The Book Thief – Marcus Zusak
ఒక వారాంతం లో ఓసియాండర్ షాపులో తిరుగుతూ ఉండగా, నన్ను ఆకర్షించిన టైటిల్స్ లో The book thief కూడా ఒకటి. నేనెలాగూ చదవను అన్న నమ్మకంతో నేను ఏదీ కొనదల్చుకోలేదు. కానీ, ఇది బ్రౌజ్ చేస్తూ ఉండగా, వెనుకవైపు అట్టపై – “This novel is narrated by death” అన్న వాక్యం దగ్గర కళ్ళు ఆగాయి. మనసు లాగడం మొదలైంది. నవల ప్రొలోగ్ లో మృత్యువు కథనం చదవగానే… ఆ లాగుడులో, పుస్తకం కొనేసి, వెంఠనే దగ్గర్లోని పార్కులో కూర్చుని చదవడం మొదలుపెట్టేశా.
కథ: కథ నాజీ పాలన సమయంలో మ్యూనిక్ నగరం దగ్గర్లోని మోల్షింగ్ అన్న కల్పిత పట్టణంలో జరుగుతుంది. పుస్తకాలని దొంగలించే ఒక చిన్న అమ్మాయీ, ఆమె పెంపుడు తల్లిదండ్రులూ, ఆమె గతం – వెంటాడే పీడకలలూ, ఆమె స్నేహితులూ, వీళ్ళ ఇంట్లో అనుకోకుండా వచ్చి చేరి చాలా కాలం తల దాచుకున్న ఒక యూదు మతస్థుడూ, అతనితో ఈ అమ్మాయికి ఏర్పడ్డ స్నేహం, నాజీల వ్యవహారశైలీ – ప్రధానంగా ఈ నవలలో వచ్చే విషయాలు ఇవీ.
(మీకు కథ కావాలంటే, కాసేపు గూగిలిస్తే దొరికేస్తుంది.)
నా అభిప్రాయం:
పుస్తకం వెనుక This novel is narrated by death.. వంటి వాక్యాలూ, మొదటి రెండు,మూడు పేజీల్లో మృత్యువు చెప్పే కబుర్లూ చదవగానే – అద్భుతమైన డార్క్ హ్యూమర్, pathos ఉన్న నవల చదవబోతున్నాము అన్న అనుభూతి కలుగుతుంది. అయితే, ఆ కోణంలో ఈ పుస్తకం నాకు నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఒక నవలగా చదివేందుకు బాగుంది. అక్కడక్కడా మృత్యువు చెప్పే మాటలు అద్భుతం. అలా మనసులో నిలిచిపోయేవి కొన్నీ, వెంటాడేవి కొన్నీ.
ఈ అమ్మాయి లీజెల్ కథ గానీ, నాజీల కథని ఆ అమ్మాయి జీవితంతో కలిపిన పద్ధతి గానీ, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కొన్నింటిని నవలలో జొప్పించిన తీరుకానీ – అన్నీ చాలా బాగున్నాయి. అయితే, మృత్యువు, ఒక పన్నెండేళ్ళ పాపా – కథా – అనగానే, నాకు ఫిలిప్ పుల్మన్ రాసిన His Dark Materials Trilogy గుర్తు వచ్చింది. అందులో మూడో భాగంలో మృత్యువు గురించి అద్భుతమైన సంభాషణలు పలికిస్తాడు రచయిత. అటువంటిది ఒకటి చదివాక, ఈ నవలలో ఆ కోణం సాధారణంగా అనిపిస్తుంది. రచయితకి, అతను ఎంచుకున్న కథన తీరులో నవలంత పెద్ద కథ చెప్పడం (మృత్యువు కథకుడు కావడం)… చేతకాలేదేమో అనిపించింది. చాలా మంచి స్కోప్ ఉన్న కథాంశాన్ని మామూలు నవలగా మార్చేసినట్లు అనిపించింది.
మొత్తానికి, ఏకవాక్యంలో చెప్పాలంటే – నవల బాగుంది. కానీ, నా అంచనాలను అందుకోలేదు.
అయితే, గత రెండు నెలల్లో నేను చదివిన పుస్తకాల సంఖ్య ఈ పుస్తకంతో కలుపుకుని ఒకటిన్నర. ప్రత్యేకం కారణాలేవీ లేవు – రీడర్స్ బ్లాక్. అంతే. కాబట్టి అసలీ రెణ్ణెల్లలో నన్ను చదివించిన పుస్తకం ఇదొక్కటే కనుక – పుస్తకం బాగున్నట్లే!!
నాకు నచ్చిన కొన్ని వాక్యాలు (మృత్యువు మాటల్లో!):
“As I’ve suggested, my only saving grace is distraction. It keeps me sane.”
“I am haunted by humans”
“Can a person steal happiness..or its just another internal, infernal human trick?”
“I do not carry a sickle or scythe
I only wear a hooded black robe when it’s cold
and I don’t have those skull like
facial features you seem to enjoy
pinning on me from a distance. you
want to know what I truly look like?
I’ll help you out, Find yourself
a mirror while I continue.”
“Forget the scythe, God damn it, I needed a broom or a mop. And I needed a holiday.”
“So many humans
So many colors….
they keep triggering inside me. They harass my memory. I see them all in their heaps, all mounted on top of each other. There is air like plastic, a horizon like setting glue. There are skies manufactured by people, punctured and leaking, and there are soft, coal colored clouds, beating like black hearts.
and then.
there is death.
making his way through all of it.
on the surface: unflappable, unwavering.
Below: unnerved, untied and undone.”
“one seat, two men, a short argument and me.
it kills me sometimes, how people die.”
“It’s probably fair to say that in all the years of Hitler’s reign, no person was able to serve the Fuhrer as loyally as me.”
Leave a Reply