చందమామ కథలు
రాసిన వారు: లలిత జి.
**************
అందమైన ముఖ చిత్రంతో మొదలయ్యి అట్ట చివర ప్రకటన వరకూ ఆగకుండా చదివించి, బొమ్మల కోసం పేజీలు మళ్ళీ మళ్ళీ తిప్పించి రంగుల లోకం (బొమ్మలన్నీ రంగుల్లో లేనప్పుడు కూడా) విహరింప చేసే చందమామ జ్ఞాపకాలు ఎంత మధురమో.
మొదలైనప్పట్నుంచీ మారుతోంది చందమామ. ఒకప్పుడు అత్యున్నత స్థాయిని చేరింది. అప్పట్నుంచీ పడుతూ లేస్తూ అభిమానుల ఆప్యాయత బలంతో ముందుకు సాగుతోంది. తనని తాను సరి దిద్దుకుంటూ మళ్ళీ తానే స్థాపించిన ఉన్నత శిఖరాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు సాక్ష్యం చందమామ మళ్ళీ తన పూర్వ పరిమాణం సంతరించుకుంటోందన్న కబురు.
చైనా కథలూ, ఇంద్రజాల కథలూ, అల్లరి దయ్యాలూ, ఇతిహాసాలూ, పురాణాలూ, అపురూప విషయాలూ, జోడు వాక్యాల చమక్కులూ (ఫోటో క్యాప్షన్లు), దాసరి సుబ్రహ్మణ్యం గారి అడవిలో కథలూ, అరేబియా కథల అద్భుత ప్రపంచాలూ ఉన్న చోటే వసుంధరాదుల అతి సామాన్యమైన కథలలోని అసాధారణమైన ఆలోచింప చేసే విషయాలూ అన్నీ చందమామ వన్నెలో అంతర్భాగాలు.
దాసరి సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం రచన శాయి గారు అభిమానుల కథనాలతో ఈ పుస్తకం విడుదల చేశారు. చందమామ చిత్రకారుల అద్భుత చిత్ర రచనను చందమామ వారు ఆర్ట్ బుక్కుగా తీసుకు వచ్చారు.
నేను రాయ దల్చుకున్నది నాకు అడుగడుగునా గుర్తుకు వచ్చే చందమామ కథల గురించి. అందులో బహుశా చాలా మటుకు వసుంధర గారివే అయ్యి ఉంటాయి. ఇంట్లో వస్తువులు పేరుకు పోవడం, పడెయ్యలేక పోవడం సామాన్యమైన అనుభవాలే అనుకుంటాను అందరికీ. చాలా సార్లు నాకు అక్కరకు వచ్చేది వసుంధర గారి కథ ఒకటి. ఇలాగే ప్రతి వస్తువూ ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందని పోగు చేసుకుంటుంటే, దొంగ ఒకడు ఆ వస్తువులనే ఉపయోగించి ఇంట్లో వాళని కట్టేసి, కావల్సినవి దోచుకుని, అలా చేరిన చెత్తకు నిప్పు పెట్టి తప్పించుకోవడం లాంటిది ఏదో చేస్తాడు. ఎన్నో సార్లు ఆ కథ గుర్తుకి వచ్చి చాలా అనవసరమైన వస్తువులు వదిలించుకోగలిగాను.
ఇది కూడా వసుంధర గారి రచనే. చలికి ఇంట్లో వారికెవ్వరికీ బయటకు వెళ్ళాడానికి మనసొప్పక బిచ్చం అడగడానికి వచ్చిన వాణ్ణి పనికి పురమాయిస్తారు. వాడు ఆ చలిలో పనులు చేసుకొస్తే అతనికేవో అద్భుత శక్తులు ఉన్నాయనుకుంటారు. కడుపు నిండి కృతజ్ఞత తెలుపుకోగలిగాక వాడికీ చలి వేస్తుంది. అప్పుడు అందరూ పాఠం నేర్చుకుంటారు.
ఇంకొకటి ఇల్లు ఇరుకైనప్పుడు దానిని మరింత ఇరుకు చేసి తర్వాత ఒక్కొక్కటీ బయటకు పంపించమని సలహా ఇవ్వడం. ముందు ఇరుకనిపించిన ఇల్లే, ఎక్కువైనవి తీసేశాక ఎంతో విశాలంగా అనిపిస్తుంది.
అలాగే ఈ మధ్య మళ్ళీ ప్రచురించిన పాత కథ ఒకటి. తను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయి తెలివితేటలు పరీక్షించి నచ్చి పెళ్ళికి ఒప్పుకుంటే ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోదు. తెలివితేటలే కాదు స్వాభిమానం కూడా విలువైనది అని తెలియ చెప్పే కథ ఇది.
చందమామ పౌరాణికాల ఆకర్షణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. బొమ్మలే కాక కథనం కూడా అందంగా ఉండేది. అందుకు కారణం కుటుంబరావు గారని ఈ మధ్యే తెలిసింది. ఐతే ఈ విషయం మా అక్కతో చెప్దామని సంభాషణ మొదలు పెడితే తనే చందమామ పౌరాణికాలను గుర్తు చేసుకుంటూ అందులో కుటుంబరావు గారి పాత్ర చెప్పి, వారు రాసిన విధానం వల్లే మనం పాత్రలను judge చెయ్యకుండా కథను తెలుసుకోగలిగాము అని చెప్తుంటే ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి.
చందమామ పిల్లల కోసమా పెద్దల కోసమా అన్న ప్రశ్న, అమూల్ ప్రకటన “I’m too old for… I’m too young for..” గుర్తుకు తేవచ్చేమో. పెద్దలని అలరిస్తూ వారి చేత కొనిపించి, పిల్లలను పుస్తకాలకు దగ్గర చేసిన చందమామ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో. ప్రత్యేకించి పిల్ల కోసం ఏ ఆకర్షణలూ పెట్టకుండా పిల్లల స్థాయిని పెంచి, వారు చందమామని అందుకునేలా చేసిన ఘనత ఆ నాటి చందమామది. ఇప్పుడు మా పిల్లలని ప్రధానంగా ఆకర్షిస్తున్నవి బొమ్మలు, పౌరాణిక గాథలు. మామూలు కథలు కూడా చదివి వినిపిస్తే చక్కగా వినే స్థాయికి ఎదిగాడు మా చిన్నబ్బాయి కూడా. చందమామ కథలు వారంత వారు చదువుకో గలిగే తెలుగు వస్తే వారే ఆ కథల ద్వారా నేను చెప్పాలనుకున్న, చెప్పలేని విషయాలు ఎన్నో తెలుసుకోగలుగుతారని నా ఆశ.
nimmagadda krishna murthy
Chandamama chandamame
Chandamamaku satedee ledu
pillala manobhavalu pratifalinche
pillala kadhalu marekkada dorakavemo
neti sahityam pillaini hantakuluga marustondi
nizam cheppalante aanati chandamama
pillalni alarinchindi , dantobate vaariki
manchi buddhulni kuda nerpi manchivaaruga
tayaaruchesindi.
prasad
good to see chandamama in old format. the readers are expecting the stories to deal with keelugurram,ontikanti rakshasudu ,raathiradham and never wants stories involving recent guns cycles cars etc. let it be old chandamama .
jony
cinna pilla kadalu rayandi,jokes elativi raste happyga read chestaru plz.
శివరామప్రసాద్ కప్పగంతు
“…ఇంకా రాయడానికి ప్రయత్నిస్తాను…”
రాయటమా? లేక వ్రాయటమా! నా ఉద్దేశ్యంలో వ్రాయటం సరైన పదం. రాయటం పదానికి అర్ధం వేరుగా ఉంటుంది.
మన తెలుగు చందమామ బ్లాగులో అనేక మంది చందమామ అభిమానులు సహ రచయితలుగా ఉన్నారు. ఆ బ్లాగు లో విషయాలు చదివుతుంటే ఒక్కొక్కరూ పరిచయం అవుతారు. అనేక లింకులూ దొరుకుతాయి.
konda reddy
chandamamakathalu chala bagunnai…….. very interested….
లలిత (తెలుగు4కిడ్స్)
@మందాకిని: Thanks.
“పుస్తకం మొదలు పెట్టినపుడు మొదటి వ్యాసంగా రావల్సిందిది. హి..ఎందుకంటే చదివే ఇష్టం ఉన్నవాళ్లందరూ చందమామ మొదట ఇష్టంగా చదివే కదా వచ్చుంటారు!”
@శివరామప్రసాద్ కప్పగంతు: ఇలా మీలాంటి అభిమానులు ఇంకొన్ని లంకెలు పరిచయం చెయ్యగలరనీ, వీలైతే చందమామ అభిమానులు విడిగా బ్లాగుల్లోనే కాక పుస్తకం.net లో కూడా విలువైన వివరాలు అందించగలరని ఆశిస్తున్నాను.@రాజశేఖర రాజు: రాజు గారూ,
చందమామ అభిమానులు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చందమామ చరిత్రను ఎంతో శ్రమపడి మాకు అందిస్తున్నారు. చందమామ కోసం, చందమామ గురించి, రాసేవారికి అవసరమైన, ఉపయోగరమైన ప్రోత్సాహ సహకారాలు అందిస్తున్నారు. చందమామ అభిమానులను, చందమామను ఒకరికి ఒకరిని దగ్గిర చేస్తున్నారు. నా చందమామ జ్ఞాపకాలను అసలంటూ మనసులోంచి మాటలలోకి తేగలిగింది, మీరు పట్టుబట్టటం వల్లే కదా.
అందరికీ తెలిసే ఉండవచ్చేమో, కానీ, నేను మర్చిపోయిన లంకెలలో ఇంకొకటి చందమామ ఆర్కైవులు(http://chandamama.com/archive/TEL/storyArchive.htm)
పాత చందమామను పదిలంగా చేతిలో పట్టుకున్న తృప్తి వేరైనా, దాదాపు అన్ని సంచికలూ ఉంచితంగా అంతర్జాలంలో ఉంచడం చాలా గొప్ప విషయం.
అందరి అభిమానానికీ ధన్యవాదాలు. ఇంకా రాయడానికి ప్రయత్నిస్తాను.
రాజశేఖర రాజు
లలితగారూ,
క్లుప్తంగా ముగించిన ఈ కథనంలో ఎంత మంచి విషయాలు రాశారు!
.చదివే ఇష్టం ఉన్నవాళ్లందరూ చందమామ మొదట ఇష్టంగా చదివే కదా వచ్చుంటారు! అని మందాకిని గారన్న ఆ ఒక్క ముత్యపు మాట చందమామ పట్ల పాఠకుల ఆరాధనను తెలుపుతోంది. చందమామకు ఇంతకంటే మించిన ప్రశంస లేదనుకుంటాను. లలితగారూ మీదే ఆలస్యం.. మీ చందమామ వ్యాసాలకోసం మేమందరం ఎదురుచూస్తుంటాము.
శివరాంగారూ,
నా కొత్త, వ్యక్తిగత బ్లాగు ఇంకా ఆన్‌లైన్ కూడళ్లలోకి రాలేదు. అజ్ఞాతంగానే ఉన్న దీనిని మీరు ఇక్కడ బహిర్గతం చేసేశారు. ధన్యవాదాలు.
శివరామప్రసాద్ కప్పగంతు
అభిమానులు కొందరు తెలుగు చందమామ గురించి ఒక ప్రత్యేక బ్లాగ్ నడుపుతున్నారు. ఈ కింది లింకు నొక్కి చూడగలరు
http://manateluguchandamama.blogspot.com/
“చందమామ రాజు”గా పేరొందిన శ్రీ రాజశేఖర రాజుగారి బ్లాగు ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.
http://kanthisena.blogspot.com/
మందాకిని
పుస్తకం మొదలు పెట్టినపుడు మొదటి వ్యాసంగా రావల్సిందిది. హి..ఎందుకంటే చదివే ఇష్టం ఉన్నవాళ్లందరూ చందమామ మొదట ఇష్టంగా చదివే కదా వచ్చుంటారు!
లలితగారూ, క్లుప్తంగా అనిపిస్తోంది. చక్కగా రాస్తున్నారుగా, వ్యాసపరంపర గా రాయమని వినతి.