుండా చదివించడమే కాక, చాలా స్పూర్తి దాయకంగా కూడా ఉన్నాయి. దుగ్గిరాల, పూసపాటి కథలు మాత్రం తీవ్రంగా నిరాశ పరచాయి.

కవితలు, శతకాలూ వగైరా:
ఆగ్డెన్ నాష్ రచనలు
ఎడ్వర్డ్ లియర్ రచనలు
స్వప్న లిపి – అజంతా
బాకీ-బాకా – నిష్టల వెంకటరావు
ఆరుద్ర – పదాలూ, పజ్యాలూ
శతకాలు: కుమార శతకం, నారాయణ శతకం, సుమతీ శతకం, నరసింహ శతకం, భాస్కర శతకం
వేమన పద్యాలు
-కవితలు మాత్రం చదివిన ఒక్కొక్కటీ అలా మనసులో నిల్చిపోయాయి. నాష్, లియర్లు మాత్రం దైనందిన జీవితంలో రోజూ తల్చుకునే వ్యక్తులైపోయారు. కొన్నాళ్ళ దాకా అజంతా కూడానూ!

వ్యాసాలు:

The Man without a country – Kurt Vonnegut : వ్యంగ్య వ్యాసాలు
The Emerging Mind – V.S.Ramachandran : మెదడు పనితీరుపై వ్యాసాలు
IPL, Cricket & Commerce – the inside story – T.R.vivek and Alam Srinivas : ఐపీఎల్ గురించిన వ్యాసాలు
Gold of the Gods – Erich Von Daniken : ఆర్కియాలజీ పరిశోధనల గురించి
India after Gandhi – Ramachandra Guha : స్వతంత్ర భారతి చరిత్ర
States of Indian Cricket – Ramachandra Guha : వివిధ రంజీ మరియు ఇతర జాతీయ టోర్నమెంట్లలో ఉన్న జట్ల గురించి
Red Sun – Sudeep Chakravarthi : నక్సల్ ప్రాంతాల్లో ఒక జర్నలిస్టు అనుభవాలు
Multiple City – Writings on Bangalore : బెంగళూరు నగరం గురించి వివిధ వ్యక్తుల వ్యాసాలు
In to the passionate soul of subcontinental cricket – Emma Levine : ఉపఖండంలోని గల్లీ క్రికెటర్ల కథలు
The Groaning Shelf – Pradeep Sebastian : పుస్తకాల గురించిన పుస్తకాల గురించిన పుస్తకం!
అసిమోవ్ వ్యాసాలు : వివిధ శాస్త్ర, సాంకేతిక, సాహిత్య విషయాలపై అసిమోవ్ వ్యాసాలు
20 things I learnt about browsers and web – Google : ఇంటర్నెట్ గురించి ప్రాథమిక స్థాయి అవగాహన కల్పిస్తూ రాసిన ఈ-పుస్తకం
The Django Book : జాంగో ను ఉపయోగించి వెబ్ అప్ప్లికేషన్లు రూపొందించడం ఎలా? అన్నది తెలియజేస్తూ, చక్కగా రాయబడ్డ ఈ-పుస్తకం ఇది
The Language Machine: Eric Atwell : ఈ పుస్తకం మనుష్య భాషల్ని అర్థం చేసుకునే సాంకేతిక పరికరాలను రూపొందించడంలోని సాధకబాధకాలను, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలనూ గురించి తయారు చేసిన ఒక రిసర్చి రిపోర్ట్. Eric Atwell వెబ్ పేజీకి వెళితే లంకె ఉంటుంది. అద్భుతంగా ఏమీ లేదు కానీ, కొత్తగా ఈ రంగం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి మాత్రం – చాలా వివరంగా అన్ని కోణాలనూ స్పృషించి, సాంకేతిక పదజాలాలూ, వివరాలు లేకుండా రాసారు కనుక, పనికి రావొచ్చు. చివర్లో ఇచ్చిన రిఫరెన్సులు, అపెండిక్స్ మాత్రం విలువైనవి.
Too Soon to say goodbye – Art Buchwald (ఇంకా చదువుతున్నా. Buchwald సహజ హాస్య, వ్యంగ్య శైలిలో సాగుతోంది.)
A Mathematician reads the newspaper – John Allen Paulos : పుస్తకం పేరులో చెప్పినట్లే, సాధారణ వార్తాపత్రిక వ్యాసాలు, వాటిలో అంకెలు చెప్పే ‘నిజలూ’ ఒక గణిత శాస్త్రజ్ఞుడి కోణంలో చూస్తే ఎలా ఉంటాయో వివిధ రకాల వార్తాంశాలను తీసుకుని రాసిన వ్యాసాలు. చాలా ఆసక్తికరమైన పుస్తకం.
BPO Sutra -Sudhindra Mokashi : బీపీవో ఉద్యోగుల అనుభవాల కథలు. చికెన్ సూప్ పుస్తకాల తరహాలో ఉంది. బానే ఉంది. దాదాపు నాలుగొందల పేజీల పుస్తకమైనా ఏకబిగిన చదివించింది.

సారస్వత వివేచన – రా.రా. : రాచమల్లు రామచంద్రా రెడ్డి సాహితీ విమర్శ వ్యాసాలు. బాగున్నాయ్!
రాముడికి సీత ఏమౌతుంది – ఆరుద్ర : ఆరుద్ర గారి ఆసక్తికరమైన పరిశోధనా వ్యాసాలు
ఆముక్త మాల్యద పరిచయం – మల్లాది హనుమంతరావు : ఆముక్త మాల్యద ను సామాన్య జనాలకి పరిచయం చేసే పుస్తకం. చాలా బాగా రాశారు.
చిరంజీవులు – నండూరి రామ్మోహనరావు : వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తుల గురించిన నండూరి వారి సంపాదకీయాలు
అనుపల్లవి – నండూరి రామ్మోహనరావు : వివిధ వార్తాంశాలపై నండూరి వారి సంపాదకీయాలు
(ఈ రెండింటి గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు)
పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావ్ : నెల్లూరు జిల్లా చరిత్రపై చిన్న చిన్న వ్యాసాలు
వ్యాసమాలతి – నిడదవోలు మాలతి : పాతతరం తెలుగు రచయితలపై వ్యాసాలు.
కన్నడ సాహిత్య సౌరభం – గడియారం రామకృష్ణాశర్మ : కన్నడ సాహిత్యం గురించి చిన్న పరిచయం
కథా శిల్పం – వల్లంపాటి : కథా ప్రక్రియ, చరిత్ర, స్ట్రక్చర్ ఇత్రత్రా అంశాల గురించి గురించి వ్యాసాలు.
-ఈ పుస్తకాలన్నీ ఏదో ఒక విధంగా తమ ప్రభావం నాపై చూపాయి. ఒక్కటి వదలకుండా అన్నీ మంచి ఎంపికలే అని నాకు నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. వీటన్నింటిలో, జీవితాంతం నాతో వెంట ఉంచుకుని, అప్పుడప్పుడూ తిరగేస్తూ ఉండాలి అనిపించిన పుస్తకాలు: The Emerging Mind, ఆసిమోవ్ వ్యాసాలు, ప్రదీప్ సెబాస్టియన్ వ్యాసాలు, చిరంజీవులు, వ్యాసమాలతి, స్టేట్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఇండియా ఆఫ్టర్ గాంధీ. Kurt Vonnegut వ్యాసాలు కూడా చాలా నచ్చాయి – ఆయన పుస్తకాలు మరిన్ని చదవాలి అనిపించింది.

ఇవి కాక, వృత్తి పరంగానూ, భవిష్యత్తు పరంగానూ – వ్యాసాలు, రిసర్చి పేపర్లు వగైరా చదివాను. పత్రికలు, దిన పత్రికలు ఎటూ చదువుతూనే ఉంటాము. కానీ, అవన్నీ ఇలా పద్ధతిగా డైరీలో పేర్లు నోట్ చేసుకోలేదు కనుక, వాటి గురించి పద్ధతిగా రాయలేనన్నమాట. ఇప్పటికి ఇదీ కథ.

You Might Also Like

4 Comments

  1. Indian Minerva

    ప్రియాంక గారు: Many thanks

  2. Priyanka

    Baaboi.. ee samvatsaram prachurinchina pustakaalu anni chavinantha list undhi kadhaa. Congratulations Soumya.

  3. Priyanka

    Indian Minerva garu,

    EveningHour.com website dwaaraa online orders place cheyyachu. Please check the website.

    Thanks,

  4. Indian Minerva

    మీరు ఏంచేస్తుంటారో తెలుసుకోవచ్చా. మరేమీ లేదండీ ఇన్ని పుస్తకాలెలా చదివారో తెలుసుకొందామని. మీరు పుస్తకంలో పరిచయం చేసిన ప్రతి english పుస్తకమూ చదివేస్తుంటాను (ఇక్కడ బెంగుళూరులో తెలుగువెక్కడ దొరుకుతాయో తెలీదుకాబట్టి).

Leave a Reply