నా అసమగ్ర పుస్తకాల జాబితా -2
రాసిన వారు: సి.బి.రావు
****************
(ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు)
Essays -Criticism
1) సమగ్రాంధ్ర సాహిత్యం -ఆరుద్ర
నేను మెచ్చిన కవి ఆరుద్ర. ఎవ్వరూ చెయ్యలేనంత గొప్ప కార్యం చేసి వెళ్లిపోయారు. సమగ్రాంధ్ర సాహిత్యం పేరుతో ఆంధ్రుల సాహితీ చరిత్రని పధ్నాలుగు సంపుటాలుగా, 3100 పేజీల గ్రంథాలిచ్చారు. దేశంలో ఒంటిచేత్తో అంతపనిచేసిన వారు ఆయన తప్ప మరొకరు కనిపించరు. గత యాభై, అరవై సంవత్సరాల్లో వివిధ ప్రక్రియల ద్వారా సాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారు. ఆంధ్రులున్నంత వరకు సమగ్రాంధ్ర సాహిత్యం ఉంటుంది. అది చూసి ప్రతి ఆంధ్రుడూ గర్విస్తాడు. ఆ గర్వం వెనుక ఆరుద్రుడి విశ్వరూపం కనిపిస్తూనే ఉంటుంది. -అడిగోపుల వెంకటరత్నం (కవి)
2) గీతా రహస్యం -నార్ల వెంకటేశ్వర రావు . ఆంగ్ల పుస్తకం అమజాన్.కాం లో లభ్యమవుతుంది. The Truth About the Gita అనే నార్ల పుస్తకానికి నరిసెట్టి ఇన్నయ్య సంక్షిప్త అనువాదం గీతా రహస్యం ఇక్కడ చదవవచ్చు.
3) రామాయణ రహస్యాలు (1968) -కొత్త సత్యనారాయణ చౌదరి . చారిత్రక కోణంలో రామాయణ పరిశీలన. ఈ విమర్శనా గ్రంధ పరిచయం ఇక్కడ చదవవొచ్చు.
4) ఉపనిషత్ చింతన (1989) -ఏటుకూరి బలరామమూర్తి. ఏటుకూరి బలరామమూర్తి జీవితం -రచనలు గురించిన వ్యాసం ఇక్కడ చదవండి.
5) మీగడ తరకలు -వేటూరి ప్రభాకర శాస్త్రి. సాహిత్య పరిమళాలతో కూడిన చక్కటి వ్యాస సంపుటి. వేటూరి ప్రభాకర శాస్త్రి గురించిన మరిన్ని వివరాలకై ఇక్కడ చూడవచ్చు.
6) సారస్వత వివేచన -రాచమల్లు రామచంద్రారెడ్డి. రా.రా గురించిన తమ్మినేని యదుకుల భూషణ్ వ్యాసం ఇక్కడ చూడవచ్చు.
7) విమర్శా శిల్పం -వల్లంపాటి వెంకటసుబ్బయ్య. విమర్శలో ఘనాపాఠి వల్లంపాటి వ్యాసం ఇక్కడ చదవవచ్చు.
8 ) మానవ సమాజం -రంగనాయకమ్మ. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
9) పురాణ ప్రలాపం – హరిమోహన్ ఝా. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు,దిగుమతి చేసుకోవచ్చు. ఈ గ్రంధం పై, నరిసెట్టి ఇన్నయ్య సమీక్ష ఇక్కడ చూడండి.
10) రాష్ట్ర రాజకీయ చరిత్ర: వందేళ్ల విశ్లేషణ 1910 – 2010 -నరిసెట్టి ఇన్నయ్య . ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు, పుస్తకాన్నీ దిగుమతి చేసుకోవచ్చు.
11) మన తెలుగుతల్లి -నలమోతు చక్రవర్తి : My Telugu Roots: Telangana State Demand – A Bhasmasura Wish (Paperback – Dec 7, 2009) పుస్తకానికి తెలుగు అనువాదం. ఈ పుస్తకం లోని కొన్ని అధ్యాయాలు ఇక్కడ చదవండి.
12) తెలుగు కథానికకు వందేళ్ళు! – వేదగిరి రాంబాబు (సంపాదకుడు) : ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు
17) క్రైస్తవం ఇంత అమానుషమా? -మూల రచయిత శాం హారిస్. శాం హారిస్ రాసిన ‘A Letter to Christian Nation” అనే పుస్తకాన్ని ఇన్నయ్య “క్రైస్తవం ఇంత అమానుషమా?” అనే పేరుతో తెలుగీకరించారు. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు. పుస్తకాన్ని దిగుమతి కూడా చేసుకోవచ్చు.
18) యాది 19) సంగీత శిఖరాలు -ఎన్.సదాశివ. ఎన్.సదాశివ గురించిన విపుల సమాచారానికై ఇక్కడ చూడవచ్చు.
14) రాజకీయాల మధ్య తీరిక వేళలు -డా|| రాం మనొహర్ లోహియా. రాం మనోహర్ లోహియా గురించిన సమాచారానికై ఇక్కడ చూడవచ్చు.
15) దేవుడంటే ఇదన్నమాట -క్రిస్టోఫర్ హిచిన్స్ God Is Not Great పుస్తకానికి తెలుగు అనువాదం: ఎన్. ఇన్నయ్య. ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి దిగుమతి చేసుకోవచ్చు.
21) లేఖా చలం -చలం. చలం సంజీవదేవ్ కు వ్రాసిన ఉత్తరాలు 1957 -1960
22) తెలంగాణం (వ్యాస సంకలనం) -సంపాదకుడు : వట్టికోట ఆళ్వారుస్వామి . మొదటి ముద్రణ :1953, రెండవ కూర్పు (Edition) :2009 . ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు.
23) పెళ్లి దాని పుట్టు పూర్వోత్తాలు –తాపీ ధర్మా రావు. ఈ పుస్తకాన్ని ఇక్కడ చదువవచ్చు. మరిన్ని వివరాలకై ఇక్కడ చూడవచ్చు.
25) స్మృతికిణాంకం (2002 సాహిత్య అకాడమీ అవార్డు) -చేకూరి రామారావు. స్మృతికిణాంకం పుస్తకం లోని కొన్ని విశేషాలు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
27) నేటికాలపు కవిత్వం – తీరు తెన్నులు -తమ్మినేని యదుకులభూషణ్.
వేర్వేరు పత్రికలలో వెలువడిన, వివిధ సందర్భాలలో విశ్వనాధ వారు వెల్లడించిన ఆలోచనల సంకలనం. ఆంధ్రా, తెలంగాణా విభజన సమంజసమని వారి అభిప్రాయం.
అనూహ్య విజయం సాధించిన చలనచిత్రం ‘ శంకరాభరణం ‘ చిత్ర నిర్మాణ విశేషాలతో కూడిన నాలుగు చిత్రాల వెండితెర నవలల పుస్తకం, దర్శకుడు వంశీ మాటలలో.
నా అసమగ్ర పుస్తకాల జాబితా -3 | పుస్తకం
[…] పుస్తకాల జాబితా భాగం 1 ఇక్కడ, భాగం 2 ఇక్కడ […]
నా అసమగ్ర పుస్తకాల జాబితా -4 | పుస్తకం
[…] చదవకపోయుంటే, వ్యాస భాగం 1 ఇక్కడ, భాగం 2 ఇక్కడ, భాగం 3 ఇక్కడ […]
cbrao
అగ్ని గర్భ -ఈ పేరుతో రెండు హిందీ పుస్తకాలున్నాయి. ఒకటి మహాశ్వేతా దేవి రెండోది అమృత్ లాల్ నగర్ వ్రాశారు. మహాశ్వేతా దేవి పుస్తకాలు పలు భారతీయ భాషలలో అనువాదమయ్యాయి. అగ్నిగర్భ ఆంగ్లానువాదం లభ్యమయ్యే అవకాశం ఉంది.
రామ మోహన రెడ్డి
వందనములు,
నాకు ఒక సాయం చెయ్యగలరా, నేను యెప్పుడో చిన్నప్పుడు “అగ్ని గర్భ” అని నవల చదివాను, రచయిత పబ్లిషర్ వివరాలు నాకు గుర్తు లేవు, దయచెసి మీకు తెలిస్తె చెబుతారా?