పుస్తకం
All about booksపుస్తకభాష

April 19, 2012

The Book I Won’t Be Writing and Other Essays – H Y Sharada Prasad.

More articles by »
Written by: Purnima
hysp

హెచ్.వై. శారదా ప్రసాద్ గారి గురించి నాకు మొదట తెల్సిన విషయం, ఆయన 1966-78, 1980-88 మధ్య భారత ప్రధానమంత్రులకు మీడియా అడ్వైజర్ అని. ఆసక్తి కలిగి ఆయన గురించి గూగుల్ చేస్తే, ఆయన ఒక కీలక పదవిని చేపట్టటం మాత్రమే కాదు, ఆయనలో మరెన్నో రంగాల్లో విశేష ప్రతిభ కలవారని తెలియడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. అన్నింటికన్నా ఎక్కువగా ఆయనలోని పుస్తక ప్రియత్వం నన్ను ఆకర్షించింది. మార్కెట్టులో లభ్యమవుతున్న వారి ఏకైక పుస్తకం కొని, చదివాను. ఆ విశేషాలే ఇక్కడ పంచుకుంటున్నాను.

కరచాలనం చేసి ఒక చిర్నవ్వు నవ్వి పక్కకు వచ్చేయటం లాంటిది గూగుల్‍ చేసి మనుషుల గురించి తెల్సుకోవటం. అదే వారి రచనలను చదివితే, ఒక intense conversation నెరిపిన అనుభూతి కలుగుతుంది. ఆ సంభాషణ రాజకీయాల నుండి, చరిత్ర వైపుకి మళ్ళి, బాల్యస్మృతులు నెమరవేసుకుంటూ, ఇష్టుల గురించి కబుర్లాడుకుంటూ కొనసాగితే అంతకన్నా భాగ్యమా?! ఈ పుస్తకం అలాంటి అనుభవాన్నే మిగిల్చింది నాకు.

ముందుగా, పుస్తక శీర్షిక అయిన వ్యాసంతో మొదలవుతుంది పుస్తకం. వీరు ఇందిరా గాంధితో చాన్నాళ్ళ పాటు పనిజేశారు కాబట్టి, ఆమెను దగ్గరగా చూసే అవకాశం కలిగింది కాబట్టి, వీరు రిటైర్ అవ్వగానే అంతా “మీరో పుస్తకం రాస్తున్నారు కదూ?” అంటూ వెంటబడ్డారు. రాయటం లేదని చెప్తే దాపరికమనుకున్నారు గానీ, నిజమని నమ్మలేదు. వీరు తప్పక రాస్తారని అందరూ అనుకున్న ఆ పుస్తకం ఎందుకు రాయదల్చలేదో చెప్పే ప్రయత్నం చేశారు ఈ వ్యాసంలో. ఏ బయోగ్రాఫర్‍ ఇందిరా గాంధి అంతటి ముడిసరుకు దొరికితే, అంతకన్నానా? కానీ ఆవిడ విశిష్ట వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా చూసిన కొందరిలో ఒకరిగా, అంతటి మనిషికి పూర్తి న్యాయం చేస్తూ రచన చేయలేని అసమర్థత తనది అని చెప్పుకొచ్చారు. ఇక్కడే లింకన్‍ ఉదాహరిస్తూ, ఆయనపై వందలకొద్దీ బయోగ్రఫీలు వచ్చినా, Carl Sandburg వచ్చేంత వరకూ లింకన్‍ సరితూగల జీవితచరిత్ర రాలేదని అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాసంలోనే కాకుండా, మొత్తం పుస్తకంలోని అన్ని వ్యాసాలలోనూ ఆయన సూటిగా, నిక్కచ్చిగా మాట్లాడే టోన్ వినిపించింది నాకు. ఉదాహరణ, తాను పుస్తకం రాయకపోవటాన్ని ఆయన ఇలా సమర్థించుకున్నారు.

“Suppose you have no urge to project yourself or play the justifier of God’s ways to man and man’s way to other men. Suppose you have no relish for being dismissed as a toady, and certainly not as a traitor to those who feel: “If the bell rings, why must I run?” Suppose you feel that what you might know might not be the whole truth in the Roshomon-like ambivalence of events. Then you will come to the same conclusion as I have, and not write the book that friends expect. You will refrain from wanting to etch your name like a schoolboy on a small tree in the forest that is history. “

ఇది అయ్యాక, వ్యాసపరంపర మొదలవుతుంది. ఇవ్వన్నీ లేట్ నైన్టీస్ లో ఆయన పత్రికలకు రాసిన వ్యాసాలు. ఎక్కువగా మ్యూజింగ్స్, లేక ఏదైనా విషయంపై ఆయన వ్యాఖ్యానాలు. కొన్ని ఆయన ఉద్యోగానికి సంబంధించినవి, కొన్ని ఆయన ఇష్టవ్యాపకాలైన పుస్తకాలు, రచనావ్యాసంగం గురించి, కొన్ని గడచిన, ప్రస్తుత దేశరాజకీయ పరిస్థితుల గురించి, కొన్ని ఒక్కప్పటి భారతీయ జీవనం గురించి, మరికొన్ని ఆయన వీశేషంగా అభిమానించే కొందరి ప్రముఖుల గురించి.

వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆయన pro-Nehru-Gandhian dyansty స్టాండ్ గురించి. ఒకే కుటుంబానికి చెందిన నెహ్రూ-గాంధిలు ఎక్కువ కాలం దేశాన్ని పరిపాలించడంపై వెల్లువెత్తిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలా అనిపించాయి. నెహ్రూ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల వల్లే దేశం త్వరితగతిన అభివృద్ధి సాధించలేదన్న వాదనకు ఆయన అభిప్రాయం ఇలా కొనసాగింది.

“Contemporaries are not the best best judges of a politician’s work. Nor is posterity always right. Sometimes posterity provides the corrective to contemporaries’ neglect or misjudgements. Sometimes it gets carried away by new gusts of prejudice.”

పరిస్థితుల ప్రభావం వల్లనే కానీ, నెహ్రూ కుటుంబం ఎప్పుడూ పదవిని తమ చేతుల్లోనే పెట్టుకోడానికి ప్రయత్నించలేదని వారి వాదన. అలానే, ఇందిరా గాంధి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని మరో కోణం నుండి చూడచ్చునన్నారు. ఇందిరా గాంధిని తప్పుదోవ పట్టించారనీ, పైగా చిన్నపాముని కూడా పెద్దకట్టెతో చంపే ఆమె స్వభావరిత్యా ఎమర్జెన్సీ తటస్థించిందని అభిప్రాయపడ్డారు. “Was the Emergency unavoidable?” అన్న ఈ వ్యాసాన్ని ఇలా ముగించారు.

“One thing Indira Gandhi did achieve by the Emergency: she ensured that no future Prime Minister would be tempted to resort to it.”

“ఇందిరా గాంధి” అన్న ఈ విభాగంలో ఆయన ఆవిడ పనిజేసేతీరు, ఆవిడ రొటీన్, ఇష్టాయిష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఇందిర గీసిన డూడుల్స్ ను ఇందులో పొందుపరిచారు. గాంధి, ప్రసాద్ గార్లు ఇద్దరూ, తమ ఆఫీసు సంబంధించిన నోట్స్ ఎక్కడా పదిలపర్చుకోలేదట. అందుకని మరిన్ని ఆసక్తికర విషయాలను తెల్సుకునే అవకాశం లేకుండా పోయింది. ఇదే విభాగంలో, “Ali Baba in Anand Bhawan” అనే వ్యాసం, ప్రసాద్ గారు, ఇందిర కోరిక మేరకు ఆనంద్ భవన్ వెళ్ళి అక్కడి నుండి ఏవో డాక్యుమెంట్స్ పట్టుకొచ్చిన వైనం గురించిన వ్యాసం. ఆనంద్ భవన్ పుస్తక ప్రియులకు నిజంగా ఖజానానే అన్నట్టు రాసుకొచ్చారు. ముఖ్యంగా నెహ్రూ ప్రచురించిన పుస్తకాల మాన్యుస్ర్కిప్ట్లు, ఆయన ముద్రించని రచనలతో పాటు, మోతీలాల్ నెహ్రూ (జవహర్ లాల్ తండ్రిగారు) రాసిన ఒక పుస్తకం (Short History of my family) మాన్యుస్క్రిప్ట్ కూడా ఉన్నాయక్కడ, అప్పుడు.

రాజకీయాలకు దూరంగా ఉండే వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వృత్తిరిత్యా ఢిల్లీలో స్థిరపడినా, ప్రసాద్ గారు కర్ణాటకకు చెందినవారు. ప్రధానమంత్రి కార్యాలయంలో అడ్వైజర్‍గా వచ్చే ముందు ఆయన ప్రముఖ పత్రికకు ఎడిటర్‍ వ్యవహరించారు. సాతంత్ర్య సమరయోధులు. ఒక పుస్తకం చదివితే, పది పుస్తకాల చిరునామా చూపించే పుస్తకాల్లో ఇదోటి. ప్రతి వ్యాసంలోనూ ప్రసాద్ గారి పఠనాభిలాష కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఉటంకించే వ్యాఖ్యానాలకు అంతే లేదు.

ముఖ్యంగా “Some Authors and Artists” విభాగన ఆయన పరిచయం చేసిన కొందరు ప్రముఖుల గురించి ఈ పుస్తకం చదివే వరకూ నాకు తెలీనేలేదు. ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మిగారి గాత్రం వినకుండా తెల్లారదుగానీ, వారి శ్రీవారు, సదాశివన్ గురించి ప్రసాద్‍గారి మాటల్లో చదువుతుంటే కడుపు నిండిపోయింది. ఎనలేని పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నవారిని వారికొచ్చిన అవార్డులతోనో, లేక వారికున్న బిరుదులతోనో వారి పేర్లు ప్రస్తావిస్తాం గానీ, ఎంతటి ప్రతిభ ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా మానవసంబంధాలకు, మమతానురాగాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారిని చూస్తే కలిగే తృప్తి. అప్పుడు నమస్కరించాలనిపిస్తే అది వారి ప్రతిభకు కాదు, మనసుకు. సదాశివన్, సుబ్బలక్ష్మమ్మగార్ల అన్యోన్య దాంపత్యం గురించి మరింత తెల్సుకోవాలనే ఆరాటం కలిగించిన వ్యాసం ఇది.

ఇహ, రచయితల విషయాలకొస్తే కన్నడనాట ప్రసిద్ధిగాంచిన శివరామ కారంత్ గురించి ఈ పుస్తకం ద్వారానే తెల్సింది. కారంత్ గారి ఒకట్రెండు పుస్తకాలకు ప్రసాద్‍ అనువాదం చేశారు. అలానే, టెండూల్కర్ అంటే సచిన్ అనే అనుకునే ఈ రోజుల్లో (నేను అంటున్న మాట కాదు, ప్రసాద్ గారే వ్యాసం అలా మొదలెట్టారు) డి.జి.టెండూల్కర్ గురించి తెలియవచ్చింది. వీరు ఎంతో వ్యయప్రయాసలకోర్చి గాంధి గురించి ఎనిమిది వాల్యూమ్స్ రాశారట. ఆ తర్వాత “ఫ్రంటియర్ గాంధి” అభివర్ణింపబడే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ జీవిత చరిత్రనూ రాశారు. (ఈ రచన ఎక్కడ లభిస్తుందో తెల్సున్నవారు తెలియజేయగలరు.)

ఆపై కె.కె.హెబ్బర్‍ తోనూ పరిచయం జరిగింది. వీరు చాలా పేరుగడించిన పేంటర్. నిన్ననే ఆయన రాసిన పుస్తకం “An Artist’s Quest” చదివాను. చిత్రలేఖనాన్ని అర్థంచేసుకునే విషయం లేకపోయినా, ఆయన పేంటింగ్స్ చూస్తే మనసుకు ఏదో తాకినట్టు అనిపించింది. అలానే, భారతాన పేరుమోసిన ఫొటోగ్రాఫర్ రఘుబీర్ సింగ్ గురించి కూడా తెల్సింది. వీరి పుస్తకాలన్నీ మార్కెట్టులో లభ్యం. Santokhba Dudhat అనే ఎనభై ఏళ్ళ పడచు పరిచయం చదివి కళ్ళు తేలేశాను. ఈవిడ అరవైవ పడిలో మొదటి సారిగా బ్రష్ పట్టుకొని (అవును, ఆరూ-సున్నా!) అనతికాలంలో 1120 మీ. పొడవు, మీటరు వెడల్పు ఉన్న స్కోల్ మీద మహాభారతాన్ని చిత్రించారు! రామయణం, గాంధీ జీవిత చరిత్రను కూడా!

ఇహ, మనకు సుపరిచితమైన ఆర్కె నారాయణ్, ఆర్కె లక్ష్మణ్, ఎ.కె రామానుజన్ లు ప్రసాద్ గారికి మంచి స్నేహితులు అవటంతో, కేవలం వారి పనిని గురించే కాక, వారి మధ్య సఖ్యతను కూడా పరిచయం చేశారు.

ఆపై చెప్పుకోవాల్సింది, ప్రసాద్ గారి మ్యూజింగ్స్ గురించి. చిన్నప్పటి బొమ్మల కొలువు స్మృతుల నుండి, కౌన్ బనేగా కరోడ్‍పతిలో అడిగే ప్రశ్నల స్టాండర్డ్ వరకూ ఆయన ఎన్నో విషయాలను స్పృశించారు. ఎన్నో ఆలోచనలు పంచుకున్నారు. మరెన్నో ఆలోచనలు రేకెత్తించారు. విషయం ఏదైనా crisp and clear టోన్ తో తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆయన ఇంగ్లీషు కూడా చదువుకునేందుకు చాలా బాగుంది. అట్లాంటి వచనం ఇండియన్ రచయితల (నేను చదివిన కొందరిలో) నుండి నేను చదవలేదు.

కేవలం రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారే కాదు, ఒక నిండు వ్యక్తిత్వాన్ని పరిచయం చేసుకోవాలి, చేసుకొని బోలెడు విషయాలు తెల్సుకోవాలి (వాటితో అంగీకరించకపోయినా) అని అనుకుంటే, తప్పని సరిగా చదువుకోవాల్సిన పుస్తకం ఇది.

Memoirs are written by people who think that their life and work of great interest to others. But when we have a person who thinks he is not particularly interesting even to himself, what kind of memoirs could he write?

Well, he wrote something that I would treasure for a long, long time to come. 🙂

_____________________________________

The Book I Won’t Be Writing And Other Essays
Author: H Y Sharada Prasad
Publisher: DC Publishers
Price: INR 425

Buy BOOK I WON’T BE WRITING & OTHER ESSAYS,THE from Flipkart.comAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..4 Comments


  1. srisri

    ee పుస్తకం తెలుగు లో అనువదిస్తే చెప్పండి ప్లీజ్ ….రాగానే నా మెయిల కి పమించాగాలరని మనవి


  2. ee పుస్తకం తెలుగు లో అనువదిస్తే చెప్పండి ప్లీజ్ ….రాగానే నా మెయిల కి పమించాగాలరని మనవి  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
IMG_7389

ఆరు కాలాలూ, ఏడు లోకాలూ – 2016లో నేను చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్ *********** కిందటి ఏడు మా ఇల్లు – చాదస్తం బాబాయిలు, రెబెల్ ...
by అతిథి
22

 
 
viswanatha-aprabha

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
1

 
 
cheekatirojulu

రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ (ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట...
by అతిథి
1

 

 
booksread

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదహారూ …

వ్యాసకర్త: పద్మవల్లి ************* ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగ...
by అతిథి
0

 
 
booksread

2016 లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: Naagini Kandala ********************* ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలె...
by అతిథి
0

 
 
IMG_20170131_173605936

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0