నా అసమగ్ర పుస్తకాల జాబితా -3

రాసిన వారు: సి.బి.రావు

*****************

(నా అసమగ్ర పుస్తకాల జాబితా  భాగం 1 ఇక్కడ, భాగం 2 ఇక్కడ చదవవొచ్చు.)

Fiction  -Novel


78) విశాలనేత్రాలు -పిలకా గణపతిశాస్త్రి
విశాలనేత్రాలు పత్రికలో ధారావాహికంగా వస్తున్నప్పుడు చదివాను. కార్తికేయ పాత్ర శౌర్యం ఇంకా గుర్తుంది. నాయిక విశాలనేత్రి. జానపదంలో విహారమే ఈ నవల చదవటం.  ఆద్యంతం ఆసక్తికరమైన ఈ నవల ఆధారంగా చిత్రం తీద్దామని, ఆదుర్తి సుబ్బా రావు నాయిక కోసం అన్వేషణ జరిపారు. ఏ కారణం వలనో ఇంత మంచి కధ తెరకెక్కలేదు. ఆంధ్రప్రదేష్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత ఈ నవల.
79) రెండో అశోకుడి ముణ్ణాళ్ళ పాలన   –  పాలగుమ్మి పద్మరాజు. పార్టీ రహిత ప్రజాస్వామ్యం  ఎలా వుంటుందో ఈ నవల లో చూడవచ్చు.
80) మట్టి మనిషి, 81) మరీచిక   -వాసిరెడ్డి సీతాదేవి. మట్టి మనిషి నవల 14 భాషలలోకి అనువదించబడినది. ఈ పుస్తకాలపై సమీక్షకు ఇక్కడ చూడండి.


82) హౌస్ సర్జన్ -కొమ్మూరి వెణుగోపాల రావు. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
83) గాలి పడగలు నీటి బుడగలు  (1953)  -లత  (మొదటి నవల). ఈ పుస్తకం, రచయిత్రి గురించిన మరిన్ని వివరాలకై ఇకకడ చూడవచ్చు.

84) అతడు అడివిని జయించాడు, 85) మునెమ్మ కేశవరెడ్డి . అతడు అడవిని జయిం చాడు, రచయిత గురించిన మరిన్ని వివరాలకై ఇకకడ చూడవచ్చు.

86) అతడు-ఆమె  -ఉప్పల లక్ష్మణ రావు. జీవితానికి అక్షరభాష్యం ”అతడు-ఆమె”. గత 40 సంవత్సరాలలో వచ్చిన మంచి నవలల్లో అతడు-ఆమె ఒకటి. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చూడవచ్చు.
87) హిమజ్వాల, 88) అనుక్షణికం, 89) చీకట్లోంచి చీకటిలోకి  -వడ్డెర చండీదాస్. ఈ పుస్తకాలపై కొడవళ్ళ హనుమంతరావు  తాత్విక చింతన ఇక్కడ చదవవొచ్చు.
90) కాలాతీతవ్యక్తులు  -డాక్టర్ శ్రీదేవి. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
91) వెన్నెల్లో ఆడపిల్ల   -యండమూరి వీరేంద్రనాథ్
92) డబ్బు ² డబ్బు   -యండమూరి వీరెంద్రనాథ్
కథ, కథనం ఇవన్నీ పక్కన పెట్టినా, తన నవలలకి నామకరణం చెయ్యడంలో . యండమూరి మొనగాడని ఒప్పుకోవాలి. ఆయన సృజించిన టైటిల్సన్నిటిలో ఈ టైటిలు నాకు చాలా ఇష్టం. ఆధునిక జీవితంలో డబ్బుకున్న ప్రాముఖ్యతని చాలా ఒడుపుగా పట్టుకున్నారిందులో. -కొత్తపాళి


93) రేగడివిత్తులు  -చంద్రలత. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
94) అంటరాని వసంతం  -జి. కళ్యాణరావు. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
95) ఊసులాడే ఒక జాబిలటా   -నిషీగంధ. రంగనాయకమ్మ కృష్ణవేణి నవల వలే, ఈ నవలిక  లో కూడా నాయికా నాయకులు ఉత్తరాల ద్వారా ఒకరి కొకరు పరిచయం పెంచుకొంటారు. ఆ తరువాత? ఆసక్తికరంగా నడిచే ఈ నవలికను దిగుమతి చేసుకుని, చదవొచ్చిక్కడ.  నిషీగంధ -ఈ రచయిత్రికి తెలుగులో కవిత్వపు బ్లాగు (ఆహ్వానితులకు మాత్రమే)  ఉంది. ఫ్లోరిడా, అమెరికా లో నివాసం.   “జాజుల జావళీలతో, అందమైన ప్రేమలేఖలతో , కథలతో మనతో ఊసులాడే ఒక జాబిలి . కవిత్వం అంటే తెలియని వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఓ Night Queen.”  -సిరిసిరిమువ్వ.

96) అగ్నికణం  -అల్లం రాజయ్య. ఈ  పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు.


97) నిమజ్జనం  -మంజరీ ఈశ్వరన్. మంజరీ ఈశ్వరన్ నవల ఇమ్మెర్షన్ కు తెలుగుసేత వేమరాజు భానుమూర్తి .  ఈ కధ ఆధారంగా వచ్చిన చిత్రం నిమజ్జనం లో నటించిన కాధానాయిక శారదకు ఊర్వసి బహుమాన సత్కారం లభించింది.  ఈ చిత్ర కధ ఇక్కడ చదవవొచ్చు.
98) వనవాసి  -భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.

99) అమ్మ  -గోర్కీ. అమ్మ  పుస్తక పరిచయం ఇక్కడ చూడండి.
100) అడవి పిలిచింది -జాక్ లండన్. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు.ఉచితంగా ఇక్కడనుంచి దిగుమతి చేసుకోండి.

Fiction  -Short Stories
101) వాల్ పేపర్  -వివినమూర్తి చదివిన చాలా సంవత్సరాల తర్వాత కూడా వెంటాడే కధ వాల్ పేపర్  పరిచయం పుస్తకం.నెట్ లో వచ్చింది. వాల్ పేపర్ కధా సంపుటం లో వాల్ పేపర్ కధే కాకుండా జ్ఞాతం, దళిత సత్యం, దళిత ధర్మం, నేరం, అఖండ దృష్టి  కధలున్నాయి.  వైవిధ్యమైన కధలు వ్రాసే వివినమూర్తి ,కాళీపట్నం రామారావు నెలకొల్పిన కధానిలయం బాధ్యతలు
చూస్తూ ప్రస్తుతం శ్రీకాకుళం లో ఉంటున్నారు.   వీరి సంపాదకత్వంలో “రాచకొండ విశ్వనాధ శాస్త్రి రచనా సాగరం”  పుస్తకం వెలువడింది.
102) యజ్ఞం  -కాళీపట్నం రామారావు. కాళీపట్నం రామారావు  యజ్ఞం కథమీద జరిగినంత విపులమయిన చర్చ తెలుగు సాహిత్యంలో మరే కథమీద జరగలేదనటం అతిశయోక్తి కాదు. కాళీపట్నం రామారావు యజ్ఞం-ఒక సమీక్ష.
యజ్ఞం కధ పై కస్తూరి మురళీకృష్ణ విశ్లేషణ క్రింద చదవండి. యజ్ఞం-ఒక విమర్శ! యజ్ఞం-విమర్శ కొనసాగింపు.

యజ్ఞం-అర్ధాలు,అపార్ధాలు,అనర్ధాలు!

యజ్ఞం కధలో ఊరు అభివృద్ధి చెందుతుంది.ఊళ్ళోకి స్కూళ్ళు వస్తాయి.రోడ్లు వస్తాయి. వ్యాపారాలు వస్తాయి.జీవన పద్ధతులు మారతాయి. అయితే ఇంత అభివృద్ధికి భిన్నంగా రైతు జీవన స్థితిగతులు వ్యతిరేక దిశలో పయనిస్తాయి. ఎక్కడుంది కుట్ర, ఎలా జరుగుతుందీ కుట్ర అని తర్జన భర్జనలు ఎన్నో జరిగాయీ కధ పై. తెలుగు సాహిత్యం లో అత్యుత్తమమైన కధల కోవలో చేరుతుందీ కధ.

103) అతడు – నేను: కె.వరలక్ష్మి కధలు. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు.
104) ఆలంబన  -వారణాసి నాగలక్ష్మి. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు.
105) స్వయంప్రకాశం – టి.శ్రీవల్లీ రాధిక. ఈ పుస్తక పరిచయం  1) ఇక్కడ 2) ఇక్కడ చదవవొచ్చు.
106) పక్షి   -వి.ప్రతిమ. కధా రచయిత్రి ప్రతిమ   స్త్రీవాద కథా రచయిత. ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కార గ్రహీత. పక్షి కధల సంక్షిప్త పరిచయానికై ఇక్కడ చూడవచ్చు.
107) 20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కధానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం  -వంగూరి ఫౌండేషన్
ఈ పుస్తక పరిచయం ఇక్కడ చూడండి.
108) చెహోవ్ కధలు  -చెహోవ్; తెలుగు అనువాదం -ముక్తవరం పార్థసారధి. మరిన్ని వివరాలకై ఇక్కడ చూడవచ్చు.

Detective
109) చావు తప్పితే చాలు  -కొమ్మూరి సాంబశివరావు. తెలుగు లో మొట్టమొదటి ఒళ్లు గగుర్పొడిచే,  భయానక, ఉత్కంట భరితమైన నవల (1962). డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన. ఈ నవలను ఇక్కడనుండి దిగుమతి చేసుకోవచ్చు.

Music
110) త్యాగరాజ కీర్తనామృతం  -వ్యాఖ్యానం- కల్లూరి సత్య రామ ప్రసాద్. ఈ పుస్తక విశేషాలకై ఇక్కడ చూడవచ్చు.

Travel
111) ‘తెలంగాణ చూపుతో ఛత్తీస్ ఘడ్ యాత్ర’   -‘సలాం హైద్రాబాద్’ లోకేశ్వర్. ఛత్తీస్ ఘడ్ పై వచ్చిన తొలి తెలుగు యాత్రా సాహిత్యం ఇది. ఈ పుస్తకం అక్కడి నైసర్గిక స్వరూపం, ప్రకృతి అందం, ప్రజల దారిద్ర్యం, నక్సలైట్ల, కార్మిక నాయకుల  ఉద్యమాలు, రహదారుల దుస్థితి గురించి చక్కగా వివరిస్తుంది. ఛత్తీస్ ఘడ్ చూడాలన్న కోరిక పాఠకులలో కలిగిస్తుంది.
112) నర్మద పరిక్రమ  -మల్లాది వెంకట కృష్ణమూర్తి. భారతదేశం లో నదులు పడమర పుట్టి తూర్పుకు ప్రవహిస్తే నర్మద తూర్పున పుట్టి పశ్చిమానికి ప్రవహిస్తుంది. నది పుట్టిన చోటు నుంచి సముద్ర గర్భంలో కలిసే దాక నదితో పాటు నడిచి, సముద్రంలో,పడవలో, ఆవలి ఒడ్డుకు వెళ్లి ,అవతలి గట్టు దారి మీదుగా నది పుట్టిన చోటుకు,నర్మద నది చుట్టూ భక్తులు చేసే ప్రదక్షిణే నర్మదా పరిక్రమ. రచయిత పరిక్రమలో తన అనుభవాలు వివరిస్తారు.
113) తీర్థ యాత్ర (టాంజానియా ట్రావెలాగ్)  -గొల్లపూడి మారుతి రావు. టాంజానియా లో, అడవి జంతువుల మధ్య గొల్లపూడి సాహసయాత్ర. ఈ పుస్తకాన్ని ఉచితంగా దిగుమతి చేసుకోండిక్కడ.
114) అమెరికా….అమెరికా – అంపశయ్య నవీన్. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
115) కాశీ యాత్ర  -చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి . రచనాకాలం 1888. “ఈ యాత్రా చరిత్రల ద్వారా అప్పటి సంపద, భాషా విశేషాలు, నాణేలు, క్రయ విక్రయాలు, ఉత్సవాలు వంటివెన్నో బోధపడతాయి. “ -చల్లా భాగ్యలక్ష్మి. ఎందరో యాత్రికుల కాశీ యాత్ర ల వివరాలకై ఇక్కడ చూడవచ్చు.

ఈ వ్యాసం లోని గొలుసులు (links) పనిచెయ్యక పోతే మీ వ్యాఖ్యల ద్వారా తెలియపరచగలరు. ఈ వ్యాస తరువాయి భాగం లో కవయిత్రి జయప్రభ కవిత్వం ఏ బ్రాండ్ కు చెందుతుంది?  స్త్రీవాద కవి (ఫెమినిస్మ్), దళిత కవి, అభ్యుదయ కవి, తిరోగమన కవి అని కవులను విభజించటం సమంజసమేనా? “రూళ్ళకర్ర  పద్యం”  అంటే ఏమిటి? కవిత్వం, శాస్త్రం, నాటకం ఇంకా బాల సాహిత్యంలో పలు అణిముత్యాల లాంటి పుస్తక పరిచయాలు మరియు వ్యాస ముగింపు ఉంటాయి.


(ఇంకా ఉంది)



Fiction  -Novel

You Might Also Like

One Comment

  1. రామ

    తరువాయి భాగం కోసం చూస్తున్నాను.. మీ పుస్తకాల పట్టిక చాలా వివరం గా ఉంది. ఎప్పటికైనా ఇవన్నీ చదవాలనుకునే నా లాంటి వాళ్ళకి మార్గదర్శి.

Leave a Reply