పుస్తకం
All about booksపుస్తకలోకం

May 21, 2011

ఒక పుస్తక ప్రదర్శన – ఫోటోలు

More articles by »
Written by: సౌమ్య

మా ఊళ్ళో శనివారం అంటే, సంతలా ఉంటుంది డౌన్‌టౌన్ వీథుల్లో.  ఆ మధ్యన ఒక శనివారం రోడ్ల వెంబడి నడుస్తూ ఉంటే, ఉన్నట్లుండి ఒక చోట గుంపులు గుంపులుగా జనం ఒక చోట టేబుళ్ళపై ఏవో వెదుక్కుంటున్నారు. ఏమిటా, అని ముందుకొచ్చి చూస్తే, బోర్డు కనిపించింది. ఓసియాండర్ వారి పుస్తక ప్రదర్శన, 29-30 ఏప్రిల్ 2011 అని. రోడ్డుపైనే పుస్తకాలు అలా డబ్బాల్లో పెట్టి ఉన్నాయి. అందరూ గుంపుగుంపుగా వచ్చి, ఏరుకుంటున్నారు. కొందరు అక్కడే తదేకంగా చదువుకుంటున్నారు.

ఇదంతా ఎక్కడన్నా జరిగేదే కదా! అంటారా? నిజమే. కానీ, ఇక్కడ ప్రత్యేకంగా నాకు నచ్చిన అంశాలేమిటి? అంటే –

1. అలా ఆరుబయట పుస్తకాలు పరిచేస్తే, జనాలు పద్ధతిగా బ్రౌజ్ చేస్కుంటూ (ఎవరన్నా కొట్టేస్తారేమో అన్న బెంగ లేకుండా) తిరగడం
2. పుస్తకాలన్నీ జర్మన్ వే కావడం (నేను చాలా ప్రయత్నిస్తే, జర్మన్ వెజిటేరియన్ వంటకాల గురించిన పుస్తకం ఒక్కటి మాత్రం ఆంగ్లం లో కనబడ్డది. నాకు కొనే ఉద్దేశ్యం లేదనుకోండి, అది వేరే విషయం.)

ఈ ఓసియాండర్ అన్న షాపు 1596నుంచీ ఉందిట!! సైటు జర్మన్ లో ఉండటం మూలానా, గూగుల్ ట్రాన్స్లేట్ సరిగా ఆంగ్లానువాదం ఇవ్వని మూలానా, నాకాట్టే అర్థం కాలేదు వీళ్ళ చరిత్ర. తెలుసుకున్నప్పుడు మళ్ళీ రాస్తాను. ఇప్పటికి మాత్రం, ప్రదర్శన తాలూకా ఫొటోలు కొన్ని:About the Author(s)

సౌమ్య3 Comments


 1. raani

  సౌమ్యగారూ,
  ఓసియాండర్ జిందాబాద్
  ఇక్కడ కూడా అలాంటి పుస్తకాల సంత జరిగితే ఎంత బాగుంటుందోనని కలలు కనేవారిలో నేనూ ఉన్నాను.
  ఆ కలని నిజం చేసుకునే అవకాశం లేకపోయినా..,
  అలాంటి అవకాశాన్ని పొందినవారి ఛాయా చిత్రాల్ని చూసే అవకాశం కల్పించినందుకు మీకు నా అభివందనాలు.


 2. vineela

  ఇవ్వాళ మా ఊర్లో కూడా పుస్తకాల అమ్మకం జరిగింది..అచ్చు మీరు రాసినట్టే చక్క గ డబ్బా లలో పుస్తకాలని చూసుకుంటూ నచ్చినవి కొనుక్కుంటున్నారు..ధర ఎంతో తెలుసా…ఈ పుస్తకమైన ౧$ ఏ..నాకు ఎక్కువ పుస్తకాలూ కనబడేసరికి అన్ని వెతికే ఓపిక లేక john grisham’s the summon, jane austen’s pride & prejudice కొనుక్కోచాను. వచ్చే వారం ౩ రోజులు సెలవులు..అప్పటికి కాలక్షేపం..చదివి రాస్తాను రివ్యూ 🙂


 3. murty

  చాలా బాగుంది ఇండియాలో ఎప్పుడు అలా కొనగలం?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0