నా పుస్తకాలు – 2021

వ్యాసకర్త: సునీత రత్నాకరం

**********

పుస్తకాల యేడాది ఇది నాకు, ముఖ్యంగా Dostoevsky….. Dostoevsky….. Dostoevsky. క్వాలిటీ సినిమాలు పది పదిహేను ఉన్నట్టున్నాయి, పోనీయచ్చు… అన్నీ కుదరవు. పుస్తకాలు చాలా చదివాను, కొన్ని విన్నాను. క్లాసిక్స్ చాలా వున్నాయి, అది అన్నిటికన్నా సంతోషం. ఎప్పటినుంచో పేర్లు విని మురిసిన పుస్తకాలు చదివేయడం గొప్ప సంతృప్తి. కొన్ని పుస్తకాలకి ఆర్కైవ్ నుంచి లింక్స్ ఇచ్చాను. ఇంకొన్ని వెతికి కలపొచ్చు కానీ, ఇక ఈ పోస్ట్ పూర్తి కాదు. పుస్తకం పేరుతో వెతకొచ్చు. కొన్నిటికి నా పోస్టుల లింక్స్ ఇచ్చాను, అసలు చూడాల్సిన పనిలేదు, ఇది నా రికార్డు కోసం. ఈసారి పోస్టులు ఎక్కువ రాయలేదు, ఆన్లైన్ సెమిస్టర్ డిమాండ్స్ ఎక్కువగా వున్నాయి, కాబట్టి కాస్త టైం దొరికినా నా కోసమే వాడుకున్నా మరి. క్లాసిక్స్ దాదాపు ఆర్కైవ్ లో దొరుకుతాయి, కనీసం గంట గంటకు అద్దెకు తీసుకునే పద్దతిలో. కిండిల్ సబ్స్క్రిప్షన్ తో కొన్ని వేల  క్లాసిక్స్ దొరికేస్తాయి. నాకూ చేతిలో పుస్తకమే ఇష్టం, కానీ ఈ-బుక్ సులువు అర్థమయ్యాక, ముఖ్యంగా ఇంట్లో బీరువాలు నింపుకున్నాక ఈ-బుక్ కి మళ్లక నాకు ఇంకో మార్గం తోచదు. ఆడియో ఇంకాస్త ఎక్స్ప్లోర్ చెయ్యాలి. తెలుగువీ కొన్ని ఎక్కువ మంచి పుస్తకాలే దొరికినట్టు సత్యవతి గారి కథలతో కలిపి. 

ఆలస్యంగా మొదలుపెట్టాక కాస్త వేగం తప్పదు కదా. కొందరు ఇవి పుస్తకాలలో భాగంగా చదివివుంటారు. ఇంకా చాలా బాకీ ఉన్నాయి కూడా. ఇంకొందరు నా తర్వాత చదవొచ్చు. అందుకు ముఖ్యంగా లిస్ట్ చేయడం. కనీసం ఇంకా రెండేళ్లు ఫిక్షన్ తోనే ఎక్కువగా వుంటా ….. అటు తర్వాత దైవాధీనం…. సంస్కృతం నేర్చుకోవాలి, ముందు తెలుగు సరేసరి.  కొన్ని పూర్తి చేయనివి ఉన్నాయి, నచ్చక వదిలేసినవి…. , ఓపిక ఎక్కువే నాకు, మరీ చిరాకు పెడితే తప్ప వదిలెయ్యను. కల్లూరి భాస్కరం గారి “మంత్రకవాటం తెరిస్తే ……” ఈ యేడాది మొదలుపెట్టి ఇంకా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పుస్తకం. అది పూర్తి కాకపోవడానికి కారణం వేరే. ఇంత అధ్యయనంతో రాసిన తెలుగు పుస్తకం నేను ఇప్పటి వరకు చదవలేదు. బోలెడు నోట్స్, రెఫెరెన్సులు ఉన్నాయి. “మహాభారత చరిత్రము”, “జనకథ” తెప్పించుకుని అవీ కలిపి తిరగేసి చదువుతున్నా, అందుకే నడుస్తూ వుంది . ఇది మాత్రం పెండింగ్ లో ఉన్న పుస్తకం వచ్చే యేడాదికి, దీనితో పాటు తలావ్జ్హఝల శివాజీ గారి “త్రిపథ”, “శ్రీపాద సాహితీ సర్వస్వం” నడుస్తూ వున్నాయి . మొదటి క్వార్టర్ లో అన్నా యివన్నీ పూర్తి చేయాలని గోల్. 

తెలుగు పుస్తకాలు తెప్పించి ఉంచినవి చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పటికి అవుతాయో… అవి అట్లాగే వుంటాయో తెలియదు. Anything can happen in 2022 🙂 ఇదే వరుసలో చదవలేదు. పోస్ట్ కోసం కొంత ఆర్గనైజ్ చేశా. ఇవీ చదివినవి.

తెలుగుతో మొదలెడదాం. 

సుప్త భుజంగాలు – చేబ్రోలు సుజాత గారి పుస్తకంతో మొదలెట్టా. చాలా మంచి బోణీ నా వరకూ:)  

మోహనస్వామి – వసుధేన్ద్ర

అవతలిగట్టు – అరవింద

నిర్మల – మున్షీ ప్రేమచంద్

మా అమ్మంటే నాకిష్టం – వసుధేన్ద్ర

మౌన భాష్యం – యద్దనపూడి సులోచనారాణి

జాహ్నవి – యద్దనపూడి సులోచనారాణి

అపూర్వ పురాణ కథలు – సౌదా (కొత్త గొంతుకలతో పురాణేతిహాసాలు పరికించిన  కథలు) 

సత్యవతి కథలు – పి. సత్యవతి

ఒక తల్లి – హజార్ చౌరాసిర్ మా – మహాశ్వేతాదేవి – సూరంపూడి సీతారాం

యారాడకొండ – ఉణుదుర్తి సుధాకర్

M S Subbalakshmi – the definitive biography – TJS George

మనోధర్మపరాగం – మధురాంతకం నరేంద్ర

సుస్వరాల లక్ష్మి సుబ్బలక్ష్మి – పల్లవి

(మూడు పుస్తకాల పరామర్శ )

నాలుగో ఎకరం – శ్రీ రమణ

చీకటిలో చందమామ – సత్యం మందపాటి

ఒక భార్గవి – డా. భార్గవి 

దూరాంతరం – బిభూతిభూషణ్ బందోపాధ్యాయ

ఉత్సవ సౌరభం – వాడ్రేవు వీరలక్ష్మీదేవి

పంచతంత్రం – బొజ్జా తారకం 

ఒక భార్గవి రెండు ప్రయాణాలు – డా. భార్గవి

సింహాచలం సంపెంగలు – శ్రీరమణ

చార్ దర్వీష్ కథలు – ఎర్రమిల్లి మల్లికార్జునుడు

కథలు – గాథలు – హువనెస్ తుమన్యాన్ – చిరంజీవినీ కుమారి

సౌశీల్య ద్రౌపది – కస్తూరి మురళీకృష్ణ

శ్వేత రాత్రులు – FYODOR DOSTOYEVSKY – నిడమర్తి ఉమారాజేశ్వరరావు

ఇనుప కచ్చడాలు – తాపీ ధర్మారావుధర్మారావు

బతుకీత కథలు – ఎండపల్లి భారతి

కొండకింద కొత్తూరు – మధురాంతకం నరేంద్ర 

తొమ్మిది దేశాల కథలు – ముక్తవరం పార్థసారథి

తూరుపు గాలులు కథలు – ఉణుదుర్తి సుధాకర్

జయమ్ – నాయుని కృష్ణమూర్తి

మెరుపుల మరకలు – త్రిపురనేని గోపీచంద్

తన్హాయి – కల్పన రెంటాల

కాలయంత్రం 2020 (హిస్టారికల్ ఫిక్షన్) – కూర్పు సాయి పాపినేని

రామేశ్వరం కాకులు – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 

గెట్ పబ్లిష్డ్ – మహమ్మద్ ఖదీర్బాబు

ఒక జీవితం కొన్ని కలలు – ఆకునూరి హసన్

వేకువపాట కథా సంపుటి – వారణాసి నాగలక్ష్మి

సమాంతరాలు – తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి

పాతిక పరభాషాచిత్రాలు – కిరణ్ ప్రభ

ఆహా!! – మూలా సుబ్రహ్మణ్యం

మిళింద – మానస ఎండ్లూరి

లెటర్స్ to లవ్ – కడలి సత్యనారాయణ

చింతకింది మల్లయ్య – పూడూరి రాజిరెడ్డి

పదహారు గడ్డిపోచలు – స్వాతి కుమారి

అయిదో గోడ – కల్పన రెంటాల

ఐదుకాళ్ల మనిషి – ఎ. ముత్తులింగం – అవినేని భాస్కర్

వేలుపిళ్ళై కథాసంపుటి – సి. రామచంద్రరావు

విశాలాక్షి దీపావళి బహుమతి కథలు – ఎడిటర్ ఈతకోట సుబ్బారావు

ఇంగ్లిష్ ప్రపంచ సాహిత్యం నుంచి & క్లాసిక్స్ 

Crime and Punishment – Fyodor Dostoevsky

One Hundred Years of Solitude – Gabriel García Márquez

The Mysterious Flame of Queen Loana – Umberto Eco (చంద్రలత గారు బహు చక్కని పరిచయం చేసారు ఇక్కడ, ఆవిడ చెప్పినట్టు వంద పుస్తకాల పెట్టు ఈ ఒక్క పుస్తకం, ఒక ఇరవై రోజులు బహుశా దీనితోనే ఉన్నా, ముందుకూ వెనక్కూ  ఇష్టమున్నవారు ఇక్కడ చదవొచ్చు కూడా గంట గంటకూ అద్దె పద్ధతిలో, నేను కిండిల్ unlimited లో చదివా బహుశా )

1984 – George Orwell

The Moon and Sixpence – W. Somerset Maugham

The Magician – W. Somerset Maugham

Three Men in a Boat – Jerome K. Jerome

The Great Gatsby – F. Scott Fitzgerald

The Good Earth – Pearl S. Buck (మాలతీచందూర్ గారి పరిచయం చదివినప్పటినుంచీ చదవాలనుకున్న పుస్తకం ఇప్పటికి వీలయింది నాకు. ప్రశాంతంగా ఉన్న రైతుగా మొదలై, ఒక అనుకూలవతి అయినా భార్య తోడుతో బంగారమైన జీవితం అథఃపాతాళందాకా వెళ్లి మళ్ళీ ఎవరెస్టు దాకా అన్నంత చేరుతుంది, అంతేనా!! అటుదిటా!! చూసే చూపుని బట్టి. నాకైతే రెండోదే అనిపించింది.) 

Short Stories – Fiodor Dostoievski

Sons and Lovers – D. H. LAWRENCE (అమ్మ ఎక్కడయినా అమ్మే, ఈ అమ్మకు కొంచెం స్వార్థం కూడా) 

Three Men on the Bummel – Jerome K. Jerome

The Idle Thoughts of an Idle Fellow – Jerome K. Jerome (నా తత్వానికి దగ్గరవాళ్ళు బెగ్, బారో, స్టీల్ లలో ఏది చేసైనా ఈ పుస్తకం చదవండి, ఆర్కైవ్ లో సులువుగా దొరకచ్చు)

Diary of a Pilgrimage – Jerome K. Jerome

All Roads Lead to Calvary – Jerome K. Jerome

Imperial Woman The Story of the Last Empress of China – Pearl S. Buck (మొఘల్ రాణులతో బోలెడంత సాపత్యం ఉన్న పాత్ర, ఎక్కువగా నూర్ జహాన్ …. మొఘల్ రాజ్యంలో ఉన్న మాదిరి పోట్లాటలే మొత్తమ్ అన్నీ… )

Anna Karenina – Leo Tolstoy – The Annotated & Unabridged Maude Translation

Poor Folk -FYODOR DOSTOYEVSKY –  Translated by C. J. Hogarth 

The Brothers Karamazov –  FYODOR DOSTOYEVSKY –  Constance Garnett (ఇది ఈ సంవత్సరానికి నా బెస్ట్ రీడ్, బహుశా ఎప్పటికీ… ఇప్పటికే రెండుసార్లు చదివా.. ఒకసారి విన్నా..  కనీసం ముప్పై గంటల లెక్చర్లు కూడా …. బుక్ రీడర్స్ క్లబ్ కోసం చేసిన ప్రెసెంటేషన్ ఇక్కడ. ఇది రేఖామాత్రపు పరిచయం కూడా కాదు, నా ఉద్వేగం మాత్రమే. ఇప్పుడు ఈ పుస్తకం తెలుగులో ఉంది. అరుణా ప్రసాద్ గారు తెలుగు చేశారు. ఆవిడ ఎంత తపస్సు చేసి తెలుగు చేసారో నేను ఊహ కూడా చేయలేను. పుస్తకం అంటే ఇష్టం ఉన్న అందరూ చదవాల్సిన పుస్తకం. ఒక రచయిత ప్రాణం పెట్టి రాస్తేనే ఇట్లాంటి ఒక రచన తయారవుతుంది. ఈ ఏడాది తెలుగులో చదువుతాను)

The Idiot –  FYODOR DOSTOYEVSKY –  Constance Garnett

Notes from the underground – FYODOR DOSTOYEVSKY – Constance Garnett

The Gambler – FYODOR DOSTOYEVSKY -C. J. Hogarth

North and South – Gaskell, Elizabeth 

Tess of the D’Urbervilles – Hardy, Thomas (https://bit.ly/3sDWAbn )

The picture of Dorian Gray – Oscar Wilde

Emma – Jane Austen

Wuthering Heights – Emily Brontë

Les Misérables – Victor Hugo – Isabel F. Hapgood (https://bit.ly/3ErVYI1 )

THE CATCHER IN THE RYE – J. D. Salinger (అన్వర్ గారు పోయినేడాది ఒక మంచి సినిమా సజెస్ట్ చేసారు “బ్రేకింగ్ అవే” అని. టీనేజ్ అమెరికన్ పిల్లల స్లైస్ ఆఫ్ లైఫ్ కథ. ఈ పుస్తకం మొదలుపెట్టగానే అదే గుర్తొచ్చింది. శాలింజర్ పుస్తకాన్ని కొన్నాళ్ళు బాన్ కూడా చేశారు, పుస్తకంలో cursing మాటలు చాలా ఎక్కవ. కానీ, కొంత ఎక్కువ ఇండిపెండెంట్ ఆలోచన ఉన్న టీనేజర్ కి అది గొప్ప ప్రతీక, హోల్డెన్ కి ఏ రూల్ నచ్చదు, గీత గీసి వుంటే అది దాటడానికే  అనుకునే పిల్లవాడు. బ్రేకింగ్ అవే లో డేవ్ ని పట్టి ఉంచే దారాల్లో కొంత ఎక్కువ ఫ్రెండ్స్ పాత్ర ఉంది, హోల్డెన్ ని తన చిన్న చెల్లి మాత్రమే నిలపగలిగిన బిసతంతువు. ఈ కారణం లో ఇద్దరి వ్యక్తిత్వాలూ రెండు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తాయి. మొత్తానికి కథని సుఖాంతం చేసినా ఆ పుస్తకం చరిచిన చరుపులు మర్చిపోలేనివి, ఆ వయసు టీనేజర్ వేరే ఉన్నాడాయే ఇంట్ల, క్యాంపస్ నిండా వున్నవాళ్లు కాక:) ఇది నలభైలలో రాసిన పుస్తకం అంటే నమ్మలేము, మొబైల్ లేకపోబట్టి నమ్మవలసిందే. టైమ్స్ నుంచి అన్ని టాప్ 100 పుస్తకాల లిస్టుల్లో కొనసాగుతున్న పుస్తకం, మనకు కష్టమే చదవడం భాషవల్ల, కానీ నిజాలు కటువుగా వుంటాయిమరి. ) 

The Remains of the Day – KAZUO ISHIGURO (డౌన్టన్ అబ్బే ని గుర్తు చేస్తుకుంటూ చదివేసా, భలే పోలికలు…. విషాద కామరూప అంత హార్డ్ పరిస్థితులు మాత్రం కాకపోవడం కొంత రిలీఫ్)

And the Mountains Echoed – Khaled Hosseini (https://bit.ly/3qs051w )

Love in the Time of Cholera – Gabriel García Márquez (నేనేమి రాయగలను :))

The Color Purple – ALICE WALKER (బాగా నచ్చిన ఇంకొక పుస్తకం. కథాప్రపంచం కిరణ్ గారు ఎప్పుడో సజెస్ట్ చేసారు, ఇప్పటికైనా చదవగలిగినందుకు ఎంతో సంతోషపడ్డా. ఆఫ్రికన్ మూలాలున్న రచయిత్రుల కథల్లో కనిపించే sisterhood ఎంత అబ్బురపరిచిందో నన్ను)

A room of one’s own – Virginia Woolf (వచ్చే ఏడాది ప్రణాళిక ఈవిడ…)

The coconut Monk – Thich Nhat Hanh (Book available  for borrowing @Archive.org)

The black Tulip – Alexander Dumas (Book available for download @Archive.org)

Chimamanda Ngozi Adichie (ఇంకొన్ని మిగిలాయి. ఈ అమ్మాయి గురించి రాయాలి.)

Half of a Yellow Sun-Chimamanda Ngozi Adichie

Purple Hibiscus (P.S.) – Chimamanda Ngozi Adichie

We Should All Be Feminists – Chimamanda Ngozi Adichie – Short Essay

Americanah – Chimamanda Ngozi Adichie

ఇంకొన్ని 

The Custard Heart – Dorothy Parker

Sapiens: A Brief History of Humankind – Yuval Noah Harari

Zikora A short story – Chimamanda Ngozi Adichie

This telling (Out of Line collection)  – Cheryl Strayed – Short story

The Contractors (Out of Line collection) – Lisa Ko – Short story

Halfway to Free (Out of Line collection)-Emma Donoghue – Short story

Bear Witness (Out of Line collection)-Mary Gaitskill – Short story

Graceful Burdens (Out of Line collection)-Roxane Gay – Short story

Sweet Virginia (Out of Line collection)-Caroline Kepnes – Short story

Shine, Pamela! Shine! (Out of Line collection) – Kate Atkinson – Short story

Ikigai: The Japanese Secret to a Long and Happy Life – Francesc Miralles and Hector Garcia (Book available for download @Archive.org )

The Subtle Art of Not Giving a F***-Mark Manson

The Art of Saying No: How to Stand Your Ground, Reclaim Time and Energy, and Refuse to be Taken for Granted – Damon Zahariades

ఇంగ్లిష్ భారతీయ సాహిత్యం నుంచి & క్లాసిక్స్ 

Shantaram – Gregory David Roberts (కొన్ని వాక్యాలు పుస్తకం నుంచి  )

Amma – Perumal Murugan – Kavitha Muralidharan (అమ్మ చెట్టు కథకు చేసుకున్న అనువాదం )

Poonachi – Perumal Murugan – N Kalyana Raman

One part woman – Perumal Murugan

The Devadasi and the Saint: The Life and Times of Bangalore Nagarathnamma – V. Sriram

A tribute to musical geniuses – Sriram V

Toungue of the slip – CP Belliayappa (Anectodal satire)

Two Magicians by Satyajit Ray – Arunava Sinha

Stories – Bibhutibhushan Bandopadhyaya – Rani Ray

Stories – Sunil Gangopadhyaya – Sheila sen Gupta

The Twilight Moment and other short stories – Ashapurna Devi

Stories – Ritwik Ghatak – Rani Ray

Noi Chupi: at Sixes & Sevens – Ashapurna Devi – Nupur Gupta

The magic Moonlight flower and other enchanting stories – Satyajit Ray – Arunava Sinha

GHACHAR GHOCHAR – VIVEK SHANBHAG – SRINATH PERUR

Opium – Ashapurna Devi – Sanjukta Dasgupta

The White Tiger – Aravind Adiga

Dr . ఎస్. ఎల్. భైరప్ప 

Orphaned – S L Bhyrappa – Sandeep Balakrishna (‘Tabbaliyu Neenade Magane’ is Kannada Original, in the backdrop of cow worship in India somewhere is early second half of 1900’s)

Uttara Kanda – S L Bhyrappa – Rashmi Terdal (Ramayana from Uttarakanda Sita’s perspective)

Grihabhanga – S L Bhairappa – L V Shantha Kumari

వంశవృక్షం – డా. ఎస్ ఎల్ భైరప్ప – సనగరం నాగభూషణం

Audio books

కాశీ యాత్ర – చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి (దాసుభాషితం) 

గాంధర్వం – ముక్తేవి భారతి (దాసుభాషితం)

A Life of J.R.D. – Beyond the Last Blue Mountain – R M Lala

The Jane Austen Collection – Jane Austen 

Man’s Search for Meaning – Viktor E. Frank

Sons – Pearl S. Buck

Who We Are and How We Got Here – David Reich

Moby Dick – Herman Melville

పిల్లల కథలు (ఒక ప్రణాళికతో చదివినా, చేయలేకపోతిని…. may be on a shiny day…..)

పిల్లగుర్రం నదిని ఎలా దాటింది

ఐదుగురు చైనా సోదరులు

పిల్లుల యాత్ర

బిత్తల రాజు – కమలా బకాయా

యాపిల్ గింజల మామయ్య

రాక్షసుడి తోట

పందెం

Pollyanna – Eleanor H. Porter

ఏడు రంగుల పువ్వు – అనువాదం సత్తి జగదీష్ రెడ్డి

పిల్లల సినిమా కథలు – అనిల్ బత్తుల 

అపరాధ పరిశోధన (Sheer indulgence 😁 let me number these…. భలే హాయి, గంటకో పుస్తకం; నమ్మేయొచ్చు నేను పూర్తి మాస్ మనిషినే)

1. Thirteen at Dinner – Agatha Christie

2. Murder on the Orient express – Agatha Christie

3. Death on the nile – Agatha Christie

4. ఇరవై నాలుగు గంటలలో – కొమ్మూరి సాంబశివరావు

5. లక్షాధికారి హత్య – కొమ్మూరి సాంబశివరావు

6. చీకటికి వెయ్యికళ్లు – కొమ్మూరి సాంబశివరావు

7. తలుపు తెరిస్తే చస్తావ్ – కొమ్మూరి సాంబశివరావు

8. అయిదుగురు అనుమానితులు – కొమ్మూరి సాంబశివరావు

9. చావు తప్పితే చాలు – కొమ్మూరి సాంబశివరావు

10. పదమూడు గంటలు కొట్టిన గడియారం – కొమ్మూరి సాంబశివరావు

11. అర్థరాత్రి అతిధి – కొమ్మూరి సాంబశివరావు

12. చావుకేక – కొమ్మూరి సాంబశివరావు

13. 444 – కొమ్మూరి సాంబశివరావు

14. 222 – కొమ్మూరి సాంబశివరావు

15. నక్కి దాక్కుంది – కొమ్మూరి సాంబశివరావు

ఇన్ని ఎట్లా అని ఎక్కువమంది అడగరు, అడిగేవాళ్ళకి నా ఉచిత సలహా. రోజుకి మూడు గంటలు మనకోసం వాడుకున్నా వెయ్యి గంటల పైన. నేను చాన్నాళ్లు అనుకున్నా, నేను ఇదీ చేస్తా, అదీ చేస్తా, అన్నీ చెయ్యగలను అని. కాదు, అస్సలు కుదరదు. ఇప్పుడు నెలలో నాలుగైదు రోజులు తప్ప ఫేస్బుక్ టైం గంట అయ్యిందంటే దుకాణం కట్టెయ్యడమే. ఇంతకుమించి ఒక్కమాటా నేను చెప్పను. హ్యాపీ రీడింగ్ ఫోక్స్….. హ్యాపీ న్యూ ఇయర్ …….. 

You Might Also Like

One Comment

  1. లియో

    మీ లిస్ట్ లో నేను చదవాల్సినవి చాలా ఉన్నాయి. మంచి పుస్తకాల గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply