శివరాజు సుబ్బలక్ష్మి గారితో…

ఆగస్టులో మాలతి గారు బెంగళూరు వచ్చినప్పుడు మేము కలిసి వెళ్ళి శివరాజు సుబ్బలక్ష్మి గారిని కలిసాము. ఆరోజు ఆవిడని కలిసిన అనుభవం రాయాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను. ఆ మధ్య “సెలెక్ట్” కి వెళ్ళి వచ్చాక, ఎందుకోగానీ సుబ్బలక్ష్మి గారు గుర్తొచ్చారు. దానితో, ఇన్నాల్టికి, ఆరోజుటి అనుభవాల్ని రాస్తున్నాననమాట.

అక్కడికి వెళ్ళేముందు నాకు ఆవిడ గురించి తెలిసింది మూడు మార్గాల ద్వారా :
1. మూలా సుబ్రమణ్యం – తన “ఏటి ఒడ్డున” సంకలనం లో రాసిన “శివరాజు సుబ్బలక్ష్మి గారితో” కవిత.
2. కౌముదిలో అనుకుంటాను – ఓసారి ఓ వ్యాసం చదివాను
3. మాలతి గారు చెప్పడం ద్వారా.
– అయినప్పటికీ, ఆమె గురించి నేనేమీ పెద్దగా తెలుసుకోలేకపోయాను. She is an interesting person అన్న ఒక్క విషయాన్ని తప్ప.
కానీ, అక్కడికి వెళ్ళింతరువాత – “she IS an interesting person” అనిపించింది.

సుబ్బలక్ష్మి గారు కూడా ఓ రచయిత్రి అన్న విషయం – మాలతి గారు చెప్పారు కానీ, అక్కడికి వెళ్ళాక, ఆవిడ తన వద్ద ఉన్న తన పుస్తకాలని మాకు చూపించాకా అర్థమైంది – ఆరోజుల్లో ఆవిడ తరుచుగానే రాసేవారని. మాలతి గారు ఆవిడతో మాట్లాడుతూ, ఆవిడ కథల గురించీ ఆవిడ ఆలోచనల్ను తెలుసుకుంటు ఉన్నారు. నేను ఆమె కథలు, నవలలు ఏవీ చదవలేదు (అసలు నాకు తెలిసిందే అక్కడైతేనూ!!). ఆవిడ చెప్పేది వింటూ ఉంటే, ఓ పక్క – ఆవిడ భావజాలంతో నాకు పొసగదేమో అనిపించీంది. రెండు తరాల తేడా ఉన్నందువల్ల కాబోలు. అయినప్పటికీ, ఆవిడ ఎలా రాసారో చదవాలన్న కుతూహలం మాత్రం మరింత పెరిగిపోయింది. బాధాకరమైన విషయం ఏమిటీ అంటే ఇప్పుడు ఆమె రచనలు ఒక్కటీ ప్రచురణలో లేవట. మరిప్పుడెలా చదివేది? ఈసారి వాళ్ళింట్లో తిష్ట వేసి చదువుకోవల్సిందే. దాదాపు ఎనభైఅయిదేళ్ళ వయసులో ఇప్పటికీ ఆవిడ తరుచుగా రాస్తూనే ఉంటారనీ, కానీ, దేనికీ పంపరనీ – వాళ్ళబ్బాయి చెబుతూ ఉంటే… “వాట్!” అని నోరెళ్ళబెట్టాను. అలాగే, తామిద్దరి కథ (మిస్టర్ అండ్ మిసెస్ బుచ్చిబాబు) ను ఆత్మకథలాగా రోజు కొన్ని పేజీలు రాస్తున్నానని చెప్పి, ఒకట్రెండు పిట్టకథలు చెప్పారు వాళ్ళిద్దరి మధ్య జరిగినవి.

రచయిత్రి అన్నది ఆమెలో ఒక కోణం మాత్రమేనని, పక్కగదిలో వరుసగా పేర్చి ఉన్న పెయింటింగ్స్ ని చూశాక అర్థమైంది. అన్ని పెట్టి ఉంటే, నేను ఈ ఇంట్లోవాళ్ళకి కళాపోషణ ఎక్కువేమో అనుకున్నా కానీ, అవన్నీ ఆవిడ గీసినవట!! ఇప్పటికీ తరుచుగా గీస్తూ ఉంటారని వాళ్ళబ్బై చెప్పాడు. నిజం చెప్పొద్దూ -నాకు చాలా నచ్చేశాయి ఆ పెయింటింగ్స్. బాపు చిన్నప్పుడు బొమ్మలేయడం ఎలాగో చూపారట ఈవిడ – ఆయన వీళ్ళకి చూట్టం అట. పెయింటింగ్స్ వేయడం ఒకరకం – ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీతో – సూపర్బ్!

అది ఒక కోణమా – ఎనభైఅయిదేళ్ళ వయసుకి, ఇప్పటికీ ఆవిడ చాలా హుషారైన మనిషి. వంటపని సమస్తం ఆవిడే చేస్తారు. మాకు కాఫీ కూడా పెట్టిచ్చారు – నేను సుబ్బలక్ష్మి గారి కాఫీ తాగానొచ్! 🙂 మాట్లాడుతూ ఉంటే సమయమే తెలీలేదు. నేనింకా వెళ్ళేముందు భయపడ్డాను – ఇంత పెద్దవాళ్ళతో నేనేం మాట్లాడతాను, బోరు కొడుతుందేమో అని. కానీ, అలాంటిదేం లేదు, భలే కలిసిపోయారు. మళ్ళీ రమ్మని ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. 🙂 ఒక్క మాటలో చెప్పాలంటే – ఆమెతో మాట్లాడుతూ ఉంటే, నాకు ఎనర్జీ పెరిగిపోయింది. అంతతేలికగా మర్చిపోగల వ్యక్తి కారు-అసలు మర్చిపోలేని వ్యక్తి, నన్నడిగితే.

You Might Also Like

18 Comments

  1. బాపు బొమ్మల కొలువు | kapilaramkumar

    […] వ్యాసాలు. బాపు చిన్నతనం గురించి  శివరాజు సుబ్బలక్ష్మిగారు (బుచ్చిబాబుగారి శ్రీమతి – […]

  2. పుస్తకం » Blog Archive » బాపు బొమ్మల కొలువు

    […] వ్యాసాలు. బాపు చిన్నతనం గురించి  శివరాజు సుబ్బలక్ష్మిగారు (బుచ్చిబాబుగారి శ్రీమతి – […]

  3. ramanarsimha

    @SOUMYA

    I am extremely sorry for my previous opinion.

    Your information about Subbalakshmi garu is very very comprehensi

    My prev opinion was sent without reading the artical thouroughly.

  4. ramanarasimha

    @SOUMYA..

    This information is very very uncomprehensive to me..

  5. rAm

    గాజులమ్మి, ఇలియట్‌ కొనిచ్చాను!
    శివరాజు సుబ్బలక్ష్మి జ్ఞాపకావరణం

    http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=56361&Categoryid=15&subcatid=67

  6. ram mohan

    “ఏది జరిగినా విడిపోవాలనే ఆలోచన రాకూడదు. అది కట్టుబాట్లని వెక్కిరించి … వివాహం అనే పదానికి అర్థం లేకుండా చేస్తుంది”– An utopian idea.For both the partners, if this is feasible, then divorce has no meaning.

  7. మాలతి

    సౌమ్యా, update. ఇప్పుడే తెలిసింది వైదేహిద్వారా. శివరాజు సుబ్బలక్ష్మి కథలు పుస్తకం ఎవికెయఫ్ వారి సైటులో వుందిట. వాళ్ల ఆపీసు హైదరాబాదులో వుంది కనక అక్కడ దొరకవచ్చు.

  8. విజయవర్ధన్

    సుబ్బలక్ష్మి గారి “మనోవ్యాధికి మందుంది” కథకు బాపు గారు వేసిన బొమ్మ ఇక్కడ చూడొచ్చు:
    http://chitrachalanam.blogspot.com/2009/11/11.html

  9. chavakiran

    ఆవిడని ఒక బ్లాగు మొదలు పెట్టమని చెప్పండి. 🙂

  10. సుబ్రహ్మణ్యం

    ఆవిడని ఇప్పటికి నాలుగైదు సార్లు కలిసాను. తమ అనుభవాలు, జ్ఞాపకాలు మనతో పంచుకుంటుంటే వింటూ ఎంతసేపైనా గడిపెయ్యొచ్చు.బుచ్చిబాబు గారు, సుబ్బలక్ష్మి గారు తీరిక దొరికితే ఏదైనా పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ దృశ్యాల పెయింటింగ్స్ వేసేవారుట. ఒకే దృశ్యాన్ని ఇద్దరూ చిత్రించడం, అప్పటి అనుభవాలు అన్నీ చెప్పి ఆ చిత్రాలు కూడా చూపించారు. బుచ్చిబాబు గారు “చివరికి మిగిలేది” రాస్తున్నప్పటి అనుభవాలు, రమణాశ్రమంలో చలం గారిని కలిసినప్పటి సంగతులూ ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. చలం గారి ముఖంలో గొప్ప శాంతి, తేజస్సు కనిపించాయిట.

    పుస్తకం తరపున ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే బాపు, కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, ఆచంట జానకిరాం, పాలగుమ్మి పద్మరాజు, వడ్డెర చండీదాస్ ఇలా రెండు తరాల తెలుగు సాహితీ మూర్తులందరి గురించీ మనకి తెలియని ఎన్నో మంచి సంగతులు వెలుగుచూస్తాయి. అదొక మంచి ప్రయత్నమౌతుంది.

  11. మాలతి

    – ఇంత పెద్దవాళ్ళతో నేనేం మాట్లాడతాను – :)ఇంకానా?
    మొత్తమ్మీద పెట్టేవు. అదే సంతోషం.
    @ బొల్లోజుబాబా, నాకు కెమెరాతో అంత బాగా రావడం లేదండీ. పుస్తకాలు కుట్టుదగ్గర గోళువంపుగా తిరిగి, పేజీ స్పష్టంగా రావడంలేదు. మీకేమైనా ట్రిక్కులు తెలిస్తే చెప్పండి.
    @ సుజాతా, ఫుట్టివుండకపోయినా, లైబ్రరీలో వుంటాయి కదా. ఇక్కడ మాలైబ్రరీలో అన్నీ వున్నాయి. ముఖ్యంగా నీలంగేటు అయ్యగారు నవల తప్పకుండా చదవవలసిన నవల.

  12. usha

    @ sowmya: ee sari rkkadi kanna velli nappudu Digi cam tappakunda tesukoni vellu photoes tesuko.. oka sweet memory ga anna vuntundhi.malli ekkada vasthundi aa chance.

  13. బొల్లోజు బాబా

    ప్రేరణ కలిగించే వ్యక్తిత్వం.

    @సౌమ్య గారికి
    జిరాక్స్ తీసుకోవక్కరలేదు. మనవద్ద డిజిటల్ కెమేరా ఉంటే వరుసగా ఫొటోలు తీసేసుకోవచ్చు. ఈ మధ్య నేనిదే పని చేస్తున్నాను. (మరీ పుస్తకాల షాపుల్లో కాదులెండి,:-) లైబ్రేరీలోనే) ఈ రోజుల్లో మెమరీ/రిజల్యూషను సమస్య కాదు. అలా వచ్చిన ఫొటోలను పి.డి.ఎఫ్ గా కన్వర్ట్ చేసి నెట్ లోకి అప్లోడ్ చేస్తే, ఇక అలా పడి ఉంటాయి.

    బొల్లోజు బాబా

  14. విజయవర్ధన్

    సుబ్బలక్ష్మి గారిని కలిస్తే ఎవరికైనా మంచి ఉత్సాహం వస్తుంది. వారిని రెండుసార్లు కలవగలిగాను.

    “బాపు చిన్నప్పుడు బొమ్మలేయడం ఎలాగో చూపారట ఈవిడ”
    నాకు తెలసి అలా ఆవిడ ఎప్పుడు అనలేదు. కాని బాపు గారికి PG Wodehouseని పరిచయం చేసింది సుబ్బలక్ష్మిగారే. బుచ్చిబాబు గారు బాపు గారికి చిన్నాన్నా అవుతారు (బుచ్చినాన్న అనే వారంట బాపు గారు). బుచ్చిబాబు గారు చిత్రకారులు కాబట్టి బాపుగారిపైన ఆ ప్రభావం వుండివుంటుంది. అంతేకాక బుచ్చిబాబు గారి ప్రోత్సాహం వుండేదంట.

    1. సౌమ్య

      @విజయవర్థన్: మేము వెళ్ళినపుడు వాళ్ళబ్బాయి అలాగే అన్నారు. పక్కనే ఆవిడ కూడా ఉన్నారు, నవ్వారు అంతే. కనుక, ఏమో, చిన్నప్పుడు అలా సలహాలు ఇచ్చేవారేమో మరి.

  15. సుజాత

    ఆవిడ పుస్తకాలను ఫొటోస్టాట్ తీసుకోవలసింది. ఇక దొరకవు అని తెలిసిన పుస్తకాలన్నింటికీ నేను ఇదే పని చేస్తాను. అది ఏ ఫామ్ లో ఉంటే ఏమి, రచన ముఖ్యం కదా అని! ఆమె కథలు నేనూ ఏమీ చదవలేదు! ఎలా చదువుతాం, అప్పటికి మనం పుట్టి ఉండం, ఇప్పుడేమో ఆ పుస్తకాలు లభ్యం కావాయె!

    ఆవిడ ఎనర్జీ గురించి చెప్తుంటే నీరసం వస్తోంది..అందులో సగమైనా మనకి లేదే అని!

    ఇంతేనా, రెండో భాగం ఏదైనా ఉందా?

    1. సౌమ్య

      నేను మళ్ళీ వెళ్తే రెండో భాగం వస్తుంది 🙂
      జిరాక్స్ : వాళ్ళింటి చుట్టుపక్కల అలాంటివేమీ కనబడలేదు – ఒకవేళ నాకు ఆ ఐడియా వచ్చి ఉన్నా. మళ్ళీ వెళ్ళాలనే అనుకుంటున్నా. ఈసారి జిరాక్స్ తీస్కుంటాను. 🙂

Leave a Reply