దాదా సాహెబ్ ఫాల్కే జీవితం

పుస్తకం వివరాలు:
Datasaheb Phalke – the Father of Indian Cinema
Bapu Watve (Translated by S.A.Virkar)
National Book Trust, India (First Edition-2004)
Cost: Rs 65/-


పుస్తకం చదవడం వెనుక కథా కమామిషూ:

దాదాసాహెబ్ ఫాల్కే – భారతీయ సినిమా పితామహుడు. అయితే, ఆయన గురించి జనబాహుళ్యంలో ఎంతమందికి తెలుసు? ఇన్నాళ్ళుగా సినిమాలు చూస్తూ ఉన్నానా, ఏటేటా సినీ రంగానికి విశేష సేవ చేసినందుకు ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆయనే మొదటి భారతీయ చలనచిత్రం తీశాడు అన్న నిజం తప్పితే, ఆయన గురించి నాకింకేమీ తెలీదు. ఆ విషయాన్ని నాకు గుర్తు చేసినది – రష్మీ బన్సల్ తన ’కనెక్ట్ ది డాట్స్’ పుస్తకం కోసం – ఫాల్కేపై ’హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’ మరాఠీ చిత్ర దర్శకుడు పరేశ్ మొకాషీ తో చేసిన ఇంటర్వ్యూ చదివినప్పుడు. ఆపై ఆ చిత్రం చూశాక, అనిపించింది – ఫాల్కే కథ ఏమిటో తెలుసుకోవాలని. ఆ ఇంటర్వ్యూలోనే మొకాషీ ఆ సినిమా తీసేందుకు తనకు ప్రేరణ బాపూ వాత్వే రాసిన ఫాల్కే జీవితచరిత్రని చెప్పాడు. ఇక దృష్టి ఆ పుస్తకం పై పడింది.

ఇక పుస్తకం కథ:

ఈ పుస్తకంలో ఫాల్కే భారతదేశపు తొలి చిత్రం తీసినప్పటి, తీయకముందు నాటి పరిస్థితులు, సినిమా రంగం పుట్టకముందు నాటి ప్రపంచంలో ఆ రంగోద్భవానికి కారణమైన ఆవిష్కరణలు – వీటి గురించి మొదటి మూడు ప్రకరణాల్లో వివరించారు. ఆపై, ఫాల్కే జీవితం, అతని కుటుంబం, అతని తత్వం, అతను మొదటి సినిమా తీసిన పరిస్థితులు, పద్ధతులు, ఘన విజయాలు – ఇదంతా ఒక రెండు ప్రకరణాలు. అక్కడినుంచి, ఫాల్కే అనుభవించిన కష్టాలు, మళ్ళీ మధ్యలో విజయాలు, ఆయన మనస్తత్వం వల్ల ఆయనకీ, కుటుంబానికీ ఎదురైన ఇబ్బందులు, ఆయన చివరి సినిమాలు, చివరి రోజులు – ఇవన్నీ తదుపరి ప్రకరణాల్లో కనిపించే వివరాలు. చివరి ప్రకరణాల్లో – ఫాల్కేతో చేసిన రెండు మూడు ఇంటర్వ్యూలు, అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని గురించి చెప్పిన మాటలు, ఆయన కుటుంబసభ్యుల గురించిన పరిచయం, రచయిత చివరి వాక్యాలూ అయ్యాక – ఫాల్కే జీవిత విశేషాలు, తీసిన చిత్రాల జాబితా -ఇటువంటి అపెండిక్సులతో పుస్తకం ముగిసింది.

ఇక – ఫాల్కే విషయానికొస్తే, ఈయన కథలో ఎన్ని మలుపులో! నాకెప్పుడూ ఇలా గొప్పవారి కథలు చదువుతూ ఉంటే, వారికంటే కూడా వారి భార్యా,పిల్లల గురించీ, వారి కుటుంబ నిర్వహణ గురించీ ఆలోచన ఎక్కువ కలుగుతూ ఉంటుంది. చాలా కథల్లో వ్యక్తిగత జీవితాలను వారు పట్టించుకోకపోవడమే కనిపిస్తూ ఉండటంతో నిరాశ కలుగుతూ ఉంటుంది. అయితే, ఈ కథలో కూడా ఆయన పరంగా అదే జరిగినా, ఇవతల ఫాల్కే భార్య సరస్వతి ని తల్చుకుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆకాలానికి, ఆవిడ చాలా ధైర్యవంతురాలైన ఆడదానికిందే లెక్క అనుకోవచ్చేమో. భర్త చేసిన పనిలో విశ్వాసం ఉంచి, చివరిదాకా సహకరించినందుకు ఆమెకి ఎన్ని ’వావ్’లు చెప్పినా సరిపోదు. (అదేమిటో గానీ, ఆవిడ్ని తల్చుకుంటే నాకు సినిమాలో ఆమె పాత్ర వేసిన విభావరి గారి మొహమే కనిపిస్తోంది!)

పుస్తకం-మస్ట్ రీడ్. ఫాల్కే జీవితం గురించి, భారతీయ సినిమా తొలినాటి ఎదుగుదల గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, ఫాల్కే సినిమాటోగ్రాఫ్ ఎంక్వైరీ కమిటీ తో భారత దేశంలో చలనచిత్ర రంగ భవిష్యత్తు గురించి జరిపిన ప్రశ్నోత్తరాలను చదువుతూ ఉంటే, కొన్ని ఇప్పటికీ నిజం! అనిపించాయి. ఫాల్కే – మనస్పూర్తిగా మన దేశంలో సినిమా ఒక పరిశ్రమ కాగలదని నమ్మకుండా ఉండి ఉంటే – ఇక్కడ సినిమా రంగం వచ్చేది కాదని నేననను. ఆలస్యమయ్యేదంతే. కానీ, అలాగని ఫాల్కే గురించి తెల్సుకోవడం అనవసరం అని నేననుకోను. ఫాల్కే ప్రతిభ ఎంత గొప్పదో తెలుసుకోడానికన్నా ఈ పుస్తకాన్ని చదవాలి.అయినా, సినిమాలు చూసే ప్రతి ఒక్కరూ మనకి సినిమాని చేరువ చేసిన వ్యక్తిని గురించి తెలుసుకోవడం అవసరం అనిపిస్తుంది నాకు. [నువ్వు రోజు టూవీలర్ నడుపుతావ్ -మరి దాని మేకర్ కథ తెలుసా? నువ్వు రోజూ ఫిల్టర్ కాఫీ తాగుతావ్..ఫిల్టర్ కాఫీ ఎలా కనిపెట్టారో తెలుసా… ఇలా అడక్కండేం! :)]

రచనా శైలి పరంగా ఈ పుస్తకం నాకంత నచ్చలేదు. అసలు నాకు ఈ ఎన్బీటీ, సీబీటీ వగైరా ట్రస్టుల,అకాడమీల పుస్తకాలన్నింటితోనూ ఇదే సమస్య ఉంటుందనుకోండీ, అది వేరే సంగతి. అనువాదం కూడా అంత నచ్చలేదు. ఏమిటో, భారతీయ భాషల ఆంధ్ర-ఆంగ్ల అనువాదాలు ఒక పట్టాన నచ్చవు నాకు! :(. ఇది సామాన్య ప్రజానీకం చదూకోడానికన్నా కూడా సీరియస్గా శైలిని పట్టించుకోకుండా విషయాన్ని గ్రహించుకుంటూ చదువుకుంటూ పోయేవారికి బాగా నచ్చుతుందనుకుంటాను! అయినా, ఫాల్కే గురించి ఇతరత్రా పుస్తకాలొచ్చాయా? వస్తే ఏవి? అన్నది నాకు తెలీదు కనుక, ఆపరంగా చూసినా ఇది తప్పక చదవాల్సిందే అంటాను. It’s inspiring in parts, irritating in some – interesting throughout, though.

ఆన్లైన్ కొనుగోలుకు – అప్పట్లో ఎక్కడా కనబడలేదు. ఒక్క ఎల్ఫీకార్ట్ అని ఒక సైట్లో తప్ప. అయితే, ఎన్‍బీటీ వారి సైటు ద్వారా వారిని సంప్రదిస్తే, పుస్తకం పోస్టు ద్వారా పొందవచ్చని విజయవర్థన్ గారు తెలిపారు.

ఇపుడు ప్లిప్కార్ట్ లో కూడా లభ్యం:

You Might Also Like

3 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] రచనకు కుందుర్తి తెలుగు అనువాదం దాదాసాహెబ్ ఫాల్కే : బాపు వాత్వే The Boy Who Harnessed the wind – విలియం కంకాంబ్వా అన్న […]

  2. nagaraju

    విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను కొన్నైనా మేధస్సుతో గమనించండి
    రేపటి సమస్యల పరిష్కారానికి నా భావాలు ఎంతో ఉపయోగపడుతాయి
    ప్రతి జీవి సమస్యల కారణ భావాలను గమనించే జ్ఞానం నా భావాలలోనే
    విజ్ఞాన భావాల విశ్వ భాషలో నా జీవితాన్ని లెక్కించుట లేదు ఎందుకో
    నా జీవితం కన్నా విశ్వ జీవుల జీవిత విజ్ఞానం నా మేధస్సుకు శ్రేయస్సు
    Hi,
    welcome to my blog
    gsystime.blogspot.com
    Read spiritual knowledge in this blog

    Thanks,
    Nagaraju g

  3. SRRao

    మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

Leave a Reply