పుస్తకం
All about booksఅనువాదాలు

November 3, 2010

Loveless Love – Luigi Pirandello

More articles by »
Written by: Purnima
Tags:

ఇట్లాంటి టైటిల్లు చూడగానే నాకు ఈల వేయాలనిపిస్తుంది. మరేమో నా ఇమేజ్‍కి సూట్ కాదని ఊరుకుంటాను. (ఇమేజ్‍కి సూట్ కాకపోవటం అంటే ఈల వేయటం చేతకాకపోవటం అని ఒక అర్థం.) అందుకని కాస్త గోల చేస్తున్నానన్న మాట.

ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు అంత కఠినం.. టింగ్ టింగ్ టింగ్ – ఇది లవ్లీ లవ్! మన సినిమాలూ, సాహిత్యాలు నూరి, నూరి పోయడం వల్ల మనం ఇదే నిజం అని నమ్మి కూర్చున్నాం. అదెలా ఉంటుందంటే – నన్ను తిట్టకూడదు ఈ పోలికకు మరి! “మరకలు మంచివి” అన్న సర్ఫ్ ఎక్సల్ ఆడ్స్ జనాల్లోకి చొచ్చుకొనిపోయి, పాతుకుపోగలిగితే, కొన్ని దశాబ్దాల తర్వాత, పిల్లలు బట్టలు మాపుకొని రాకపోతే, అమ్మలు కొఠేస్తారు. (కొట్టేస్తారు అన్న అసలు స్పెల్లింగ్ వచ్చు నాకు!)  ఇది సాధ్యమే!

ప్ర్రియురాలు ఎంత మధురం. ప్రేమ అంత కఠినం… డింగ్ డింగ్ డింగ్ – ఇది లవ్‍లస్ లవ్ అన్నమాట! ఇట్లాంటివి సినిమాల్లో చూపించరు. ఒహ వేళ చూపించినా జనాలు చూడరు. జరిగిన కథేంటంటే… ’”ఓసోస్, ఆల్రెడి నా జీవితంలో నేను చూసినవి, చూస్తున్నవీ తీస్తే, రాస్తే నాకు ఎక్కవ” అన్నాడు పాఠకుడు / ప్రేక్షకుడు.
“అలానా? సరే, నీకో కొత్త లోకం చూపెడతాం రా – అంతా నీలోకంలానే ఉంటుంది, కాని నీకు నచ్చవే ఉంటాయి” అన్నారు వీళ్ళు. అలా చూసి, చూసి, అసలు జీవితాల్లో ఉన్నదాన్ని విస్మరించడమో, లేక గుర్తించకపోవడమో మొదలయ్యింది. (అని నేను అనేసుకుంటున్నాను)

చూడగానే మనసు పారేసుకొనేంత అందగత్తె కాదు, ప్రేమంటే. వేపుకొని – ఓ వేళ అది డైటింగ్ మీదుంటే కాల్చుకొనీ – తినేస్తుంది అని మరచిన నిజాన్ని గుర్తుతెచ్చే రచన ఇది. అందుకని ప్రేమను పల్లెత్తు (దీని స్పెల్లింగ్ నాకు తెలీట్లేదు) మాటంటే పళ్ళు రాలగొట్టే ఆవేశం ఉన్నవాళ్ళు ఇది చదవకండి. (ఇది = నా వ్యాసమూ, ఆ పై పుస్తకమూ)

ముందుగా పుస్తకంలో ఏముందో చెప్తాను.

పుస్తకం చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో మూడు చిట్టి కథలు. ఇటాలియన్ భాష నుండి ఆంగ్లంలోకి అనువాదం చేయబడ్డాయి.

మొదటి కథ The Wave – ఇందులో ఒక ఇంటి యజమాని ఉంటాడు. తన ఇంట్లో  అద్దెకు దిగిన అమ్మాయిలను ప్రేమిస్తూ (flirting ) ఉంటాడు. అలా ఒకసారి ఓ అమ్మాయి వస్తుంది.  ఇతను ఎంతగా ఆమె మీద శ్రద్ధ పెట్టినా, ఆమె అట్టే పట్టించుకోదు అతడిని. ఆనక, ఆ అమ్మాయికి వంట్లో బాగోటం లేదనీ, అది మానసిక వ్యధ అనీ, ఆమెకు ఎవరితో అయితే నిశ్చితార్థం అయిందో, అతడిప్పుడు పెళ్ళికి నిరాకరిస్తున్నాడనీ తెల్సుకున్నాక, ముందున్న ప్రేమకు ఇప్పుడు జాలి కలిసి ఇతడి భావోద్వేగాలు పేట్రేగిపోతాయి. అంత అందమైన అమ్మాయిని తృణీకరించి వాడేం నష్టపోతున్నాడో చూపించగల సత్తా తనకే ఉందనుకొని, ఆ పిల్ల తరఫున వాళ్ళతో మాట్లాడతాడు, సంబంధం కుదిరి, పెళ్ళి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉందన్నది తక్కిన కథాంశం.

రెండో కథ The Signorina – ఇదో ప్రేమలో ఉన్న ఆడపిల్ల కథ. ఆమెకి ఒకరంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని తనకు తానుగా వ్యక్తీకరించడానికి సిద్ధపడదు. ఆమె ప్రేమించిన మనిషీ, ఆమెతోనే పీకలోతు ప్ర్రేమలో ఉన్నా కాస్తైనా బయటపడడు, కారణాంతరాల వల్ల. పైనా ఆమెకు తగ్గ వరుణ్ణి వెతికే బాధ్యత ఆమె తండ్రి అతడికే అప్పగిస్తే, దాన్ని స్వీకరించి, అందుకు తగ్గ చర్యలు చేపడతాడు. స్వయంగా వెళ్ళి ఆమెకి ఈ విశేషాలు చెప్పుకొస్తాడు. ఇక లాభం లేదనుకొని ఆమె మనసు విప్పి అసలు మాట చెప్పేస్తుంది. అప్పుడు అతడేం చేస్తాడు? ఒప్పుకుంటాడా? తిరస్కరిస్తాడా? ఆమె వాటికి ఎలా స్పందిస్తుంది? అన్నదాంతో కథ ముగుస్తుంది.

మూడో కథ A Friend to the Wives – ఇది కాస్త తమాషా కథ. ఒకామె ఉంటుంది. చాలా అందంగా. తెలివైనది కూడా. ఆమెకు సంబంధాలు బాగానే వస్తున్నా, ఆ కాబోయే పెళ్ళికొడుకులు ఆమెను కాక, వేరొకరిని పెళ్ళాడ్డం జరుగుతూ ఉంటుంది. మొదట్లో షాక్ అవుతుంది కాని, చాలా సార్లు అలా జరిగేసరికి అలవాటుపడిపోతుంది. అయితే ఈ పెళ్ళైన వాళ్ళు భార్యలు తీసుకొని ఆమె ఉన్న ఊర్లోనే కాపురాలు పెడ్డం, ఆమె ఆ కొత్త పెళ్ళికూతుర్లకి మంచి స్నేహంగా మారటం వల్ల, సంసార విషయాలన్నీ ఆమెకు తెలీటం. ముందు బయట నుండి మద్దతిచ్చినా, రానురాను వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో నేరుగా కల్పించుకుంటుంది. అప్పుడు ఆ ముగ్గురి జీవితాలూ ఎలా మలుపు తిరిగాయి అన్నది కథ.

ఇప్పుడు మొదటి కథనే తీసుకుందాం: దీనిలో జనరంజికంగా చెప్పాలంటే, ఆ అమ్మి మొదటి ప్రేమను భగ్నప్రేమగా రాసుకోవచ్చు. ఇప్పటికే బోలెడు కథలూ, కావ్యాలూ వచ్చాయి ఆ టాపిక్ మీద. “గతి లేక మరొకరితో స్థిరపడింది. చావు కన్నా భయంకరమైనవి ఉంటాయి” అంటూ ముగిస్తే జనాలు బకెట్లకు బకెట్లు నింపేస్తారు. కాని ఈయన హైలైట్ చేసే పాయింట్ అది కాదు. మరొకరి చే తిరస్కరించబడ్డ యువతిని ఇష్టపడుతూ, ఆమెపై జాలి పడి, ఆమెను తిరస్కరించినవాడి కన్నా నాదెంతో గొప్ప టేస్ట్ అని పొంగిపోతూ, ఆమె తొలి ప్రేమ కలిగించే అభద్రతా భావంలో మగ్గుతూ ఉన్న మనిషి కథ! ఇందులో ఇష్టపడ్డం వరకే ప్రేమ! తర్వాతవన్నీ నాన్-ప్రేమ అంటారు కొంతమంది. ఏమో. అంతా ప్రేమేనని నా ఉద్దేశ్యం. రచయితది కూడా అదే అనుకుంటాను.

పిరన్‍దల్లో కథలు “ప్రేమంటే ఏమిటీ?” అన్న ప్రశ్నలు లేవనెత్తవు. “ఇదీ ప్రేమంటే!” అన్న తీర్పులూ ఉండవు. మనుషులెన్ని రకాలో, ప్రేమలూ అన్ని రకాలుండచ్చునన్న స్ఫృహ కలిగిస్తాయి. మొదటి కథ గురించి, చూచాయిగా చదివినప్పుడు, “బాబోయ్.. వీడెవడో సైకో వెధవై ఉంటాడు!” అనుకున్నాను. అబ్బే! సాదాసీదా గాడు! మనకు మల్లే! అందుకని ఎక్కువ భయపెడతాడు. సాదాసీదాల్లో కూడా సైకోలు దాగుంటారు మరి!

ఈ కథల సంపుటికి రాసిన పరిచయ వ్యాసంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ముఖ్యంగా సమకాలీకులైన ఫ్రాయిడ్ – పిరన్‍దెల్లో రచనల్లో సారూప్యాన్ని ఎత్తిచూపడానికి ప్రయత్నించారు. ఫ్రాయిడ్ తన పేషెంట్స్ మీద అధ్యయనాలు చేస్తే, పిరన్‍దల్లో తన చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ, వాటిని అధ్యయనం చేసి ఈ కథలు రాసేరని.

“… the disjunction in human life between what is and what seems, with its attendant difficulty of deciding what is reality, is already his theme.” అని వాక్యం పుస్తక సారాంశం.

అదన్న మాట సంగతి.

మనకు తెలీని సంగతులు మనకు తెలీవన్న సంగతి తెల్సినప్పుడు కూడా ఒక ఆనందం ఉంటుంది. అట్లాంటివాటి కోసమే ఇట్లాంటి రచనలు అని నా ఉద్దేశ్యం.

పిరన్‍దెల్లో పుట్టిన ఊరు Cavasu పేరుకి అర్థం “chaos” అని అర్థం అన్న మాట. ఆయన రచనలన్నీ choaticగా ఉంటాయంటారు. మా ఊరి పేరులో తిక్క, పైత్యం లాంటి అర్థాలేం లేకున్నా, నాకు ఇట్లాంటివి నచ్చుతాయి.

“నాకు చిక్కని వచనం కావాలి, చక్కని కథాంశం కావాలి. చిక్కక దోబూచులాడే మలుపులు కావాలి. ” అనుకుంటూ దీన్ని చదవకండి. మనుషుల ఆలోచనా రీతులను ఏ అలంకారాలూ, వస్త్రాలూ లేకుండా నగ్నంగా నిలబెడితే చూడగల వాళ్ళు మాత్రం మిస్స్ కాకండి.

మాటల కోసం కాక, ఎందుకు చదవాలో నొక్కి వక్కాణించడానికి సరమాగో సాయం తీసుకుంటాను:

” What does reading do, You can learn almost everything from reading, But I read too, So you must know something, Now I’m not so sure, You’ll have to read differently then, How, The same method doesn’t work for everyone, each person has to invent his or her own, whichever suits them best, some people spend their entire lives reading but never get beyond reading the words on the page, they don’t understand that the words are merely stepping stones placed across a fast-flowing river, and the reason they’re there is so that we can reach the farther shore, it’s the other side that matters, Unless, Unless what, Unless those rivers don’t have just two shores but many, unless each reader is his or her own shore, and that shore is the only shore worth reaching.”
— José Saramago

అన్నట్టు నచ్చక విసిరికొడితే, అదే ఈ పుస్తకానికి అసలైన కాంప్లిమెంట్!   😛

A blog on Loveless Love

Book Details:

Loveless Love

Author: Luigi Pirandello

Translated by: J.G. Nicholas

Pages: 114

Six Characters in the Search of an Author by same author.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..8 Comments


 1. varaprasaad.k

  బావుంది రివ్యూ మొదలే సూపర్బ్,ఈలతో మొదలు పెట్టారు కంగాళీ చేస్తారనుకుంటే,సాపిగా చదివేలా చేసినందుకు హ్యాపీస్.


 2. SEKHAR

  Interesting. I missed this Luigi Pirandello by just not choosing.

  I will try and come back

  Sekhar


 3. […] ఫేవరట్ కావచ్చు” అనుకున్నాను గాని, “Loveless love” చదివాక మాత్రం ఈయనంటే తెగ ఇష్టం […]


 4. “పళ్ళెత్తు” కష్టం అయ్యింది అర్థమవ్వడానికి.
  “పల్లెత్తు” సరైన spelling.
  ఇక మిగతా వ్యాసం మీద వ్యాఖ్యానించాలంటే పుస్తకం చదవాలనుకుంటా.


 5. rAsEgA

  దీన్నిబట్టి నాకర్థమైందేంటంటే.. మీరు ముళ్ళపూడివారిని ఒక రేంజ్‍లో చదువుతున్నారని 🙂


 6. bhanu

  బాగుంది మీ సమీక్ష. పుస్తకమేమోగాని. మీ రివ్యు అయితే నాకు బాగా నచ్చింది ఆ రెండో కథ గురించి మీరు చెప్తుంటే ఏదో మన తెలుగు సినిమా చుసినత్తనిపిస్తుంది?


 7. Deepika

  Hey Purnima nice Article Girl !!! 🙂


 8. సౌమ్య

  Wow… Nice article! 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

The Oil Jar and Other Stories – Luigi Pirandello

వ్యాసకర్త: Nagini Kandala **************** నవలలు ఎక్కువగా ఇష్టపడే నాకు షార్ట్ స్టోరీస్ చదవాలనే ఆసక్తి క...
by అతిథి
1

 
 
Six characters in search of an author

Six characters in search of an author

పెద్దోళ్ళు ఏదో పెద్ద విషయం మాట్లాడుతుంటే మనకి పెద్దగా ఎక్కదులే అని అనుకుంటూ పక్కకు ...
by Purnima
4