ఒక పుస్తక ప్రదర్శన – ఫోటోలు

మా ఊళ్ళో శనివారం అంటే, సంతలా ఉంటుంది డౌన్‌టౌన్ వీథుల్లో.  ఆ మధ్యన ఒక శనివారం రోడ్ల వెంబడి నడుస్తూ ఉంటే, ఉన్నట్లుండి ఒక చోట గుంపులు గుంపులుగా జనం ఒక చోట టేబుళ్ళపై ఏవో వెదుక్కుంటున్నారు. ఏమిటా, అని ముందుకొచ్చి చూస్తే, బోర్డు కనిపించింది. ఓసియాండర్ వారి పుస్తక ప్రదర్శన, 29-30 ఏప్రిల్ 2011 అని. రోడ్డుపైనే పుస్తకాలు అలా డబ్బాల్లో పెట్టి ఉన్నాయి. అందరూ గుంపుగుంపుగా వచ్చి, ఏరుకుంటున్నారు. కొందరు అక్కడే తదేకంగా చదువుకుంటున్నారు.

ఇదంతా ఎక్కడన్నా జరిగేదే కదా! అంటారా? నిజమే. కానీ, ఇక్కడ ప్రత్యేకంగా నాకు నచ్చిన అంశాలేమిటి? అంటే –

1. అలా ఆరుబయట పుస్తకాలు పరిచేస్తే, జనాలు పద్ధతిగా బ్రౌజ్ చేస్కుంటూ (ఎవరన్నా కొట్టేస్తారేమో అన్న బెంగ లేకుండా) తిరగడం
2. పుస్తకాలన్నీ జర్మన్ వే కావడం (నేను చాలా ప్రయత్నిస్తే, జర్మన్ వెజిటేరియన్ వంటకాల గురించిన పుస్తకం ఒక్కటి మాత్రం ఆంగ్లం లో కనబడ్డది. నాకు కొనే ఉద్దేశ్యం లేదనుకోండి, అది వేరే విషయం.)

ఈ ఓసియాండర్ అన్న షాపు 1596నుంచీ ఉందిట!! సైటు జర్మన్ లో ఉండటం మూలానా, గూగుల్ ట్రాన్స్లేట్ సరిగా ఆంగ్లానువాదం ఇవ్వని మూలానా, నాకాట్టే అర్థం కాలేదు వీళ్ళ చరిత్ర. తెలుసుకున్నప్పుడు మళ్ళీ రాస్తాను. ఇప్పటికి మాత్రం, ప్రదర్శన తాలూకా ఫొటోలు కొన్ని:

You Might Also Like

3 Comments

  1. raani

    సౌమ్యగారూ,
    ఓసియాండర్ జిందాబాద్
    ఇక్కడ కూడా అలాంటి పుస్తకాల సంత జరిగితే ఎంత బాగుంటుందోనని కలలు కనేవారిలో నేనూ ఉన్నాను.
    ఆ కలని నిజం చేసుకునే అవకాశం లేకపోయినా..,
    అలాంటి అవకాశాన్ని పొందినవారి ఛాయా చిత్రాల్ని చూసే అవకాశం కల్పించినందుకు మీకు నా అభివందనాలు.

  2. vineela

    ఇవ్వాళ మా ఊర్లో కూడా పుస్తకాల అమ్మకం జరిగింది..అచ్చు మీరు రాసినట్టే చక్క గ డబ్బా లలో పుస్తకాలని చూసుకుంటూ నచ్చినవి కొనుక్కుంటున్నారు..ధర ఎంతో తెలుసా…ఈ పుస్తకమైన ౧$ ఏ..నాకు ఎక్కువ పుస్తకాలూ కనబడేసరికి అన్ని వెతికే ఓపిక లేక john grisham’s the summon, jane austen’s pride & prejudice కొనుక్కోచాను. వచ్చే వారం ౩ రోజులు సెలవులు..అప్పటికి కాలక్షేపం..చదివి రాస్తాను రివ్యూ 🙂

  3. murty

    చాలా బాగుంది ఇండియాలో ఎప్పుడు అలా కొనగలం?

Leave a Reply