2011 లో నా పుస్తక పఠనం

రాసిన వారు: బుడుగోయ్
***************
సంచయాలు, సంకలనాలు, నెమరువేసుకోవడాలు అంటే నాకెందుకో పడదు. కానీ పొద్దున లేస్తూనే నేను చూసే సైట్లలో పుస్తకం ఒకటి. సంవత్సరం పొడుగునా ఇన్ని రికమండేషన్లు పుస్తకం నుండి తీసుకుంటూ కనీసం ఒక ఆర్టికల్ కూడా రాయలేదని మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ కొంతకాలంగా వెంటాడుతుంది. ఒక స్నేహితుని దగ్గర ఎప్పుడూ సహాయాలు తీసుకొని మనం మాత్రం ఒక్కసారి కూడా చేయందించకపోవడం లాంటి గిల్ట్. ఈ బాకీ తీర్చడం కాస్త కష్టమే ఐనా ఒక చిన్న ప్రయత్నం చేద్దామని నా బద్ధకాన్ని పక్కన బెట్టి ఒకసారి నా ఫ్లిప్‌కార్టు, కినిగె, అమేజాను అకౌంట్లు తిరగేసి, నేను చదివిన పుస్తకాల జాబితా జమ చేస్తే అబ్బో రాశి బాగానే ఉందే అనిపించింది. వాసి పెద్దగా లేదన్న విషయమూ తెలిసింది. ఇక నవోదయలో కొని చదివి ఇచ్చేసిన పుస్తకాలు కొన్ని మిస్సయ్యి ఉండొచ్చు. అలాగే కొన్ని అధ్యాత్మిక పుస్తకాలు ఇందులో కలపలేదు. ఇక ఈ జాబితాకు ఒక వరసంటూ లేదు. ఆయా దేశ కాల పరిస్థితుల్లో నా మూడు బట్టి చదివినవి. ఇక * గుర్తున్న పుస్తకాలు కేవలం పుస్తకం.నెట్ ద్వారా నాకు పరిచయమైనవి.

ఇంగ్లీషు:

*1) Moonwalking with Einstein : the art and science of memory – Joshua Foer
చాలా ఆసక్తి కరమైన పుస్తకం. ఈ పాశ్చాత్యులు దేన్నైన పోటీగా మార్చేయగలరు.దేని గురించైనా ఆసక్తి కరంగా పుస్తకాలు రాయగలరు. పుస్తకం.నెట్ పరిచయానికంటే ఎక్కువగా చెప్పవలసింది లేదు. మంచి పుస్తకం. పిల్లలకు కొన్ని పాఠాలు చెప్పొచ్చేమో ఇలాంటి పుస్తకాల్లోంచి. మెమోరీ ప్రాబ్లంస్ ఉన్న పెద్దలకూ కొన్ని మంచి సూచనలున్నాయి.

2) The Accidental Billionaires: the founding of Facebook – Ben Mezrich:
సొషల్ నెట్‌వర్క్ చూశాక చదవాలనిపించింది. చాలా సార్లు పుస్తకం సినిమాకి మారిస్తే నిరాశ చెందుతాం. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోదు. (lord of the rings, namesake లాంటి కొన్ని మినహాయింపులున్నాయనుకోండి.) కాని ఈ విషయంలో మాత్రం సినిమానే పుస్తకానికన్న బాగుంది. kudos to screenplay writer and director.

3) Steve Jobs – biography:
స్టీవ్ పోయాక చదివాను. ఆయన అభిమానులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. టెక్నాలజీ ప్రియులకు మాత్రం రికమండ్ చేయను. ఇది ఒక బయోగ్రఫీ. రచయిత చాలా సమర్థవంతంగా రాశారు. నిడివి కాస్త తగ్గిస్తే బాగుండేది.

4) Open – Agassi’s biography:
కిండిల్ కొన్నాక లైబ్రరీలో దొరికింది. నిజంగా మంచి పుస్తకం. అగస్సీ అభిమానులు, టెన్నిస్ అభిమానులు తప్పకుండా చదివాలి. చదువుతుంటే కొన్ని సంప్రాస్ అగస్సి మ్యాచులు, సంప్రాస్ వర్సస్ బగ్దాటిస్ గుర్తు రావడం ఖాయం.

5) A Champions Mind – Sampras’ biography:
అగస్సి జీవిత చరిత్ర చదివాక సంప్రాస్ ని చదవకుండా ఉంటే ఎలా? అగస్సి పుస్తకం తన కోర్టు బిహేవియర్ లాగే కలర్‌ఫుల్ గా ఉంటే ఇది సంప్రాస్ లాగే చప్పగా మొనాటనస్ గా ఉంది. నేనైతే ఇంకొకరికి రికమండ్ చేయను.

6) The Help:
అమెరికాలో టాప్ సెల్లరు.అరవైల్లో జాత్యహంకార నేపథ్యంలో రాసిన ఒక నవల. గుడ్ రీడ్. ఇది చదివి సినిమా చూస్తే నిరాశ చెందడం ఖాయం.

7) The Apprentice : My Life in the Kitchen – Jacques Pepin:
సరదాగా ఎవరి రికమండేషనూ లేకుండా చదివింది. చదువుతుంటే అయ్యో నేను శాఖాహారినయ్యానే అనిపించింది 🙂 ఇది చదివిన తర్వాత చీజుల గురించి నా పరిజ్ఞానం పెరిగింది. సరదా పుస్తకం. కాస్త ఫ్రెంచ్ క్విసీను గురించి తెలిస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు.

8) Gang Leader for a Day : Sudhir Venkatesh ఇది ఫ్రీకనామిక్సులో పరిచయమైన ఒక ఇంటరెస్టింగ్ కారక్టర్ కథ. సుధీర్ వెంకటేశన్ ప్రస్తుతం కొలంబియాలో సొషియాలజీ ప్రొఫెసరు. చాలా ఆసక్తికరమైన పుస్తకం. మంచీ చెడూ పూర్వాపరాలు పాఠకులకే వదిలేస్తాను.

9) The secret of Nagas – మెలుహా మొదటి భాగం చదివిన తరువాత ఇది చదివాను. మొదటి భాగమే అంత సో సో గా ఉందనుకుంటే ఇది ఇంకా సో సో గా ఉంది.
(ఈ సిరీస్ రచయిత అమీష్ తో పుస్తకం.నెట్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు)

10) Chanakya’s Chant అపుడపుడూ ఇండియన్ ఫిక్షన్ వైపు తొంగి చూసే ధైర్యం చేస్తే నాగా లతో బాటు ఇలాంటి పుస్తకాలు కూడా కనిపించి ఫరవాలేదనిపిస్తాయి. నైస్ రీడ్.

11) A shot at history: Abhinav Bindras bio భారత జాతి చరిత్రలో ఒకే ఒక ఒలింపిక్ బంగారు పతక విజేత. నిజంగా ఎంత కఠోర పరిశ్రమ చేశాడో. మెచ్చుకోకుండా ఉండలేము. I will have more respect for every Olympian after reading this. పిల్లలు, టీనేజర్లతో చదివించాలీ పుస్తకాన్ని. క్రమశిక్షణ, పట్టుదల వంటి పదాలకు అభినవ్ ఒక నిర్వచనం లాంతి వాడు.

12) The Monk as a Man : Unknown side of vivekaananda ఎంతో ఆసక్తితో కొన్నా పూర్తి చేయలేకపోయాను.

13) Phantom series. చిన్నప్పుడు ఈనాడు ఆదివారాల్లో వచ్చేది. మా అన్నయ్య కొడుక్కి వీరోచిత గాథలు ఇష్టం. వాడికి పరిచయం చేద్దామని మళ్ళీ చదివాను. loved every bit of it all over. its available in flipkart.

14) Kafka on the shore – Haruki Murakami కొలీగ్ ఒకతను రికమండ్ చేస్తే చదివాను. మాడర్న్ రచయితల్లో గుర్తింపదగ్గ రచయిత. ఆరువందల పేజీల నవలను ఇంత ఆసక్తికరంగా రాయగలరా అనిపించింది. మాజిక్ రియలిజం, ఈడిపస్ కాంప్లెక్సు..అబ్బో heady mix

15) The Steve Jobs way స్టీవ్ బతికుండగా చదివిన పుస్తకం. బయో కంటే గూడా ఈ పుస్తకం ద్వారా స్టీవ్ పనితీరు గురించి నేర్చుకోవచ్చు. పుస్తకం పూర్తి చేసేసరికి స్టీవ్ నామాన్ని పదివేల సార్లు జపించడం ఖాయం.

16)* A journey down the melody lane: ఒక పాత్రికేయుడు, మన పాత హిందీ ప్లేబాక్ సింగర్ల గురించి రాసిన పుస్తకం. ఒకవేళ మీరు లత, కిషోర్, ఆశా ఫాన్స్ ఐతే చదవకపోవడమే మంచిది. వారి గురించి అనవసర నిజాలు తెలుసుకొని ఏవగింపు కలిగించుకొని సాధించేది ఏముంది.

17) The Millennium Trilogy ఇంత పాపులర్ సిరీస్ గురించి చెప్పేదేముంది. ఇలాంటి పుస్తకాలతో నాకు ఒకటే చిక్కు. చదివినంత సేపు కాస్త ఆసక్తితో చదివినా దాదాపు రెండు వేల పేజీలు చదివాక ఏం సాధించాను..ఉత్తినే టైం అంతా వేస్టు చేయడం మినహా అనిపిస్తుంది. i am not a big fan of fiction and thrillers.

18) Autobiography of a yogi.ఇది చదవడం రెండో సారి. ఒక గొప్ప పుస్తకం. సత్యాన్వేషణలో ఒక మనిషి చేసిన ప్రయాణం. కొన్నాళ్ళయ్యాక మరోసారి చదవగలనేమో.

19) Don’t Ask Any Old Bloke for Directions – P.G.Tenzing : 22ఏళ్ళ వయసులో కేరళలో IAS లో జాయిన ఒక సిక్కిం యువకుడు ఇరవైయేళ్ళ తర్వాత రాజీనామా చేసి, ఒక మోటర్ సైకిల్ కొనుక్కొని దేశమంతా తిరిగాడు. ఆ ట్రావెలాగ్ అనుభవాలే ఇవి. నా మనసులో ఎక్కడో దాగున్న ఇబ్న్ బటాట స్పిరిట్ కొని చదివింప జేసింది. పుస్తకం అంత నచ్చకపోయినా, పాపం చివర్లో ఆయన కాన్సరు వచ్చి, 46 ఏళ్ళకు పోయారని తెలిసి మనసు చివుక్కుమంది. నేను థండర్‌బర్డ్ కొనుక్కోవడానికి సవాలక్ష స్ఫూర్తి కలిగించిన విషయాల్లో ఈ పుస్తకం ఒకటి.

తెలుగు

1)* ఆ కుటుంబంతో ఒక రోజు (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
2)* శ్యాం యానా – పూర్తి చేయలేకపోయాను. (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
3)* వేలుపిళ్ళై – పొగడ్తలు చూసి చదివాను. సరైన పొగడ్తలే అనిపించాయి. (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ)
4) మిథునం – ఇది బహుశా ప్రతి సంవత్సరం చదువుతుంటానేమో (మిథునం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు))
5)* కృష్ణారెడ్డి గారి ఏనుగు – ఈ పుస్తకం గురించి ఇప్పటికే కొన్ని వ్యాఖ్యల్లో పుస్తకంలో రాశాను. కన్నడ కథా చరిత్రకు ఒక గవాక్షం. (ఈ పుస్తకం ముందుమాట ఇక్కడ చదవండి)
6)* మధుమురళి (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
7) నంబర్ వన్ పుడింగి -no comments. still love Naamini. (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
8 ) ముక్కోతి కొమ్మచ్చి – కాస్త నవ్వుతూ కాస్త ఏడుస్తూ చదువుకున్న పుస్తకం. ఈ పుస్తకం గురించి రాయాలని చాలా సార్లు ప్రయత్నించి విరమించాను. కొన్ని పుస్తకాలు, కొందరు రచయితలతో మనం మరీ ఇమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకుంటాం. మంచిది కాదని తెలిసీ. రమణ, బాపు, నామిని, ఇస్మాయిల్ నాకలాంటి వాళ్ళు. (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
9) నా జీవిత చరిత్ర – విన్నకోట వెంకటేశ్వరరావు (జంపాల గారి పరిచయం తో నూరు పాళ్ళు ఏకీ భవిస్తాను)
10) యాత్రాస్మృతి – మంచి పుస్తకం. (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
11)* నా రేడియో అనుభవాలు (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
12) పాలగుమ్మి విశ్వనాథం జీవిత చరిత్ర : పుస్తకం చదవకముందు ఈయనెవరో నాకు తెలీదు. షాపతను రికమండ్ చేస్తే కొన్నాను. పూర్తి చదివాక, నాకు గుర్తుండి పోయిన కొన్ని రేడియో పాటలు ఈయనే రాసి కంపోజ్ చేశారని తెలిసి సంతోషం కలిగింది. (ఉదా: నారాయణ నారాయణ అల్లా అల్లా పాట)
13) శబ్బాష్ రా శంకరా (i was underwhelmed) (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
14) జుగారి క్రాస్ – పూర్ణచంద్ర తేజస్వి – మంచి థ్రిల్లర్ నవల.
15) చిదంబర రహస్యం – పూర్ణచంద్ర తేజస్వి
16) పర్యావరణ కథలు – పూర్ణచంద్ర తేజస్వి – చదవవలసిన పుస్తకం.
17) చినరావూరులోని గయ్యాళులు – కన్నడ అనువాదాలు
(ఈ కన్నడ కథల/నవలల తెలుగు అనువాదాలు కినిగే.కాం లో ఇక్కడ చదవవచ్చు)
18) మాస్తి వెంకటేశ అయ్యంగారు కన్నడ కథలు : what a classic. i am glad i bought this and read it instead of putting somewhere in the bookshelf. మాస్తి కన్నడిగుల ఆస్తి అన్నారు. గొప్ప రచయిత.
19) నారాయణ రావు – అడవిబాపిరాజు : ఈ నవల చదవకముందు వేయిపడగలకు, ఈ నవలకు జరిగిన పోటీ గురించి చర్చ చదివాను. నాకైతే ఎప్పటికైనా వేయిపడగలు దీనికన్నా మంచి పుస్తకమనిపించింది. ఈ నారాయణ రావు శ్రీరాముని మించిన ఆదర్శపురుషుడు.
20)* విరాట్ – స్తెఫాన్ త్వైక్ అనువాదం (దీనిపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు – ఇక్కడ మరియు ఇక్కడ)
21) పరంజ్యోతి – మల్లాది
22)* తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు
23)* విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ (ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ)
24) నిద్రిత నగరం – చక్కని కవిత్వం. (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ)
25) తుమ్మపూడి : ఈ పుస్తకం గురించి మరెప్పుడైనా సవివరంగా రాయాలి.
26)* సురపురం, మెడోస్ టైలర్ ఆత్మకథ : ఈ పుస్తకాన్ని పరిచయం చేసినందుకు పుస్తకానికి, సమీక్షకులకు ధన్యవాదాలు.
27) రెండో పాత్ర – విన్నకోట గారి కవిత్వం గురించి చెప్పేదేముంది. మలయమారుతం లాంటి కవిత్వం. ఎలాంటి మూడ్ నైనా సాత్వికంగా మార్చేయగల శక్తి ఉంది ఈయన కవిత్వానికి. (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇవిగో)
28) అమ్మ ఒడిలోకి పయనం: ఆటొబయాగ్రఫీ ఆఫ్ అ యోగి లాంటి పుస్తకం. అది నచ్చితే ఇది తపక నచ్చుతుంది.
29) త్రిపుర కథలు : ఇది మరో క్లాసిక్. నాలుగో సారో ఐదో సారో చదవడం. కినిగె లో రీ-రిలీజ్ అని కొని చదివాను.

Flipkart.com

You Might Also Like

3 Comments

  1. Purnima

    Amazing!

    I wish I had read Abhinav’s autobio! I read only few pages of it and got hooked, but somehow didn’t go back to it, again. Glad you liked it.

    I’ve been postponing reading “Kafka on shore” for the fear of how it would project or use “the” Kafka in its narration. How much is it about the Kafka? Can you throw some light from that point of view?

    I seriously envy you for your appetite for Telugu books. Way to go!

    Ibn Battuta, eh? Bagal mein jhootaa, too?! 😛

    Yeah. I too recommend as many works as possible of Jarred Diamond. I read, “Why sex is fun?” last year and quite liked it. His other books are on my reading list, this year.

    Have a fun-filled, reading-full year ahead. Thanks for sharing about your books.

    1. budugoy

      kafka on the shore is not about “the kafka” so you can safely read it.
      murakami is a must read for any modern reader. After reading this, I got
      curious and googled more about him..it seems “the wind-up bird chronicle”
      is his best work. So, if you have to read one book of his, i would say read
      that one. Let me forewarn you..many of themes in his novels are pretty disturbing.
      added this diamond guy to my list. thx for recommendation and all the good work

  2. Krishna

    Thanks for sharing…thought of adding these in my 2012 reading list..Try Guns, Germs and Steel by Jared diamond..( bit dry, but interesting facts about evolution)

Leave a Reply