గొల్లపూడి గారి రీడింగ్ లిస్టు

[ప్రముఖ రచయిత, నటుడు, మంచి చదువరీ అయిన గొల్లపూడి మారుతీరావు గారికి నచ్చిన తెలుగు పుస్తకాల లిస్టు ఇది. అడగ్గానే స్పందించినందుకు మారుతీరావు గారికి అనేకానేక ధన్యవాదాలు. ఆయనను పోయిన సంవత్సరం పుస్తకం.నెట్ లో ఇంటర్య్వూ చేసిన విషయం సైటు వీక్షకులకు గుర్తుండే ఉంటుంది.. (మొదటి భాగం, రెండో భాగం).]

ఇదిగో ఆయన సూచించిన తెలుగు పుస్తకాల జాబితా:

1.నా యెరుక – ఆధిభట్ల నారాయణదాసు
2.అనుభవాలు-జ్ఞాపకాలూనూ – శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
3. నా స్మృతి పథంలో – అచంట జానకీరామ్
4. కృష్ణపక్షము – దేవులపల్లి కృష్ణశాస్త్రి
5. ఆరుసారా కథలు – రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి గారి నాలుగార్లు – ఆరుసారా కథలు, ఆరు సారో కథలు, ఆరుచిత్రాలు, మరో ఆరుచిత్రాలు పై మాలతి గారి వ్యాసాలు
ఇక్కడ చూడవచ్చు.)
6.అల్పజీవి – రాచకొండ విశ్వనాథశాస్త్రి
7.మహాప్రస్థానం – శ్రీశ్రీ (శ్రీశ్రీ రచనలపై పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
8.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్
9.కొవ్వలి నవలలు (దాదాపు అన్నీ)
10.జంపన నవలలు (కొన్ని)
11.కన్యాశుల్కం – గురజాడ అప్పారావు నాటకం
12.ఆత్మకథ – విశ్వనాథ సత్యనారాయణ
13.హంపీ నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర (రామచంద్ర గారి రచనలపై పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ)
14.నా స్వామి – శతకం – శంకరంబాడి సుందరాచారి
15.దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర
16.మనసులో మాట – అక్కినేని
17.చివరకు మిగిలేది – బుచ్చిబాబు
18.కవితా పుష్పకం – దాశరథి
19.యాత్రాస్మృతి – దాశరథి
20. నేనూ-మా నాన్న – బుజ్జాయి (కృష్ణశాస్త్రి గురించి)

(మారుతీరావు గారి ఆత్మకథ ’అమ్మ కడుపు చల్లగా’ పై విష్ణుభొట్ల లక్ష్మన్న గారు పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం లంకె ఇక్కడ).

You Might Also Like

3 Comments

  1. HANUMANTH

    నేను రవి శాస్త్రి గారి ” ఆరు సారా కథలు ” పుస్తకం కొరకు వెతుకుచున్నాను , దయచేసి ఎక్కడ దొరుకుతుందో తెలియచేయగలరు , కృతఙ్ఞతలు 🙂

    హనుమంతు (న్యాయవాది) : 8121112333
    ,విజయవాడ.

  2. సంతోష్ సూరంపూడి

    ఇరవై పుస్తకాలకు ఎనిమిది పుస్తకాలు ఆత్మకథలు కావడం చాలా ఆనందం కలిగించింది.నేను ఆత్మకథల అభిమానిని.ఆత్మ కథలు కాలాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.సాహితీ ప్రక్రియలన్నింటిలోకి ఆత్మకథలే తలమానికం అని నా అభిప్రాయం.
    ఈ ప్రముఖ రచయితలు మెచ్చిన పుస్తకాలు ఇవ్వడం చాల బావుంది.కాని దాంతో పాటు రెండు లైన్ల నోట్ రాయిస్తే మరింత బాగుంటుంది.
    –సంతోష్ సూరంపూడి

  3. సౌమ్య

    ఇక్కడ హైపర్లింకులు లేవంటే పుస్తకం.నెట్ ఎరుకలో ఆ పుస్తకాల వివరాలు ఆన్లైన్లో కనబడనట్లే అనుకుంటే – అవి చదివినవారు తక్షణమే వాటి గురించి ఇక్కడ (మీకిక్కడ ఇష్టంలేకుంటే ఎక్కడో ఒకక్కడ) అర్జెంటుగా రాయాల్సిన అవసరం ఉంది. ఉందా?

    మంచి జాబితా ఇచ్చినందుకు మారుతీరావు గారికి ధన్యవాదాలు.

Leave a Reply