2021 – నా పుస్తక పఠనం

2021 – ఎలాగైనా మళ్ళీ రోజూ కాసేపు ఏదైనా చదవాలి, నెలకోసారన్నా పుస్తకం.నెట్లో రాయాలి – అనుకుంటూ మొదలుపెట్టాను. మొదటిది చాలావరకూ జరిగింది. రెండోది సగం ఏడాది జరిగింది. ఏం చదివాను? అన్నది పరిశీలిస్తే -ఎక్కువభాగం వివిధ దేశాల ఆదివాసీ రచయితలు ఆక్రమించారు. ఆపైన కోవిడ్-19 సంబంధిత రచనలు. తరువాత అంబేడ్కర్. ఈ విషయాలు సమీక్షించుకుంటూ రాస్తున్న వ్యాసం ఇది.  గతంలో నేను వివరంగా రాసి ఉన్న పక్షంలో ఆ లింక్ ఇస్తున్నాను. నేను చదివినవి ఇవీ:

  1. ఆదివాసీ రచనలు, లేదా వారి గురించినవి

ఆత్మకథలు, జీవిత చరిత్రలు

Permanent Astonishment: A memoir by Tomson Highway

ఈయన కెనడియన్ రచయిత. ఉత్తర కెనడాలో దాదాపు సంవత్సరం పొడుగుతా కురిసే మంచు మధ్య వేటకుక్కలతో తిరుగుతూ ఉండే సంచార తెగల జీవితం రచయిత తల్లిదండ్రులది. ఈయన చూస్తే ఎంతో ఘోర చరిత్ర ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివి, ఆ తరువాత నాటక రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. మొదటి అధ్యాయం అసలు మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. తరువాత్తరువాత ముందుకుసాగే కొద్దీ సాధారణంగా అనిపించింది. ఆ అధ్యాయం మట్టుకు ఎలాగైనా అనువాదం చేయాలనిపించింది. 

The life and times of Birsa Munda – Gopi Krishna Kunwar

బిర్సా ముండా గురించి  జీవిత చరిత్రకంటే అద్భుతరసానుభూతి కలిగించడానికి రాసినట్లుంది. నేను బాగా నిరాశపడ్డాను చదివి. 

The life and times of Jaipal Singh Munda – Santosh Kiro

జైపాల్ సింగ్ ముండా భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ హాకీ గోల్డ్ తెచ్చిన జట్టు కెప్టెన్. స్వాతంత్రానంతర రాజకీయాలలో కొంతకాలం ముఖ్య పాత్ర పోషించి, తరువాత జార్ఖండ్ రాష్ట్ర సృష్టి కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఆదివాసీ నాయకుడు. ఈ జీవిత చరిత్ర ఈయన హిందీలో అనుకుంటా…రాసుకున్న ఆత్మకథ ఆధారంగా, ఇతర గ్రంథాల ఆధారంగా రాశారు. మరీ అద్భుతమైన పుస్తకం అనలేను కానీ, బాగుంది. 

వ్యాసాలు, చరిత్ర వగైరా

Adivasidom: Selected Writings and Speeches of Jaipal Singh Munda

జైపాల్ సింగ్ ముండా గురించి తెలిసాక ఏమిటీయన కృషి అన్న కుతూహలం కొద్దీ చదివిన పుస్తకం. 1930ల నుండీ ఆదివాసీ మహాసభ పేరిట జరిగిన సభల్లో, ఆకాలం నాటి రాజకీయ నాయకులతో చర్చల మధ్య నుంచి జైపాల్ సింగ్ ఆలోచనలు ఇందులో ఏరి కూర్చారు. కొన్ని బాగున్నాయి కానీ చాలామటుకు నాకు అప్పటి రాజకీయాలు తెలియక అసలు ఈ ఆలోచనలకి నేపథ్యం ఏమిటన్నది అర్థం కాలేదు. 

Indigenous Toronto: Stories that Carry this Place

వివిధ కెనడియన్ ఆదివాసీ ప్రముఖులు, మేధావులు, రచయితలు – టొరొంటో ప్రాంతాలలో పనిచేస్తున్న వారు -అంతా కలిసి రాసిన అనుభవాల సంకలనం. కొన్ని వ్యాసాలు చాలా నచ్చాయి. అలా నచ్చిన ఒక వ్యాసాన్ని నేను తెలుగులోకి అనువదించాను. అది సారంగ వెబ్ పత్రికలో ఇక్కడ చదవవచ్చు. 

My conversations with Canadians by Lee Maracle

వ్యాసాలు. రచయిత్రి కలం బాగా సూటి అయినది, పదునైనది కూడా. వ్యాసాలు కొన్ని చోట్ల మరీ గుచ్చుకునేలా ఉన్నా కూడా అలాంటిదొకటి అందరికీ పడాలి అనిపించాయి నాకు. ఈ పుస్తకంలోంచి కొన్ని పిట్ట కథలని నా బ్లాగులో ఇక్కడ పంచుకున్నాను. 

The Inconvenient Indian by Thomas King

కె.బాలగోపాల్ మూడు వ్యాస సంకలనాలు: ఆదివాసులు – చట్టాలు, అభివృద్ధి; ఆదివాసులు – వైద్యం, సంస్కృతి, అణిచివేత; ఆదివాసులు-ఛత్తీస్ గఢ్ , కంధమాల్ పై వ్యాసాలు, నివేదికలు

– ఈ నాల్గు పుస్తకాల గురించి (మరోదాని గురించీ) గతంలో పుస్తకం.నెట్లో ఇక్కడ పరిచయం చేశాను. 

కథలు, కవితలు, నవలలు వగైరా

77 Fragments of a familiar ruin: poetry by Thomas King

A really good brown girl: poetry by Marilyn Dumont

-కొన్ని భలే చురుగ్గా తగిలేలా ఉన్నాయి. చాలా చిన్నవి కూడా ఉన్నాయి కొన్ని – కానీ ప్రభావవంతమైనవి. మొదటిది కొత్త పుస్తకం. రెండవది కొంచెం పాతదే కానీ కెనడియన్ ఆదివాసీ సాహిత్యంలో ప్రభావవంతమైన రచనగా పరిగణిస్తారు. కవయిత్రి ఆదివాసీగా కెనడాలో ఎదుర్కున్న జీవితం గురించి రాసిన కవిత్వం.

A short history of Indians in Canada: short stories by Thomas King

  • సగానికి పైగా కథలు నచ్చాయి నాకిందులో. పాత పుస్తకం. ఈ రచయిత వ్యంగ్యం, హాస్యం నాకు నచ్చింది. 

Glass Beads – short stories by Dawn Dumont

Sabrina and Corina – short stories by Kali Fajardo-Anstine

  • మొదటిది కెనడియన్ ఆదివాసీ రచయిత, రెండవది అమెరికాన్ రచయిత్రి. రెండూ నన్నంతగా ఆకట్టుకోలేదు. అసలు ఒక పాత్రకి కూడా కొంచెం కూడా రిలేట్ అవలేకపోయాను సరికదా… ఆ పాత్రలు ఏ భావోద్వేగాన్నీ కలిగించలేదు నాలో. 

Adivasi will not dance  -short stories by Hansda Sowendra Shekhar 

ఇందులోని రెండు కథలు నేను గత ఏడాది సంచిక వెబ్ పత్రిక కోసం తెలుగులోకి అనువాదం చేశాను. అవి – “ఆదివాసీలు నర్తించరు“, “వాళ్ళు మాంసం తింటారు” – ఇక్కడ చదవవచ్చు)

The mysterious ailment of Rupi Baskey -novel by Hansda Sowendra Shekhar

  • సంతాలీ జాతి వారి కుటుంబాల చుట్టూ, వారిలో ప్రబలి ఉన్న బ్లాక్ మాజిక్ చుట్టూ అల్లిన నవల. ఆపకుండా చదివించింది కానీ అర్థాంతరంగా ముగిసిపోయింది అనిపించింది.

శిలకోల – మల్లిపురం జగదీశ్ కథలు

బహుశా తెలుగు ప్రాంతాలకి చెందిన ఒక ఆదివాసీ రచయిత రాయగా నేను చదివిన మొదటి సంకలనం ఇదే కావొచ్చు. కొన్ని కథలు బాగున్నాయి. అన్ని కథలూ ఆదివాసుల జీవిత వాస్తవాలని ప్రతిబింబించేవే. తప్పకుండా చదవవలసిన సంకలనం.

2. మహమ్మారులు, టీకాలు, చరిత్ర

The Great Influenza: the story of the deadliest pandemic in history by John Barry

బాగా పరిశోధన చేసి రాశారు. ఈ పుస్తకం గురించి నేను వివరంగా రాసిన పరిచయం ఇక్కడ.

Shitala: How India Enabled Vaccination by Mitra Desai

The Great Inoculator: The Untold Story of Daniel Sutton and his Medical Revolution by Gavin Weightman

Vaccine Hesitancy: Public Trust, Expertise, and the War on Science –  Maya J. Goldenberg

On Immunity: An Inoculation –  Eula Bliss

Anti-vaxxers: How to Challenge a Misinformed Movement – Jonathan M. Berman

టీకాలు, వాటిపై వ్యతిరేకత – వీటి గురించిన చరిత్ర ని చెప్పే పుస్తకాలు. వీటి గురించి పుస్తకం.నెట్ లో పరిచయం చేశాను.

Wuhan Diary: Dispatches from a quarantined city- Fang Fang (translated from Chinese to English by Michel Berry)

Be Kind, Be Calm, Be Safe: Four Weeks That Shaped a Pandemic by Bonnie Henry and Lynn Henry

Virus: Vaccinations, the CDC, and the Hijacking of America’s Response to the Pandemic – Nina Burleigh

చరిత్రని అటుపెట్టి, కోవిడ్-19 గురించి ప్రత్యేకం మూడు పుస్తకాలు చదివాను. ఒకటి లాక్డవున్ లో ఉన్నప్పటి అనుభవాలని లైవ్ బ్లాగ్ పద్ధతిలో రాసిన జర్నలిస్టు పుస్తకం, ఒకటి యూఎస్ ప్రభుత్వం ఈ మహమ్మారికి స్పందించిన విధానం మీద విమర్శలాగా రాసిన పాత్రికేయ పరిశోధన, మూడవది ఒక ప్రజారోగ్య అధికారి తమ శాఖ వారు ఒక ప్రాంతంలో (కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రం) కోవిడ్ తొలి నాళ్ళని ఎలా ఎదుర్కున్నారు? అన్నది. మూడూ మూడు భిన్న కోణాలని పరిచయం చేశాయి. వూహాన్ డైరీ ని భారతదేశలో కోవిడ్ కరాళ నృత్యం సమయంలోనే చదవడం వల్ల కొంచెం గగుర్పాటు కలిగింది నాకు పోలికల వల్ల! ముఖ్యంగా మొదటి రెండు పుస్తకాల గురించి అసలు వివరంగా పరిచయం చెయాలనుకున్నాను, వీలు చిక్కలేదు.  

కొమురం భీము నవల -సాహు, అల్లం రాజయ్

3. అంబేడ్కర్ ప్రపంచం:

సమకాలీన సమాజంలో అంబేడ్కర్ ప్రభావం గురించి, ఆయన ఆశయాలను అనుసరిస్తూ పనిచేసిన వారి గురించి:

What Babasaheb Ambedkar means to me

We Also Made History: Women in the Ambedkarite Movement

ఇక అంబేడ్కర్ రచనలు:

Castes in India – Their mechanism, genesis, and development

Dr. Babasaheb Ambedkar writings & speeches, Volume 1-3

Annihiliation of Caste

ఈ ఏటికి ఈయనే నా మీద అత్యంత ప్రభావం చూపిన మనిషి. మొత్తం సమగ్ర సాహిత్యం 17 భాగాలు. మిగితా భాగాల్లో కూడా మధ్య మధ్య ఏదో ఒకటి తీసి చదువుతూనే ఉన్నా ఏడాది పొడుగుతా. వీటిల్లో కొన్నింటి గురించి గతంలో పుస్తకం.నెట్ లో రాశాను.

4. బొజ్జా తారకం రచనలు

చరిత్ర మార్చిన మనిషి: బొజ్జా అప్పలస్వామి జీవిత చరిత్ర

వ్యాసాలు: నలుపు సంపాదకీయాలు

అంటరానితనం ఇంకానా?

పోలీసులు అరెస్టు చేస్తే

కులం-వర్గం

ఇది రిజర్వేషన్ల దేశం

పంచతంత్రం (నవల)

-ఈ పుస్తకాల గురించి ఒక పరిచయం గతంలో రాశాను

5 ఇతరాలు

ఆత్మకథలు, జీవిత చరిత్రలు, స్వీయ అనుభవాలు వగైరా

అసమాన అనసూయ – వింజమూరి అనసూయ – బాగుంది పుస్తకం.ఆపకుండా చదివించింది.వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణ. కినిగె లో దొరుకుతుంది

On the outside, Looking Indian: How my second childhood changed my life by Rupinder Gill – కెనడాలో పంజాబీ ఇమ్మిగ్రంట్ తల్లిదండ్రుల తో పెరగడం గురించి అనుభవాలు. అక్కడక్కడా ఆసక్తికరంగా ఉంది. అక్కడక్కడా బాగా నవ్వొచ్చింది. కాలక్షేపానికి చదవొచ్చు.

Sanghi who never went to a Sakha by Rahul Roushan – అక్కడక్కడా ఆలోచింపజేసింది. మొదటంతా ఏదో కొత్త విషయం అని ఆసక్తిగా చదివినా, చివరికొచ్చేసరికి అదే విషయం మళ్ళీమళ్ళీ చెబుతూ పోవడంతో బోరు కొట్టింది.

A long way home by Saroo Brierly -ఈ పుస్తకం నన్ను విపరీతంగా కదిలించి కళ్ళనీళ్ళు కూడా పెట్టించేసింది. నా పరిచయం ఇక్కడ.

Notes on Grief by Chimamanda Ngozi Adichie -తండ్రి పోయాక ఆయన్ని తల్చుకుంటూ రాసిన చిన్న పుస్తకం. 

Extraordinary Canadians: Stories from the Heart of Our Nation by Peter Mansbridge – సెలబ్రిటీలు కాకుండా మామూలు మనుషుల మధ్య నుండి కొందరు స్ఫూర్తివంతమైన కెనడియన్ ల జీవిత చిత్రణలు…వారి మాటల్లోనే. అన్నీ కాకపోయినా కొన్ని నాకు చాలా నచ్చాయి.

Pyongyang – a Journey in North Korea by Guy Delisle – యానిమేషన్ కళాకారుడు, కార్టూనిస్టు అయిన రచయిత ఆఫీసు పనిమీద వెళ్ళిన ఉత్తర కొరియా పర్యటన గురించి రాసిన/గీసిన గ్రాఫిక్ అనుభవాలు. ఆసక్తికరంగా ఉన్నాయి కానీ అంత విపరీతంగా ఆకట్టుకోలేదు.

కథలు, నవలలు, కవితలు వగైరా

Toddler Hunting and Other Stories by Kono Taeko -ఈ జపనీస్ రచయిత్రి గురించి చాలా విని చదివాను. కథలు కొత్తగా ఉన్నాయి. అందులోని పాత్రలు కొత్తగా ఉన్నాయి. కానీ నాకంత నచ్చలేదు. 

Goodbones and Simple Murders – Margaret Atwood -ఒకే మాట: అద్భుతః

Dearly – poems by Margaret Atwood

Made in China – Parinda Joshi (Novel)

వ్యాసాలు, చరిత్ర

Being Mortal: Medicine and What Matters in the End by Atul Gawande – వృద్ధుల మెడికల్ కేర్ గురించి రచయిత ఆలోచనలు, అనుభవాలు. మంచి అనుభవజ్ఞుడి రచన కనుక ఆలోచింపజేసేది గా ఉంది.

101 Letters to a Prime Minister: The Complete Letters to Stephen Harper by Yann Martel – ఒక ప్రముఖ రచయిత ఒక దేశ ప్రధానికి 101 పుస్తకాలు పంపి (వారానికోటి చొప్పున) అన్నింటికీ అందమైన పరిచయాలు రాశాడు. వాటి సంకలనం ఈ పుస్తకం. కొన్ని పరిచయాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాల గురించి పద్మవల్లి గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ.

ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు – జంగం చిన్నయ్య – ఆంగ్లంలో హిస్టరీ ప్రొఫెసర్ అయిన రచయిత రాసిన పుస్తకానికి సజయ గారి తెలుగు అనువాదం. 

Love and Capital by Mary Gabriel – ఇదింకా మధ్యలోనే ఉన్నాను. బాగా ఆసక్తికరంగా మొదలైనా చారిత్రక వివరాలెక్కువై … పని ఒత్తిడి మధ్య పక్కకి పెట్టాను ప్రస్తుతానికి. కార్ల్ మార్క్స్ వ్యక్తిగత జీవితం, ఆనాటి సామాజిక జీవితం గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. 

సాంకేతికం

Life in Code: A Personal History of Technology by Ellen Ullman

Close to the machine: Technophilia and its discontents

తొలితరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రచయిత్రి అప్పటి అనుభవాలు, పరిశీలనలు. నాకు కొన్ని వ్యాసాలు బాగా నచ్చాయి. కొన్ని అనవసరమైన క్లిష్టత ని జోడించినట్లు అనిపించాయి.

Data and Goliath The Hidden Battles to Collect Your Data and Control Your World by Bruce Scheier 

In the beginning, was the command line by Neal Stephenson

ఇక ఇంకా పూర్తిచేయకపోయినా ఈ ఏడు నన్ను బాగా ఆకట్టుకున్నవి:

ఢావ్లో – రమేశ్ కార్తిక్ నాయక్ కథలు

బతుకీత – ఎండపల్లి భారతి కథలు

చివరగా: కిరణ్ ప్రభ గారు తెలుగు/ఆంగ్ల సాహితీవేత్తల మీద చేసిన పాడ్ కాస్టులు. విశ్వనాథ, చలం, మార్క్స్, శ్రీశ్రీ, లార్డ్ బైరన్, తోరూ దత్, కీట్స్ -ఇలా కొన్ని పాడ్కాస్టులు విన్నాను. వీటిలో మొదటి మూడూ పెద్దవి..చెరో 20-25 ఎపిసోడ్లు. పుస్తకాలుగా రావాల్సినవి అసలు. ఈ ఏటికి ఇదే నాకు బెస్ట్ ఫైండ్. 

You Might Also Like

2 Comments

  1. S. Narayanaswamy

    బాగుంది. ముఖ్యంగా వివిధ ఆదివాసీ ప్రజల గురించిన రచనల వివరాలు.

Leave a Reply