పుస్తకం
All about booksపుస్తకభాష

October 2, 2010

Memoirs of Geisha – Arthur Golden

More articles by »
Written by: Purnima

“But now I know that our world is no more permanent than a wave rising on the ocean. Whatever our struggles and triumphs, however, we suffer them, all too soon they bleed into a wash, just like watery ink on paper.”

పై వాక్యాలతో ముగిసే ఈ పుస్తకం పూర్తి అయీ అవగానే అత్యుత్సాహంలో ఒక స్నేహితురాలికి ఈ లైన్లు చెప్పాను. తను వెంటనే “వాహ్.. వాహ్” అనేసి, ఆపకుండా, “రెప్పపాటు ఈ జీవితం – కన్ను తెరిచి మూసే లోపు చేసే ప్రయత్నం” అంటూ మొదలెట్టింది. సరే.. మనం కూడా ఈ జీవితం రెప్పపాటే అని అనుకుందాం. మన కళ్ళ ముందరున్న ఒక విశిష్ట మానవ సౌందర్యాన్ని కళ్ళు తిప్పుకోలేక అలా కన్నార్పకుండా చూస్తూ ఉన్న వేళ, ఆ మనిషి మనకేసి చూసిన క్షణంలో ఒక అద్వితీయమైన అనుభవమేదో కలిగిన పరవశంలో మనముండగా, ఆ కళ్ళు చూపును మరల్చటమో, రెప్పలు వాల్చటమో చేశాయనుకుందాం. ఇదీ రెప్పపాటే! కానీ మనతో ఒక జీవితకాలం పాటు గుర్తుగా మిగలొచ్చు. క్షణికమైనవే అనిపించినా కొన్ని జీవితాలు మిగిల్చే అనుభూతులు అపురూపం! ఈ పుస్తకం అలాంటి కోవకే చెందుతుంది.

ఇది ఒక కాల్పనిక రచన. జపాను సంస్కృతిలో అంతర్భాగమైన గీషా ఆచారాన్ని కూలంకషంగా మనకి పరిచయం చేయటానికి ఒక అమెరికన్ రచయిత ఎన్నుకొన్న మార్గం “Memoirs of Geisha” అనే నవలను సృష్టించటం. తను చేసిన పరిశోధనను అంతా “సయూరి” అనే కాల్పనిక పాత్ర చేత మనకి వినిపిస్తారు.

కథ: జపానులో ఒక కుగ్రామంలో జాలరి కుటుంబాన జన్మించిన ఓ చిన్నారి జీవన గాధ ఇది. పసి వయస్సులోనే తల్లి అనారోగ్యంతో మూలన పడ్డం, వయోభారం మీద పడ్డంతో తండ్రి తన కూతుర్లిద్దరినీ ఒక కామందుకు అమ్మేస్తాడు. ఆ కామందు ఈ పిల్లలని పట్నం తీసుకొని పోయి చెరో గీషా ఇళ్ళల్లో అమ్మేస్తాడు. ఇంటికి దూరమైయ్యానన్న బాధతో, అక్క తనలా ఎక్కడ కష్టపడుతుందో తెలీక ఆమెను చేరుకోడానికి చేసిన విఫల యత్నాల తర్వాత, ఇక అన్నింటినీ దిగమింగుకొని గీషా కావటమే ఒక ధ్యేయంగా పెట్టుకొన్న విపరీత పరిస్థితులని కూడా అధిగమించి మంచి పేరు సంపాదిస్తున్న తరుణాన, రెండో ప్రపంచ యుద్ధం వల్ల గీషా ఇళ్ళని మూసేయటం వల్ల, మళ్ళీ జీవనోపాధికి వీధిన పడుతుంది. తన చిన్నపిల్లగా ఉన్నప్పుడు దారిపోయిన ఓ ధర్మాత్ముడు చెప్పిన ఉత్సాహపూర్వక మాటలను గుండెల్లో తొలి ప్రేమగా దాచుకున్న ఈ సాయురి అతడిని చేరటంతో కథ సుఖాంతం అవుతుంది.

కథనం: సాయూరి అనే ఆవిడ తన జీవిత కాలంలో జరిగిన విశేషాలన్నీ పూసగుచ్చినట్లు మనకి కబుర్ల రూపంలో చెప్పుకొస్తున్నట్టు ఉంటుంది శైలి. తను కోరుకున్న మనిషితోనే జీవితం పంచుకునే అవకాశం కలిగి, పుస్తకం మొదలయ్యేసరికి, పేరు ప్రఖ్యాతలు గాంచిన ఓ గీషాగా తన కథ చెప్పుకొస్తుంది. అయినా, చిన్నప్పుడు గీషా ఇంటి నుండి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాల గురించి చదువుతుంటే మాత్రం “ఈ అమ్మాయ్ తప్పించుకోవాలి.. తప్పకుండా తప్పించుకోవాలి” అనుకుంటూ వేలి గోర్లు కొరికేసుకునేంతగా ఉద్విగ్నంగా సాగింది కథనం. గీషాలు అనుపమాన అందగత్తెలే కాదు, చమత్కారులు, మాటకారులు కూడా! ఆ విషయం ఈ పుస్తకం ప్రతీ వాక్యంలోనూ ప్రస్పుటం చేయగలిగాడు రచయిత. అందుకు అభినందించాల్సిందే!

నాకీ పుస్తకాన్ని ప్రెసెంట్ చేస్తూ నా స్నేహితులొకరు అన్న మాటలు: “ఈ పుస్తకాన్ని చదివాక, మనకా సంస్కృతి మీద, ఆ ఆచారం మీద, ఆ జీవిన విధానం మీద కోపం గానీ, అసహ్యం కానీ కలుగవు. అప్పుడప్పుడూ మదిలో ఏదో ముళ్ళు కెలుకుతూ ఉంటుంది. ఆ బాధా ఉంటుంది. అయినా కూడా  మనకి నెగటివ్ ఫీలింగ్స్ రావు” అన్నారు. అభం శుభం తెలీని అమాయక పసివాళ్ళను క్రూరాతి క్రూరంగా హింసించి, వాళ్ళ సంపాదన మీద జీవనాధారంగా మల్చుకునే ఆచారం ఎవరికి ఏవగింపు కలిగించదూ అనుకుంటూనే చదివాను. కానీ సాయూరి కథ చదువుతున్నప్పుడు ఆ కోపం ఎక్కడా కలగలేదు. కారణం?!

సాయూరి పాత్రను తీర్చిదిద్దిన వైనం. ఆమె తన జీవితంలో అనేక కష్టనష్టాలకు ఓర్చుకుంటుంది. కానీ ప్రతీ అనుభవం వల్ల తాను నేర్చుకునే పాఠాలు కాస్త విభిన్నంగా, అత్యధిక శాతం ఒక పాజిటవ్ ధింకింగ్ కనిపిస్తుంది. ఉదా: తన తొలిప్రేమను గురించిన ఆలోచనలు ఇలా సాగుతాయి.

“From this experience, I understood the danger of focusing only on what isn’t there. What if I came to the end of my life and realized that I’d spent every day watching for a man who would never come to me? What an unbearable sorrow it would be, to realize I’d never really tasted the things I’d eaten, or seen the places I’d been, because I’d thought of nothing but the Chairman even while my life was drifting away from me. And yet if I drew my thoughts back from him, what life would I have? I would be like a dancer who had practiced since childhood for a performance she would never give. (349)”

జ్ఞాపకాలని నెమరువేసుకునేటప్పుడు, తనకి అన్యాయం చేసినవారిని గురించి కూడా ఒక రకం డిటాచ్‍మెంట్ చూపిస్తూ మాట్లాడుతుంది. బురదలో పుట్టిన తామరపువ్వల్లే కనిపిస్తుంది ఆమె. ఆమె మాటల మత్తులో పడ్డ మనకి కోపం, అసహ్యం కలుగవు. కీలక పాత్రకు ఇంత బాలెన్సడ్ వాయిస్ ఇవ్వటం వల్లే ఈ నవల ఇంత సఫలం కాగలిందని నా నమ్మకం.

జపాను ఆచారవ్యవహారాలు తెల్సుకోడానికి ఈ రచనను ఆశ్రయించటం అంత తెలివిగల పని అనిపించుకోదేమో! అంతర్జాలంలో జపనీయులు ఈ పుస్తకం మీద విరుచుకుపడుతుండడం గమించాను. కానీ, ఒక చక్కని కాల్పనిక నవల చదివే అనుభూతి కావాలనుకుంటే ఈ రచన తప్పక చదవచ్చు. మురికిలో ఉన్నవాటిని కూడా అభినందించాలనిపిస్తుంది. మురికిలో పడ్డా కొన్ని తమ స్వంత మెరుపుని కోల్పోలేరనీ అనిపిస్తుంది.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..7 Comments


 1. […] Jan Ada – Ruswa: ఏదో బజ్‍లో మెమొరీస్ ఆఫ్ గీషా పుస్తకంపై చర్చ మొదలై అది మెల్లిగా […]


 2. KumarN

  నా దగ్గిర పైన మెన్షన్ చేసిన PBS, Arthur Golden Interview వీడియో ఉంది. With one of my all time favorites Charlie Rose. ఆ ఎపిసోడ్లో Charlie ముగ్గురు, నలుగురిని ఇంటర్వ్యూ చేసాడు, అందులో గోల్డెన్ తో ఉన్నది ఇరవై నిమిషాలు. మొత్తం ఫైల్ 1gb. నాకెప్పుడైనా టైమ్ దొరికినప్పుడు నా దగ్గిర ఎక్కడో పడి ఉన్న వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తో, ఓన్లీ “గోల్డెన్” ఉన్న పోర్షన్ కట్ చేసి పంపడానికి ప్రయత్నిస్తాను.

  పోతే ఆయనతో various interview transcripts, google లో చాలా ఉన్నాయి, including cnn transcript.


 3. పద్మవల్లి

  Memoirs of a Geisha (ముందుగా నవల గురించి)
  ఎందుకు చదవాలనిపించిందో గుర్తు లేదు కానీ, ఎప్పుడో దాదాపు రెండేళ్ళ క్రితం మొదటి సారి ఈ నవల లైబ్రరీ నుంచి చదువుదామని తెచ్చాను. 2009 సమ్మర్ లో అనుకుంటాను, ఒక్కో వైపు మొత్తం 4 గంటలు పట్టే ప్రయాణంలో మొదలుపెట్టి , మొత్తం 500 పేజీలున్న దాన్ని వదలకుండా చదివేసాను. ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం సెవెంత్ సీక్రెట్ తరువాత, ౩ ఏళ్ళ క్రితం చదివిన namesake , తరువాత ఇది మాత్రమే అంత వదలకుండా, వేరే ఏమి తోచనివ్వకుండా నన్ను చదివేలా చేసినది. ఇది ఒక మామూలు జాలరి కుటుంబలో పుట్టిన అమ్మాయి (షియో అసలు పేరు, సయూరి గేషాగ మారిన తరువాత పేరు) , జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఏ దారి దిక్కు లేకుండా కొట్టుకు పోతూ, అనుకోకుండా దొరికిన ఒక్క ఆలంబనతో తన గమ్యం చేరుకున్న కథ.

  అసలు ఆర్దర్ గోల్డెన్ సయూరిని న్యూయార్క్లో కలిసి మాట్లాడి, తన జీవిత కథని రాయటానికి ఒప్పించి, ఎన్నో సాయంత్రాలు తను చెప్తుంటే రికార్డు చేసి (అనువాదకుడి సహాయంతో) రాసారు. సయూరి పెట్టిన కండిషన్, తను మరియు తన జీవితంలో ముఖ్య పాత్ర ఉన్న వాళ్లంతా బ్రతికి ఉన్నంత వరకు ఈ పుస్తకం బయటకి రాకూడదని. అయితే మిగతా అందరూ, తన కన్నా ముందే పోయారు అని రాసారు.

  చదువుతున్నంత సేపు నేను కూడా సయూరితో మమేకమై, సమాంతరంగా జీవించాను. సయూరి జీవితం ఎన్నో రాగద్వేషాలు, భావోద్వేగాలు, ఈర్ష్య అసుయాల సమాహారం. సయూరిని ఎవరూ ఇష్టపడకుండా ఉండలేరు అని నా ప్రగాఢ నమ్మకం. తను కష్టాల్లో కొట్టుకుపోయినపుడు, ఆమె అసహాయత చూసి జాలి పడ్డాను. దొరికిన ఆధారాన్ని పట్టుకుని తీరం చేరడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గర్వ పడ్డాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ గమ్యానికి ఒక్కో అడుగూ దగ్గరవుతుంటే ఆనందంతో పొంగిపోయాను. మట్టిలో మాణిక్యం లాంటి ఆమె తెలివి, ఎంచుకున్న దారిలో నెగ్గడానికి చూపిన నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాను. చివరికి తన జీవిత గమ్యమైన వ్యక్తిని చేరినపుడు కొంచెం అసూయ పడ్డాను కూడా. ఇంతకన్నా ఏం కావాలి తను నన్ను యెంత ప్రభావితం చేసిందో తెలుసుకోవటానికి? ఈరోజుకీ సయూరి నా ఆలోచనల్లో చాలా సజీవంగా ఉంది. నిజానికి నేను సయూరితో అడుగడుగునా ప్రేమలో పడిపోయాను. ఎన్నాళ్లయినా గుర్తుకొచ్చినప్పుడల్లా సయూరి ఒక అందమైన జ్ఞాపకంలా మనసును తట్టి పలకరించి పోతుంది.

  చివరగా తను పొందాలనుకున్న వ్యక్తిని కలిసినపుడు “Every step I have taken, right from my childhood, is in the hope of bringing me closer to you , can’t you see that ” అంటుంది ఎంతో అమాయకంగా. ఐ జస్ట్ లవ్ దట్.
  ** ఈ నవలతో గేష సంప్రదాయం గురించి వివరాలు బాగానే తెలుస్తాయి, కాని అదే మొత్తం సంస్కృతీ అని కానీ, ఇందులో చూపించిందే నిజం అని కానీ అనుకోవటం లేదు.

  నవల చదివేసి అది అంత నచ్చేసిన తర్వాత, సినిమాగా వచ్చిందని తెలిసి, అసలు అన్ని క్లిష్టమయిన ఎమోషన్స్ కి ( తెలుగుపదం ప్లీజ్) ఎలా న్యాయం చేసారో చూడాలని అనిపించింది. కానీ ఎప్పుడూ మంచి పుస్తకాలు సినిమాగా తీసినపుడు నిరాశ పరచడమే గుర్తొచ్చి రెండేళ్ళ నుంచి వాయిదావేస్తూ వచ్చాను. చివరికి క్రిందటి వారం నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆగలేక తెప్పించుకున్నాము. ఈ సినిమా Art Direction , Cinematography, Costume Design లో మూడు ఆస్కార్లు వచ్చాయి. మరెన్నో అవార్డ్స్ కి నామినేట్ కాబడి, చాలా గెలుచుకుంది కూడా. అయినా కూడా చాలా తక్కువ అంచనాలతో చూడ్డం మొదలు పెట్టాను. తనకైతే చాలా నచ్చేసింది. అందులోను తను నవల చదవలేదు కాబట్టి నాలాంటి బయాస్డ్ అభిప్రాయాలు లేవుకూడా. మొత్తం చూస్తున్నంత సేపూ ఆ ఎమోషన్స్ స్క్రీన్ మీద పట్టిన విధానానికి ఆశ్చర్యంతో కూడిన నిట్టూర్పులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నాకు నవలలో చాలా ఇష్టమయిన రెండు సీన్లలో యెంత సఫలమయ్యారో చూడాలని అనుకున్నాను. మొత్తానికి నన్ను నిరాశ పరచలేదు. కాకపొతే సినిమా వొక్కటే చూసినట్టయితే మాత్రం ఇంతగా మనసు మీద ముద్ర వేసుకోదు అనేది మాత్రం నిజం. ఒక మంచి సినిమా చూసిన అనుభవం మాత్రమే మిగులుతుంది అంతే. సినిమా చూడని వాళ్ళకి, నవల చదవని వాళ్ళకి నా సలహా, ముందు నవల చదివిన తర్వాతే సినిమా చూడండి.

  మొత్తం మీద నటీనటులలో నాకు నచ్చిన వారు మొదటగా Hutsumomo గా చేసిన “Li Gong “. జస్ట్ WOW అంతే. తర్వాత “Ziyi Zhang” ది గ్రేట్ సయూరి. షియో (చిన్న సయూరి) గా చేసిన “Suzuka Ohgo ” మాత్రం చాలా ముద్దుగా, అమాయకంగా, ముత్యంలా ఉంది. చైర్మన్ గా చేసిన “Ken Watanabe ” కూడా చాలా ప్లెజంట్ గా ఉన్నాడు (నేను ఊహించుకున్న దాని కన్నా) :-))


 4. నేనీ సినిమా చూశాను. నవల చదవలేదు. బావుంది, బాలేదు అని ఏదీ చెప్పలేము. ఫోటొగ్రఫీ అద్భుతం.

  కాపోతే ఇలాంటివి చదివి “కల్చరు” ను తెలుసుకోవడం అంత మంచిపద్ధతి కాదు, మీరన్నట్లు.


 5. madhavi

  chala rojulu tharuvatha nenu oka telugu lo chadavatum… baaga vivarincharu..


 6. పూర్ణిమ,

  ఈ పుస్తకం మీద మీ సమీక్ష బావుంది.

  నేను ఈ పుస్తకం మీద అని కాకుండా మొత్తం గీషా సంస్కృతి గురించి నేను ఎప్పటికైనా ఒక సుదీర్ఘ వ్యాసం రాయాలనుకున్నాను. ముందు మీరు మొదలుపెట్టినందుకు థాంక్స్. నాకు రాయటానికి కొంత సమాచారాన్ని మిగిల్చినందుకు థాంక్స్ 🙂

  కాకపోతే ఒకటి రెండు విషయాలు…ఇది కేవలం కాల్పనిక రచనా మాత్రమే కాదు. గీషాలు సామాన్యం గా ఎవరితోనూ మాట్లాడరు.వారి ఇళ్ళల్లోకి వెళ్ళటానికి ఎవరికీ అనుమతి వుండదు. అలాంటిది మొదటి సారి ఒక గీషా ఇంట్లోకి వెళ్ళి అనేక వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకున్న మొదటి అమెరికన్ గోల్డెన్ అంటారు. ఆ కారణం గా గోల్డెన్ కృషి ని అమెరికన్ ను ఆకాశానికి ఎత్తేస్తే, ఇంటర్వ్యూ విషయాలు బయటకి చెప్పి మోసం చేశారని జపనీసులుగొడవ చేశారు. గోల్డెన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన గీషా ఇంకో పుస్తకం రాశారు కూడా.

  PBS వాళ్ళు గోల్డెన్ తో చేసిన ఇంటర్వ్యూ ఎక్కడైనా దొరికితే మీకు లింక్ ఇస్తాను వెతికి.


 7. పూర్ణిమా, ఈ పుస్తకంగురించి విన్నాను కానీ మీరు చాలా బాగా వివిరంచారు. – మురికిలో పడ్డా కొన్ని తమ స్వంత మెరుపుని కోల్పోలేరనీ అనిపిస్తుంది – అన్నది గొప్పమాట. నాకు కూడా ఇలాటి దృక్పథం గల పుస్తకాలే ఎక్కువ నచ్చుతాయి, ఊరికే కిరాణా పధ్దులా కష్టాలు రాసుకుంటూ పోయేకథలకన్నా… మంచి సమీక్ష ఇచ్చినందుకు ధన్యవాదాలు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0