పరిచయం: రాష్ట్ర రాజకీయ చరిత్ర: వందేళ్ల విశ్లేషణ 1910 – 2010

రాసిన వారు: సి.బి.రావు

*******************

ఇది ఒక శతాబ్ద గమన చరిత్ర

rashtrarajakeeyaతెలుగు వారు ఆంధ్ర తెలంగాణా కలియక పూర్వం, స్వాతంత్ర్యం రాకముందు ఎలాంటి నేపథ్యం నుండి వచ్చారు? తమిళులు, కన్నడిగులు, మళయాళీల నుండి వేరుపడిన తెలుగు వారు, జస్టిస్ పార్టీ హయాంలో ఏ విధంగా సంస్కరణలు చవిచూచారు? మరో పక్క నైజాం నిరంకుశ పాలనలో మరాఠీలు, కన్నడిగులు, తెలుగు వారితో ఎలా మసిలారు? స్వాతంత్ర్య పోరాటాలలో ఉభయ ప్రాంతాల పాత్ర ఏమిటి?ఆంధ్ర ఏర్పడిన తరువాత, హైదరాబాద్ విమోచన తరువాత అధికారానికి దగ్గరగా వచ్చిన కమ్యూనిస్టులు ఎలా జారిపోయారు? ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం సాగడమే గాని సాధించిందేమిటి?

ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉభయ ప్రాంతాలలో ఏవిధంగా ఆక్రందించారు? వద్దన్న వారు ఏం చెప్పారు? ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుండీ 25 సంవత్సరాల పాటు తిరుగులేని కాంగ్రెస్ పాలన నుండి, ఎన్.టి. రామారావు తెలుగు దేశ ప్రభంజనం ఎలా తెచ్చారు? నాదెళ్ళ భాస్కరరావు  పాత్ర ఏమిటి? ప్రతి పక్షం నుండి కోలుకొని మళ్ళీ కాంగ్రెస్ ఎలా బతికి బట్టకట్టింది? వీటన్నిటి వెనుక కులరాజకీయాలు ఏ ధోరణిలో సాగాయి? పుట్టి గిట్టిన పార్టీలు, తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం సాగినప్పుడు, సామాన్య ప్రజలు ఎలా (ముఠా రాజకీయాలు సరే సరి) కొరముట్టు అయ్యారు?

ఒకే ఒకసారి దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యి ఒక దళితుడికి గౌరవం దక్కించాడు. ఆ తరువాత వెనుకబడిన వారి పక్షాన అంజయ్య ముఖ్యమంత్రి అయినా, తానూ రెడ్డినే అని తన పాత్ర మార్చివేశాడు. మిగిలిన వారంతా అటు అధికారంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ అగ్రకులాల ఆధిపత్యంలోనే కొనసాగారు. బహుశా గౌతులచ్చన్న, బండారు రత్న సభాపతి ఇందుకు మినహాయింపు కావచ్చు. తెలంగాణ నుండి ముఖ్యమంత్రులుగా నలుగురు వచ్చి కూడా ఆ ప్రాంతపు సమస్యలు తీర్చలేకపోయారు.

ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉభయ ప్రాంతాలు ఉద్యమాలు చేసిన ఘట్టాలు  వివరంగా సంకలనం చేయడం ఒక ఎత్తయితే, పార్టీలు చీలి పోవడము, కొత్త పార్టీలు పుట్టడం మరొక ఎత్తు. తిరుగులేని కాంగ్రెస్ పార్టీని 9 నెలలలో తొలగించి  అధికారానికి వచ్చిన ఎన్ టి రామారావును, కుట్ర ద్వారా తప్పించాలని ప్రయత్నించిన  నాదెండ్ల   భాస్కరరావ్ పాత్ర మరచిపోలేని మచ్చగా మిగిలింది. మరొక సారి అల్లుడు చంద్ర బాబు వెన్నుపోటుకు గురై  అధికారం పోగొట్టుకొన్న రామారావు  అచిరకాలం లోనే కాలం చేసాడు.రాష్ట్రాన్ని హై టెక్  లోకి నడిపించిన చంద్రబాబు రైతుల్ని మరిచాడని అన్నారు.అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి దీవించినా ఓటమి తప్పలేదు.జార్జ్ బుష్ ను రాజధానికి తెచ్చిన రాజశేఖరరెడ్డి, తిరుగులేని నాయకుడుగా పరిపాలిస్తుండగా హెలికాప్టర్ పొట్టన పెట్టుకున్నది. ఆనుకోని ముఖ్య మంత్రిత్వం రోశయ్య మీద పడింది . మరో సారి  తెలంగాణా  కొరకు వుద్యమం రాగా, ఈ సారి ఆంధ్రలో సమైక్య వాదంతో ముందుకు రావడం విశేషం.  లాంటి ఆసక్తి కరమైన అంశాల చరిత్ర ఈ గ్రంథమంతా కనిపిస్తుంది. చివరకు ప్రస్తుత ముఖ్య మంత్రి  కే. రోశయ్యతో సాగుతున్న చరిత్ర దగ్గర ఆగుతుంది. 100 ఏళ్ళ  రాజకీయ చరిత్ర, పార్టీ రహితంగా పరిశీలించి, నిష్పక్ష పాతంగా, శాస్త్రీయ ధోరణిలో ఈ పుస్తక రచన సాగింది.

ఈ 100 ఏళ్ల రాజకీయ చరిత్ర  ఆంగ్ల సంహితం  TV  9  సంచాలకులు రవిప్రకాష్  అక్టొబర్ 18, 2009న  TV 9   దూర దర్శనం ద్వారా ఆవిష్కరించారు.  ఆ కార్యక్రమంలో పలువురు  సంపాదకులు, రచయితలు ఈ పుస్తకం పై తమ సదభిప్రాయాన్ని వెళ్లడించారు.  మన రాష్ట్రంలో ఈ పుస్తకం టివి ద్వారా ఆవిష్కరణ కావింపబడటం  చారిత్రాత్మకం.  ఇప్పుడు పాఠకులకు పరిచయం చేస్తున్నది తెలుగు లో “రాష్ట్ర రాజకీయ చరిత్ర:  వందేళ్ల విశ్లేషణ  1910 – 2010”. ప్రముఖ రచయిత ఇన్నయ్య గారి రాజకీయ పరిశీలనే ఈ పుస్తకం. పుస్తకం చివరలో రచయిత సంక్షిప్త జీవిత చరిత్ర, వారు వెలువరించిన ఇతర గ్రంధాల వివరాలు లభిస్తాయి.మన రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో , మన రాష్ట్ర రాజకీయ చరిత్ర తెలుసుకొనగోరేవారికి,  రాజకీయ శాస్త్ర విద్యార్థులకు మరియు పాత్రికేయులకు ఇది ఒక  సంప్రతింపు గ్రంధంగా ఉపయుక్తం కాగలదు.

ప్రచురణ కర్తలు: Centre for Inquiry India, Hyderabad.
తొలి ముద్రణ:  ఫిబ్రవరి 2010
పేజీలు: 410   పేపర్ బాక్  డెమి

పుస్తక  పంపిణీదారులు: Navodaya Book House , Kachiguda X Roads, Hyderabad – 500 027
Phone: 91-040- 27678411
ధర: రూ. 120/- $ 20 £ 10

తాజాకలం: ఈ 100 ఏళ్ల రాజకీయ చరిత్ర  e – పుస్తకం గా కూడా లభ్యం అవుతుంది. ఈ గొలుసులోంచి pustakam.net పాఠకులు ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.

You Might Also Like

7 Comments

  1. Narasimha

    ఇటువంటి పుస్తకాలు ఆన్ లైన్లో ద్వారా పొందగలమా

  2. Chowdary

    This book has very valuable information and which is very helpful to the youger generations to know the facts and history about our state.

    Thanks alot Innaiah Garu for bring to the world as a book.

    -Chowdary

  3. పుస్తకం » Blog Archive » నేను కలిసిన ముఖ్యమంత్రులు, మానవవాదులు

    […] చదివించే గుణం కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచన, రాజకీయాలను విశ్లేషించటం లోనూ […]

  4. cbrao

    అచ్చులో ఈ పుస్తకం పేజీలు: 410 పేపర్ బాక్ డెమి పరిచయంలో ఈ వివరాలు ఉన్నాయి. P.D.F. లో ఇచ్చింది పూర్తి పుస్తకం. ఆ ఫార్మాట్ లో తక్కువ పేజీలుగా కనపడుతుంది. ఈ పుస్తకం శాస్త్రీయ ధోరణిలో వుంటుంది.

  5. HalleY

    186 pages in the .pdf i meant

  6. HalleY

    పుస్తకం బాగానే ఉంది కానీ రామచంద్ర గుహ “India after gandhi” తరహా ఆశించాను నేను .. ఈ తరహా పుస్తకాలు ఎదో ఒక 400-500 పేజీలు ఉంటేనే సరైన న్యాయం జరుగుతుందో ఏమో ! . మరీ 186 పేజీలలో 100 యేళ్ళ చరిత్ర చెప్పేయటం కొంచెం కష్టమే మరి !.

Leave a Reply