“నా ఇష్టం” – రాం గోపాల్ వర్మ
కొందరి విషయంలో “తీవ్రత” అనివార్యం! ఇష్టపడడం, చిరాకుపడ్డం లాంటివి కుదరవు. అయితే ఆరాధించటం లేక పోతే అసహ్యించుకోవటం మాత్రమే వీలుపడతాయి. అలాంటి కోవకు చెందిన వ్యక్తి, “రాం గోపాల్ వర్మ” అని వేరే చెప్పక్కరలేదు. సినిమాలన్న, సినిమాలోని మనుషులన్నా నాకు ప్రత్యేక ఆసక్తి ఉండనందున, అమితంగా ఇష్టపడ్డానికో, విభేదించటానికి బద్దకించి, ఆ పేరు ఉన్న చిత్రాలను స్కిప్ చేస్తూ, ఆయన టీవీ లో వస్తే remote వాడుతూ, ఆయన బ్లాగును అనుసరించకుండా.. ఆర్జీవిని *హాయిగా* విస్మరించాను. మొన్నా అనుకోకుండా రక్త చరిత్ర పై మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా విని ఊరుకున్నాను. ఈ పుస్తకం గురించి తెల్సి, పెద్దగా పట్టించుకోలేదు. కాని, అనుకున్నది అనుకున్నట్టుగా, అదనపు అలంకారాలు లేకుండా మాట్లాడే వ్యక్తి రాసినా పుస్తకం, నచ్చకునా బానే ఉంటుందనిపించి చదివాను. అనుకున్నట్టే నిరాశ పడలేదు. పడినా, it’s worth it! అనిపించింది.
ఆర్జీవి గురించి తెలియకపోయినా, “నా ఇష్టం” అన్న టైటిల్, “అంకితం – నాకే!” అని రెండు ముక్కల్లో తానేంటో తేటతెల్లం చెయ్యడం వల్ల, “పోస్టర్ చూసి మోసపోయిన” బాపతు నిరాశలు కలిగే అవకాశం శూన్యం. “మనోడు.. తెలుగోడు..బొంబాయిని ఒక ఊపు ఊపుతున్నాడు” అని ప్రాతీయాభిమానంతో ఈ పుస్తకం చదివితే, దెబ్బ తినడం ఖాయం. “వీడు తీసిన సినిమాలు నాకు నచ్చాయి” అని చదివినా కష్టమే.
మధ్య తరగతి కుటుంబ పరిస్థితులకు తలవొగ్గి, ఇంజనీరింగ్ చేసి, ఒక ఉద్యోగం సంపాదించుకొని, ఏ విదేశాలకో పోయి, అక్కడ ఉండకలేక తిరిగొచ్చి, పెళ్ళిలో ఇమడలేక విడిపోయి.. పూట గడవడం కోసం మాత్రమే శ్రమించి, మిగితా సమయమంతా తన ఊహల్లో బతికేస్తూ, తోచినదల్లా మాట్లాడేస్తూ.. సమాజం standards లో failure కి నిలువెత్తు నిదర్శమనిపించే వాడిగా ఒకవేళ ఇతని జీవితం గడిచి ఉన్నా.. ఈ పుస్తకంలో అత్యధికభాగం అలానే ఉంటుంది అని నాకనిపించింది. సూపెర్ హిట్ అయిన శివ బదులు, పేపర్ మీద నిలచిపోయిన ఒక మాస్టర్ పీసు ఉండేది. సాక్షాత్తు శ్రీదేవి బదులు ఊహా శ్రీదేవి ఉండేది. సినిమా లో నిజ జీవిత విశ్లేషణలకు బదులుగా ఇంకేవో ఉండేవి. అంతే అని నాకనిపిస్తోంది. నాకు కలిగిన అనుభవాలు, నా పరిచయాలు, నేను చదివిన పుస్తకాల వల్ల నేను “నా”లా మిగిలాను అని చెప్పుకున్నారు గాని, ఈయనకు అయాన్ రాండ్ ను కాక, “పరుల కోసం బతుకు. నీ సంగతి మర్చిపో..” అని హితోపదేశాలు చేస్తుంటే కచ్చితంగా work out అయ్యేది కాదు!
(May be, it’s not always about man finding his influences or inspirations. It could be the other way round too. May be, Ayn Rand found him! Who knows? 😛 Well, let me take a break with my psychoanalysis here! 🙂 )
పుస్తకాన్ని నాలుగు భాగాలుగా విభాజించొచ్చు. నాకు బాగా నచ్చింది.. మ్యూసింగ్స్ అనుకోకలిగే వ్యాసాలూ లాంటివి. ఆయన సినిమాల గురించి, ఆలోచనల గురించి, వ్యక్తుల గురించి ఆయన మాటల్లో చెప్పుకొస్తారు. కొన్ని “ఆహా” అనిపిస్తే, కొన్ని “ఓహ్” అనీ, మరికొన్ని “హహహ” అని, ఇంకొన్ని “అబ్బే!” అని అనిపిస్తాయి.
రెండో భాగంలో ఆయన గురించి ఇతరాలు ఏమనుకుంటారో తెలిపే అభిప్రాయాలు. నాకు కామెడి అనిపించిన సంగతి ఏంటంటే.. “ఎవడి లోకం వాడిది.. ఇందులో అన్యులకి ప్రవేశార్హత దొరకటమే దుర్లభం.. ఇక దాన్ని అర్థం చేసుకోవడం కూడానా?” అన్నట్టుగా ఒక వ్యాసం ముగిసీ ముగియగానే.. అన్యుల అభిప్రాయ పరంపర మొదలవుతుంది. రామూ అమ్మగారు, తనికెళ్ళ భరణి, రాముని అమితంగా ప్రభావితం చేసిన సత్యేంద్ర వ్యాసాలూ తక్క, మిగితావన్నీ ముత్యాల ముగ్గు సినిమాలో భజన బృందం బాపతులా అనిపించాయి. నన్ను విమర్శించేవాళ్ళంటే నాకిష్టం అని డంక బజాయించుకునే వీరు, ఏదో ఒక hate-mail కూడా చేర్చుంటే బాగుండేది.
ఆ తర్వాత, ప్రశ్నోత్తరాల రూపంలో వివిధ సందర్భాలు ఈయన వెలుబుచ్చిన అభిప్రాయాలు, విశ్వసించే నిజాలు ఉన్నాయి. సున్నిత మనస్కులు, ప్రపంచం అంటే ఒక రకమైన romanticism ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని చదువుకోవాల్సిన పేజీలు! చివరాఖరున కొన్ని అరుదైన ఫోటోలు. ఫోటోలూ బాగున్నాయి (కలర్ లో ఉంటే ఇంకా బాగుండేవి!), వాటి కింద లైన్లూ బాగున్నాయి.
ఈ పుస్తకంలో సాహిత్యపు విలువలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇవి రచనలు కాదు, రాతలు! అని ముందే సుస్పష్టం చేసేసారు కాబట్టి, తెలుగు పుస్తకాల విషయంలో ఉండే షరా మామూలు complains వదిలేయచ్చు. అయినా, ఇంతటి విభిన్నమైన పుస్తకం తెలుగులో చదవటం నాకయితే ఆనందం కలిగించింది. “నేను తీసేవి అర్థం చేసుకోగలిగే వారు ఒక పది శాతమే.. తెలుగులో తీస్తే ఆ శాతం ఇంకా పడిపోతుంది కదా.. అందుకని తీయను” అని ఒక సారి ఆర్జీవి అన్న గుర్తు. పుస్తకానికి కూడా అదే లాజిక్ వాడకుండా, తెలుగులో రాసినందుకు ముదావహం. కొన్ని చోట్ల తెలుగు బాగా రాసారు. కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే (కనీసం editors ! ) ఇంకా బాగుండేది.
సినిమా ప్రియులు మిస్ కాకూడని పుస్తకమే అనిపిస్తుంది. సినిమాలు అట్టే పట్టని నాలాంటి వాళ్ళకి కూడా.. ఇది విందు భోజనమే!
“అతడు” సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగు ఒకటి ఉంటుంది.. “జింకను వేటాడేడప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది. అట్టాంటిది పులినే యాటాడాలంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి!” అని.
ఇప్పుడు రాము పులి, పుస్తకం చదవటం వేట అని కాదు నా ఉద్దేశ్యం. ఇక్కడ పులులు నిజాలు! నిజం నిష్టూరంగానే ఉంటుంది అంటారు. నిజం నిప్పు లాంటిది అని కూడా అంటారు. నిజానికి నిజం ఇంకా చాలా కూడా.. నిజం అసహ్యంగా ఉంటుంది. వికృతంగా ఉంటుంది. భయపెట్టేలా ఉంటుంది. మన అస్తిత్వాన్ని ప్రశ్నిన్చేలా ఉంటుంది. మన ఆర్జీవి తానూ నమ్మిన నిజాలతోనే డీలింగ్ చేస్తుంటాడు. అందుకని, ఇది అందరి పుస్తకం కాలేదు! Be prepared for some severe jolts – this way or that way – before thinking of reading this book!
పుస్తకం లో కొన్ని హైలైట్ చేసుకోవాల్సిన లైన్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ ఇచ్చేస్తే, చదవబోయేవారి ఆనందానికి విఘాతం అని ఇవ్వటం లేదు. కాని తనికెళ్ళ భరణి గారి నాలుగు మాటలు ఇవ్వకుండా ఉండలేను.
రాం గోపాల్ వర్మ.. మాట మీద నిలబడని హరిశ్చంద్రుడు
రాం గోపాల్ వర్మ.. ఎంతో మందిని ప్రేమించిన రామచంద్రుడు
రాం గోపాల్ వర్మ.. చిత్రమైన చిత్రాల ఫ్యాక్టరీ
రాం గోపాల్ వర్మ.. ఎవడికీ అర్థం కాని ఒక మిస్టరీ
పుస్తకం వివరాలు:
నా ఇష్టం
రాం గోపాల్ వర్మ
ఏమ్మేస్కో ప్రచురణలు
వెల: 175
pages: 284
Available in all leading bookstores!
(Folks away from AP, may buy the book through eveninghour.com)
Balu
I like it ..na guruvu rgv..
vishnu
ఇది నాకు చాల నాచింది . అందులో రాంగోపాల్ వర్మ డైలాగ్స్ కూడా సూపర్ గా నచినాయి . ంతెరెస్తింగ్ బుక్.
పూడూరి రాజిరెడ్డి
…”ఇందులో అన్యులకి ప్రవేశార్హత దొరకటమే దుర్లభం.. ఇక దాన్ని అర్థం చేసుకోవడం కూడానా?” అన్నట్టుగా ఒక వ్యాసం ముగిసీ ముగియగానే.. అన్యుల అభిప్రాయ పరంపర మొదలవుతుంది. రామూ అమ్మగారు, తనికెళ్ళ భరణి, రాముని అమితంగా ప్రభావితం చేసిన సత్యేంద్ర వ్యాసాలూ తక్క, మిగితావన్నీ ముత్యాల ముగ్గు సినిమాలో భజన బృందం బాపతులా అనిపించాయి.”
… ఇందులో “మిగతావన్నీ” అనే మాటను క్యాజువల్-గా వాడారా?
ఇంత ఆలస్యంగా దీనికి స్పందించడం ఎందుకంటే-
అసలు ఈ విమర్శను ఖాతరు చేయకుండా ఉందామనే అనుకున్నాను. కానీ ఇది నన్ను కలచివేసిన మాట నిజం; ఇప్పటికీ ముల్లు గుచ్చుతూనే ఉంది. అలాంటప్పుడు దీన్ని పట్టించుకోకుండా ఉండగలిగానని నన్ను నేను మభ్య పెట్టుకోవడం ఎందుకు?
రాంగోపాల్ వర్మతో నాకు ఎలాంటి లావాదేవీలూ లేవు; ఆయన్ని పొగిడితే నాకు ఏ విధమైన లబ్ధీ కలగదు; రేపెప్పుడైనా నాకు ఎదురై, ‘అలా ఎలా రాశా’వని నిలదీసే నా బాసూ కాదూ. కేవలం నాకు నేనుగా, నేను నిజంగా అనుకున్నది మాత్రమే రాశాను. అదీగాక, అది(మౌన సంభాషణ) రాసింది ఈ పుస్తకం కోసం కూడా కాదు. వర్మ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా ఫన్డే కోసం రాసిన చిన్న ముక్క.
నా ఈ ముక్క కూడా “మిగతావన్నీ” విభాగంలోకి వచ్చేస్తోందని ఈ చెప్పడం.
నాకు ఎవరి భజనా చేయవలసిన అవసరం లేదు.
2011- నా తెలుగు పుస్తక పఠనం | పుస్తకం
[…] వచ్చిన పూర్ణిమ వ్యాసం ఇక్కడ.) […]
chalapathi.DM,kuppam, chithoor distric
Ramgopalvarma mee peru lone “RAMUDU”,”KRISNUDU”. kani naaku thelisi meeru ramudu kaadhu krushnudu kaadu.mee gurinchi mee feelling enti?
సౌమ్య
ఈ వారాంతంలో చదివాను.
౧) వర్మ రాసిన వ్యాసాలు, ఫొటోలు బాగున్నాయి.
౨) ఇతరులు రాసిన వ్యాసాల్లో వర్మ అమ్మగారిది తప్పిస్తే మరేదీ నన్ను ఆకట్టుకోలేదు (నాకు అర్థం కాకపోయి ఉండొచ్చు లెండి!)
౩) వర్మ జవాబులు కూడా కొన్ని భలే నచ్చాయి నాకు.
-మొత్తానికి పుస్తకం నాకైతే చదవడానికి బాగుంది.
V. Dilip Reddy
I love Ram Gopal Varma………..
Because WE BOTH ARE SAME IDEAS…………..
Ramana
Ram Gopal Varma.. may be “Idi mana Karma” but surely “Veede maro Brahma”. He breaks our romanticism with heavy hand. Some times with XL reasoning n Some times “S” (Not Small But Silly) reasons. But for sure we can strongly Follow/Hate him but CAN NOT IGNORE HIM. He has created such a strong impact on my mind. There is lot of Underlying philosophy in his responses.
rawm
మీ మాటలు అన్ని బాగానే ఉన్నై గాని ..
రామ్ కు నేను ఒక చిన్న అభిమానిని.
ఎవరైనా చెప్పగలరా ఆన్లైన్ లో “నా ఇష్టం” బుక్ ఎలా చదవాలో ?
లింక్ చెప్పారు ప్లీజ్ ….
Pavankumar
RGV book rasaddu ani telsinappati nundi, book release kosam wait chesaanu..
antakumundu RGV blog regular follower ni kanuka, book lo vunna chala articlea kottaga anipinchaledu.
konni , kotta vishayalu and philosophy vundi..
RGV gurunhchi okka matalo cheppalante..
RGV is not a person, he is a persona
Love him or Hate him, but you can’t ignore him.
పుస్తకం » Blog Archive » హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి
[…] వారు “నా ఇష్టం” పుస్తకానికి ప్రత్యేకంగా ఒక […]
tolakari
వర్మలో నచ్చింది, నేను నాకిష్టమైనట్టు గానే బతుకుతాను అని చెప్పి అలాగే వుంటున్నారు. అలా చెప్పడం ఎంత తేలికో, అలా బతకగలగడం అంతో కష్టం. మనలో కొద్దిమందైనా కనీసం ఒక్క రోజైనా మనకిష్టమైనట్టు ఉండ గలుగుతున్నామా .
దానికి ఎంతో ధైర్యం కావాలి. మనలను మనం మోసగించుకుంటూ బతుకుతున్నాము . కొద్ది రోజులైనా మనకోసం మనం బతకాలి. ప్రతీ క్షణం మనకోసమే. ఉండగలమా అలా?
చక్కటి వ్యాసం రాసారు. వీలైనంత త్వరగా పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నిస్తాను.
కొత్తపాళీ
sarcasm ఎక్కడో మిస్సయింది .. బాగా చెప్పారు. ఇటీవల ఎక్కడో చదివాను “ఆ అడుగు ఆటని మార్చేసే విధంగా తయారయింది”. ఒక్క నిమిషం అర్ధం కాలేదు. అప్పుడు వెలిగింది – That step turned out to be a game changer! 🙂
kiron
Pathetic review
budugoy
చాణ్ణాళ్ళ కింద RGV బ్లాగులో మూడు నాలుగు టపాలు చదివిన అనుభవంతో, ఈ పుస్తకం డబ్బులు దండగ వ్యవహారం అని – కొనలేదు. ఇంటికొచ్చి చూస్తే టేబుల్ మీద కనిపించింది. సినిమా అభిమాని మా తమ్ముడు కొన్నాడుట. సరే అని తెరచి చూస్తే, ఈ పుస్తకం ముప్పాతిక భాగం , ఆయన బ్లాగుకి తెలుగు అనువాదం. (కనీసం అదైనా బాగుందా అంటే, చాలా యావరేజి అనువాదం. ఆ సర్కాస్మ్ ఎక్కడో మిస్ అయినట్టుంది.) ఇక మిగిలిన నాలుగోవంతు భాగం, ఆయన శ్రేయోభిలాషులు, ఆరాధకులూ ఆయన గుణగణాలను వర్ణిస్తూ రాసిన పేజీలు.
ఈ కాలపు easily excitable mediaను చక్కగా వాడుకుంటున్నాడు rgv.
అమ్మదగ్గిరా, ఇష్టసఖుల దగ్గిరా నాటకాలు వేయలేం. బ్లాగు టపాలు చదివినపుడే రాంగోపాల్ వర్మ బ్లాగు అంత ఒక facade అనిపించేది. వాళ్ళమ్మ వ్యాసం, సత్యేంద్ర వ్యాసం చదివాక అది నిజమేననిపిస్తుంది. మిగిలినదేదీ అంత సీరియస్‌గా తీసుకోనవసరంలేదనిపించింది నాకు.
ఈ పుస్తకం తెలుగులో చదివేకంటే, ఆయన బ్లాగులో ఇంగ్లీషులో చదవడం ఉత్తమం. అదీ బోలెడు తీరికా, ఆసక్తి ఉంటే.
లలిత
ఏం మాట్లాడుకుంటున్నారిక్కడ? పేర్లేవో తెలిసినట్లున్నాయి. మాటలే అర్థం కావట్లేదు. ఏమయ్యింది పాపం రాంగోపాల వర్మకి? అతని సినిమాల్లో నేను ఆఖరున చూసింది బహుశా “గోవిందా గోవింద”. 🙁
కొత్తపాళీ
Interesting book.
Interesting presentation of a review
Lalitha Thripura Sundari
****ప్రపంచానికి ఒక పేలవమైన మినియేచర్ వెర్షన్‌ని ముందేసుక్కూర్చుని… దాన్ని పరిపాలిస్తున్నట్టూ ఫీలవడం, ఆ భ్రమాజనిత ధీమాని అందరికీ ప్రదర్శించడం చాలా సులభం.******
Wonderful analysis & well-expressed in few words….
మెహెర్
ఈ మధ్యనే ఇంకొక రాండిస్టు గురించి నా ఫ్రెండుతో అన్న మాటలు ఇతనికీ వర్తింపజేయగలను (ఇతనికనే కాదు, మొత్తం మందకి): “కాశ్మీరులోయలో కార్లో పోతూ విండోలకి అతికించుకున్న మంచుపర్వతాల వాల్‌పేపర్‌ని చూస్తూ మురిసిపోయే రకం”.. అని. ప్రపంచానికి ఒక పేలవమైన మినియేచర్ వెర్షన్‌ని ముందేసుక్కూర్చుని… దాన్ని పరిపాలిస్తున్నట్టూ ఫీలవడం, ఆ భ్రమాజనిత ధీమాని అందరికీ ప్రదర్శించడం చాలా సులభం. అర్థం కాని వాళ్లకి రివరెన్సూ, అర్థమైన వాళ్లకి ఎంటర్టైన్‌మెంటూ! ఆ రకంగా ఇప్పుడు వర్మ సినిమా దర్శకునిగా కన్నా వ్యక్తిగానే పెద్ద ఎంటర్టెయినర్‌గా మిగిలాడు. 🙂
ఒకసారి ఈ వ్యూ అబ్బాక వీళ్ళలో ఇంక కళేం వుండి చస్తుంది. అందుకే ఇక వర్మ నుండి ఇంకో “శివ”నీ, ఇంకో “క్షణక్షణా”న్నీ ఆశించడం అత్యాశే. ఈ మధ్య “రక్తచరిత్ర” మొదటి భాగం చూసాకా, మరీ అనిపించింది. ఆత్మ ఎటూ లేకపోయింది, కనీసం నరాల మీద బాస్ గిటార్ వాయిస్తూ ఎమోషన్‌లెస్ ఎమ్యూస్‌మెంట్‌ని క్వింటాళ్ళకొద్దీ అందించే Quentin Tarantino తరహా దర్శకుడు కావాలన్నా ఇతనింకా కాంతిసంవత్సరాల దూరం వెళ్లాలి.
మనసులో ప్రతీ భావమూ రసాయనిక చర్యల ఫలితమే అంటారు మెటీరియలిస్టులు. కాజూ ఎఫెక్టూలో కాజు ముందుంది కాబట్టి ప్రాధాన్యత పెరిగి మూలం అయిపోదుగా. సృష్టిలో ప్రతీదీ వర్తులం. ఒక భావాన్ని పుట్టించడం కోసం సృష్టి పడే మూగ ప్రయాసే రసాయనిక చర్యలేమో. అవన్నీ నిష్టూరమైన నిజాలు కాదు. నిజాల వెలుగు భరించే సత్తువ లేని వాళ్లకి రెడీమేడ్‌గా దొరికే కళ్లద్దాలు. One can’t negate the entertainment-factor though! 🙂
మాలతి
@ పూర్ణిమా, ఇవాళెందుకో చదవాలనిపించింది. అలా చేసింది మీరే అనుకుంటా. నేను ఇలాటిపుస్తకం ఒకటి రాయాలగలిగితే బాగుండు :p.
సౌమ్య
ఇదివరలో మీ వ్యాఖ్యల్ని చూడలేదు మాలతి గారూ. మీర్రాయాలంతే! 🙂