స్వయం ప్రకాశం – పుస్తకావిష్కరణ సభా విశేషాలు
రాసిన వారు: సి.బి.రావు
***************
శ్రీమతి టి.శ్రీవల్లీ రాధిక విరచిత “స్వయంప్రకాశం” – కధా సంపుటి, పలువురు రచయితలు, బంధుమిత్రుల సమక్షంలో జనవరి 19 సాయంత్రం, చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో, మనొజ్ఞమైన వాతావరణంలో, జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీత, పద్మభూషణ్ డా.సి.నారాయణ రెడ్డి గారి కరకమలాల ద్వారా ఆవిష్కృతమైంది. ఈ సభకు ప్రముఖ కధకులు, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మునిపల్లె రాజు, ప్రముఖ రచయిత, విమర్శకులు విహారి , ఆంధ్ర ప్రభ దిన పత్రిక సంపాదకులు పి.విజయబాబు ఇంకా పలువురు రచయితలు, రచయిత్రులు విచ్చేశారు. పుస్తకావిష్కరణ చేశాక నారాయణరెడ్డి గారు క్లుప్తంగా ప్రసంగిస్తూ ఈ కధా సంపుటిలోని ఈర్ష్య మరియు పుణ్యమూ – పురుషార్ధమూ కధల గురించి మాట్లాడారు. ఈర్ష్య కధలోని కొన్ని వాక్యాలు చదివి వినిపించారు. ఈ కధా నాయిక ఇంకొకరికన్నా తాను తక్కువగా లేనందువలన తనకు ఈర్ష్య చెందవలసిన అవసరము లేదనుకుంటూ తాను సంతోషంగా ఉన్నానని వెల్లడిస్తూ స్నేహితుల ఈర్ష్యకు ఎలా పాలయ్యిందో వివరించారు. పుణ్యమూ – పురుషార్ధమూ కధలో కెనడా నుంచి వచ్చిన శ్రీనివాస అయ్యంగార్ యొక్క డబ్బే పరమావధిగురించి ప్రస్తావించారు. ఈ కధలోని కధా నాయిక మైసూర్ దగ్గరి సోమనాధపురం లో పరిచయమైన శ్రీనివాస్ కు భారతీయుల పుణ్య పురుషార్థాలగురించి వివరించిన తీరు బాగుందన్నారు.
పుస్తకావిష్కరణ సమయంలో ఎడమనుంచి కుడి వైపు: శ్రీయుతులు భవాని, మునిపల్లె రాజు, విహారి, పి.విజయబాబు, డా.సి.నారాయణ రెడ్డి, టి.శ్రీవల్లీ రాధిక, మరియు కళావెంకట దీక్షితులు
కధా సంపుటి స్వయం ప్రకాశం గురించి మాట్లాడుతున్న డా.సి.నారాయణ రెడ్డి
అనంతరం ఆంధ్ర ప్రభ దిన పత్రిక సంపాదకులు పి.విజయబాబు మాట్లాడుతూ రచయిత్రి కి ఆంధ్ర ప్రభకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. శ్రీవల్లీ రాధిక తమ కధలలో చేసే మధ్యతరగతి కుటుంబాలలోని వ్యక్తుల మనస్వత్వ చిత్రణ వాస్తవికంగా ఉంటుందన్నారు. కధారీతిలో మాం, ఓ. హెన్రి ఛాయలు కనిపిస్తాయన్నారు. ప్రామాణిక భాషలోనే కాకుండా శ్రీవల్లీ రాధిక మాండలీకాల్లో కూడ కధలు రాయాలని కోరుతున్నానన్నారు. తదుపరి ప్రముఖ రచయిత, కధా విమర్శకులు విహారి కధా విశ్లేషణ చేశారు. వీరు “తెలుగుకధ తేజోరీతులు” అనే శీర్షికతో ఆంధ్ర ప్రభలో 171 మంది రచయితలను పరిచయం చేశారు. విహరి మాట్లాడుతూ “1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకున్న పాలగుమ్మి పద్మరాజు కథ గాలివాన నుంచి నేటి దాకా కధలు తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలుగా ఉన్న శ్రీవల్లి రాధిక 1993 నుంచి కధలు వ్రాస్తున్నారు. భావనాశ్రయంగా కధను నడిపి మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించటం కష్టమైన పని. శ్రీవల్లీ రాధిక ఈ కధలలో పాత్రల మానసికావస్థను చిత్రీకరించిన తీరు అభినందనీయం. పుణ్యమూ – పురుషార్ధమూ కధలో సోమనాధపురం యాత్రలోని అనుభవాలు, తోటి ప్రయాణీకుని గురించిన మనస్తత్వ విశ్లేషణ రచయిత్రి చక్కగా మన ముందుంచారు” అన్నారు.
కధా రచయిత్రి టి.శ్రీవల్లీ రాధిక ను దుశ్శాలువతో సత్కరించిన డా.సి.నారాయణ రెడ్డి, పి.విజయబాబు
జ్యేష్ట, రావి శాస్త్రి ,గొపీచంద్ జ్ఞాపక సాహిత్య బహుమతులు , తెలుగు విశ్వవిద్యాలయం (రెండు సార్లు), ఆంధ్ర సారస్వత సమితి ఇంకా 2006 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత అయిన మునిపల్లె రాజు రచయిత్రిని ఆశీర్వదిస్తూ ప్రసంగింస్తూ ” శ్రీవల్లీ రాధిక కధా పాటవాన్ని ఆంధ్ర ప్రభ మాజీ సంపాదకులు వాకాటి పాండురంగారావు గారు గుర్తించి ఆంధ్ర పాఠకులకు పరిచయం చేశారు. మన చుట్టూ ఉన్న సమాజంలోని భిన్న వ్యక్తుల మానసిక పోకడలను ఈ కధలలో ఈ అమ్మాయి చక్కగా చిత్రించారు. అంతే కాదు, ఈ కధలలో భారతీయ తాత్వికత ఉంది. వైష్ణవ ద్వైత విశిష్టాద్వైత తాత్వికాలోచనల విమల సారాంశాలు – ఈ కధానికలు. ఈ కధా సంపుటి లోని సాహసి అనే కధలో రోజూ బస్ లో కార్యాలయానికి వెళ్లే ఒక అమ్మాయి జీవితంలో ఒక రోజు ఒక ఆకతాయి చేసిన అఘాయీత్యం ఆమెను మానసిక సంక్షొభంలోకి నెడ్తుంది. ఈ సంఘటన తర్వాత ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన ఓదార్పు మాటలు , పాత తరం మనిషి నాయనమ్మ ఇచ్చిన ధైర్యం శ్లాఘనీయం. ఈ కధలు జీవితానికి కూడా పునర్మూల్యాంకన అవసరాన్ని తెలియ చేస్తాయి. వీటిని ఒక్కొక్కటీ విశ్లేషించటం కంటే పాఠకులే చదివి మానసికానందాన్ని పొందగలరు” అన్నారు.
త్యాగరాయ గాన సభ తరఫున కళావెంకట దీక్షితులు మాట్లాడుతూ ఇలాంటి మేధోపరమైన సభలకు ఆతిధ్యమివ్వటం తమకెంతో ఆనందాన్నిస్తుందన్నారు. తదుపరి కధా రచయిత్రి మాట్లాడుతూ ” మా తల్లి గారి ప్రోత్సాహంతో ఈ కధ రచన మొదలు పెట్టాను. ఈ పుస్తకం ఆమెకే అంకితం ఇస్తున్నాను. తన కధలలో సున్నితత్వమే ప్రత్యేకమని దాన్ని విడువద్దని సంపాదకులు పాండురంగారావు అన్నారు. నాకు సలహాలు, దీవెనలు అందించిన కధారిషివల్యులకు,ఈ పుస్తకం ఈ రోజు ఇలా అందంగా రావటానికి సహయమందిచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. చివరగా సభను నిర్వహించిన ఆప్తమిత్రురాలు భవానీకి ధన్యవాదాలు” తెలిపారు.
బిందు ఆర్ట్స్ మరియు శ్రీత్యాగరాయ గాన సభ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర ప్రభ దిన పత్రిక సంపాదకులు పి.విజయబాబు మాట్లాడుతూ రచయితలు తమ కధలను ప్రచురించి, ప్రోత్సాహించిన సంపాదకులను స్మరణకు తెచ్చుకోవటం అభినందనీయమన్నారు.
Photos & Text – by cbrao
పుస్తకం » Blog Archive » కొన్ని కథలతో అనుభవాలు
[…] గిడుగు రాజేశ్వరరావు కథలు: దాదాపు రెండేళ్ళ క్రితం ఈయన కథలు కొన్ని చదివి, మర్చిపోయినట్లు గుర్తు. పోయిన వారం మరో సంకలనం దొరికి, అది చదువుతూ ఉంటే, అప్పటి అభిప్రాయాలు పూర్తిగా గుర్తులేవు కానీ, ఇప్పటితో పోలిస్తే వేరేమో అనిపించింది. ఇప్పుడు చదివిన కథల్లో – ఒక విధమైన వేదాంత ధోరణి కనబడ్డది. అయితే, కొన్ని కథలకి అది బాగా అమరింది కానీ, కొన్నింటిలో మాత్రం – సంబంధం లేని విషయాలను వేదాంతం అన్న లంకెతో కలిపేసినట్లు అనిపించింది. ఈకథలు కాస్త వయసొచ్చాక రాసారేమో అనిపించింది. కథలు చదివించేమాదిరిగానే అనిపించాయి కానీ – ఒక్కోచోట ఓవర్డోస్ అయిన భావన కలిగింది. బహుశా, మరోసారి ఈయన కథలేవన్నా కనిపిస్తే కూడా చదువుతాననుకుంటాను… (రాజేశ్వరరావు గారు వారి తాతగారైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవితచరిత్రను రాశారు. ఆ పుస్తకం పై పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్ష ఇక్కడ.) బీరకాయపీచు – కొడవటిగంటి కృష్ణమూర్తి కథలు: ఈయన పేరు తెలిసిందే – నాకు తెలిసినవారు ఒకరు, తన కాలేజీ రోజుల్లో (దాదాపు యాభై ఏళ్ళ క్రితం), ఈయన కథలు చదివానని చెబుతూంటే. ఈయన కొ.కు. సోదరుడని తర్వాత తెలిసింది. ఇప్పటి వరకూ సంకలనం పూర్తి చేయలేదు. కానీ, చదివిన కథలన్నీ బాగా నచ్చాయి. ఈపుస్తకం ఇప్పుడు దొరకట్లేదని విన్నాను. పైగా, ఈయన ప్రచురించిన సంకలనం ఇదొక్కటేనట!! ఏమైనా, ఈయన్ని మాత్రం మస్ట్ రీడ్ అని చెబుతాను నేను…. ఈ తరహాలో కథలు (ముఖ్యంగా బీరకాయపీచు కథ) తెలుగులో నేనెప్పుడూ చదవనందుకు కాబోలు… వీటిల్లో కథంటూ పెద్దగా లేదు – అనిపించే అవకాశం లేకపోలేదు కానీ – వెరీ ఎంటర్టైనింగ్. స్వయంప్రకాశం – శ్రీవల్లీ రాధిక కథలు: ఆమధ్య సి.పి.బ్రౌన్ వారి పత్రికలో రాధిక గారి కథ చదివాను. నాకు కథాంశం నచ్చింది. ఇంతలోపే, సంకలనం చదువుతానని ఊహించలేదు. హుమ్ – దాదాపుగా కథలన్నీ కథాంశం పరంగా బాగున్నాయి. ఎటొచ్చీ, నాకు కథనం మాత్రం ఏమాత్రమూ నచ్చలేదు. . అయినప్పటికీ, నాకు ఈ కథల్ని రికమెండ్ చేయాలనే అనిపిస్తుంది – ఎందుకంటే, ఆ కథావస్తువులు వాస్తవజీవితంలో జరిగే సంఘటనలకు దగ్గర్లో ఉన్నాయి కనుక. (ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన సమీక్ష ఇక్కడ. పుస్తకావిష్కరణ నాటి విశేషాలు ఇక్కడ.) […]
పుస్తకం » Blog Archive » స్వయంప్రకాశం – టి.శ్రీవల్లీ రాధిక
[…] ********** [స్వయంప్రకాశం – పుస్తకావిష్కరణ,పుస్తకంలోని విశేషాలతో పుస్తకం.నెట్ లో సి.బి.రావుగారు రాసిన వ్యాసం ఇక్కడ] […]
K.Naga Maha Lakshmi
nenu swayanga chadivi na anubhavanni cheptunanu nenu anta anubhavagnuralini kanu endukante chala chinna danni kani na spandana entante swayam prakasam anna peru chala addam pattinattundi e kadalaki endukante prati ammayi e kadha chadivite tana jivitamlo swayamga jariginda mana anubhavalane manam chuskuntunama annattu kallaki kattinattu unnayi prati aadapilla tana vyaktitvanni atma visvasanni premani anuraganni anni rangallalo ela undagalagaccho e kadalu chadivite spashtamavtayi telugu naatana telugu notana
maruvarani marapurani kadalu inka enno andistarani aasistunanu madam verito nenu toti udyoginiga panichestu enno vishayalu nerchukuntunanu inka naku teliyanivi enno unnayi meku inka enno peru prakyatalu ravalani me nunchi vignanam pondalani asistunanu
Laxmi Kanth
First of all let me congratulate Madam Radhika
I am feeling very sory, because I was unable to attend the book inuagration cerimony. My special thanks to C.B.Rao sir for this article. I am going to share some more feelings after reading this book. Thanks onece again
– Laxmi Kanth
Yalla Atchuta Ramayya
Srivalli Radhika garu,
Congratulations for releasing your book by the great literary giants.
kalpana
కథల పుస్తకం వెలువరించినందుకు శ్రీవల్లీ రాధికకు అభినందనలు. పుస్తకావిష్కరణ సభ గురించి వివరంగా ఫోటోలతో సహా అందించినందుకు సి.బి.రావు గారికి ధన్యవాదాలు.
కొత్తపాళీ
సంతోషం. శ్రీవల్లీరాధిక గారికి అభినందనలు