హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి
హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతున్న సంగతి ఇప్పటికి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న ఆ ప్రదర్శనకు వెళ్ళి నేను చూసొచ్చిన సంగతులు పంచుకుందాం అని ఈ ప్రయత్నం.
* నన్ను ఆకర్షించిన మొదటి స్టాల్, eveninghour.com వాళ్ళది. వీరి ద్వారా పుస్తకాల కొనడం వల్ల, నాకీ మధ్య పుస్తకాల కొట్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే శ్రమ తప్పుతోంది. మీరు గాని ప్రదర్శనకు వెళ్తే, ఈ స్టాల్‍ని చూడమనే చెప్తాను.
* అటు తర్వాత యధావిధిగా పుస్తకాల కొట్లు కనిపించసాగాయి. అంతకు ముందు సంవత్సరాల్లో చూసిన పబ్లిషర్స్, పంపిణీదారులవి. అనేకానేక విషయాల మీద పుస్తకాలు కనిపించాయి, తెలుగు సాహిత్యం, చరిత్ర, జానపద సాహిత్యం, మాన్యువల్స్, గాజెట్స్, ఆర్ట్ ఆండ్ డిసైన్ లాంటి వివిధ కాటగరీలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.
* నేషనల్ బుక్ ట్రస్ట్, బెంగళూరి వారి స్టాల్ లో అనేక భాషల సాహిత్యానికి తెలుగు అనువాదాలు కనిపించాయి. హిందీ కథానికలు, హిబ్రూ కథలు, బెంగాలీ సాహిత్యం, గుజరాతీ కథలు అన్నింటికీ తెలుగు అనువాదాలు ఉన్నాయి. పోయిన ఏడాది ఇదే స్టాల్‍లో అనుకుంటా, నేను “సమకాలీన భారతీయ కథానికలు” అనే కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ప్రచురణలు కొన్నాను. నచ్చాయి బాగా. కాని ఈ సారి ఏమీ తీసుకోకుండానే వచ్చేశాను. ఒకటో, అరో కథలు చదివి, ఈ అనువాద సాహిత్యం నుండి పుస్తకాలు కనుక్కోవచ్చని నాకు బలంగా అనిపిస్తుంది.
* సి.పి. బ్రౌన్ అకాడెమి వారి “సాహితి స్రవంతి” పత్రికకి రెండేళ్ళ చందా కట్టేశాను. ఈ సారి వీరి మోనోగ్రాఫ్‍లు ఏవీ నాకంతగా నచ్చలేదు.
*తెలుగు బుక్ హౌస్ అనే స్టాల్‍లో అనుకుంటా, పిలకా గణపతి శాస్త్రి గారి అనేక రచనలు కనిపించాయి. చైత్ర పూర్ణిమ, విశాల నేత్రాలు లాంటివెన్నో.. నాకా పేర్లన్నీ గుర్తులేవు. కాని కనీసం ఒక ఐదారు పుస్తకాలున్నాయి.
* టోటోచాన్ కు మరో అనువాదం, రైలు బడి అనేక తెలుగు స్టాల్లో విరివిగా కనిపించింది.
*పోయిన ఏడాది లేని స్టాల్స్ – నాకు గుర్తున్నంతలో – మోతీలాల్ బనారసీ దాస్, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, బిహార్ నుండి వచ్చిన ఒకటి రెండు స్టాల్స్. విన్‍స్టల్ చర్చిల్ ప్రపంచ యుద్ధ సాహిత్యం, రీడర్స్ డైజెస్ట్ కండెన్స్డ్ పుస్తకాలు కనిపించాయి.
*మిసిమి పత్రిక వారు “ఆర్ట్స్ ఆండ్ లెటర్స్” అని ఒక స్టాల్ పెట్టారు. లోపలికి వెళ్ళి చూడలేదు గాని, ఈ సారి వెళ్ళినప్పుడు తప్పక చూడాలి.
*వీక్షణం పత్రిక వారి స్టాల్ కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలు కనిపించాయి. వనవాసి, రైలు బడి, బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర, మిట్టూరోడి పుస్తకం లాంటివి.
*తిరుమల రామచంద్ర “హంపి నుండి హరప్ప దాకా”, శ్రీశ్రీ అనంతం కొత్త ముద్రణలు వచ్చాయి. కొత్త అట్టలతో ముద్రణలు బాగున్నాయి. బుచ్చిబాబు గారివి, పాలగుమ్మి గారివి కథల కొత్త భాగాలు వచ్చాయనుకుంట.
*విశాలాంధ్ర వారి స్టాల్ తీవ్ర నిరాశకు గురిచేసింది. పెట్టడానికి మూడు స్టాల్స్ పెట్టినా, ఎక్కడా పుస్తకాలు సరిగ్గా అమర్చలేదు. పోయిన ఏడాది ఉన్న స్టాఫ్ కూడా లేనట్టున్నారు. వారు లేని పుస్తకాలు, అబిడ్స్ బ్రాంచ్ నుండి తెప్పించి మరీ ఇచ్చారు. ఈసారేమో, మాలతిగారి చాతకపక్షుల గురించి అడిగితే, “ఇక్కడ లేవు, అక్కడికెళ్ళి తెచ్చుకోండి” అని బదులిచ్చారు. వీరి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆంధ్రమహాభారతం ఒక కాపీ ఉంది.
*పాలపిట్ట వారి స్టాల్‍లో కవిత్వానికి సంబంధించి చాలా పుస్తకాలు కనిపించాయి. కాశీభట్ల వేణుగోపాల్ వారి కవిత్వమూ దొరికింది. ఇస్మాయిల్ హైకూలు కూడా.
*నవోదయ స్టాల్ లో, ఒకతని చేతిలో రెండు హార్డ్ బౌండ్ పుస్తకాలు కనిపించాయి. రెండూ కలెక్షన్ ఎడిషన్స్ అనుకుంట. ఒక దాని పేరు “తెలుగులో పేరొందిన హాస్య నాటికలూ, వ్యంగ రచనలూ” అనుకుంట. కన్యాశుల్కం మొదలుకొని తెలుగులో వచ్చిన హాస్యభరిత, వ్యంగ్యపూరిత రచనల సమాహారం. బాగుందనిపించింది. May be, it’s the Big book of Telugu Humour! 🙂
*ఎమ్మెస్కో వారు “నా ఇష్టం” పుస్తకానికి ప్రత్యేకంగా ఒక స్టాల్ నిర్వహిస్తున్నారు.
నాకే ఆశ్చర్యం కలిగించే విధంగా, నేనీ సారి బొత్తిగా తక్కువ పుస్తకాలు కొన్నాను. వచ్చే వారాంతం మళ్ళీ వెళ్ళాలి. నిన్న కొన్న నాలుగు పుస్తకాలు:
*ఇడిగిడుగో బుడుగు
*ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ గురించిన పుస్తకం ఒకటి.
*రాయలసీమ రాగాలు (తెలుగు అకాడెమీ ప్రచురణ)
*ఇస్మైల్ హైకూలు
మీ అనుభవాలనూ పంచుకోండి ఇక్కడ మరి..
Srinivas Nagulapalli
రామాచారి గారు
నిజమే చెప్పారు మీరు. అసలు ముందెన్నడూ లేనంతగా సమీక్షలు, విశ్లేషణలు, పరిచయాలు ఇప్పుడే వస్తున్నాయి ఉన్నాయి తెలుగులో, బ్లాగులలో. అసలు ఈ సైటు పుస్తకం.నెట్ సైతం చేసేది అదే కదా.
అయినప్పటికీ ఎందుకో తెలుగులో ఎక్కువమంది అక్షరాస్యులు ఎక్కువగా పనిచేసే శ్రమించే Science, Technology లలో మాత్రం దానికి సరిపోయేంత సాహిత్యం, ప్రచురణలు రావడం లేదు. అసలు పురోగతి అంటేనే ఏ రంగాలు తీవ్రంగా ప్రభావితం చేయగలవో, ఏవి కారణభూతాలో, అవే రంగాలకు సంబంధించిన పుస్తకాలు మాత్రం ఆశ్చర్యంగా తక్కువగా ఉండడం కొంత నిరాశాపరచేదే. పుస్తక ప్రదర్శనలో మిత్రులు పంచుకున్న పై వివరాలు సైతం దీనికి విభిన్నంగా లేదు కదా. ఇకపోతే ఉన్నవి కూడా ఎక్కువగా ప్రాచుర్యానికి నోచుకోకపోవడానికి ఇంకెట్లా చేస్తే, లేక ఇంకేవిధంగా రాస్తే ఆసక్తికరంగా ఆకర్షకరంగా ఉంటుంది, ముఖ్యంగా పిల్లలకు యువతకూ- అని ఆలోచిస్తే ఏమన్నా ఉపయోగమేమో అన్న ఉద్దేశం మాత్రమే.
—-
విధేయుడు
_శ్రీనివాస్
ramachary bangaru
srinivas garu
chadavalisina pustakam gurinchi peddalanu gaani itharulanu adigi prayatnichavachu gadaa.vivida patrikalaalo vimarsha, vishleshana mariyu sweekaramlalo kooda pustakalanu gurinchi vivaristunnarau kadha.aavidhamgaa gooda manam pustakalanu chadive avakakasalu mendu kadha.maa eekonamnunchi aalochinchi prayatninchandi.thappaka prathyutharam mistaru kadha.utharaprakriyanu eevidhamga konasagiddam.
bhavadeeyudu
9949391110
Srinivas Nagulapalli
Thanks for sharing news about Hyderabad book fair-really wish I was
there. Just reading experiences of others sounds so much fun.
Also, no one told about Telugu books on Science or Technology.
Don’t know if there are not many or not much to say about such books!
If former, it is a production issue, and if latter a quality issue,
and if both, simply our issue!
Reading more books on religion and personality development being
sold reminds me of an old joke.
బడి పిల్లలను టీచరు మీకు దేవుడు ప్రత్యక్షం అయి బుద్ధి కావాలా ధనం కావాలా అని కోరుకో అంటే ఏం అడుగుతారు
అంతుంది. చాలా మంది బుద్ధి అని, కొంత మంది రెండు అని అంటారు. ఒక్కడు మాత్రం ధనమే కావాలంటాడు.
ఎందుకని అడిగితే, ఏముంది టీచర్ ఎవరికి ఏది తక్కువైతే వాళ్ళు అది కోరుకుంటారు అంటాడు.
ఫలానా పుస్తకాలు చదవట్లేదు అనే కన్నా, ఫలానా ఎందుకు చదివింపజేసేలా లేవు అని అనుకుంటే
ఉపయోగపడేదేమైనా తడుతుందేమో అనిపిస్తుంది.
====
విధేయుడు
_శ్రీనివాస్
భావకుడన్
బెంగుళూరు పుస్తక ప్రదర్శన మిస్సయ్యాను అన్న కొరత తీరెట్టు (రామకృష్ణ మఠంలో దొరకని పుస్తకాల గురించి మాటాడుతుంటే ఒక ఆటో అబ్బాయి చెపితే తెలిసింది హైదరాబాదు పుస్తక ప్రదర్శన గురించి) దీనికి వెళ్ళగలిగాను.హాపీస్.
కావ్యాలంకార సంగ్రహం..రామరాజ భూషణుడు (ఏమిటో….కావ్య లక్షణాలు చెప్పటానికి ఒక రాజును మరీ ఇంత ఎత్తుకు లేపటం…యాక్:-)
ఎమెస్కో వారి “సాంప్రదాయ సాహితి” శీర్షికన వస్తున్న సీరీస్లోనివి
ప్రభావతీ ప్రద్యుమ్నము…సూరన్న
మనుచరిత్ర…పెద్దన
పారిజాతాపహరణము…తిమ్మన
హరవిలాసము,శృంగార నైషదము……శ్రీనాధ కవి
వైజయంతీ విలాసము…సారంగ తమ్మయ
విజయ విలాసము…చేమకూర వెంకటకవి,
శశాంక విజయము…శేషము వేంకటపతి
శృంగార శాకుంతలము…పిల్లలమర్రి పినవీరభద్ర కవి,
రాధికా స్వాన్తనము…ముద్దు పళని.
మొత్తం బ్రౌణ్యం ఆన్లైన్ ఉంది కాని ఆఫ్లైన్ (సీడీ కాని ఇతరత్రా కాని) దొరికే వెసలుబాటు ఉంటె ఎక్కడో, ఎలానో చెప్పి పుణ్యం కట్టుకోండి…..పైవన్నీ తెలుగే కదా అనుకుని తెచ్చుకున్నా ప్రతి పదానికి అర్థం వెతుక్కోవటం ఖాయమని అర్థమయిపోయింది రెండు రోజులకే 🙂
@రాణాగారు,
మంచిదే కదండీ ….disturbing news అని ఎందుకన్నారో అర్థం కాలేదు…దైవం, వ్యక్తిత్వం….
రెండూ మంచి డోమైన్స్ కదా 🙂
raana
From The HINDU:
Here is a very disturbing piece of news for the progressive minded bibliophiles who are exulting at the turnout for the recently concluded Hyderabad Book Fair. According to publishers and book sellers, majority of the books sold at the fair were either about religion or on personality development.
One more fragment of news from the fair is that film-maker Ram Gopal Varma’s work ‘Naa Ishtam’ proved to be one of the best-sellers.
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article996639.ece
Samera Kumar Peddiraju
Telangana Gramyam lo Srimati Yasoda Reddy garu andevesina cheyyi.
In my childhood i used to hear to Madam speaking on All India Radio in pure telangana language. Soooo Sweet is the dialect and it was more sweater from Madam. I know that she has written some books in pure telanganam.. If they are available in any of the stalls??? If so can anybody let me know…
Sameera Kumar
9880373232
Praveen Sarma
పుస్తక ప్రదర్శనలో ఒక్క స్టాల్‌లోనే డెబిట్ కార్డ్ ద్వారా కొనే సౌకర్యం పెట్టారు. అన్ని స్టాల్స్‌లో పెట్టి ఉంటే బాగుండేది.
కత్తి మహేష్ కుమార్
చారిత్రకనవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ నవలలు
ఆవాహన
అనుభవ మంటపం
రెసిడెన్సీ
విద్యాధర చక్రవర్తి
పటాభి
అచుంబితం
శ్రీపదార్చన
దశాశ్వమేధ
Purnima
ఈ-తెలుగు స్టాల్ పక్కనే, ఒక ప్రదర్శనా స్టాల్‍ను ఏర్పరిచారు. అందులో అందరు ప్రముఖ రచయితల ముఖ చిత్రాలను వాల్ పోస్టర్లుగా అమర్చారు. అవి అమ్మడానికి కావని తెల్సి, నిరాశపడ్డాను. కాని, చూడ్డానికి అవి భలే బాగున్నాయి.
రెండో విడతలో కొన్న కొన్ని పుస్తకాలు:
౧. పతంజలి భాష్యం -కె.ఎన్.వై పతంజలి. (వీరి ఇతర పుస్తకాల గురించి వివరాలు తెలుపగలరా?)
౨. స్వీయచరిత్రము – చిలకమర్తి లక్ష్మీనరసింహము
౩. పరికిణీ – తనికెళ్ళ భరణి
౪. ఇల్లాలి ముచ్చట్లు – పురాణం సీత
౫. పోలేరమ్మ బండ కతలు – ఖదీర్ బాబు
౬. నక్షత్ర దర్శనమ్ – తనికెళ్ళ భరణి
౭. ఆట గదరా శివ – తనికెళ్ళ భరణి
౮. పుణ్యభూమి – బూదరాజు రాధాకృష్ణ
౯. శీతవేళ రానీయకు – కుప్పిలి పద్మ
౧౦. విరాట్
౧౧. కథల అత్తయ్యగారు – నిడదవోలు మాలతి
Sameera Kumar
Dear all,
Did any one found a treatise on Soundarya Lahari called as
Gunanika Vyakhyanam. If so, can you please let me know.
regards
Sameer
Rakesh
I purchased 65 books of TELANGANA PADAKOSHAM by Dr. Nalimela Bhaskar for distribution to specific (target) readers!!
A must read for people from Andhra region as well as Telangana…
(youngsters – who are unaware, on the usage of these words)
నరసింహారావు మల్లిన
శ్రీమదాంధ్ర మహా భారతం టి.టి.డి. వారిది ఎవరూ కొన్నట్టు లేదే.
మాలతి
సరే, పూర్ణిమా. నా అభ్యంతరం ఉపసంహరించుకుంటున్నాను.
మాలతి
ఊరికే అన్నానులెండి. పుస్తకప్రదర్శనలో దొరుకుతున్న పుస్తకం దొరకడంలేదని మీరు రాస్తే, ఆపుస్తకంకోసం అడిగేవాళ్ళు అడగడం మానేస్తారు కదా. పైగా సిరిసిరిమువ్వ చెప్పేక కూడా మీరు గమనించినట్టు లేదు చాతకపక్షులు విశాలాంధ్రలో కాదు ఎమెస్కోవారి స్టాల్ లో దొరుకుతుందని.
Purnima
మీ పుస్తకం *నాకు* దొరకలేదనే రాశాను. అది కూడా విశాలాంధ్ర వారు నన్ను నిరాశపరిచిన విధానం చెప్పడానికి అంతే! సిరిసిరిమువ్వగారు చెప్పాక, నా లిస్ట్ లో నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఆవిడకు బహిరంగంగా “థాంక్స్” చెప్పడానికి బద్దకించాను.
అంతేగాని, మీ పుస్తకం మీద నేను ఎటువంటి దుష్ప్రచారమూ చేయలేదని గమనించమని ప్రార్థన! 😛
మాలతి
@ పూర్ణిమ, నా చాతకపక్షులు పుస్తకం ఎమెస్కో వారి స్టాల్ లో ఉందనీ, తనస్నేహితురాలు కొందనీ ఇప్పుడే ఒక స్నేహితురాలు నాకు మెయిలిచ్చింది. మీకు నామీద ఏమైనా కోపం వచ్చిందేమిటి?
Purnima
కోపం దేనికి? దేని మీద?
నాకర్థం కాలేదు!
Raana
Here is a funny ( real?) take on book exhibitions
or rather more on visitors,in Andhra jyothy.
https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/dec/21/navya/21navya3&more=2010/dec/21/navya/navyamain&date=12/21/2010
sujata
Oh Waow Purnima. I wish I could make it. I want to buy ‘Humpy nunchee Harappaa daakaa’ badly. U are really good.
Purnima
Sujata: If you can’t make it, drop me an email! We’ll see how we can get it for you. 🙂
కల్హార
నేను కొన్న పుస్తకాలు..
————————-
వనవాసి
రెండో పాత్ర – విన్నకోట రవిశంకర్
కాశీభట్ల కవిత్వం – ఒక బహుముఖం
పాకుడు రాళ్ళు – రావూరి భరద్వాజ
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, నవల్లు
బుచ్చిబాబు కథలు రెండో సంపుటం
యమకూపం
భాగవతం
గువ్వలచెన్న శతకం
కలుపు మొక్కలు – శ్రీపాద సుబ్రఃహ్మణ్యశాస్త్రి
ఇస్మాయిల్ హైకూలు
కుప్పిలి పద్మ కథలు – మంచుపూల వాన
Ramanujan – Indian folk tales
సీ పీ బ్రౌన్ పత్రిక
పాలపిట్ట పత్రిక
బుడుగు కార్టూన్ లు
ద్వా నా శాస్త్రి కథలు
కవిత – 2009 సంకలనం
విశ్వదర్శనం భారతీయ చింతన
కృష్ణ శాస్త్రి సాహిత్యం- ఐదవ సంపుటం – వ్యాసావళి
పాలగుమ్మి పద్మరాజు కథలు – రెండవ సంపుటం
మనుచరిత్రలో మణిపూసలు
టోటో-చాన్ -వాసిరెడ్డి సీతాదేవి అనువాదం
అతడు అడవిని జయించాడు
విరాట్
భమిడిపాటి కామేశ్వర్రావు హాస్య వల్లరి
ఆమె ఎవరైతేనేం – కవిత్వం- కే శివారెడ్డి
కవిత్వం లో నిశ్శబ్ధం – ఇస్మాయిల్ వ్యాసాలు
కొమ్మకొమ్మకో సన్నాయి – వేటూరి సుందర్రామ్మూర్తి
Thank to Purnima – తోడొచ్చి పుస్తకాలు ఎంచి పెట్టినందుకు.
సిరిసిరిమువ్వ
పూర్ణిమా, మీరు మాలతి గారి చాతక పక్షులు పుస్తకం కోసం ఎమెస్కో వారి స్టాల్సు చూసారా!!
వారి స్టాల్స్: 103, 228, 229
Purnima
may be @ Motilal Banarasi Das.. but it wasn’t there last time. At least, we didn’t get a visiting card or so from them, when we roamed stall to stall. Hence assumed it wasn’t.
Corrected.. @ Navodaya!
By the way, the whole of post is according to my limited knowledge. What happened to interest me. So, there is much scope for factual errors, I guess.
సౌమ్య
మోతీలాల్ బనారసీ దాస్ – Was there in all the Hyd book fairs i saw so far…as far as i remember.
>>నవోదయ స్టాల్ లో, ఒకతను రెండు హార్డ్ బౌండ్ పుస్తకాలు కనిపించాయి
-???