పుస్తకం
All about booksపుస్తకభాష

July 20, 2012

A Shot At History – Abhinav Bindra

More articles by »
Written by: Purnima
Tags:

మళ్ళీ నాలుగేళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ తలుపు తడుతున్నాయి. డ్రాయింగ్ రూమ్స్ లో కాళ్ళ మీద కాళ్ళేసుకొని, పాప్-కార్న్ తింటూ టివిలో ఆ ఆటలు చూస్తూ ఉంటే ఇంకో మూడు వారాలూ గడిచిపోతాయి. అప్పుడు అందరూ పతకాల పట్టీలో మన దీనావస్థ గురించి మొదలెడతారు. ఓ నలుగురైదుగురు సెలబ్రిటీలను పోగేసుకొని న్యూస్ ఛానెల్ వాళ్ళు చేసే చర్చల్లో మళ్ళీ నా వంతుగా పాప్-కార్న్ తో సిద్ధపడతాను. ఆనక, అన్నింటిలా “వంద కోట్ల జనాభా-పట్టుమని పది పతకాలు కూడా లేవు” అన్న సమస్య మళ్ళీ నిద్రావస్థలోకి పోతుంది. కుంభకర్ణుడిలా మళ్ళీ అవసరమైతే గానీ అది లేవదు. ఈ లోపు జెనరల్ నాలెడ్జ్ కోసమని లియాండర్ పేస్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రాల లాంటి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటుంటాను. వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళచే లేక వాళ్ళపై వచ్చిన పుస్తకాలు చదువుతుంటాను. ఇదీ మొత్తానికి ఒక నాన్-స్పోర్టింగ్ సిటిజిన్ గా నా కాంట్రిబ్యూషన్!

అలా నా వంతుగా అభినవ్ బింద్రా రాసుకున్న “A Shot at History” చదవటం పూర్తిచేశాను. పుస్తకం వచ్చిందని తెల్సిన చాన్నాళ్ళ వరకూ దాని జోలికి పోలేదు. ఎంసెట్ రాంకుల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు “మేం ఇరవై ఆరేసి గంటలు చదివాం రోజుల్లో. మా టీచర్లు, పేరెంట్స్ హెల్ప్ చేశారు చాలా..” లాంటి విషయాలే ఉంటాయని నమ్మకం. ఇంకా చెప్పాలంటే, “ఆ ఏదో ఒక ఒలింపిక్ మెడల్ గెల్చేసి, జనాలు మర్చిపోయే లోపు ఓ పుస్తకం రాసేసి పాపులారిటి కాష్ చేసుకోవడం తప్పించి” అని పెదవి విరిచాను. మరో పుస్తకం అందుబాటు లేని వేళలో ఇది తీసుకొని, పరమ అలక్ష్యంగా చివర్న ఉన్న చాప్టర్ ఏదో తెరిచి చదవటం మొదలెట్టాను. అందులో అభినవ్ మన స్పోర్ట్స్ అఫీషియల్స్ ని పేర్లతో సహా తూర్పారబట్టాడు. ఆ చాప్టర్ చదివాక ఇదేదో దేశజనాభా స్మృతుల్లో కొండెక్కిపోతున్న తన గెలుపుకి మరికొంత నూనె వేసే ప్రయత్నంలా కనిపించలేదు. షూటింగ్ క్రీడలో బుల్స్ ఐ లో సెంటర్ ని ఎలా టార్గెట్ చేయగలడో, భారతీయ క్రీడా వ్యవస్థపై కూడా అంతే సూటిగా మాట్లాడగలడు అని అర్థమయ్యాక, ఈ పుస్తకం చదవటంలో ఆలస్యం చేయలేదు.

2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించి అభినవ్ బింద్రా “వ్యక్తిగత స్పర్థలో స్వర్ణం గెల్చుకున్న తొలి భారతీయుడి”గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అనుకున్నట్టే, ఈ పుస్తకం ఆ విజయం గురించే. కాకపోతే దాని గురించి మాత్రమే అని అనిపించదు. అసలు ఈ బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు ఏథెన్స్ ఒలింపిక్స్ లో ఘెరాతి ఘోరంగా ఓడిపోవటం తనను ఎంతగా కృంగదీసిందోనని చెప్పటంతో పుస్తకం మొదలవుతుంది. పతకం గెల్చి, ప్రపంచ విజేతగా నిలిచి కూడా తాను డ్రిప్రెషన్ కు ఎలా గురైందీ, దాని నుండి ఎలా బయటపడింది చెప్పుకొస్తాడు. అంటే, ఒక పీక్ పాయింట్ ను చూడ్డానికి రెండు పాతాళాలను చూశాడన్న మాట. ఆ రోలర్-కోస్ట్రర్ రైడ్ మొత్తాన్ని పాఠకులచేత కూడా చేయిస్తాడు. అందుకని ఈ పుస్తకానికి నా వైపు నుండి కొంచెం ఎక్కువ మార్కులు. రోహిత్ బ్రిజ్‍నాథ్ తోడుండడంతో ఆ ప్రయాణం ఎంత ఉత్కంఠగా సాగిందో, పఠనం కూడా అంతే నిరాటంకంగా సాగింది.

బింద్రా బాల్యం, అతడికి షూటింగ్ పై ఆసక్తి కలగడం, ఆ పై దానిపైనే ధ్యాస నిలపటం, దాన్నో వృత్తిగా స్వీకరించడానికి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం, స్వంత ఖర్చులతో ప్రపంచ స్థాయి శిక్షణ పొందటం, తన జీవితం వడ్డించిన విస్తరే అయినా అహర్నిశలు, అవిశ్రాతంగా శ్రమించి తన కలను సాకారం చేసుకోవడమే కాకుండా వంద కోట్ల భారతీయుల కళ్ళల్లో ఆనందరేఖలు నింపిన అనుభవం – ఇవ్వన్నీ పుస్తకంలో పుష్కలంగా ఉన్నాయి, ఇదో బయోగ్రఫీ కనుక. అతడిని గురించి మెటీరియల్ ఫాక్ట్స్ మాత్రమే కాకుండా అతడు స్వభావసిద్ధంగా ఎట్లాంటి మనిషి అని తెల్సుకునే వీలునూ కలిపిస్తుంది. “నేను కొంచెం తేడా అనుకుంట, అందుకే జీవితంలో షూటింగ్ తప్ప మరో ధ్యాస లేదు. త్వరగా ఎవరితోనూ కలిసిపోలేను. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. నేను ఖచ్చితంగా “నార్మల్” కానేమో” అని ఒకటికి రెండు సార్లు రెట్టించినప్పుడు, జిమ్ లో అలిసిపోయున్నప్పుడు అక్కడే ఓ అమ్మాయి వర్కవుట్ చేస్తుంటే ఆమెను ఓరకంట చూస్తూ “ఇన్స్పిరేషన్ వస్తుంది” అన్నప్పుడు, ఇలాంటి మరో రెండు మూడు చోట్ల “If not for that Olympic gold, you’re so common, dude.” అని అనాలి అనిపించేంతగా ఈ కాలపు 20-somethings కుర్రాళ్ళో ఒకడిగా అనిపిస్తాడు.

అదే తన ఆటను గురించి మాట్లాడ్డం మొదలెట్టినప్పుడు ఆటపై ఉన్న భక్తిశ్రద్ధలు, లక్ష్యంపై ఉన్న ఏకాగ్రత, ఏది ఏమైనా సరే చేసి తీరాలన్న కసి, అతడు వందకోట్లమందిలో “ఒక్కడు” ఎందుకయ్యాడో స్పష్టంగా తెలియజేస్తాయి. ఆ మాటలు మన ముందు పెట్టే విధానం కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓ పక్క తనకు లోకమైన ఆటను గురించి మనతో బోలెడన్ని కబుర్లు చెప్పేయాలని ఉత్సుకత. కానీ షూటింగ్ స్పెక్టేటర్ స్పోర్ట్ కాదాయే. పైగా మనదేశంలో జనరల్ పబ్లిక్ లో ఆ ఆటలోని టెక్నికాలిటీస్ తెల్సినవాళ్ళు ఎంతమంది. అందుకని వీలైన చోటల్లా అయితే టెన్నిస్ లేదా క్రికెట్ నుండి పోలికలను తెచ్చి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించటం. మధ్యమధ్యన సరైన సపోర్ట్ లేనందుకు తన్నుకొచ్చే ఆవేశం. లోపాలని ఎలా సరిదిద్దాలని ఆలోచనలు. ఇన్ని కల్సి పాఠకుడిని తికమక పెట్టకుండా, ఉక్కిరిబిక్కిరి చేసేంత వరకే వచనాన్ని లాక్కొచ్చారంటే అందులో రోహిత్ బ్రిజ్‍నాథ్ కే ఎక్కువ క్రెడిట్ వెళ్తుందనుకుంట. కానీ చదువుతున్నంత సేపు అభినవ్ తో ఒక లోతైన సంభాషణలో ఉన్నట్టు అనిపించింది.

షూటింగ్ గురించి ఈ పుస్తకం చదవక ముందు తెల్సింది శూన్యం. పుస్తకం మొదట్లోనే షూటింగ్ కి సంబంధించిన బొమ్మ ఇచ్చి, అందులో కీలక టెక్నికల్ టెర్మ్స్ పరిచయం చేయడం, ఆ పైన సందర్భానుసారంగా వీలైనంతగా షూటింగ్ లో ఛాలెంజెస్ ను వివరించడం వల్ల పఠనం తేలిగ్గా సాగింది. మధ్యమధ్యన ఇచ్చిన ఫొటోస్ అదనపు ఆకర్షణ.

ఇహ, భారతీయ క్రీడా వ్యవస్థలో జరిగే అవకతవకలని అభినవ్ లేవనెత్తిన తీరు బి.పి. పెంచేస్తుంది. వాటిని గురించి మాట్లాడుకోడానికి ఇది అనువైన చోటు కాదు. పసిప్రాయం నుండి ఆట తప్ప మరో ధ్యాస లేకుండా ఏళ్ళకు ఏళ్ళు నిరంతరం శ్రమిస్తే, కలలు కన్న వేదికపైన పోటీ పడే అవకాశం కేవలం కొన్ని గంటలనుండి కొన్ని నిముషాలకు పరిమితం. అంత కఠిన శిక్షణ పొంది, ఎన్ని రకాలుగా సంసిద్ధమైనా “అదృష్టం” కలిసి రాకపోతే అంతా బూడిదే! ఒకసారి క్రీడాజీవితం ముగిశాక, పొట్టకూటికోసం మళ్ళీ ఏదో దారి వెతుక్కోవాలి. అయినా కూడా వీళ్ళంతా ఆడతారు. ఎందుకోసం? ఎవరికోసం? మనకోసమా? కానీ మనం మాత్రం ఇలా అభినవ్ బింద్రాల గురించే మాట్లాడుకుంటామే! మరి అంజలి భాగవత్‍లు, అంజూ బాబీ జార్జ్ ల సంగతో? Do we even look upto a sportsperson as more than “entertainment”? How do we pay them back, in case we’re deriving something from them, to begin with? – ఈ పుస్తకం నాలో రేపిన కొన్ని ప్రశ్నలు. వీటికి జవాబుల్లేకుండా, “వందకోట్ల మందికి పట్టుమని పది పతకాలు కూడా లేవే?!” అని వగచే అర్హత నాకు లేదని తెలియజేసిన పుస్తకం. ఇదో ఒలింపియన్ ఆత్మకథ మాత్రమే కాదు. చాలావరకూ మన దేశంలోని క్రీడల కథ! For a general sportslover in India, I don’t think I can recommend anything better than this.

Some of the quotes from the book:

“My only chance is seventy shots in 125 minutes every four years.” “Let’s be clear: we’re not you. We’re not better than you, or other athletes, just caught in lives weirder than most. Shooters can’t suddenly shout “”fuccckkk” as football strikers do after a missed opportunity to score, we can’t throw our guns as one might a tennis racket, we have to absorb everything, swallow conflict, keep it tightly leashed within, not let it out, give up our humanness to become a machine. It’s probably what’s makes us neurotic.”

“Are champions born? I don’t think so. It is bunch of extraordinary people who make champions out of ordinary kids.” “Dreams require a team. And my Olympic and world championship golds arrived because my parents and a clutch of experts groomed a young boy to strive for excellence.”

“When people buy into your cause, cheer your dream, it’s like an armour-plating of sorts: you’re not alone. When this cheering is fake, and I’ve smelled that, too, it stinks. In India, we tend to limp along because our sports are shrouded in negativity.”

“Flawlessness is a burden. In football, the flaw is allowed; of ten passes two may not be weighted exactly.In tennis, not every serve needs to dust the line. In shooting, flawlessness is measured, it is demanded; in shooting, inaccuracy is announced to you and the world over a loud speaker half a second after your shot in a final.A 10.0 in a final is, in fact, a miss.”

“My talent is an opinion, an idea; I am trying to translate it into an unarguable fact. Coaches praise me. My mother is insistent I am gifted. I value myself as a world class shooter. But dazzling myself in a lonely background, with flower pots as spectators, is insufficient. Eventually, I require proof of capability in the public arena, under the lights, cameras watching, the world judging, the very best in the planet competing. I need it to convince you and satisfy me. As a sportsman, this is my job.”

“Words that were printed all across the US Olympic Centre. IT’S NOT EVERY FOUR YEARS. IT’S EVERY DAY.”

_________________________

Book Details:

A Shot At History: My Obsessive Journey to Olympic Gold

Abhinav Bindra with Rohit Brijnath

Harper Sport

Pages: 229

Price: 399 (Can be found at high discounts at stores like Landmark or Flipkart. )About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..2 Comments


  1. […] *A shot at History – My Obsessive Journey to Olympic Gold – Abhinav Bindra […]


  2. ఎప్పటిలానే మీ పరిచయం ఆసక్తికరంగా ఉంది. ఎప్పటిలానే నేను చదువుతూండగానే ఈ పరిచయం వ్రాసింది పూర్ణిమ గారేనని కనిపెట్టేశా(టైటిల్ కింద ఉన్న రచయిత్రి పేరు ముందు చదవలేదు మరి).  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0