పుస్తకం
All about booksఅనువాదాలు

March 27, 2014

నిజానికి, కలకీ, మనిషికీ – Face to Face

More articles by »
Written by: సౌమ్య
Tags: , ,
Face to Face అన్నది ప్రముఖ స్వీడిష్ చలనచిత్ర దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్మన్ తీసిన చిత్రం. దీనిని మొదట టీవీ సిరీస్ గా తీశారు. దానినే కొద్ది మార్పులతో సినిమాగా విడుదల చేశారని చదివాను. ప్రస్తుత విషయం – ఆ సినిమా/టెలీ సీరియల్ తాలుకా స్క్రిప్టు చదివాక నాకు కలిగిన ఆలోచనలు.

కథ చాలా క్లుప్తంగా చెప్పాలంటే – ఒక మానసిక వైద్య నిపుణురాలు తానే తాత్కాలికంగా మానసిక సమస్యకు లోనవుతుంది. ఒంటరితనం, గతం, లోపలి భయాలు, బలహీనతలు, కుటుంబ సంబంధాలలోని లోతు(టు)లు ఈ అంశాలన్నీ‌ కలిపి ఆమెని ఆత్మహత్యకి పురికొల్పుతాయి. అయితే, ప్రయత్నం బెడిసికొడుతుంది. ఈ క్రమంలో నిజానికి, కలకీ, రెండూ కాని మధ్య స్థితికీ మధ్య సరళహరాత్మకచలనం తరహాలో తిరుగుతూ, ఒక స్నేహితుడి సమక్షంలో మళ్ళీ క్రమంగా కోలుకోవడం కథ. (ఈమధ్య కాలంలోనే ఇలాంటి ఓ నిజజీవిత కథ: ఒక న్యూరో సైంటిస్టు బ్రెయిన్ హెమరేజ్ కి గురై, కోలుకునే క్రమంలో మెదడుకు సంబంధించిన వ్యాధుల గురించి ఆమె చేసిన పరిశీలనతో రాసిన అనుభవాలు – My Stroke of Insight గురించి రెండు వ్యాసాలు పుస్తకం.నెట్లో వచ్చాయి).

ఇంగ్మార్ బెర్గ్మన్ (కనీసం నా మటుకు) మొదట కథకుడు, రచయిత. ఆ పైనే దర్శకుడు అనిపిస్తాడు. ఆయన రచనలలో మానసిక సంఘర్షణలు, సమస్యలు చాలా తరుచుగా కనిపిస్తూంటాయి. ఇవి బెర్గ్మన్ స్వయంగా అనుభవిస్తున్న సంఘర్షణలకి సమాధానాలు వెదుక్కుంటూ వెళ్ళిన దారులని కొందరంటారు. బెర్గ్మన్ తన సినిమాల గురించి, తన గురించి చెప్పుకున్న వ్యాసాలు చదివితే – అవుననే అనిపిస్తుంది నాకు. ఈ సినిమా కూడా ఆ కోవకి చెందినదే అనడానికి సాక్ష్యం సినిమాగా తీసే ముందు తన టీం కి రాస్తున్న లేఖగా పుస్తకంలో కనబడే ముందుమాట వ్యాసం. అందులో-

“..I think that for some time now I have been living with an anxiety which has had no tangible cause. .. .. After having given my anxiety various labels, each less convincing than the other, I decided to begin investigating more methodically. Another person’s vicissitudes came to my aid; I found similarities between her experiences and my own, with the difference that her situation was more obvious and explicit, and much more painful. In this way, the chief character in our film began to take shape … … It is this admirable character’s shockingly quick breakdown and agonizing rebirth that I have tried to describe.”
అంటాడు. అదే ఈ కథ. ఈ సినిమా. బెర్గ్మన్ తన ప్రశ్నలకి సమాధానాలు వెదుక్కుంటూ రాసుకున్న ఈ కథ ముందుకు సాగే కొద్దీ నాకు సార్వజనీనమైన అనుభూతిగా అనిపించడం మొదలైంది. చివరికి వచ్చేసరికి ప్రతి మనిషీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక తీవ్రతతో ఈ సంఘర్షణని అనుభవిస్తూనే ఉంటాడేమో అనుకున్నాను.

కథ మొదట్లో కనబడే పాత్రలూ – వాటి స్వభావాలూ – జెన్నీ ఇంట్లో దొంగలు పడినప్పటి దృశ్యం – ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు చదవడానికి/చూట్టానికి. మొదటిసారి చదివినప్పుడు నేనక్కడే చిరాకుగా పక్కన పెట్టేశాను. కొన్ని గంటల తరువాత మళ్ళీ తెరిచినప్పుడు, ఆ సంఘటనల తరువాత జెన్నీ తాలూకా సంఘర్షణ కథను ఆక్రమించుకున్నాక ఇక పుస్తకం నన్ను ఆక్రమించుకుందనే చెప్పాలి. గత ఏడెనిమిది నెలల కాలంలో ఒక నాలుగైదు సార్లైనా చదివి ఉంటాను. ఎప్పుడైనా ఏమీ తోచకపోతే జెన్నీ లోపలి మనిషికీ, బయటి ప్రపంచానికీ మధ్య ఎలా ఊగిసలాడుతూ ఉందో చదవడం అలవాటైపోయి, పుస్తకం పర్మనెంటుగా నా మంచం మీదే ఉంటోంది 🙂 ఈ పుస్తకం గురించి ఎక్కువ రాయదల్చుకోలేదు (ఎందుకంటే నాకు చేతకాదు కనక). నాకు బాగా నచ్చిన కొన్ని సంభాషణలను ఉటంకించి ముగిస్తాను:

నాటకం చివ్వర్లో అప్పటికి కోలుకుంటున్న డాక్టర్ జెన్నీ, ఆమె స్నేహితుడు డాక్టర్ థామస్ మధ్య జరిగిన సంభాషణ:

Jenny: “Do you think I’m crippled for the rest of my life? Do you think we’re a vast army of emotionally crippled wretches wandering about calling to each other with words we don’t understand and which only make us even more afraid?”
Thomas: I don’t know.
..
there is an incantation for us who don’t believe.
Jenny: What do you mean?

Thomas: I wish that someone or something would affect me so that I can become real. I repeat over and over: Let me become real one day.
Jenny: What do you mean by real?
Thomas: To hear a human voice and be sure that it comes from someone who is made just like I am. To touch a pair of lips and in the same thousandth of a second know that this is a pair of lips. Not to have to live through the hideous moment needed for my experience to check that I’ve really felt a pair of lips. Reality would be to know that a joy is a joy and above all that a pain has to be a pain.
.. …
Reality is perhaps not at all what I imagine. Perhaps it doesn’t exist, infact. Perhaps it only exists as a longing.

-ఇదంతా నిజానికి మానసికంగా ఆరోగ్యవంతుడిగానే ఉన్న థామస్ చెప్పినా, నాకు జెన్నీ మనసులోని మాటల్లా తోచాయి. మానసిక సమస్యలతో బాధపడేవారినెవరినైనా దగ్గరగా చూసినవారు, లేదా అనుభవించినవారు మాత్రమే అంత స్పష్టంగా, క్లుప్తంగా ఆ స్థితిని గురించి చెప్పగలరేమో అనుకున్నాను (రెండు పాత్రల్లోనూ బెర్గ్మన్ స్వగతాలు ఉన్నాయి అనుకుంటున్నాను కనుక!).

***
జెన్నీ ఇంకా కోలుకోకముందు అనుభవించిన ఒకకలలో ఒక గది తలుపు తెరవాలనుకుంటున్న జెన్నీని అదే కలలో ఉన్న మరో పాత్ర (జెన్నీ నిజజీవితంలో ఉంటాడు ఈ మనిషి) Wankel ఆపుతాడు. వద్దు, మంచిది కాదు, తెరవకు అంటాడు. “నీకక్కడ ఏముందో తెలుసా?” అంటుంది జెన్నీ. “ఎలా తెలుస్తుంది?” అంటాడతను. “మరెందుకు నాకు వార్నింగ్ ఇస్తున్నావ్?” అంటుంది జెన్నీ. దానికతనిచ్చిన జవాబు – “We’re thankful for the horrors we are used to. The unknown ones are worst” – నన్ను కొన్నాళ్ళ బట్టి వెంటాడుతోంది, నినువీడని నీడని నేనే టైపులో‌ 🙂
***
నాకీ పుస్తకం My Stroke of Insight ని గుర్తుకు తేవడానికి కారణం – ఇందులో కూడా డా. జెన్నీకి తన అనారోగ్యం గురించిన స్పృహ ఉండటం. పైన ప్రస్తావించిన కలలో కూడా ఒక పాత్రతో సంభాషణ ఇలా ఉంటుంది:
“…and what are you going to do now?”
“I don’t know. (anxious) Do you realize this is a dream?”
(coughing) “Are you sure?”
“Yes, this is a dream. The whole of this ridiculous spectacle is a result of my illness. You mustn’t forget I’m a pretty experienced doctor. It’s a dream”
***
ఈ‌టైపులో ఉన్నదంతా కాపీ-పేస్టు చేస్తూ పోతానేమో అన్న భయం ఉంది నాకు. అందువల్ల, ఇక ఆపుతున్నాను. ఒక్కముక్కలో చెప్పాలంటే – కథా, కథనం రెండూ నాకు నచ్చాయి. అంతా కళ్ళకి కట్టినట్లు ఉండింది – మానసిక సంఘర్షణతో సహా. సినిమా చూడకుండా పుస్తకం మట్టుకు చదివినా కూడా సినిమా చూసిన భ్రాంతి కలిగింది (నేను మొదట చదివి తరువాత చూశాను). సినిమా చూడకపోతే ఇదంతా తెరపై ఎలా చూపగలిగారు? అన్న ప్రశ్నకి జవాబునీ, జెన్నీగా లివ్ ఉల్మన్ నటననీ మిస్సవుతామన్నది వేరే విషయం!

ఈ కథ గురించి బెర్గ్మన్ తన టీం కు చెబుతూ ఇలా‌ అంటాడు –
“…Actually, it deals (“as usual”, I was about to say!) with Life, Love and Death. Because nothing in fact is more important. To occupy oneself with. To think of. To worry over. To be happy about. And so on”
-నిజమే కాబోలు!!

Face_to_face_movie_poster

పుస్తకం అట్టపైన కనిపిస్తున్నావిడ ఈ సినిమా లో ప్రధాన పాత్రధారిణి ప్రముఖ నటి, దర్శకురాలు, బెర్గ్మాన్ తో దీర్ఘకాల అనుబంధం గల వ్యక్తీ అయిన Liv Ulmann. సినిమా చూడాలనుకుంటే ఆంగ్ల ఉపశీర్షికలతో యూట్యూబులో ఇక్కడ చూడండి. ముందే అన్నట్లు, సినిమాలో కొంత explicit content ఉంటుంది. నాకు ఆట్టే అవసరం అనిపించదు కానీ, సినిమా తీసేది నేను కాదు కద! ఆనక నా దగ్గరకొచ్చి ఏమిటీ ఇలాంటి సినిమా చూడమన్నావు? ఆ సినిమాలో ఆ దృశ్యాలన్నీ ఉన్నాయి! అనకండి. నేనేం చూడమనడం లేదు. మీక్కావాలంటే చూసుకొండి అంటున్నా అంతే! 😉 ఇక ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పలేను. గత ఏడాది అమెరిక సంయుక్త రాష్ట్రాలకి ఒక సమావేశానికని వెళ్ళినపుడు అమెజాన్.కాం ద్వారా కొన్నాను. కొత్త ముద్రణలు వస్తున్నట్లు లేదు.
Face to Face

Ingmar Bergman

Psychological Drama

About the Author(s)

సౌమ్య2 Comments


 1. Halley

  సినిమా చూడకుండా పుస్తకం మట్టుకు చదివినా కూడా సినిమా చూసిన భ్రాంతి కలిగింది (నేను మొదట చదివి తరువాత చూశాను)

  When i first read Vikas Swarup’s “Q&A” i could clearly see a movie before me. It later got shot as Slumdog millionare ( Q&A was the inspiration. The movie had one too many edits anyway). Are you referring to that sort of a feeling here? If i understand this correctly it is a movie script that you read and not a book per se? I thought movie scripts anyway are bound to create a movie like experience when read?


  • సౌమ్య

   >>Are you referring to that sort of a feeling here?
   -No. I am talking about the imagination of a reader. Perhaps scripts are bound to create the experience of a movie – but not every script catches your imagination so much. If all movie scripts affect you equally, what is the point in making so many movies and publishing so many scripts? 🙂 It is just a personal reaction.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Wild Strawberries

నేను రాయబోతున్నది ఒక సినిమా తాలుకా స్క్రీంప్లే గురించి. రచన: ఇంగ్మర్ బెర్గ్మన్. మొదట...
by సౌమ్య
4

 
 

The Fifth Act – ఇంగ్మార్ బెర్గ్మాన్ నాటకాలు

“Images from his work shock us … and haunt us long after we’ve first seen them…” – అని Bergman గురించి ఎవరో అన్న మాట. మిగితా వారి...
by సౌమ్య
0