సంస్కార – 1

1970లో సంస్కార అనే కన్నడ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయస్థాయిలో ఎంపిక అయ్యింది. ఆ కన్నడ చిత్రానికి దర్శకుడు పట్టాభిరామిరెడ్డి అనే తెలుగు వ్యక్తి కావడం, ఆయన భార్య స్నేహలతారెడ్డి కథానాయిక అవటం, చాలా ఆశ్చర్యం కలిగించింది (ఈ పట్టాభిరామిరెడ్డే పఠాభి అనే ప్రముఖ తెలుగు కవి అని తర్వాత తెలిసింది). గిరీష్ కర్నాడ్ పేరు మొదటిసారి వినటం కూడా అప్పుడే. 1972-73 ప్రాంతంలో సంస్కార నవల Illustrated Weekly of Indiaలో సీరియల్‌గా ప్రచురితమయ్యింది. చాలా ఆసక్తిగా చదివాము. 1975-76లో సంస్కార నవలకు తెలుగు అనువాదం వచ్చింది. మా మిత్రవర్గాల్లో ఈ పుస్తకంగురించి ఆ రోజుల్లో చాలా చర్చ జరిగింది. ఈ పుస్తకాన్ని యు.ఆర్.అనంతమూర్తి 1965లో కన్నడంలో వ్రాశారు. ఆయనకు 1994లో కన్నడసాహిత్యానికి చేసిన సేవకు జ్ఞానపీఠ్ అవార్డ్ బహూకరించారు ఆతర్వాత పద్మభూషణ్ కూడా. కొన్నేళ్ళ క్రితం మయామీ యూనివర్సిటీ (ఆక్స్‌ఫర్డ్, ఒహాయో)లో ఫిలాసఫీ ప్రొఫెసర్ పప్పు రామారావుగారి లైబ్రరీలో సంస్కార ఇంగ్లీషు అనువాదం కనిపించిది. ఆయన తరగతుల్లో ఒకదానికి సంస్కారను పాఠ్యపుస్తకంగా వాడేవారట. అరువు కోసం అడిగితే, తన దగ్గరున్న అదనపు ప్రతిని అచ్చంగానే ఇచ్చేసిన రామారావుగారికి ధన్యవాదాలు.

ఈ పుస్తకంలో ముఖ్యస్థలం కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్రానది ఒడ్డున ఉన్న దూర్వాసపురం అనే బ్రాహ్మణ అగ్రహారం. వీథికి అటూ ఇటూ చెరో పదిళ్ళు ఉన్న ఆ అగ్రహారంలో ప్రాణేశాచార్యులు అనే పండితుడు ఉన్నారు. నలభై యేళ్ళైనా నిండని ప్రాణేశాచార్యుడి భార్య బాగీరథి పెళ్ళికి ముందునించీ రోగిష్టి, తన పనులు తాను చేసుకోలేని అశక్తురాలు. పుల్లలా ఎండిపోయిన ఆమెకు స్నానం చేయించడం, చీర కట్టడం నుంచి అన్ని పనులూ ఆయన తనే స్వయంగా చేసిపెడతారు. సమయానికి ఆమెకు ఆహారం, మందులు అందించి, దగ్గర్లో ఉన్న మారుతి ఆలయంలో అనుదినమూ పూజలు నిర్వహించి, సాయంత్రం అగ్రహారంలోని మిగతావారందరికీ శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు వివరించి చెప్పడం ఆయన దినచర్య. ప్రాణేశాచార్యులు శ్రావ్యమైన గొంతుతో చదువుతూ, భక్తి పారవశ్యంతో వివరిస్తుంటే ఊరిలో వారంతా పరవశంతో ముగ్ధులౌతారు. చిన్నతనంలోనే కాశీ వెళ్ళి సంస్కృతము, శాస్త్రాలు చదువుకుని, వేదాంత శిరోమణి బిరుదు సంపాదించుకొని వచ్చారు ఆయన. ఆ ప్రాంతాల్లో అనేక పండితులతో జరిగిన శాస్త్రచర్చల్లో గెలుపొంది చాలా సన్మానాలు, అందరి గౌరవం పొందిన వ్యక్తి. ఆయనకు తెలియని ధర్మశాస్త్రాలు, సూక్ష్మాలు లేవని అక్కడివారందరికీ నమ్మకం.

poster samskaraఒక వేసవి ఉదయాన ప్రాణేశాచార్యులు తన భార్యకు అవసరమైన సపర్యలు చేసి, తన కార్యకర్మాలు చేసుకుంటుండగా, ఇంటిముందు నించి ఆచార్యులవారూ అంటూ చంద్రి పిలుపు వినిపించింది. అగ్రహారంలోనే ఉండే నారణప్ప ఉంపుడుగత్తె చంద్రి. ఆమెతో మాట్లాడితే మళ్ళీ శుచి చేసుకోవాలి. అయినా, ఇంటిముందుకి వచ్చిన ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. చంద్రి చెప్పిన విషయం ఆయన్ని విభ్రాంతపరిచింది. నారణప్ప చనిపోయాడు. శివమొగ్గ నుంచి వస్తూ జ్వరం, ఒళ్ళునెప్పులు అన్నాడట. పక్కలో ఏదో గడ్డలా వచ్చింది. నాలుగురోజుల్లో అకస్మాత్తుగా చనిపోయాడు.

ప్రాణేశాచార్యులు గబగబా ప్రక్కన ఇళ్ళలో ఉన్న బ్రాహ్మణులందరికీ ఆ వార్త తెలిపాడు. వారెవరూ ఆ ఉదయం ఇంకా భోజనం చేయలేదు. మంచిదయింది. అగ్రహారంలో బ్రాహ్మణ శవం ఉండగా భోజనం చేయటం పాపం. ఆ శవసంస్కారం చేశాకే ఏమైనా తినడం. నిజానికి ఆ ఊళ్ళో ఎవరికీ నారణప్ప మరణం పట్ల బాధ లేదు. బతికి ఉన్న రోజుల్లో నారణప్ప వారందరికీ విరోధి. ఇప్పుడు చచ్చి వారి తిండికి అడ్డంకి. అతని శవం ఒక సమస్య. ఒక సంకటం. ప్రాణేశాచార్యులు కబురు చెప్పాక బయటకు బయల్దేరిన మగాళ్ళతో వారి భార్యలు ప్రాణేశాచార్యుల నిర్ణయం వినకుండా తొందరపడి ఏమీ చేయద్దని జాగ్రత్త చెప్పారు. లేకపోతే కులంనుంచి వెలి అయ్యే ప్రమాదం ఉంది.

చచ్చిపోయిన నారణప్పకు పిల్లలు లేరు. మరి ఆయన అంత్యక్రియలు ఎవరు చేస్తారు? నారణప్ప జ్ఞాతులు గరుడాచార్యులు కానీ, లక్ష్మణాచార్యులు కానీ చేయాలి. వారిద్దరూ దానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి నారణప్పతో సత్సంబంధాలు లేవు. “మా కుటుంబం అంతా అతనితో ఎప్పుడో తెగతెంపులు చేసుకున్నాం. ఆ విషయం పక్కన పెట్టినా, ముందు ఒక సంగతి తేల్చండి. అసలు నారణప్పని ఇంకా బ్రాహ్మణుడిగానే పరిగణించాలా? తక్కువకులపు స్త్రీతో పడుకున్నాడు కదా?” అని అడిగాడు గరుడాచార్యులు. “అవును, ఆమె వండిందే తినేవాడు కూడా” అన్నాడు లక్ష్మణాచార్యులు. నారణప్ప తాగేవాడు. స్వంత పెళ్ళాన్ని వదిలేస్తే ఆమె రోగానబడి చచ్చింది. పితృదేవతలకి తద్దినాలు పెట్టేవాడు కాదు. అందరూ పూజించే సాలగ్రామాన్ని తీసుకెళ్ళి ఊళ్ళో అందరెదురుగానే నదిలో పారేశాడు. ముస్లిం నేస్తాలని తీసుకొచ్చి దేవుడి చెరువులో చేపల్ని పట్టి వండించుకు తిన్నాడు. “అటువంటి వాణ్ణి ఊళ్ళో ఉంచుకున్నందుకే రెండేళ్ళనుంచి పక్క ఊళ్ళ వాళ్ళు కార్యాలకి మనల్ని పిలవడం మానేశారు. ఇప్పుడు వాడికి అంత్యసంస్కారాలు చేస్తే మనల్ని కులంలో ఉంచుతారా” అని సందేహపడ్డాడు, శ్రాద్ధకర్మలు చేయించి పొట్టగడుపుకునే దాసాచార్యులు.

ప్రాణేశాచార్యులకు ఏం చెప్పాలో పాలు పోలేదు. ‘మిమ్మల్నెవరినీ ఈ కర్మలు చేయమని నిర్దిష్టంగా చెప్పలేను. నారణప్ప బ్రాహ్మణ్యాన్ని వదిలినా, అతన్ని బ్రాహ్మణ్యం వదల్లేదు. అతన్ని ఎవరూ కులబహిష్కారం చేయలేదు. అందుచేత అతని శవానికి బ్రాహ్మణులు మాత్రమే అంత్యక్రియలు చేయాలి. ఒకసారి ధర్మశాస్త్రాలను పరిశీలించి చెపుతాను.” అన్నాడు.

snehalaareddy as chandriఇదంతా వింటున్న చంద్రి ఉన్నట్టుండి ముందుకు వచ్చింది. తన మెడలో ఉన్న నాలుగుపేటల బంగారు గొలుసు, చేతికి ఉన్న పెద్ద మురుగు, గాజులు అన్నీ తీసి ప్రాణేశాచార్యుల ముందు పెట్టింది. ఆ సొమ్ములు అంత్యక్రియల ఖర్చులకోసం అంటూ గొణిగింది. కనీసం రెండువేల కిమ్మత్తన్నా ఉండే ఆ బంగారం అక్కడ ఉన్న వాళ్ళ మనసుల్లో కలకలం రేపింది. బంగారం పట్ల మోజుతో కులభ్రష్టులమౌతామేమోనన్న భయం ఒక పక్క, తాము కాకుండా మరొకరెవరైనా ముందుకువచ్చి ఆ కర్మకాండ జరిపించేసి, పాపపరిహారార్థం ఏ బక్కచిక్కిన గోవునో దానమిచ్చి ఆ బంగారమంతా కొట్టేస్తారేమోనన్న శంక మరో వేపు. గరుడాచార్యులు, లక్ష్మణాచార్యులు ఒకరినొకరు అనుమానంగా చూసుకోసాగారు. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క స్మార్త బ్రాహ్మణుడు దుర్గాభట్టుకి ఇదంతా తమాషాగా ఉంది. ఈ మధ్వులంతా తమంత ఆచారపరాయణులు మరెవ్వరూ లేనట్టు పోజులు కొడుతూ ఉంటారు. డబ్బుకోసం ఎవరైనా ఆశపడి నారణప్ప అంత్యక్రియలు చేశారో, వీళ్ళ సంగతి ప్రపంచమంతా పనిగట్టుకుని ప్రచారం చెయ్యాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. తలుపు వెనుకనుండి చోద్యం చేస్తున్న బ్రాహ్మణ ఇల్లాళ్ళనూ ఆ బంగారం కలవరపరచింది. లక్ష్మణాచార్యుడి భార్యకైతే మరీను. ఆ బంగారమంతా ఆమె మేనకోడలికి – అంటే నారణప్ప భార్య, చనిపోయినావిడకి – చెందాల్సిందాయె. చంద్రి మంచికిపోయి చేసిన పని సమస్యని మరింత జటిలం చేసిందని అనుకున్నాడు ఇదంతా గమవిస్తున్న ప్రాణేశాచార్యులు.

అందర్నీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు పంపించేసి ధర్మశాస్త్రాలని తన ముందు వేసుకొని కూర్చున్నాడు ప్రాణేశాచార్యులు. సాయంత్రమయ్యింది కానీ సమస్యకి పరిష్కారం పుస్తకాల్లో కనిపించటం లేదు. నారణప్పని ముందే వెలివేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. మిగతా బ్రాహ్మణులంతా ఒకసారి నారణప్పని వెలివెయ్యటానికి తయారయ్యారు కాని, ప్రాణేశాచార్యులే ఆ ప్రయత్నాన్ని ఆపారు. “తనని వెలివేస్తే ముస్లింలలో కలిసిపోయి, ఆ తర్వాత కూడా అగ్రహారంలోనే ఉంటా”నని నారణప్ప బెదిరించటం ఒక కారణమైతే, నారణప్పను ఎప్పటికైనా మార్చి సరైనదారిలోకి తీసుకురాగలనన్న ఆశ, నమ్మకం ఒక కారణం. పైగా నారణప్ప బాగోగులు కనిపెట్టి ఉంటానని అతని తల్లి చనిపోయేటప్పుడు మాట ఇచ్చాడు కూడా.

నారణప్ప మాత్రం ప్రాణేశాచార్యుల ఆచారాల్నీ, ఆయన చెప్పే ధర్మసూత్రాలనీ ప్రశ్నించేవాడు. అగ్రహారంలో ఉన్న మిగతా బ్రాహ్మణుల ప్రవర్తనపై అతనికి అసహ్యం. ఆచారాలనైతే పాటిస్తారేమో కానీ వారి ప్రవర్తన ధర్మమార్గంలో లేదని అతని అభిప్రాయం. ప్రాణేశ్వరాచార్యులు మంచివాడేకాని ఆయన చెప్పే ధర్మాలు అవీ అతను ఉద్దేశించినదానికి వ్యతిరేక ఫలితాల్ని ఇస్తున్నాయని అతని అభిప్రాయం. అగ్రహారంలో పిల్లలను చెడుదారి పట్టిస్తున్నాడని తనను మందలించబోయిన ప్రాణేశాచార్యులతో నారణప్ప నిర్ద్వందంగా ఇదే మాట చెప్పాడు. ఆ రోజున తనను పరిహసిస్తూ నారణప్ప మాట్లాడిన మాటలకు ప్రాణేశాచార్యులకు చాలా కోపం వచ్చింది కూడా.

ప్రాణేశాచార్యులనుంచి సమాధానం రాకపోవడం అగ్రహారీకులను నిరాశపరచింది. పక్క ఊరు పారిజాతపురంలో నారణప్పకు చాలామంది బ్రాహ్మణ స్నేహితులున్నారు. ఆ ఊరి బ్రాహ్మలకు ఆచారాల పట్ల తమకున్నంత పట్టింపు లేదు, ఎంతైనా వారందరూ స్మార్తులుకదా, తమకంటే తక్కువ బ్రాహ్మణ్యం వాళ్ళది. వాళ్ళనడిగితే వాళ్ళెవరైనా కర్మ చేయటానికి సిద్ధపడచ్చు. ఈ ఆలోచనతో వారందరూ కలసి పారిజాతపురం వెళ్ళారు. అక్కడ కులపెద్ద ఒప్పుకునేవాడేమో కాని, దుర్గాభట్టు అడ్డం వేశాడు – ఆ పని చేస్తే, తమను ఈ దూర్వాసపురం మధ్వులు ఎప్పటికీ తక్కువవాళ్ళుగానే చూస్తారని. నిరాశగా, కాళ్ళీడ్చుకుంటూ అందరూ నీరసంగా తిరిగివచ్చారు.

రాత్రి అయ్యింది. అగ్రహారంలో మొగవాళ్ళెవరికీ తిండీ తిప్పలూ లేవు. ఆకలి వల్ల నిద్ర పట్టక అవస్థ పడుతున్నారు. ప్రాణేశాచార్యులు ఇంకా ధర్మశాస్త్రాలు తిరగేస్తున్నారు. ఆయన అవస్థను చూసిన చంద్రికి జాలి వేసింది. ఆయనంటే చంద్రికి చాలా గౌరవం. ఆయన్ని చూస్తున్న చంద్రికి, అటువంటి మహానుభావులవల్ల గర్భం పొందితే మంచి భవిష్యత్తు ఉన్న సంతానం కలుగుతుందని తల్లి చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. ఆకలి ఎక్కువవగా, చంద్రి బయటకు వెళ్ళి తోటలో అరటిపళ్ళు తిని, నదిలో మంచి నీళ్ళు తాగి, ప్రాణేశాచార్యుల ఇంటి వరండాలో ఒక కునుకు తీసింది. అది గమనించిన ప్రాణేశాచార్యులు ఆమెకు పడుకోవడానికి ఒక చాప, దుప్పటి, దిండు ఇచ్చాడు. మనసులో ఏదో తట్టి, లోపల్నించి చంద్రి బంగారం తీసుకువచ్చి, “చూడు చంద్రీ నీ మంచితనం సమస్యని ఇంకా జటిలం చేస్తూంది. ఈ విషయాన్ని బ్రాహ్మణులం ఏదో ఒకటి అత్యవసరంగా తేల్చేస్తారులే. ఈ బంగారం నువ్వే ఉంచుకో. నారణప్ప ఎలానూ పోయాడు. కాని, నువ్వింకా బతకాలి కదా,” అని చెప్పి బంగారం ఆమె చేతిలో పెట్టాడు.

నారణప్ప శవం ఇంకా ఆ ఇంట్లో అలానే పడి ఉంది. ఆ సాయంకాలం అగ్రహారం పక్క పల్లెలో ఇద్దరు భార్యాభర్తలు జ్వరంతో చనిపోయారు. వారినేదో ఆవహించింది అనే భయంతో వారినీ, వారి గుడిసెనీ కలిపి తగలుపెట్టేసారు. అదేం చిత్రమో కాని, ఎప్పుడూ లేంది, పల్లెలోవాళ్ళ గుడిసెలలోనూ ఎలుకలు తిరుగుతున్నాయి. కొన్ని ఎలుకలైతే అర్థంతరంగా చచ్చి కింద పడుతున్నాయి. పల్లెలో మరికొందరికి కూడా జ్వరాలు మొదలయ్యాయి.

తెల్లవారింది. ప్రాణేశాచార్యులకు ఏ గ్రంథంలోనూ సమాధానం కనిపించలేదు. భార్య పనులు చేసిపెట్టి, తాను శుచిగా తయారై, ఊరిబయట అడవి మధ్యలో ఉన్న మారుతి ఆలయానికి వెళ్ళి ఈ సమస్యకు సమాధానం చెప్పమని దేవుణ్ణి ప్రార్థించారు. దహన సంస్కారాలు చేయటం సరైన పనే ఐతే కుడిపక్కన ఉన్న పూలను క్రిందపడేయమని, కాదంటే ఎడమ పక్క పూలను కిందపడేసి తనకు సంకేతమివ్వమని కోరి, ధ్యానం చేస్తూ అక్కడే కూర్చున్నారు ఎదురు చూస్తూ. ఆయన్ని చూస్తూ చంద్రి కూడా ఆ దగ్గర్లోనే కూర్చుంది.

ఇక్కడ అగ్రహారంలో కూడా ఎలుకలు ఎక్కడికక్కడ చచ్చిపడి కనిపిస్తున్నాయి. ఎక్కడనుంచో ఒక రాబందు వచ్చి ఒకరి దొడ్లో ఉన్న ఎలుక శవాన్ని తన్నుకువెళ్ళి ఆ ఇంటి నడికప్పుపై కూర్చొని తినటం మొదలుబెట్టింది. ఆ దృశ్యం అందర్నీ భయభ్రాంతుల్ని చేసింది. ఊళ్ళోకి రాబందు రావటం చాలా అశుభం. చూస్తుండగానే ఇంకా చాలా రాబందులు ఊళ్ళోకి వచ్చాయి. ఉన్న ఇరవై ఇళ్ళ కప్పుల మీదా రాబందులు చేరాయి. అందరూ కలసి పూజలో వాడే గంటలు కొడుతూ, శంఖాలు మోగిస్తూ చాలా గోల చేస్తే కాని అవి అక్కడనుంచి కదల్లేదు. ఇదంతా చూస్తున్న అగ్రహారీకులకు చాలా భయం వేసింది. నారణప్ప ఇంటినుంచి దుర్గంధం వీధంతా వ్యాపిస్తూ ఉంది. శవానికి జరిపించల్సిన కర్మలు జరగకపోతే నారణప్ప ఆత్మ తమల్ని పీడిస్తుందేమోనన్న అనుమానం వారిని కలతపెట్టింది.

చీకటి పడింది కానీ మారుతి విగ్రహంనుంచి, కుడీ, ఎడమా ఎటూ ఒక్క పూవు కూడా కింద పడలేదు. ఏం చేయాలో ప్రాణేశాచార్యులకు బోధ పడలేదు. రెండు రోజులనుంచి తిండి లేని నీరసం. ముందున్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని అశక్తత, ఆయన్ని కమ్మేశాయి. భార్యకు మందు ఇచ్చే వేళ దాటింది. ఇంటికి వెళదామని లేచి నుంచున్నాడు. కానీ కదల్లేకపోయాడు. అలా నుంచునే నీరసంతో ఒణుకుతున్న గొంతుతో, మారుతి, మారుతి అంటూ జపించసాగారు.

Girish karnadఆ గొంతులో నీరసం, నిరాశ వింటున్న చంద్రికి జాలి వేసింది. పాపం ఎంత అవస్థ పడుతున్నాడో. తిండీ తిప్పలూ, నిద్రా లేవు. ఒక్కరోజులోనే మనిషి చాలా తీసిపోయాడు. ఆయన పాదాలకు నమస్కరించాలనిపించింది. ముందుకు వచ్చి ఆయన పాదాల మీద పడబోయింది. చిమ్మచీకటి. ఏమీ సరిగా కనిపించడం లేదు. ముందుకు వంగిన ఆమె తడబడింది. ఆయన మీద పడింది. ఆ పడటంలో ఆమె వక్షం ఆయన మోకాళ్ళకు తగిలింది. ఆ అదాటులో రవిక ముడి విడిపోయి స్తనాలు బయటపడ్డాయి. ఆమె తల ఆయన తొడలపై పడింది. ఆ బ్రాహ్మణుడి మీద జాలో, ఆ అగ్రహారంలో తనను మనిషిగా చూసేది ఈయన ఒక్కడేనన్న కృతజ్ఞతో, ఏదో ఉద్వేగం ఆమెను కుదిపివేసింది. ఆయన్ను అలాగే హత్తుకుని ఏడవటం మొదలుబెట్టింది. ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన ప్రాణేశాచార్యులు ఆమెను సముదాయించి, ఆశీర్వదించుదామని ముందుకు వంగారు. ఆయన చేతికి ముందు ఆమె వెచ్చని కన్నీళ్ళు, వేడి నిట్టూర్పులు తగిలాయి. పరిచయంలేని ఆ స్పర్శకు ఆయన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన చెయ్యి ఆమె కేశాలను నిమురుతూంది. ఆశీర్వచన మంత్రం గొంతులోనే ఆగిపోయింది. చంద్రి ఉద్వేగం ద్విగుణీకృతమయింది. ఆయన చేతుల్ని గట్టిగా పట్టుకొని, లేచి నిల్చుని, ఆ చేతుల్ని రెక్కలాడిస్తున్న గువ్వల్లా కొట్టుకుంటున్న తన స్తనాలపై వేసుకొని గట్టిగా నొక్కుకుంది. ఎప్పుడూ నిండు స్థనాలని స్పృశించని ప్రాణేశాచార్యులకు కొద్దిగా తలతిప్పుగా అనిపించింది. ఏదో కలలో లాగా, ఆ స్తనాలను నొక్కాడు. ఆయన కాళ్ళు బలహీనమౌతుండగా, చంద్రి ఆయన్ను అలాగే గట్టిగా పట్టుకునే కూర్చోబెట్టింది. అప్పటివరకూ సుప్తంగా ఉన్న ఆచార్యుల ఆకలి ఒక్కసారి చెలరేగింది. బాధపడుతున్న పిల్లవాడిలా అమ్మా అంటూ ఒక కేక పెట్టాడు. ఆయన్ను అలాగే తన వక్షానికి పొదివిపెట్టుకుని, చంద్రి తన దగ్గర ఉన్న అరటిపళ్ళను ఒలిచి తినిపించింది. తర్వాత, తన చీరను విప్పి నేలపై పరచి దానిపై పడుకుంది, ప్రాణేశాచార్యులని దగ్గరకు హత్తుకుంటూ, ఏడుస్తూ, నిస్సహాయపు కన్నీళ్ళలో ప్రవహిస్తూ.

(సశేషం)

*****
Samskara – A Rite for a Dead Man
U.R. Anantha Murthy
Translated by A.K. Ramanujan
Oxford University Press
1978
141 pages.

You Might Also Like

27 Comments

  1. kotari mohan rao

    recently i red about pattabhi’s life .girish karnad also opposed to release the picture, n adamant towards patabhi , but after getting popularity to the film SANSKAARA he was friendly towards them. my dissatisfaction is that though TIKKAVARAPU family is good enough financially none remembers him at nellore similar to GUNTURU SESHENDRA SARMA. IN YOU TUBE THE FILM sanskaara is unavailable.

  2. సంస్కార – 2 | పుస్తకం

    […] భాగం ఇక్కడ) *** అర్థరాత్రి ప్రాణేశాచార్యులకు […]

  3. Jampala Chowdary

    ఇప్పటివరకూ, ఈ పుస్తకానికి ఒక్కటే తెలుగు అనువాదం ఉందనీ, అది ఇప్పుడు బహుశా అలభ్యమనీ అనుకున్నాను. కనీసం నాలుగు అనువాదాలు ఉన్నాయని ఇప్పటి వరకు వచ్చిన స్పందన వల్ల తెలిసింది. ఈ నవల ప్రస్తుతం అందుబాటులో లేదన్న అపోహతో, ఒక ముఖ్యమైన నవల గురించి విపులంగానే తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ పరిచయం మొదలుపెట్టాను. ఇది మామూలు పరిచయం కన్నా కొద్దిగా ఎక్కువ, పూర్తి అనువాదంకన్నా బాగా తక్కువ.

    ఈ భాగంలో ఆఖరు పేరా కొంతమందిని ఇబ్బంది పెట్టినట్లుంది. ఆ పేరా నవలలో ఒక కీలక ఘట్టం. ముందు రెండు మూడు వాక్యాలతో సరిపెడదామనుకున్నాను కానీ, అలా చేస్తే ఈ నవల, ముఖ్యపాత్రలు సరిగా అర్థం కావు అని, ఆ పేరాను ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేయటమే సరైన పద్ధతి, అవసరం అని అనిపించింది. ఇది, ప్రసాద్ గారు అనుమానించినట్లు, (శృంగార) రసజ్ఞతకు సంబంధించిన విషయం కాదు – కథాగమనానికి, పాత్రచిత్రణకు అవసరమైన ముఖ్య విషయం. దీన్ని రచయిత చాలా ప్రతిభావంతంగా చిత్రీకరించాడని నా భావన.

  4. ప్రసాద్

    ఎంతో ఆసక్తిగా మొదలు పెట్టిన నాకు, చివరికి వచ్చేటప్పటికి, ఏదో “బూతు కధ” చదువుతున్నట్టు అనిపించింది. కొందరికి ఆ వర్ణనలు అవసరమని అనిపించ వచ్చేమో గానీ, నాకైతే అలా అనిపించలేదు. బహుశా, నాలో ఏమన్నా “రసజ్ఞత” లోపించిందేమో మరి!! ఆ భాగాలు నాకు బొత్తిగా నచ్చలేదు.
    ప్రసాద్

  5. mythili

    [ఆ పుస్తకంలోగాని, సినిమాలో గాని ఏమి చెప్పారూ అనేదాని గురించి కాదు. అలాగే రాసి ఉండవచ్చు, అలాగే తీసి ఉండవచ్చు]సమీక్ష లేదా పరిచయం ఇంత ‘ గ్రాఫిక్ ‘ గా ఉండటం అవసరమా?

    1. manjari lakshmi

      నాకూ ఈ వ్యాసం చదువుతుంటే మైథిలి గారిలానే అనిపించింది. అంత వర్ణన అవసరమా?

    2. డింగు

      సాధారణంగా ఇలాంటి సంపూర్ణ వ్యాసాలు పుస్తకం.నెట్‌లో అరుదుగా వస్తాయి. సంస్కార ఇప్పటి రచన కాదు. ఇలాంటివి ఇలా పరిచయం చేస్తేనే బాగుంటుందనేది నా ఉద్దేశ్యం. మాలతి చందూర్ గారు పుస్తకం పరిచయం చేసే తీరు మనకి తెలిసిందే కదా…!

  6. కత్తి మహేష్ కుమార్

    కులాలకు అతీతంగా మనుషుల ఆభిజాత్యాలకూ స్వార్థాలకూ ప్రతీక “సంస్కార”.

    అయితే సమాజంలో ఆధిపత్యం స్థానంలో ఉంటూ, సాంస్కృతిక/సాంప్రదాయ విలువలకు ఆలవాలమన్న బ్రాహ్మణకులంలోని అణగారిని విలువల్ని నవలలో చూపించడం ద్వారా ప్రతీకాత్మకతకు మరింత బలం చేకూర్చాడు రచయిత.

    రచనాకాలాన్ని చూసుకుంటే, ఒకవైపు ఫ్యూడలిజం మరోవైపు బ్రాహ్మినిజం అనే సామాజిక-ఆర్థిక-సాంస్కృతిక అణచివేతలనుంచీ భారతీయ సమాజం పోరాటం జరుపుతూ ఉంది. ఆ పోరాటానికి ప్రశ్నల ఆయుధాల్ని అందించింది ఈ నవల. ఆ ప్రశ్నలు ఇప్పటికీ సత్యాలే. కులచట్రాల్లోంచీ ఒదిగి చూసినా, ఎదిగి చూసినా ఇప్పటికీ ఈ నవల ఒక “కావ్యమే”.

  7. k.p. ashok kumar

    సంస్కార తెలుగు అనువాదాలు:
    1.ఆర్వీయస్ సుందరం మరియూ క్.నారాయనస్వామి-1974
    2.ఎస్.ఎల్.శాస్త్రె-2006
    3.సుజాత పట్వారి-2010(?)

  8. Sujatha

    ఈ పుస్తకాన్ని శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రి గారు తెలుగులోకి చాలా ఏళ్ల క్రితమే అనువదించారు. చాలా గొప్ప అనువాదం!

    నా బ్లాగ్ లో దీన్ని పరిచయం చేశాను

    http://www.manishi-manasulomaata.blogspot.com/2009/11/blog-post_30.html

  9. సంస్కార – 1 | Bagunnaraa Blogs

    […] Jampala Chowdary 1970లో సంస్కార అనే కన్నడ చిత్రం ఉత్తమ […]

  10. bharathi.jonnalagadda

    patabhi garu rachayitagane naaku telusu aayana darshakudu kooda ani telisi chaala aascharyamga undi.kotta konanni chupinanduku jampalagariki abhinandanalu.

  11. Appaji Ambarisha Darbha

    This book was translated into Telugu by my father late Ramsha and came as serial in our Abhisarika magazine around 80s. I still remember the story and illustrations. I think he translated it from english version published in Illustrated weekly.

  12. విజయవర్థన్

    పఠాభిగారు “చండమారుత” (Wild Wind) చిత్రాన్ని నిర్మించారా లేదా నిర్దేశించారా? గిరీశ్ కర్నాడ్ వారి ఆత్మ కథ (ఆడాడత ఆయుష్య)లో నిర్దేశించారు అని వ్రాసారు. కాని అంతర్జాలంలో దొరికే సమాచారం[౧] ప్రకారం ఆ సినిమాను “సంస్కార” ఛాయాగ్రాహకుడు Tom Cowan దర్శకత్వం వహించాడు అని వుంది. ఈ విషయాన్ని రావెల సోమయ్యగారే నివృత్తి చేయాలి.

    [౧]: http://www.innersense.com.au/mif/cowan.html
    [౨]: http://www.deccanherald.com/content/192070/content/212455/F

    1. Jampala Chowdary

      I think IMDB lists Pattabhi as the Director of Chandamarutha.
      However, IMDB also lists Pattabhi as the producer of oka oori katha, which is clearly an error.

  13. k.p. ashok kumar

    మీ పరిచయం బాగుంది.ఈ పుస్తకం పై ఓఛ్ఛీన మూడు తెలుగు అనువాదాలు చదివాను.అవన్నీ మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చెసినందుకు థాంక్స్.

    1. k.p. ashok kumar

      సంస్కార తెలుగు అనువాదాలు:
      1.ఆర్వీయస్ సుందరం మరియూ క్.నారాయనస్వామి-1974
      2.ఎస్.ఎల్.శాస్త్రె-2006
      3.సుజాత పట్వారి-2010(?)

  14. Sreenivas Paruchuri

    Raman did the translation in 1976, published in 1978. But who did the earlier one published in “Illustrated Weekly”? Regards, Sreenivas

    1. సౌమ్య

      According to this article, A.K.Ramanujan seems to have translated the illustrated weekly serial:
      http://caravanmagazine.in/reportage/reading-small-print

    2. Jampala Chowdary

      Thank you Sowmya.
      That was a very interesting article on Ramanujan.

    3. Jampala Chowdary

      AK Ramanujan’s translation was first published in the Illustrated Weekly. The US edition of OUP is in 1978. I suspect that Indian and UK editions may have been published a little earlier.

  15. Ravela Somayya

    Jampala garu ! Thank you for introducing the Samskara here . I am very happy to see this article here as not only the writer of this book Ananthamurthy is my friend but its film director Pattabhi and his wife Snehalatha reddy were also my family friends for years . After having close association with there of them , i have some points to make here .
    1 . The book samskara has been one of a wonderful classics in Indian literature which tells the in -humanness in the Indian caste system . Recently i met him in Bangalore , though his physical health is not well but his wise spirit is still young and active like his early years of Samskara . Since his student days, he has been with socialist thought and inspired by Dr.Rammanohar Lohia . 2. At suggestion of Dr. Lohia , Pattibhi has adopted this book and the film Samskara . It was initially banned by the Govt , and liberated after a big struggle to won international acclaim awards such as 1. The president’s Gold Medal 1971 2. The Bronze Leopard , Locarno international fim festival -1972 3. The Protestant jury award , Mannheim -1972 4. The Catholic jury Award , Mannheim -1972 and 13 other intenational , national awards . 5. The interesting point is that no film has won both from catholic and protestant juries till 1972 6. Pattabhi has also made another film ” Chandamarutha ” in 1975 which predicted the dictatorial tendencies ( Emergency ) in the country that time but unfortunately it was also banned . It came into light later . So he was such a courageous and creative filmmaker of Indian cinema apart from his poetry .

    1. విజయవర్థన్

      > 2. At suggestion of Dr. Lohia , Pattibhi has adopted this book and the film Samskara

      గిరీశ్ కర్నాడ్ వారి ఆత్మ కథ (ఆడాడత ఆయుష్య)లో పఠాభి గారి గురుతుల్యులు గోపాల గౌడ[౧] (వీరు కూడా లోహియా శిష్యులే) కోరిక మేరకు ఈ సిన్మా నిర్మాణం చేపట్టారని వ్రాసారు.
      [౧]: http://en.wikipedia.org/wiki/Shantaveri_Gopala_Gowda

  16. మెర్సీ సురేష్ జజ్జర

    Jampala Chowdary సర్ , మంచి పుస్తకంతో పాటు, పఠాభి గారి గురించి మరింత సమాచారం తెలియజేసారు. ధన్యవాదాలు ..

  17. సత్యవతి

    నేను కూడా ఈ నవలని మొదట ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలోనే చదివాను.చాలా ఇష్టంగా వీక్లీలు దాచిపెట్టుకుని అన్నీ కలిపి మళ్ళీ చదివాను.సినిమా కూడా చూశాను .ఇంత వివరమైన పరిచయం చదువుతుంటే మళ్ళి నవల చదువుతున్నట్లే వుంది సినిమా చూస్తున్నట్లే అనిపించింది.ఈ పుస్తకాన్ని ఇటీవల సుజాతాపట్వారీ తెలుగులోకి అనువాదం చేసారు.

  18. మెర్సీ సురేష్ జజ్జర

    ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు. అభినందనలు. పట్టాభిరామిరెడ్డి గారు సినిమా తీసారని వినడం ఆశ్చర్యంగా అనిపించింది ..

    1. Jampala Chowdary

      పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) బహుముఖ ప్రజ్ఞావంతుడు. కవి, పన్నరి, చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. గణిత శాస్త్రంలోనూ కృషి చేశారు. జయంతి సంస్థ పేర నిర్మించిన పెళ్ళినాటి ప్రమాణాలు చిత్రానికి నిర్మాతలలో ఒకరని గుర్తు. 1970లలో కన్నడ చిత్ర పరిశ్రమలో వచ్చిన కళాత్మక, ఆలోచనాత్మక సినిమా ఉద్యమానికి సంస్కార చిత్రం ద్వారా తలుపు తెరిచి దారి చూపినవాడు. చండమారుత, దేవరకాడు, శృంగార మాస కన్నడంలో ఆయన దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు.

Leave a Reply