పుస్తకం
All about books



అనువాదాలు

August 29, 2014

Changing – Liv Ullmann

More articles by »
Written by: సౌమ్య
Tags: ,
Liv & Ingmar: Painfully Connected” అని 2012లో ఒక డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. దర్శకుడు Dheeraj Akolkar. దీని గురించి తెలిసినప్పటి నుండి ప్రయత్నిస్తూండగా, ఎట్టకేలకి ఈమధ్యనే ఓ నెలక్రితం చూడగలిగాను. ఇది ప్రముఖ దర్శకుడు ఇంగ్మర్ బెర్గ్మన్, ప్రముఖ నటి-దర్శకురాలు లివ్ ఉల్మన్ ల మధ్య ఉన్న అనుబంధం గురించిన సినిమా. నాకు Liv Ullman అన్న పేరు తల్చుకోగానే వెంటనే కలిగే స్పందన – గౌరవం. అది ఈ సినిమా చూశాక మరింత ఎక్కువై, ఆవిడ ఆత్మకథ చదవాలనుకున్నాను. దీని ఎండ్ టైటిల్స్ పడుతూండగా అర్థమైంది దీని స్క్రిప్ట్ లో లివ్ ఆత్మకథ “Changing” లోంచి కొన్ని వాక్యాలు వాడుకున్నారని. దర్శకుడు ధీరజ్ అకొల్కర్ ఇంటర్వ్యూలు చదువుతూండగా తెలిసినది ఏమిటంటే, అతనీ సినిమా తీయడానికి స్పూర్తి కూడా ఆ పుస్తకమేనని. ఇక చదవక తప్పింది కాదు.

ఇంగ్మార్ బెర్గ్మాన్ నేను బాగా అభిమానించే రచయితల్లో ఒకడు. లివ్ నేను ఇంగ్మర్ సినిమాలు చూసి అభిమానించడం మొదలుపెట్టిన నటి. ఆయన దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రాలు సినీ విమర్శకుల కితాబులనందుకున్నాయి. మొదట్లో నా మట్టుకు నాకైతే అలాంటి పాత్రలు ఆయన రాయడం సరే, ఎలా తీస్తాడో అనిపించేది. తరువాత సత్యజిత్ రాయ్ అన్నట్లు, అలాంటి నటులు ఉన్నారు కనుకనే అతను అలాంటివి తీయగలిగాడు అనిపించడం మొదలైంది. అలా అనిపించడానికి ముఖ్య కారణం Liv Ullmann. వీరిద్దరూ 1965-70 మధ్య కాలంలో కలిసి బ్రతికారు. Linn Ullmann కు తల్లిదండ్రులైనారు. తరువాత విడిపోయారు. తరువాత ఎవళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతూనే అనేక సినిమాలు కలిసి చేశారు. లివ్ ఇంకా చురుగ్గా సినిమాల్లో నటిస్తూ/దర్శకత్వం వహిస్తూ ఉంది.

ఈ పుస్తకం లివ్ ఆత్మకథ. తన గతం గురించి కంటే ఈ పుస్తకం రాసేకాలం నాటి (70s) వర్తమానం గురించి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఇంగ్మర్ తో విడిపోయిన విడిపోయిన తొలినాళ్ళలో లివ్, లిన్ ల జీవితం, లివ్ కెరీర్ గురించి ఉంటుంది. డెబ్భైలలో తన కూతురితో కలిసి single mother గా జీవితం, కెరీర్, వీటి మధ్య సమన్వయం కుదుర్చుకోవడం; ఇంగ్మర్త్ తో ఆవిడ వ్యక్తిగత, సినిమా సంబంధాలు – ఇవి ప్రధానంగా ఈ పుస్తకంలో తరుచుగా కనబడే అంశాలు. రచనా విధానం ముందుకీ వెనక్కీ పోతూ సాగుతుంది – ఒక వరుసగా ఉండదు కానీ, ఈ తరహా ఆత్మకథకి అది బాగా నప్పింది అని నా అభిప్రాయం.

లివ్ మొత్తానికి ఆవిడ సీరియస్ స్వీడిష్ సినిమాల్లో పోషించే పాత్రల్లాగే లోతైన మనిషి అనిపించింది నాకైతే. అలాగే, సాహిత్యాన్ని, జీవితాన్ని బాగా చదివింది అనుకుంటాను. ఒక మహిళగా, అందులోనూ స్వతంత్రంగా బ్రతుకుతూ తన కూతుర్ని పెంచుతూ, కెరీర్ లో నిలదొక్కుకుంటూ విజయవంతంగా నిలిచిన వైనం నాకైతే స్ఫూర్తిని కలిగించింది అనే చెప్పాలి. పుస్తకంలో కొన్ని చోట్ల ఇదే లివ్ child-likeగా, కొన్ని చోట్ల childish గా కూడా అనిపిస్తుంది (నాకు రెంటినీ వేరుచేసే రెండు వేర్వేరు తెలుగు పదాలు తట్టలేదు). ఈ విధంగా ఆవిడలోని రకరకాల రంగులు కనబడ్డందుకో ఏమో నాకు పుస్తకం నిక్కచ్చిగా, నిజాయితీతో రాసినట్లు అనిపించింది. తన పాత ప్రేమ గురించి, విడిపోయిన భర్త గురించి – చాలా మామూలుగా, “ఇదీ సంగతి” అన్నట్లు చెప్పుకొచ్చింది. ఇంగ్మర్ గురించి కూడా ఎక్కడా ద్వేషంతోనో, అక్కసుతోనో రాయలేదు. అదే “ఇదీ సంగతి” పంథాలోనే సాగింది ఆవిడ ఏం చెప్పినా. ఈ విషయంలో నాకు ఈ పుస్తకం కొండపల్లి కోటేశ్వరమ్మ గారి “నిర్జన వారధి”ని గుర్తు తెచ్చింది. కాకపోతే, ఈ పుస్తకం రాసేనాటికి లివ్ కోటేశ్వరమ్మ గారి కంటే చాలా చాలా చిన్నది అంతే!

హెన్రిక్ ఇబ్సెన్ నాటకం “Doll’s House“లో నోరా‌పాత్రను లివ్ పలుమార్లు, పలుచోట్ల పోషించింది. నార్వేజియన్ లోనే కాక, నాటకం ఆంగ్ల అనువాదం ప్రదర్శనలోకూడా నోరా గా వేసింది. ఈ అనుభవాలను చెబుతున్నప్పుడు నాటకం గురించిన ఆవిడ వ్యాఖ్యానం చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే, ఇరు భాషల్లోనూ అదే పాత్ర వేస్తున్నప్పుడు డైలాగులు గుర్తుపెట్టుకోడం, నాటకం అనువాదం గురించి ఆవిడ వ్యాఖ్యలు కూడా నాకు ఆసక్తికరంగా అనిపించాయి.

ఇవన్నీ కాక నన్ను ఇందులో ఆకట్టుకున్న అంశం ఆవిడ తన నట జీవితం గురించి చెప్పిన కబుర్లు. ఈ కబుర్లలో నేను చూసిన స్వీడిష్ సినిమాల్లో భారీ పాత్రలు వేసిన నటులంతా మామూలు మనుషుల్లా కబుర్లు చెప్పుకుంటూ, జోకులేసుకుంటూ కనిపిస్తారు. వీళ్ళందరి వ్యక్తిగత జీవితాలను గురించి నాకేం తెలీకపోడం వల్ల చాలా ఆశ్చర్యపోతూ చదివాను ఇవన్నీ – “ఓహో, వీళ్ళు కూడా మన్లాగే మామూలు మనుషులు” అనుకుంటూ! హాలీవుడ్ లో లివ్ అనుభవాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. స్వీడెన్ లో ఆవిడ నటించిన సినిమాలకీ, అక్కడ ఆవిడ చేసిన సినిమాల్లోని పాత్రలకీ ఎక్కడా పొంతనే కుదరదు అసలు.. ఒక హాలీవుడ్ సినిమాలో లివ్ పిల్లలతో నృత్యం చేస్తున్న దృశ్యం చూశాక నాకు గుండాగినంత పనైంది. స్వీడిష్ సినిమాల్లోని ఆవిడ భారీ పాత్రలని చూసిన ఎవరికైనా నా గుండెపోటుకి కారణం అర్థమయ్యే ఉంటుంది. హాలీవుడ్ లో ప్రవేశించినప్పుడు వాళ్ళు కూడా నవ్వు మొహంతో దర్శనమిచ్చిన లివ్ ను చూసి ఆశ్చర్యపోయారట ..ఆవిడే చెప్పింది సినిమాలో ఓ చోట.. 🙂

నేనాట్టే చూడలేదు కానీ, నేను చూసిన కొన్ని యూట్యూబు విడియోలను బట్టి – హాలీవుడ్ లో లివ్ లోని నటికి తగ్గ పాత్రలు రాలేదేమో అనిపించింది. ఆవిడా అలాగే అనుకుందేమో మరి, తిరిగి వెళ్ళిపోయింది. ఇంగ్మర్ బెర్గ్మన్ సినిమా “ఫేస్ టు ఫేస్” సినిమా షూటింగ్ అనుభవాలతో ఈ పుస్తకం ముగుస్తుంది (ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఇదివరలో నేను రాసిన వ్యాసం ఇక్కడ). “Don’t you know Liv, you are my stradivarius” అని ఇంగ్మర్ వంటి మనిషి చేత అనిపించుకున్న లివ్ ఉల్మన్ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!

సినిమా చూడాలనుకుంటే, అంతర్జాలంలో వెదికితే ఉచితంగా చూడ్డానికి దొరకవచ్చు. లివ్ లో ఇప్పటికీ తగ్గని ఉత్సాహాన్ని, ఇంగ్మర్ గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్ళలోని మెరుపునూ చూడాలనుకునేవారికి ఈ సినిమా తప్పకుండా చూడమని చెబుతాను. ఇక పుస్తకం గురించి చివరిసారి నొక్కి వక్కాణించాలంటే -లివ్ ని అభిమానించే ఎవరికన్నా ఈ పుస్తకం చదవడం తప్పనిసరి అని నా అభిప్రాయం. ఇంగ్మర్ అభిమానులకు కూడా. పుస్తకం చదవాలి అనుకుంటే అమేజాన్ లంకె ఇక్కడ. నేను లైబ్రరీ నుండి అరువు తెచ్చుకుని చదివాను. పాత పుస్తకాలకి కూడా కిండిల్ వర్షన్లు విడుదలైతే బాగుండని అనుకున్న సందర్భాల్లో ఇదీ ఒకటి.

ఈ పుస్తకంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను కింద కోట్ చేసి, వ్యాసం ముగిస్తాను.
****

“Books have always been living things to me. Some of my encounters with new authors have changed my life a little. When I have been perplexed, looking for something I could not define to myself, a certain book has turned up, approached me as a friend would. And between its covers carried the questions and answers I was looking for.”

“Why doesn’t life turn out as we hope and plan?”
“Why is time so merciless, stealing our opportunities if we are not swift enough to grasp them immediately?”

“Only then, when no situation or character is obviously good or evil, is it truly interesting to act.”

“I had a dream last night – that you and I are painfully connected.” – Ingmar to Liv, while shooting Persona.

“For a period of time they had taken each other’s hands and been painfully connected. But only when it was all over did they become true friends.”

“Gifts are not happiness only. I think I accept that. I believe this is my most important change.”

“I used to want to lodge in someone’s pocket and be able to jump in and out whenever it suited me. Now I go around listening for cries from women who I imagine are locked in others’ pockets”








Changing





Liv Ullmann





Autobiography



About the Author(s)

సౌమ్య



0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *




 
 

 

Fantastic night and other stories – Stefan Zweig

వ్యాసకర్త: Nagini Kandala ********* Stefan Zweig.. ఈ మధ్యే మొదలైన కొత్త ప్రేమ. అసలీ పుస్తకం కళ్ళపడే వరకూ ఈయన గు...
by అతిథి
0

 
 

పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్

వ్యాసకర్త: Sujata Manipatruni పథేర్ పాంచాలీ – బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ (1894-1950) అనువాదం : మద్దిపట్...
by అతిథి
0

 
 

రష్యన్ జానపద కథలు -స్వేచ్ఛానువాదం

వ్యాసకర్త: పూదోట శౌరీలు ****************** ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్...
by అతిథి
0

 

 

కామ్యూ కథ: “అతిథి”. (The Guest (L’hote’) by Albert Camus)

వ్యాసకర్త: సూరపరాజు రాధాకృష్ణమూర్తి పాత్రలు: —Daru, దారు,స్కూల్ మాస్టరు.ఫ్రెంచివాడు.ఆ...
by అతిథి
1

 
 

ఓ సామాన్యుడి అసాధారణ కథ – “ఓ సంచారి అంతరంగం”

ఇది ఓ మామూలు మనిషి జీవితం! భద్రజీవితం గడిపేవారికి ఇది ఓ సామాన్యుడి కథే, కాని ఆయన అసాధ...
by అతిథి
0

 
 

తెలుగు అనువాదంలో టాల్‌స్టాయ్

వ్యాసకర్త: మెహెర్ టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’ నవలని చదవాలని అనుకునేవాళ్లు ఇంగ్...
by అతిథి
2