విశ్వనాథ ఆత్మకథ

రాసిన వారు: గొల్లపూడి మారుతీరావు గారు

(సెప్టెంబర్ 10, విశ్వనాథ జయంతి సందర్భంగా నిన్న భైరవభట్ల కామేశ్వరరావు గారి సమీక్షా వ్యాసాన్ని ప్రచురించాము. ఇవాళ గొల్లపూడి మారుతీరావు గారు విశ్వనాథ ‘ఆత్మకథ’ గురించి రాసిన వ్యాసం ప్రచురిస్తున్నాము. ఈ వ్యాసం మొదట 21 జులై 2005 లో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతించిన గొల్లపూడి గారికి మా ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
***************************************************************
viswanaathaస్కాన్ చేసిన పేజీలు కావడం వల్ల పీడీఎఫ్ లోకి మార్చి పెడుతున్నాము. వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

You Might Also Like

8 Comments

  1. శివరామప్రసాద్ కప్పగంతు

    ఈ సాహిత్య అద్భుతం గురించి ఆలస్యంగా చూశాను. పైన ఉన్న వ్యాఖ్యలలో శ్రీ పన్నాల సుబ్రహమణ్య భట్టు గారు విశ్వనాథ గారిని ఆత్మ కథ కొనసాగించమని కోరారని వారు ఒక అధ్యాయం రికార్డు చేసారని ఉన్నది. భట్టు గారు ప్రముఖ రేడియో కళాకారులు. ఆయన ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి వచ్చిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు స్వయంగా పర్యవేక్షించారు. వారు రికార్డు చేసిన ఒక అధ్యాయం కూడా దొరికి పుస్తకం.నెట్ లో ప్రచురిస్తే ఎంతయినా బాగుంటుంది. నాకు బాగా గుర్తు, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి 1980 ప్రాతాలలో విశ్వనాథ వారి ఇంటర్వ్యూ దాదాపు ఒక గంట నిడివి గలది ప్రసారం అయ్యింది. దురదృష్టవశాన అప్పుడు నా దగ్గర రికార్డు చేసే అవకాసా లేకపొయ్యింది. ఈ రికార్డింగు ఎవరిదగ్గరైనా ఉంటే విశ్వనాథ వారి గొంతులోనే ఆయన జీవిత వివరాలు కొన్ని మనం వినేఅవకాసం ఉన్నది. ఆకాశవాణి వారి వద్ద ఈ రికార్డింగు ఉంది ఉంటే, వారు ఎక్కడైనా నెట్లోకి అప్లోడ్ చేస్తే ఎంతైనా బాగుంటుంది. ఇటువంటి ఆని ముత్యాలు, ఆకాశవాణి వారివద్ద ఉన్న సంగతి, ఇప్పటి వారి సిబ్బందికే తెలియదేమో. తెలిసినా ఆసక్తి ఉండాలి.

    ఇప్పటికి విశ్వనాధ వారి జీవిత వివరాలు వారే వ్రాసుకున్న 65 పేజీలు పావని శాస్త్రిగారు వ్రాసిన విషయాలు, భట్టుగారు సేకరించిన ఒక అధ్యాయం, ఇంకా ఇలా ఇతరుల దగ్గర ఉన్న విసేశాలన్ని కలగలిపి ఒక సమగ్ర జీవిత చరిత్రగా ప్రచురించగలిగితే సాహితీ అభిమానులు సంతోషిస్తారు, ఒక అరుదైన రచయిత గురించి ఇప్పటి తరానికి రాబొయ్యే తరాలకు తెలియచెప్పే అవకాశం ఉంటుంది. కాని ఈ పని చేయ్యగాలవారు ఎవ్వరు!

  2. కౌటిల్య

    కామేశ్వరరావు గారూ,
    గొల్లపూడి గారు రాసేశారు కదండీ! అంతకన్నా విపులంగా నేను రాయగలననుకోను…ధన్యవాదాలు..

  3. కామేశ్వర రావు

    కౌటిల్యగారూ,

    అయితే ఆ పుస్తకాన్ని గురించి మీరిక్కడ పరిచయం చెయ్యాలి.

  4. కౌటిల్య

    కామేశ్వరరావు గారూ,
    “నారాముడు -నా రామాయణము” వేరే…”ఆత్మకథ” వేరే…నా చిన్నతనంలో పదేళ్ళ వయసులో చదివా..నాన్నగారి దగ్గరున్న అపురూపమైన పుస్తకం…నన్ను కూడా ముట్టుకోనిచ్చేవారు కాదు..నాన్న లేనప్పుడు దొంగచాటుగా తీసి చదివేవాణ్ణి..నాన్న వచ్చాక నా వీపు పేలిపోయేదనుకోండి..ః)…అందులో ఉన్న సంఘటనలన్నీ నాకు జరుగుతున్నట్టే ఊహించేసుకునేవాణ్ణీ…

  5. పుస్తకం » Blog Archive » గొల్లపూడి గారి రీడింగ్ లిస్టు

    […] – గురజాడ అప్పారావు నాటకం 12.ఆత్మకథ – విశ్వనాథ సత్యనారాయణ 13.హంపీ నుండి […]

  6. కొత్తపాళీ

    @ సౌమ్య .. నాకర్ధమయ్యింది .. సత్యనారాయణ గారు తన అన్నయ్య పెండ్లి మేనమామ కూతురితో జరిగిన విశేషం చెప్పుకొచ్చారు. అందుకని ఆ వాక్యం అలా దొర్లి ఉంటుంది. ఆ అన్న సత్యనారాయణగారికి సవతి అన్న కాకపోతే, ఆ మేనమామగారు అన్నదమ్ములిద్దరికీ మేనమామ అయే ఉండాలి.

  7. కామేశ్వర రావు

    మేనమామ ఇంటిపేరూ కాదు, ఆ వాక్యంలో అచ్చుతప్పూ లేదు. “అన్నయ్య” అంటే అక్కడ పినతండ్రిగారి కొడుకు. అతను విశ్వనాథ కన్నా ఏడాది పెద్ద. అతని మేనమామ సితారామశాస్త్రిగారు. వాళ్ళమ్మాయిని విశ్వనాథ కిచ్చి పెళ్ళిచేసారు.
    విశ్వనాథవారిని చేసుకుంటామని ఒక పెద్దింటి సంబంధం వచ్చిందిట. దానికి విశ్వనాథ తండ్రి శోభనాద్రిగారు, మా తమ్ముడి కొడుకు మా యింట్లో పెద్దబ్బాయి. అతనికి అవ్వకుండా విశ్వనాథకి ఎలా చెయ్యడం అన్నారట. అప్పుడు వాళ్ళు శోభనాద్రిగారి తమ్ముడి కొడుకునే చేసుకుంటామైతే అని అడిగారట. అంచేత శోభనాద్రిగారి మాటమీద అతని పెళ్ళి జరిగింది. ఆ తమ్ముడి బావమరిది సీతారామశాస్త్రిగారు నొచ్చుకొని, అయిన సంబంధం మేమున్నా ధనవంతులని వేరే సంబంధం వాళ్ళ తమ్ముడి కొడుక్కి తెచ్చి చేసారని ఆక్షేపించారట. అప్పుడు తనకలాంటి ఉద్దేశం లేదని విశ్వనాథని వాళ్ళమ్మాయికిచ్చి చేసారు.

    మారుతీరావుగారు ప్రస్తావించిన విశ్వనాథ ఆత్మకథ బహుశా “నా రాముడూ – రామాయణమూ” అయ్యుంటుంది. విశ్వనాథ స్వీయ చరిత్ర అతని చేత వ్రాయించేందుకు రెండు మూడు గట్టి ప్రయత్నాలే జరిగినట్టున్నాయి.
    పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారని ఒకరు పట్టుబట్టి విశ్వనాథతో ఆత్మకథ చెప్పే ప్రయత్నం చేసి ఒక అధ్యాయం చెప్పించి రికార్డు చేసారట. అది “విమర్శిని” అనే పత్రికలో (1977 సం. విశ్వనాథ ప్రత్యేక సంచికగా తెచ్చారు) ప్రచురించారు.
    విశ్వనాథ జీవితాన్ని గురించి రకరకాల చోట్ల లభించిన విషయాలన్నిటినీ క్రోడీకరించి పుస్తకంగా తేవాలని చివరిసారిగా పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ప్రయత్నించారు. అది పూర్తికాకుండానే అతను పరమపదించారు. అతను సేకరించి రాసుకున్న నోట్సుని కోవెల సంపత్కుమారాచార్యగారిచేత పరిష్కరింప చేసి, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారు “విశ్వనాథ ఒక కల్పవృక్షం” అనే పేరుతో 2005 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అందులో విశ్వనాథవారి జీవిత వ్యక్తిత్వాల గురించి చాలా వివరాలే ఉన్నాయి.
    ఇప్పుడు పావనిశాస్త్రిగారుకూడా లేరు. అతని “ఆత్మా వై కథ” సంగతి ఇప్పుడేమయ్యిందో మరి!

  8. సౌమ్య

    బాగుందండీ!
    విశ్వనాథ గారి ఆత్మకథ అంటే, నాకు చాలా కుతూహలంగా ఉంది ఎలా ఉంటుందో అని… పురాణవైరం సిరీస్ కాస్త చదివాక, ఇదివరలో ఆయనంటే ఉన్న భయం చాలా తగ్గి, కుతూహలం పెరిగిపోయింది. 🙂

    ఇంతకీ, ఈ వ్యాసం పరంగా నాకు ఓ సందేహం:
    నాకు ఒకటి అర్థం కాలేదు: రెండో పేజీలో మొదట్లో – “కొల్లూరు దగ్గర అనతవనము అన్న గ్రామం ఉంది. అక్కడ విశ్వనాథవారి అన్నయ్య మేనమామ సీతారామశాస్త్రి గారు భిక్షాటనము చేసుకుని బ్రతికేవాడు..”
    – అన్నయ్య మేనమామ అంటే? మేనమామ అన్నది ఓ ఇంటిపేరా? లేకుంటే, వాక్యంలో ఏదన్నా పొరపాటు దొర్లిందా?

Leave a Reply