మనం “ఫేంటసీ” బస్సు మిస్సు ఐనట్టేనా?

రాసిన వారు: Halley

********************

మొన్నా మధ్యన ఆదివారం ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, ..టి లో అత్తెసరుగాళ్ళుఅని “5 point someone” తెలుగు అనువాదం గురించి చదివాను. ముందు పేరు చూసి నవ్వుకున్నా, తర్వాత ఎందుకనో కోపం వచ్చింది! మళ్ళీ ఇంకొక అనువాదమా అన్న కోపం. కోపానికి ఒక కారణం లేకపోలేదు. నాకు ఎందుకనో చాలా కాలం నుంచీ ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక చిన్న చూపు. ఇది ఏదో అకారణంగా పెంచుకున్నది కాదు, గత 15 ఏళ్ళలో ఎన్నో మార్లు ఎన్నో బుక్ ఫెయిర్సు కానివ్వండి, బుక్ షాపులు కానివ్వండి, మంచి మోడరన్ డే తెలుగు పుస్తకాల కోసం ఎంతో వెతికాను. ఎపుడో కానీ కనపడవు. ఎక్కడ చూసినా ఇదిగో ఇలా సగానికి పైగా అనువాదాలే కనపడతాయి! అనువాదం అవసరమే కాదనను కాని పబ్లిష్ అయ్యే పుస్తకాలలో సగానికి సగం అవేకనిపిస్తాయి నాకు. ఎటు వెళ్లినా (మరి నాకు కళ్ళజోడు అవసరమో ఏమో ). ఇవీ కాదూ అంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు (ఇందులో కుడా సగం వేరే భాషల అనువదాలే). ఇవీ కాదూ అంటే ఆంగ్ల సైన్సు పుస్తకాల అనువాదాలు. ఇవన్నీ కాదు అంటే రా.వి.శాస్త్రి, విశ్వనాథవారు , శ్రీ శ్రీ అలా పాత కాలం వారి రచనలు .. లేదా 1980ల లో ఒక ఊపు ఊపిన యండమూరి , యద్దనపుడి ఇలాంటి వారి రచనలు (ఇప్పటికీ మాత్రం తెలుగు సాహిత్యం పుస్తకాల సేల్స్ ఉన్నాయి అంటే పుస్తకాల వల్లనే కాబోలు).


అపుడప్పుడు కొన్ని కొన్ని మంచి ఒరిజినల్ తెలుగు పుస్తకాలు వస్తాయి. కాదనను. ఐనప్పటికీ గత 20 ఏళ్ళలో (నేను పుట్టింది 1986 కాబట్టి నా ప్రామణికం 1990-2010) తెలుగు సాహితీ లోకాన్ని ఒక ఊపు ఊపి అటు పాత పాఠకులని అలరించి ఇటు వందల వేలకొద్దీ కొత్త పాఠకులని తెప్పించిన పుస్తకాలు యేవి అంటే ఏమో! .. అంటాను నేను. ఇక్కడ మార్పు అంటే ఎదో చిన్న స్థాయి మార్పును గురించి కాదు నేను చెపుతున్నది.. ఆంగ్లములో పరడిగ్మ్ షిఫ్ట్” (paradigm shift) అంటారు.. స్థాయి మార్పు. బహుశా అంతర్జాలంలో తెలుగు వెబ్ సైట్స్ వెల్లువ వలన మెల్లగా ఏదన్నా పెను మార్పు కలుగుతుందో ఎమో నాకు తెలియదు!


ఇది మరి అన్ని ప్రాంతీయ భాషలకి ఉన్న సమస్యో ఏమో నాకు తెలియదు. గడిచిన 20 ఏళ్ళలో ఆంగ్ల సాహితీ (ఫిక్షన్) ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పుస్తకాలలో కొన్నిటిని పరికించి చూస్తే అటువంటివి మన తెలుగులో ఎందుకురావా అని అనిపిస్తుంది [లంకె : ఇక్కడ ]. లిస్టులో పైన చెప్పిన కాలంలో ముఖ్యమైనవాటిని కొన్నిటిని పరికించి చూద్దాం. క్రిస్టొఫెర్ పౌలిని ఇన్హెరిటెన్స్ సిరీస్ ఎరగొన్ , ఎల్డెస్ట్ , బ్రిసిన్గర్ – 2002-2008 ” ,  “జె.కె.రౌలింగ్ హేరీపొట్టర్ సిరీస్ – 1997-2007″ , “ఫిలిప్ పుల్మేన్ హిస్ డార్క్ మెటిరియల్స్ సిరీస్ – 1995-2000 ” (గోల్డెన్ కంపాస్ సినిమాగా కూడా వచ్చింది) . మూడూ ఫేంటసీ నవలలు , ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి.తర్వాత సినిమాలుగా విడుదల అయ్యి కోట్లు ఆర్జించాయి కూడానూ! .


వీరిలో ఇప్పుడు పౌలినీ వయసు అక్షరాలా 26 యేళ్ళు . ఇప్పటి దాకా ఇన్హెరిటెన్స్ సిరీస్ పుస్తకాలు అమ్ముడైంది రెండు కోట్ల కాపీలకి పై మాటే! కథ అంతా టినేజ్ పిల్లలు , డ్రాగన్స్ చుట్టూ తిరుగుతుంది. ఇక జె.కె.రౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందరో లక్షల మంది కొత్త పాఠకులని సాహితీ లోకానికి లాకొచ్చింది ఆవిడ. ఇప్పటి దాకా అమ్ముడుపోయిన కాపీలు నలభై కోట్లకు పై మాటే. కథ కుడా ఫేంటసీ కథే! నేను అన్ని పుస్తకాలు చదవలేదు లెండి. ఫిలిప్ పుల్ల్మన్ పుస్తకాలు విదేశాలలో చాలా బాగా అమ్ముడుపోయాయి అంటే ఒకటిన్నర కోట్ల కాపీలకు పై మాటే. వీటి గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. “గోల్డెన్ కంపాస్సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవటం ఒక కారణం ఏమో! నేను సిరీస్ పుస్తకాలు మూడూ చదివి ఉన్నాను. వంద చందమామ కథలకు పెట్టు సిరీస్! గత కొనేళ్ళలో ఆపకుండా మూడు పుస్తకాలు చదవటం నాకు గుర్తు లేదు.. “హిస్ డార్క్ మెటిరియల్స్ సిరీస్ తప్పితే !.


పుస్తకాలన్నీ 10-25 యేళ్ళ మధ్య వారి కోసమే. ఫ్యూచర్ సిటిజెన్స్ కోసమే! చిన్నప్పుడే పుస్తకాల విలువ తెల్సుకుంటే పాఠం జీవితాంతం గుర్తు ఉండి పొతుంది. మరి ఇరవై సంవత్సరాలలో తెలుగులో ఒక మోస్తరు ఫేంటసీ నవల అన్నా వచ్చిందా అంటే లేదు అనే చెప్పాలి! పుస్తకాల పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా ప్రపంచ బాలలంతా ఫేంటసీ ప్రపంచంలో ఓలలాడుతూ ఉంటే, ఎందుకనో మరి ఒక్క తెలుగు రచయిత/త్రి కూడా రకం నవలలు రాయాలని సంకల్పించలేదు! ఏదో అవతార్లాంటి సినిమా మనం తీయలేము అనండి .. ఒప్పుకుంటా .. అన్ని కోట్లు పెట్టి సినిమా తీసే స్థోమత మన దేశంలో ఇంకా యే ప్రొడ్యుసరుకీ లేదనే అనుకుంటున్నా మరి! (మధు కోడా ప్రొడక్షన్స్ వస్తే మరి చెప్పలేం అనుకోండి!) కానీ పుస్తకాలు రాయటానికి కోట్లు అక్కర్లేదు కదా. అది ఎందుకనో తెలియదు ఒక చట్రం గీసుకొని అందులో నుంచి బయటకు రావటానికి జంకుతారేమో మన రచయితలు అని ఒక ఫీలింగు నాకు. కానీ నాకు తెలిసి నేనే ఒక పది వేరు వేరు చోట్ల వేరు వేరు వ్యక్తులనుంచీ ఇది విని ఉన్నాను .. ” హర్రీ పోట్ట్రర్లో ఏముందని .. మన పంచతంత్ర కథలకంటేనా ఇవి ! ” … “ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి సినిమాలు మన విఠ్ఠలాచార్య ఎపుడో తీసారు కదా !”. ఇలా ఉంటాయి మనవాళ్ళ రియాక్షన్లు . బహుశా ఇలాంటి ఆలోచనల వల్లనేనేమో మన దగ్గర సాహితీ విప్లవాలు కలగలేదు గత 20 యేళ్ళలో! కోట్లలో అమ్మకాలు ఎలాగూ మన దగ్గర ఉండలేవు. ఏదో రోజు రోజుకీ తెలుగు సాహిత్యానికి దూరం అవుతున్న ఒక జెనరేషన్ని తిరిగి తెలుగు పుస్తకాలలో పడేయటానికి కొన్నిమంచి పుస్తకాలు వస్తే బాగుండు .. అందుకు ఫేంటసీని మించిన “genre” లేదు అని నా అభిప్రాయం.


కొసమెరుపు: చేతన్ భగత్ కూడా తన పుస్తకాలతో ఎందరినో తిరిగి పుస్తకపఠనం వైపునకు లాకొచ్చాడు. కనీసం అలాంటి కమర్షియల్ పుస్తక రచయితలు కూడా కరువయిపోయారు మనకి. చేతన్ భగత్ ఎదో బాపు, విశ్వనాథ్ లాంటి వాడు అని నేను అనట్లేదు కాని ఒక బి.గోపాల్, కే.రాఘవేంద్రరావులలాగా ఎదో కనీసం కలెక్షన్లన్నా సాధిస్తాడు.. పుస్తకాలని జనసంద్రంలోకి తీసుకొనివెళ్తాడు. అలాంటి వారు కూడా కరువయ్యారు మనకి ఎందుకనో మరి. అత్తెసరుగాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబోలు!

మనవి : ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పాను . షారుక్ ఖాన్ ని శివ సైనికులు నువ్వు ఇండియనువా, పాకిస్తానీవా అని బెదిరించినట్టు మీరంతా నన్ను నువ్వు తెలుగువాడివా .. తెల్లదొరవా అని బెదిరించరనే ఆశిస్తున్నాను! (నేను కొంచెం తెలుపే కానీ దొరను కాదులెండి ! ) .

http://en.wikipedia.org/wiki/Christopher_Paolini

You Might Also Like

38 Comments

  1. Rk

    తెలుగులో ప్రచురణ /పాథకుల గురుంచి జరుగుతున్న చర్చ చూసిన తర్వాత
    పరిచయముచేయలనిపించిన వ్యక్తి –
    ఎం వీ రమణ రెడ్డి 78 వయస్సు ,పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యిన చిరు వుద్యోగి.

    పుసతకాభిమానే కాదు, ప్రచురణ కర్త కూడా.
    ఆయనకు వున్నా పరిమితిలో ప్రచురణలో పాలు పంచుకోవడము కాని,
    ( ‘తెలుగు లో నూరు కధకులు / కధలు ‘ )
    లేక స్వయముగా ప్రచ్గురించాతము గాని ( ‘తెలుగులో తొలి కార్టూనిస్ట్’ )

    rk

  2. లలిత (తెలుగు4కిడ్స్)

    @కామేశ్వర రావు: “నా ఉద్దేశంలో ప్రచురణ పెద్ద సమస్య కాదు” 🙂

    మీరు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. అదే నేను ఒక ఏడాది క్రితం కలగా పులగంగా చెప్పాను.
    ఐతే ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా?
    ఓ నాలుగేళ్ళ క్రితం కంటే గత ఏడాది పిల్లల పుస్తకాల గురించి ఎక్కువ మాట్లాడుకున్నాము, చదివాము, తెలుసుకున్నాము కదా.

    దీనిని ఇంకొంచెం ముందుకు ఎలా తీసుకు వెళ్ళ వచ్చు? ఎవరైనా రాసే వారు, బొమ్మలు బాగా, పిల్లలను ఆకట్టుకునేలా వేసే వారూ తెలిసిన వారు ఉన్నారా? ఆలోచనలు పంచుకుని పెంచుకోవడానికి మంచి పుస్తకం వంటి వారు ముందుకు వస్తారా?

    ముందే best sellers తయారైపోనక్కర్లేదు. ఆసక్తి ఉన్న కొంతమందినైనా ఆకట్టుకుంటే చాలు. అందరూ కొనాలి అని అనుకోనక్కర్లేదు. ఇలాంటివి కావాలి అనుకునే వారి అవసరం తీర్చడం ధ్యేయంగా పెట్టుకుంటే చాలు.

    నిజంగా మంచి quality (కథ, భాష, బొమ్మలు, సందేశం, వినోదం వగైరా..) తో పుస్తకాలు ముద్రించి ప్రభుత్వ పాఠశాలల్లో పంచినా పుణ్యం, పురుషార్థం (ప్రచారం).

    ఏమంటారు? ఇంకేం చెయ్యవచ్చంటారు?

  3. కామేశ్వర రావు

    లలితగారు,

    నా ఉద్దేశంలో ప్రచురణ పెద్ద సమస్య కాదు. మార్కెటింగు, వ్యాపార దక్షత అసలు ముఖ్యమైన అంశాలు. ఒక్క సృజనాత్మకత మీదనే ఆధారపడితే లాభం లేదు. పూర్వం నిర్మాతల్లో అటు కళాదృష్టి ఇటు వ్యాపారదక్షత రెండూ ఉండడం వల్లనే అప్పట్లో విజయవంతమైన మంచి సినిమాలు మనకి వచ్చాయి. ఇప్పుడా కలయిక లోపించింది. మంచి పుస్తకాలని ప్రచురించి వాటిని జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలంటే కావలసినది:

    1. మంచి అభిరుచి, సాహిత్య జ్ఞానం, సమకాలీన పాఠకులని అంచనా వెయ్యగల నేర్పు ఉన్న ఎడిటర్లు
    2. మంచి అభిరుచి, వ్యాపార దక్షత ఉన్న ప్రచురణ కర్తలు
    3. ప్రచురణకి, ప్రచారానికి కావలసిన డబ్బు
    4. రచనని కేవలం సృజనాత్మక ప్రక్రియగానే కాక వ్యాపార దృష్టితో కూడా చూడడానికి సిద్ధపడే, ప్రజ్ఞ గల రచయితలు. తాము రాసిందే జనాలు చదవాలి అని మంకుపట్టు పట్టకుండా, పాఠకులని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎడిటర్లతో కూర్చుని అవసరమనుకున్న మార్పులు చెయ్యడానికి సిద్దపడాలి వాళ్ళు.
    5. సరైన ప్రచారం

    Ofcourse, all these are only necessary but not sufficient conditions. ఇవన్నీ ఉన్నా చివరికి మంచి పుస్తకాలు జనాలలోకి ప్రచారం కాకపోవచ్చు. తగినంతమంది పాఠకులు లేక కావచ్చు లేదా కేవలం దురదృష్టం వల్లనైనా కావచ్చు. అందుకు సిద్ధపడే ప్రయత్నించాలి.

    బ్రహ్మానందంగారు,

    ఇక్కడ ముఖ్యంగా చర్చిస్తున్నది పుస్తకాలు, నవలల గురించి కాబట్టి నేను ప్రచురణ గురించి అన్నాను. దీనికి పత్రికలతో సంబంధం లేదు కదా.

  4. Brahmanandam Gorti

    @Halley

    నేనేమీ నిరాశావాదం మాట్లాడలేదు. వాస్తవం చెప్పాను. ఎవర్నీ రాసి చూపించడనీ కూడా సవాలు చెయ్యలేదు. హైదరాబాదులో సునామీలూ, మిగతా ‘ట” లూ అవన్నీ మీవి. నేనన లేదు. మన మాట్లాడే వస్తువొదిలి వేరే దిశగా మీ మాటలు వెళుతున్నాయి. ఇహ నేను మాట్లాడేదేమీ లేదు. ఉండదు.

    @కామేశ్వర రావు గారూ,

    ఇక్కడ నేను చెప్పే రచయితలకున్న సమస్య ప్రచురణ కర్తలతో కంటే పత్రికలవారితోనే ఎక్కువ ముడిపడుంది. దేన్నయినా వండడానికి పాత్ర కావలి. ప్రదేశం కావాలి. ఇవేమీలేకుండా గాలిలో పదార్థాలు పుట్టవుకదండీ? పాత్రుంటే వండుతారు. దాని రుచిని బట్టి తినేవాళ్ళూ వుంటారు. ఇక్కడ పాత్ర లేదు; కాబట్టి వంటకం రాదు; అప్పుడు తినాలనుకున్నా తినేవాళ్ళూ ఉండరు. ప్రస్తుతం పత్రికలు పాఠకులు ఏం తినాలో మెనూ ఇస్తున్నారు. ఇదే నా పాయింటు. ముందు వంటకం తయారయితే అమ్మేవాణ్ణి తరువాత వెతుక్కోవచ్చు.

    -బ్రహ్మానందం

  5. లలిత (తెలుగు4కిడ్స్)

    @కామేశ్వర రావు: ఎప్పట్నుంచీ ఇదే నా గోడు.
    “ప్రచురణ బాధ్యతను తీసుకోడానికి సిద్ధమవ్వగలరా?” – లోతు పాతులు చర్చించుకుందాం.
    నాకు ఆసక్తి, ఉత్సాహం ఉంది.
    రచనల గురించి ఆసక్తి ఉంది, కృషి చేస్తున్నాను.
    నా పరిధిలో ఎవరైనా నా ఆలోచనలను ముందుకు సాగించడానికి ముందుకు వస్తారేమో అని అడిగి చూస్తున్నాను.
    నేనే ప్రచురిద్దామంటే ఏం చెయ్యచ్చో కూడా ఆలోచిస్తున్నాను.

  6. కామేశ్వర రావు

    “there are no authors from the newer generations now. what we are left with is two types of people .. one who believe in old is gold philosophy.. and stay in that era praising authors of that era and lamenting abt lack of writers in this era .. other believe tat offense is best form of defense and attack people who dont agree with what they think abt telugu litt.”

    I didn’t quite get this. Does it imply that the new generations are not having the authors because of those two types of readers? Or is it that we are left with those two types of readers because of the lack of authors from new generations? If they are just two separate statements, I am not sure how it is relevant to put them together.

    ఈ చర్చకి ఒక ప్రయోజనం కలగాలంటే నాకొక ఆలోచన వచ్చింది. కేవలం పాఠకులుగా వాపోయి ప్రయోజనం ఏమీ లేదు. అయితే రచయితలుగా మారి అలాంటి సాహిత్య సృష్టి చెయ్యాలి, కనీసం అలాంటి రచయితలని పట్టుకోగలగాలి. లేదా ప్రచురణకర్తలుగా మారి అలాంటి రచనలని ప్రచురించాలి. రచయితలున్నారు కాని ప్రచురణకర్తలు లేరనే వాళ్ళు అలాంటి రచయితలను పట్టుకొనే బాధ్యతను, మంచి రచనలు రావాలని కోరుకొనే మిగతావాళ్ళు ప్రచురణ బాధ్యతను తీసుకోడానికి సిద్ధమవ్వగలరా?
    ప్రచురణబాధ్యతలో పాలుపంచుకోడానికి నేను సిద్ధం.

  7. Purnima

    నాదొక సూపర్ ఐడియా. రాత్రి అమృతం సీరియల్ లో డైలాగ్: “మనకు మనంగా కథ రాసి ఇస్తే చూడనుకూడా చూడరు. చూసి తీసుకున్నా లక్షన్నా ఇవ్వరు. అదే తమిళంలో తీసి అది హిట్ అయ్యితే, అప్పుడు అదే కథ కోటికి కూడా కొనేస్తారు.”

    అందుకని ఎంచక్కా ఒక పుస్తకం రాసి, దాని అనువాదం ముందు బయటకి వచ్చేలా చేసి, అది హిట్ అయ్యాక, ఇక్కడ పబ్లిషర్స్ వేసుకుంటారేమో! 😛

    @Halley: ఇలా హర్ట్ అయ్యి, “పో.. నేనెళ్ళి నా ఇంగ్లీషు పుస్తకాలే చదూకుంట.. ఎందుకొచ్చిన గోల!” అనంటే, “ఆయ్య్.. మీకు తెలుగు మీద శ్రద్ధ లేదు” అనంటారు. “ఉందండయ్యా.. చదవబుల్ తెలుగు పుస్తకాలు ఏవండయ్యా?” అంటే కాశీమజిలీ కథలు చెప్తారు. “అవి కాదెహే.. కొత్తవి.. కొంగ్రొత్తవి కావాలి” అంటే “ఫోయ్.. రాసుకురా” అనంటారు. రాయడం చేతకాదంటే, మాట్లాడొద్దంటారు. మాట్లాడకపోతే చదివేవాళ్ళే లేరంటారు.

    Nested Catch 22, I believe.

  8. లలిత (తెలుగు4కిడ్స్)

    Self publishing is an option.
    దాని గురించి చర్చిద్దామా?

  9. Halley

    @brahmanandam gorti

    idigo .. ii nirashavadame manalni aaputunnadi .. anthaku minchi inkem ledu. emanna ante .. edi nuvvu raasi choopinchu chooddam or neekem telsu ikkadi kashtalu or pedda cheppochavu idi jarige pani kaane kadu ani vinalsi vastundi.

    meeru rasindi chadivaka .. kevalam kalakshepaniki kuda telugulo manchi pustakalu ravali ani anukotam tappu ani telsukunna.

    endukante adi jaragadu kada .. hyderabad lo samudram vachesi tsunami vachina ravachunu emo kaani telugu lo nenu chepinattu ga edi jaragadata. endukante telugu lo patrikala teeru publisherla teeru verata .. asalu manchi pustakalu publish cheyalerata.. chesina avvi ammudupovata .. daani prakaramga chooste telugu lo asalu inkeppatiki manchi pustakalu ravata.

    shubham.

  10. Brahmanandam Gorti

    మీలా నేను MBA చదవలేదు. కాబట్టి Marketing గురించి చెప్పలేను కానీ, మనుషుల గురించి చెప్పగలను. వాళ్ళు నడిపే పత్రికల గురించి మరింత చెప్పగలను; పబ్లిషర్ల గురించి ఇంకొంత రాయగలను. రాయడానికి ప్రోత్సాహం కావాలి. ప్రోద్బలం ఉండాలి. అవన్నీ తెలుగునాట లేవు, మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా.

    గుడ్డు ముందా? పిల్ల ముందా? అంటే, మన ముందున్న పిల్లే కనిపించే నిజం అంటాను. అది పొదిగితేనే కొత్త గుడ్డొస్తుంది. దానికోసం తాపత్రయ పడాలి. కాపాడుకోవాలి. ముందున్న కొడి పిల్లని కోసుకు తింటే, రేపటి గుడ్డు లేదు. బ్రతికున్న కోడీ పిల్లని రక్షిస్తే మున్ముందు బంగారు గుడ్డు పెట్టచ్చు.

    మీరు ఇంగ్లీషు సాహిత్య రంగాన్ని తీసుకొచ్చి తెలుగు సాహిత్యానికి ఆపాదిస్తే ఈ వాదనకో నమస్కారం.
    వార్తా పత్రికలూ, వార పత్రికలూ కాకుండా తెలుగు నాట ఎవరు ప్రచురిస్తారో చెప్పండి. నేను రాసిస్తాను. వేసుకునే నాధుణ్ణి చూపించండి. ( వెబ్ పత్రికలు కాకుండా..) చెప్పడం చాలా సులభం మాస్టారూ!
    ఎంతో కష్టపడి త్యాగరాజు గురించి రాసి పుస్తకం వేయడానికి పబ్లిషర్లందరూ మీన మేషాలు లెక్కెట్టారు. ఒకడేమో ఎర్ర సాహిత్యమే వేస్తానంటాడు. ఇంకోడు పేరున్న పాతవి వేసుకుంటే డబ్బులొస్తాయంటాడు. మరొకడు తెలుసున్న మిత్రులవే వేస్తానంటాడు. ఇంకోడు పెర్సనాలిటీ డవలెప్‌మెంటే
    ముఖ్యం అంటాడు.
    చివరకి నాకు నేను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి ఏడ్చింది. డబ్బు నాకు కష్టం కాదు కాబట్టి సరేననుకొని ముందుకెళుతున్నాను. నాలా డబ్బు లేని రచయితలు? చాలా మంది రచయితలు ఇంకా పుస్తకాలు వేసుకోపోడానికి ఇదే కారణం.

    మీ అంత కాకపోయినా ఇంగ్లెస్షు పుస్తకాలెలా ప్రచురిస్తారో కాస్త తెలుసులెండి. మీరు చెప్పేవి తెలుగు సాహిత్యానికి వర్తించవు. ఇలా కాలక్షేప వాదనలకి ముడిసరుకుగా ఉపయోగిస్తాయి తప్ప.

    1. pavan santhosh surampudi

      గొర్తి సాయి బ్రహ్మానందం గారూ,
      త్యాగరాజు గురించి మీరు వ్రాసిన పుస్తకం చదవాలనుంది(పై వ్యాఖ్యలో ప్రచురింపబడినట్టుగా అనిపించింది). ఆ పుస్తకం ఎంత ఖరీదుంటుందో, ఎలా తెప్పించుకోవాలో చెప్పగలరు.
      కృతఙ్ఞతలు.
      సూరంపూడి పవన్ సంతోష్.

  11. Halley

    Glad to see that the discussion is still alive.
    “పాపులర్ రచయితల మీదుండే ఆసక్తి పాఠకులకీ మిగతా వారి రచనలపై ఉండదు”
    idi generic comment ainapatiki .. mana rachayitalalo unde risk taking abilities ki darpanam ee vakyam. cinemalalo ne kaadu .. sahityam lo kuda mana vallu chese experimentation takkuve. manchi rachanalu raste evaranna popular autaru. paolini .. rowling were nothing before their novel series got popular. first break vachedaka ye director aina kuda anamakude. popular vallade chadutaru .. popular director cinemale choostaru ani aagipothe .. manchi rachanalu manchi cinemalu yenadoo aagipoyevi. nenu chadivina atthesaru yem.bee.yeah tho okati matram cheppagelanu .. a good well packaged product sells no matter what .. might take time but it definitely sells. manam rayakunda publishers ni patrikalani paathakulani blame cheyatam lo artham ledu. once something is written marketing that is not so much of an issue.

    the only issue i see is that .. there are no authors from the newer generations now. what we are left with is two types of people .. one who believe in old is gold philosophy.. and stay in that era praising authors of that era and lamenting abt lack of writers in this era .. other believe tat offense is best form of defense and attack people who dont agree with what they think abt telugu litt.

    american universities lo PUBLISH or PERISH ani oka policy untundi professors ki. mana telugu writers ki kuda anthe.. and i see them going choosing the latter path. i still havent found that breakthrough litt sensation in telugu litt world yet 🙂

  12. విజయవర్ధన్

    @సౌమ్య:
    “కాస్త పెద్దౌతున్న పిల్లలకి తగ్గట్లుగా రాయబడ్డ నవలలేవీ లేవా తెలుగులో?”
    వున్నాయండి. కె. సభా గారి వ్రాసినవి వున్నాయి (వాట్లో “చంద్రం” నవల నాకు ఇష్టం). కాని సభా గారి తర్వాత వ్రాసినవారు ఎవరైనా వున్నారో లేదో తెలియదు. సభా గారి రచనలను వారి అబ్బాయి Prof రమణ గారు ప్రచురించబోతున్నారు.

  13. Brahmanandam Gorti

    మీరు చర్చకి తీసుకొచ్చినంత సులభం కాదు. ఏ రచనకయినా పత్రికల ఊతం కావాలి. అవే జనబాహుళ్యంలోకి తీసుకెళతాయి. కానీ నేటి పత్రికలకి వ్యాపారమే పరమావధి. దానికనుగుణంగానే పత్రికలు నడుపుతారు. రొటీన్ గా మూడు కథలు, నాలుగు సినిమా కబుర్లూ, ఒక సమీక్షా, ఒక రాజకీయ వ్యాసం, అధ్యాత్మిక సందేహాలూ, పిల్లల పేజీ, ఒకటో అరో పేరున్న వారి సీరియళ్ళూ, మధ్య మధ్యన జోకులూ, ప్రకటనలూ వెరసి పత్రిక తొంభై పేజీలు నిండుకుంటుంది. ఇదీ వార పత్రికల తీరు. దిన పత్రికల వారికి స్థలం ఉంటుంది కానీ, అభిరుచి ఉండదు. కాబట్టి మీరు చెప్పే నవల్లు ఎవరు వేస్తారు? ఏ పత్రికా అచ్చెయ్యదు. కాబట్టి ఎవరూ రాయరు. ప్రతీవాళ్ళూ మంచి రచనలు రావడం లేదు; వైవిధ్యం చచ్చిందీ అంటూ సాహిత్య సభల్లో అరుచుకోడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పత్రికలవాళ్ళే ప్రజలకేం కావాలో నిర్ణయించేస్తారు. అబ్బే, ఇలాంటివి ప్రజలకెక్కవండీ! అసలు ప్రజలకి రుచి చూపిస్తే కదా? ఎక్కాయో లేదో తెలుసుకోడానికి. అందుకే చాలామంది రచయితలు కథల మీదే పడ్డారు. చిన్న కథయితే పత్రికలూ వేసుకుంటాయి. గొడవుండదు. నా దృష్టిలో తెలుగు నవలల గొంతు పిసికింది ఈ పత్రికలవాళ్ళే!
    ఇహ పాఠకులూ అలాగే తయారయ్యారు. పాపులర్ రచయితల మీదుండే ఆసక్తి పాఠకులకీ మిగతా వారి రచనలపై ఉండదు. లేదా వేరెవరయినా బావుందీ అని ఒకటికి పదిసార్లు అరిస్తే చదువుతారు. లేదా ఆ రచయితలు మనకి మిత్రులయినా అయ్యుండాలి. లేదా బాగా తెలుసున్న వాళ్ళయినా ఉండాలి. తెలుగు పాఠకులు వస్తువుని బట్టి విలువ కట్టడం ఎప్పుడో పోయింది. అంతా బాకా ప్రపంచం.

    మనకి చాలా దరిద్రాలున్నాయి. అవన్నీ ఇప్పుడే నశిస్తాయని ఆశించడం శుద్ధ దండగ.

    వీలుంటే Louis Sachar రాసిన HOLES నవల చదవండి. అది 2003లో సినిమా కూడా తీసారు. అది కేవలం అదిహేనేళ్ళ పిల్లలకోసం పిల్లలు హీరోగా రాసిన నవల. ఇలాంటివి ఎవరైన తెలుగులో రాసి పంపితే వేసుకునే మహానుభావుణ్ణి చూపించండి. వారిని గాంధీ గారి విగ్రహం పక్కన పెట్టి పూజిద్దాం. Internet పత్రికలు మినహాయించి వేరేవైనా చెప్పండి.

    కాస్త వెరైటీ కావాలనుకుంటే ఇంగ్లీషులో చదువుకోడం ఉత్తమం. మనకి అభిరుచున్న సంపాదకులు లేరు. ఉన్నా వారిని పోషించే పత్రికా యజమానులూ లేరు. అభిరుచున్నవాడికి అధికారం వుండదు. అధికారమున్నవాడికి అభిరుచుండదు. వెరిశి..ఇదీ కథ..

  14. లలిత (తెలుగు4కిడ్స్)

    @సౌమ్య: సౌమ్యా ఈ చర్చని నిద్ర లేపాలి. active గా ఉంచాలి. ఆసక్తి ఉన్న వారందరూ కలిసి దీనిని అర్థవంతమైన ప్రయోజనం వైపు మళ్ళించాలి.
    ఈ వ్యాసంలో వక్కలంక కిషోర్ గారి వ్యాఖ్యకు నేను ditto అన్నాను.
    నాకు పెద్ద సమాధానాలు కనపడలేదు . అంటే ఈ పుస్తకాలు బాగుంటాయి అని చెప్పినా అవి ఎక్కువ లేవు, అందులో వైవిధ్యమూ ఎక్కువ లేదు.
    ఉన్న పుస్తకాలను విరివిగా పరిచయం చెయ్య వలసి ఉంది. లేవు అంటే,
    “If there’s a book you really want to read, but it hasn’t been written yet, then you must write it. ~Toni Morrison ”
    మనమే చెయ్యాలి. అంటే ఆసక్తి ఉన్న వారు పిల్లల్తో కలుపుకుని అందరూ brainstorm చెయ్యడం, రాసే ఆసక్తి ఉన్న వారిని, ప్రచురించ గలిగే వారినీ కలపడం, కృషి చెయ్యడం, దానిని ప్రచారం చెయ్యడం,పిల్లలకు పరిచయం చెయ్యడం… ఒక full time occupation and preoccupation కావాలి. Harry Potter తన ఐదేళ్ళ వయసు నుంచీ 20 ఏళ్ళు రాస్తూనే ఉండగా అప్పుడు తనకి ఏం రాయాలని అనుకున్నదో తట్టిందట. రాసిన వెంటనే కూడా ఇంద్రజాలంలా ఆమెకి పేరు, పిల్లల చేతుల్లోకి పుస్తకాలూ వచ్చెయ్య లెదు. ఎన్నో తిరస్కారాల తర్వాత సరైన చేతులకంది, దానికి వచ్చిన స్పందనని బట్టి దశ తిరిగింది.

  15. సౌమ్య

    Okay, నేను మళ్ళీ నిద్రపోతున్న చర్చని పైకి లేపేలా ఉన్నాను…

    ఇటీవలే – ఇందులో చెప్పిన – “His Dark Materials” పూర్తి చేసి, ఇందులోనే చెప్పిన Christopher Paolini రాసిన సిరీస్ లో మొదటిది “Eragon” మొదలుపెట్టాను. నాకనిపించింది ఇదీ.
    ఈ కథలు ఉద్దేశినది నాకంటే చిన్న వయసు వారికైనా (ముఖ్యంగా, ఎరగాన్, దాని తరువాతివి), నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ చదవగలిగాను – చందమామ కథల్లాగే, మొన్నే చదివిన దా.సు. గారి నవలల్లాగే.

    ఇక తెలుగులో ఫాంటసీ గురించి – ఆలోచించి చూస్తే, చిన్నప్పుడు నేను చదివాను అని చెబుతున్న తెలుగు కథల్లో కూడా రష్యన్ అనువాదాలు బోలెడున్నాయి. “చందమామ”, “బొమ్మరిల్లు” ఇత్యాది పత్రికలు తప్పిస్తే, పిల్లల సాహిత్యం అంటూ లేదా? (ఇప్పుడు మంచిపుస్తకం వంటి వారు వేస్తున్న చిన్న చిన్న పుస్తకాలు తప్పిస్తే)… కాస్త పెద్దౌతున్న పిల్లలకి తగ్గట్లుగా రాయబడ్డ నవలలేవీ లేవా తెలుగులో?

    ఎలాంటివి? అంటే – నా అభిప్రాయంలో His Dark Materials టీనేజర్లలో కాస్త పెద్దవారికి, Christopher Paolini రాసినవి కొంచెం చిన్న పిల్లలకి అని. Harry Potter నేను చదవలేదు కానీ, బహుశా Paolini నవలల స్థాయిలోనే ఉండొచ్చు అని ఊహిస్తున్నాను.

    ఈ వ్యాసం, ఆ పై ఇది రేకెత్తించిన చర్చా గుర్తుంది కానీ, ఈ సందేహాలు ఎవరూ తీర్చినట్లు లేరు. “మీరేం చేస్తున్నారు? మీరు చేయొచ్చుగా?” అనేవారికి నా సమాధానం – “మేము చేయొచ్చు. తప్పకుండా ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తారేమో కూడా. అయితే, ఇక్కడి సందేహం అది కాదు. ఆ సందేహం విషయం చెప్పండి.” అని.

  16. HalleY

    More on how young india is marketing its books :
    http://getahead.rediff.com/report/2010/feb/19/career-as-engineers-we-are-tuned-to-take-up-an-it-job.htm

    I think telugu writers can also follow suit .

  17. anwar

    కొత్త పాళి గారి తొ ఏకిభవిస్తూ,
    నేను వార్త అనే పత్రికలొ పనిచేస్తున్నప్పుడు రెగులర్ గా పిల్లల కథలకు బొమ్మలు వేసేవాన్ని, ఎంత దారుణమంటే దాదాపుగా అందులొ వచ్చే కథలన్నిటిలొ ఒక అల్లరివెధవలాంటి వాడు వుంటాదు , వాడికి చదువు లేదు, సంస్కారం లేదు, పెద్దల పట్ల గౌరవం లేదు, మహా అతితెలివి… వాదు వాడి అతితెలివికి ఊర్లొని జనం, నగరం లోని రాజు గారు కూడా మొసపొయ్యి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి వాడ్ని రాజుగా చేస్తారు…(సమకాలీన భారతీయ సామాజిక , రాజకీయ వ్యవస్తకు ఈ కథలు అద్దం పదుతూ చాలా రియలిస్టిగ్గా వున్నాయనిపించినా ) ఇదిపిల్లలకు ఏమిచెబుతుంది ” వొరే నాయనా చదువుకుంటే చంక నాకి పొవడం తప్ప మరేమి గిట్టుబాటు కాదు మొసాలు, దౌర్జన్యాలు, ధుర్మార్గం వల్ల విల్లాల్లొ వుండవచ్చును, విల్లాలు కొన వచ్చును, విల్లాలు కట్టించవచ్చును… ఈ కథలు చదివి అంతా అలా అవుతారొ లేదొ కాని 100 మంది పిల్లల్లొ ఒక్కడి కైనా ఇలాంటి కనీసం ఒక్క క్షణం అయినా ఇలాంటి భావన కలగవచ్చును కదా?
    ఆ పేజి ఇంచార్జ్ గారికి ఈ విషయం ఎంతగా చెప్పిన లేని అవిడ బుర్రకు ఆ విషయం ఎక్కేది కాదు అనే విషయం నా బుర్రకు ఎక్కి అటువంటి కథలకు బొమ్మలు వెయ్యడం మానేయడం తప్ప మరేమి చేయలేక పొయా.

  18. హెచ్చార్కె

    @కొత్తపాళీ: మీ చివరి మాట చాల బాగుంది. yes, ‘Here’s a revolutionary idea – why don’t we write some ourselves? Let’s bell the cat!’ ఆ పని చెయ్యకుండా ఎంత వగచినా ప్రయోజనం లేదు. రాయాలి. బాగా రాయాలి. అందుకు తపించాలి. తపసించాలి.
    తెలుగు సాహిత్య రంగంలోని ‘రాజకీయాల’ గురించి తరచు వింటూ ఉంటాం. అది వట్ఠి గొణుగుడు కాదు. అందులో వాస్తవం ఉంది. మంచి కవిత అంటే ఇది అని, మంచి కథ అంటే ఇది అని వీళ్లు ఒక కన్సెన్సస్ సృష్టిస్తారు. పుస్తకాల ‍అమ్మకాల మీద, పాఠకాదరణ మీద ఆ కన్సెన్సస్ ప్రభావం చూపిస్తుంది. ‘రాజకీయులు’ ఏది మంచి సాహిత్యమని కన్సెన్సస్‍ సృష్టిస్తారో అదే, అలాంటి సాహిత్యమే ప్రచారంలో ఉంటున్నది. అదే ఇక్కడ చర్చనీయాంశమవుతున్నది. అది బాగోలేదు గనుక తెలుగు సాహిత్యం బాగో లేదంటున్నాం. అది కాకుండా సాహిత్యం… మంచి సాహిత్యం… వస్తోంది. కొందరు మంచి రచయితలు, అనాదరణకు తట్టుకోలేక, తొందర్లోనే కలం వదిలేస్తున్నారు. “బాస్టర్డ్స్, ఐయాం స్టిల్‍ అలైవ్‍’ అని తెగించి కొనసాగే రచయితలు చాల కొద్ది మందే ఉంటున్నారు. చుట్టూరా డిస్కరేజింగ్ వాతావరణం ఉన్నప్పుడు రచయితలుగా కొనసాగడం అంత సులభం కాదు. (మంచి) రచయితలు ‘తీరిక’ వర్గం నుంచి వచ్చిన వాళ్లు కాకపోతే, తట్టుకుని నిలబడడం మరీ కష్టం. అయినా సరే, మొండిగా నిలబడి, పోరాడి, గెలవక తప్పదు. ‘రాజకీయాల’ వల్ల ఎదురైన అనాదరణను… ఒక సవాలుగా తీసుకుని శ్రమించి, బాగా రాసి, ‘అటెన్షన్, ని ‘కంపెల్‍’ చేయడం ద్వారా… అధిగమించక తప్పదు.

  19. రమణ

    మన సాహిత్యంలో ఫాంటసీ పుస్తకాలు తగినంతగా లేవంటున్నారు.. ముందు ఉన్న పుస్తకాలను చదివే పిల్లలు , చదివించే పెద్దవాళ్లు ఈ మధ్య కనబడుతున్నారా? ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తే ఆ తర్వాత హ్యారి పొట్టర్ తో పోల్చవచ్చు. ముందు చదివించే దిశగా ప్రయత్నాలు మొదలైతే గానీ పుస్తకాలు రాయటం అనేది పెరగదు, రచయితలు పెరగరు.

  20. Telugu4kids

    This discussion is a little depressing.

    There is a market and that’s why there are so many CDs and books being marketed for kids and being bought too. The problem is, not many, who have access to market do not have respect for quality.

    Kids do get attracted to these too. It is only parents like me who think their kids as well as the topics dealt with, the business (commercial and artisitc business) of reading, the language etc. deserve better.

    It’s been almost 2 years since I lamented last like this in length. Since then, looks like Manchipustakam is standing out in their efforts.

    There are so many with a good command on language and interest in several aspects of literature in the blogworld. Those who have already been there in the realworld are interacting with this community too. So, yes, those “we” can do it. There is no rush. All that is required is patience, perseverance and a true interest.

    “రచయితల్లో చిన్నపిల్లలు నిద్రలేవాలి. చిన్నపిల్లల్లో రచయితలు కూడానూ!! ” – Amen!

    “As individuals who love books, we needn’t really worry about missing any literature. As long as English is there, we can enjoy it.”… Kind of sad. There is rich literature in Telugu. We need to lay the path of learning leading to that. There is creativity that can enrich and add to the existing literature. There is a joy in reading our ideas and experiences in our language.

    Reading revolution by authors like Dr. Seuss didn’t happen overnight. Nor did it stop now.

  21. రామ

    తెలుగులో ఫాంటసిలు వచ్చినా చదవడానికి తెలుగు తెలిసిన పిల్లలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది.
    తాము తెలుగు మాట్లాడడానికి, తమ పిల్లల్ని తెలుగులో మాట్లాడించడానికి నామోషి పడే తల్లితండ్రులు, తెలుగు మాట నోట వచ్చిందని “ఇంకెప్పుడూ తెలుగు మాట్లాడ”మని మెడలో పలకలువేసే పాఠశాలలు, అటువంటి వాళ్ళని ఏమి చెయ్యలేని చేతగాని ప్రభుత్వాలు, పేరులో అధికారం ఉన్నా చట్టాల్ని ప్రభావితం చెయ్యలేని అధికార భాషాసంఘాలు, పాఠ్యప్రణాళికలో మొదటిభాషగా ఉన్న తెలుగుని రానురానూ, రెండో, మూడో భాషగా అణగదొక్కినా పట్టించుకోని ప్రజలు, నాయకులు, పార్టీలు ఉన్నచోట తెలుగు మనగలుగుతుందని, రచనలు చేస్తే పిల్లలు చదివే స్థితిలో ఉంటారని అనుకోవడం కష్టమే. మన సంస్కృతిలో పిల్లలు (కనీసం కొంత వయసు (కళాశాలకి వెళ్ళే) వచ్చేవరకు) తల్లిదండ్రులు ఏమిచెబితే అదే చేస్తారు. తెలుగు నేర్చుకోవడం, పఠనా వ్యాసంగం ఇంట్లోంచే మొదలుకావాలి. చదివేవాళ్ళు ఉంటే వ్రాసేవాళ్ళు, ప్రచురించేవాళ్ళు వాళ్ళే ముందుకి వస్తారు – ఈ డిమాండ్ కి సప్లై చెయ్యాలి కాబట్టి.

  22. HalleY

    This comment could have been in telugu too .. but i am yet to learn to type telugu properly and with ease using the trans-litt schemes 🙁 … so i chose english instead .

    @Achilles :
    What you said was a bit overtly pessimistic may be . We have a lot of Indian English writers these days . So it is not correct to say none of the indian fathers allow their kids to become writers . The question is about the regional languages including hindi . On that note i fully agree with you. But we did have some good quality telugu writing till the 80s. Trouble started from the 90s and the 2000s .

    @Kotthapali :
    Not everyone can become a “good” writer . Atleast now i dont think i have it in me to become a good writer. One day if i am blessed and get enlightened and it really makes me feel excited then yes i would take it up . Best of luck for you though you seem to have started :).

    @K.Maheshkumar :
    That was the whole idea behind bringing up the names of J.K.Rowling Paolini and to a smaller extent chetan bhagat . They “created” audience from near nothing across the globe.

  23. Achilles

    @కొత్తపాళీ:
    “పిల్లలకి చదువుకోవాలంటే నీతి, లేకపోతే ఏదో ఒక అతి తెలివి (బీర్బల్, తెనాలి రామలింగడూ టైపు) లేకుండా .. అసలు కథలే లేవా??”

    బీర్బల్/రామలింగడు కథలతో పరిచయం లేని వారు ఎవరైనా ఈ వ్యాఖ్య చూట్టం జరిగితే, వారికోసం ఈ వాఖ్య. బీర్బల్, రామలింగడు కథలు ఇంకేమైనా అయితే అవనీ గానీ అవి “అతి” తెలివి కథలు కాదు. చాతుర్యానికీ, అతి తెలివికీ చాలా తేడా ఉంది. కాబట్టి నిస్సంకోచంగా ఈ కథలు చదవండి!

  24. Achilles

    Warning: What follows is a rant. You might be offended.

    @HalleY: It would be interesting to observe the book consumption habits of fellow Indians of other languages like Hindi, Tamil, Kannad etc., When I said ‘observing’ I meant numbers, not opinions.

    1. Was there at least one successful book in any of the Indic languages in the last 2 decades? (Successful like “Harry Potter” or innovative like “the design of everyday things” or something that deals with serious research stuff in an entertaining manner like “Fooled By Randomness” or experimental like “cradle to cradle”)

    2. Was there at least one original variant of you-are-ok-i-am-ok ‘personality development’ book in any of the Indic languages, apart from cheap imitations? (as an aside, I think that this personality development/management studies stuff is utter crap. But at least, they are trying something.)

    as far as I know, and I beg to be corrected, the answer is a firm NO.

    One might give various reasons and opinions as an explanation to this scenario but none of them really explain anything. While it is partly true that as a community, we’d rather choose to entertain ourselves by watching some silly bollywood/tollywood stuff than reading a sensible book. One needs to think why, knowledge seeking community that we once were, are now averse to reading books or averse to anything that is sensible, for that matter.

    You can’t expect much from a country where a billion people are always trying to maintain someone else’s status quo. A country in which the schools and its curricula are at best clerk manufacturing machines! Even those who come from the most celebrated of its universities end up selling colas and printer cartridges in their cool Armanis and Guccis in far off land or settle as software coolies. In a country where you prepare the kid for the ‘competitive exam culture’ right from his pre nursery days, we can’t expect anything sensible to happen.

    An average kid starts his learning phase in the eternal compete mode, rote learning stuff, reproducing the undigested stray bits on exams, getting grades they don’t deserve and finally finding a job they were born for. You see thats where respect is. That is the surest way to be a respectable person in society. Society conditions you that way!

    How many of you fathers out there are willing to allow your kid to become a writer instead of engineer/medico/IAS/some govt job? How many of you fathers out there will back your kid when he attempts something and fails miserably? How many of you guys out there will stop scoffing at and penalizing somebody for being creative?

    When we find answers to these, I am sure we will see lot many sensible things happening in India.

  25. Telugu4kids

    ” why don’t we write some ourselves? Let’s bell the cat!! ”
    Plese do!

  26. కొత్తపాళీ

    Very interesting.
    I share much of your angst.
    It’s not just fantasy genre – we are missing a golden opportunity to introduce Telugu to younger readers.
    While we are not questioning Panchatantra, etc., we need to move on and create new, contemporary literature that will engage the interest of our young readers.
    అమెరికాలో పుట్టి పెరుగుతున్న తన పిల్లలిద్దరికీ ఎంతో శ్రద్ధతో ప్రేమతో తెలుగు నేర్పుతున్న స్నేహితుడొకరు మొన్ననే ఆక్రోశం వెలిబుచ్చారు – పిల్లలకి చదువుకోవాలంటే నీతి, లేకపోతే ఏదో ఒక అతి తెలివి (బీర్బల్, తెనాలి రామలింగడూ టైపు) లేకుండా .. అసలు కథలే లేవా?? అని.
    Here’s a revolutionary idea – why don’t we write some ourselves? Let’s bell the cat!!

  27. కె.మహేష్ కుమార్

    తెలుగునాట కొత్త పాఠకులు తయారయ్యే సంస్కృతే లేదు.దీనికి మూలాలు ఎక్కడున్నాయనేది పెద్ద సోషియాలజీ స్టడీ అవుతుంది.మరో సమస్య ప్రి-టీన్స్-టీన్స్-యూత్ అనే సెగ్మెంట్లకు తగిన పుస్తకాలు మన సాహిత్యంలో లేకపోవడం. ఇకపోతే మరో సమస్య మార్కెటింగ్…దీని గురించి కొంత నా బ్లాగు వ్యాసంలో రాశాను.
    http://parnashaala.blogspot.com/2009/05/vs.html

  28. Independent

    సిన్సియర్ బాధ కనిపించింది ఆర్టికల్ లో. నిట్టూర్పు.

    పోతే, బాబా గారో మాట చెప్పారు పైన. ” సామాజిక ప్రయోజనం అన్న కళ్లద్దాలు తొడుక్కున్న విమర్శకులు సర్టిఫై చేసిందే సాహిత్యం ” అది ఒకప్పుడు చాలా పెద్ద సమస్య మన సమాజంలో అన్న విషయం నేను కొంచెం ఆలస్యంగా అర్ధం చేసుకున్నా. అది ఇప్పటికీ సమస్య అన్న విషయం తెలీదు నాకు, కొంచెం అప నమ్మకంగా ఉంది నాకు. ఆ చెత్త ఇంప్రెషన్ లోంచి ఇంకా మన కమ్యూనిటీ బయటకు రాలేదంటే.

    “As a community, we’re not book lovers. Period” 🙂

  29. సౌమ్య

    Nice read. Keep Writing.

    My comments on the topic:
    పబ్లిషర్లూ, రచయితలు – చికెన్ అండ్ ఎగ్ సమస్య -సంగతి అటు పెడితే, నా చిన్నప్పుడు చిన్ని చిన్ని పుస్తకాలు, తక్కువధరలోనే – బోలెడొచ్చేవి.. అలాంటి చిన్ని చిన్ని – యాభై-వంద పేజీల పుస్తకాలు కొంచెం ఆకర్షణీయంగా ఉన్న బొమ్మలతో ముద్రిస్తే – వెయ్యి కాపీలకే అనుకుందాం _ ఏంతౌతుందంటారు? భయంకరమైన లాభాలు రాకున్నా – ముద్రణ ఇతర ఖర్చులపై ఎంతో కొంత లాభాలు తెచ్చుకోగల పరిస్థితిలోనే ఇంకా ఉన్నాం అని నాకనిపిస్తుంది. బుక్ఫెయిర్లలో పిల్లల సంఖ్య చూసి ఇలా అనిపిస్తోంది. అలాగే, పుస్తక పఠనం లోకి పిల్లల్ని వెనక్కి తేవాలంటే హేలీ అన్నట్లు ఫేంటసీ మంచి మార్గం. చందమామ లాంటి పత్రికలున్నా – చాలవు. మరిన్ని ఉండాలి. తొంభైలలో నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు కనబడ్డ సంఖ్యలో పిల్లలకోసం తెలుగు పుస్తకాలు, పత్రికలు ఇప్పుడు కనబడ్డం లేదు – అని అనిపిస్తుంది. అదే ఆంగ్లంలో అయితే, చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా టైముంది. సంకల్పం ఉంటే – ఇలాంటి పుస్తకాలు తెలుగులో వస్తాయి. రచయితల్లో చిన్నపిల్లలు నిద్రలేవాలి. చిన్నపిల్లల్లో రచయితలు కూడానూ!!

  30. HalleY

    On marketing of books :

    The reason i brought up the names of paolini and rowling also has got to do with this . Excerpts from paolini’s page on wiki :

    “To promote the book, Paolini toured over 135 schools and libraries, discussing reading and writing, all the while dressed in “a medieval costume of red shirt, billowy black pants, lace-up boots, and a jaunty black cap”

    Marketing books is always a challenge . But there is this thing about good books .. sooner or later they get noticed . In today’s media world it is not so much of a challenge to market stuff . Publicity in this era is easier than ever.

    The more pertinent question .. did any of our writers come up with such stuff.

    On the comment above by Poornima :
    “As a community, we’re not book lovers. Period” .

    We were book lovers till i think easily 70s 80s . Things started changing after that . There was a paradigm shift in the thinking of readers . My opinion is that that paradigm shift didn’t happen in the thinking of the writers/publishers (If my assessment of regular story reading in Popular papers,magazines like Eenadu , Andhra-Jyothi , Swati etc is correct) . We did not innovate enough and hence paying for it.

    That’s the reason why i hope the internet will slowly but surely change things out here in the telugu litt. world . It has surely done that on the english litt. world (tweet-novels , blooks – blog books). And sensationalist celebrities like fakeiplplayer etc . I hope the writers who do not find publishers will soon start embracing the internet .. just like the people are slowly doing it.

  31. Raghav

    What you said is absolute true, i got the same feeling after reading twilight series which was the first novel i read.

  32. Purnima

    మిస్స్ అయ్యామా అంటే అయ్యిపోయాం. కారణాలు అడిగితే రచయితలు పబ్లిషర్స్ ఏరి అని అడుగుతారు, పబ్లిషర్స్ చదివేవాళ్ళు ఏరి అంటారు? చదివే వాళ్ళు పుస్తకాలేవీ? అని అంటారు.

    నన్నడిగితే, As a community, we’re not book lovers. Period.

    As individuals who love books, we needn’t really worry about missing any literature. As long as English is there, we can enjoy it.

    కళలకి కావాల్సింది డబ్బు కాదు, అంతకన్నా ముఖ్యమైన కళపై ఆరాధాన. భారతీయుల వద్ద అవతార్ సినిమా తీయడానికి డబ్బు లేదంటే నేనొప్పుకోను. కొన్ని సంవత్సరాలు దాన్నే ఊపిరిగా మార్చుకొని ఒక తపస్సులాంటిది చేయడమనేది ఎన్ని కోట్లు పోసినా కొనుక్కోలేనిది. అది కావాలి, సినిమాలకైనా, సాహిత్యానికైనా.

  33. బొల్లోజు బాబా

    మంచి పరిశీలనలు.
    తెలుగు సాహిత్యంలో వర్గ, ప్రాంత స్పృహలు ఎప్పట్నుంచైతే పెరిగాయో, ఇక అది జనబాహుళ్యానికి దూరమైపోవటం మొదలైంది. దీనికి తోడు సామాజిక ప్రయోజనం అన్న కళ్లద్దాలు తొడుక్కున్న విమర్శకులు సర్టిఫై చేసిందే సాహిత్యం గా చెలామణీ అయ్యే పరిస్థితులు. దీనికి కధలూ మినహాయింపు కాదు.

    ఇక మీరు చెప్పిన వివిధ రకాల పుస్తకాలను నిజంగా జనాలు ఇష్టపడి కొంటున్నారా లేక/బలవంతంగా రుద్దబడుతున్నాయా(ఏదో ఒకటి కొనాలి కనుక) అనేది ఓ బ్రహ్మ రహస్యమే.

    మీరు చెప్పిన కాలంలో వెతికితే మంచి రచనలే కనపడతాయి. కానీ ఆయా రచయితలకు/కవులకూ మార్కటింగ్ చేసేదెవరూ? అలాంటి వ్యవస్థతెలుగులో కనపడదు.

    ప్రముఖ కవి శివారెడ్డి గారు ఓ సభలో – హిందీలో ప్రముఖ కవిని ఉటంకిస్తూ (ఈయన మనకు శ్రీశ్రీ ఎలానో హిందీలో అలాగట – పేరు గుర్తుకు రావటం లేదు) ఆయన తన పుస్తకాలను అయిదువందలు మాత్రమే ప్రింటు చేయిస్తున్నాడట, మనమే నయం మనపుస్తకాలు కనీసం వెయ్యి కాపీలు అమ్ముడు పోతాయి అని అన్నారు. నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఈ గొప్పకి. పది కోట్ల తెలుగు వాళ్ల ప్రముఖ కవి పుస్తకాలు వెయ్యి అమ్ముడు పోవటం ఒక గొప్ప విషయమైనందుకు.

    నాకు తెలిసిన ఒక మంచి కవిని రెండో పుస్తకం ఎప్పుడు తెస్తున్నారూ అని అడిగితే, ఇదివరలో వేసిన మొదటి పుస్తకం యొక్క కాపీలను ప్రముఖ పంపిణీ సంస్థలకు పంపాను, కనీసం అందాయన్న రిప్లై కూడా ఇవ్వలేదు. మూడేళ్లవుతుంది. ఇక రెండవ పుస్తకం తెచ్చే సాహసం ఎక్కడ చేయను అన్నాడు. అదీ పరిస్థితి.

    పుస్తకాల మార్కటింగ్ పై ఈ క్రింది లింకులలో రచయితల పాట్లు గమనించండి.

    http://kasturimuralikrishna.wordpress.com/2008/12/20/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81/

    http://lolakam.blogspot.com/2008/12/blog-post_15.html

    బహుసా పాఠకుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయేమో. ఆదరణ తగ్గుతుందేమో, గతకాలమే మేలు కాబోలు అని అనుకొనే సమయాలలో ఇలాంటి వ్యాసాలు చదవటం ఆనందాన్నిస్తూ ఉంటుంది.

    let us hope for the best

    బొల్లోజు బాబా

Leave a Reply