టోటో చాన్
Give me some sunshine
Give me some rain
Give me another chance.. I wanna grow up once again
ఇటీవల విడుదలైన హిందీ సినిమాలోని పాట వినగానే నాకు నచ్చిందిగానీ, నన్ను నేను చూసుకునే అవకాశంగా అనిపించలేదు, “టోటో చాన్” అనే పుస్తకం చదివే వరకూ. ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివాక కూడా “యెస్.. నాకూ ఒక ఛాన్స్ ఉంటే బాగుణ్ణు” అని అనిపిస్తూ ఉంది.
నా బాల్యంతోనూ, బడితోనూ, అసలు ఇప్పటిదాకా జీవితంలో దేనితోనూ తీవ్ర నిరాశ చెందలేదు. ఉన్నంతలో దొరికిందే చాలు అనుకుంటూ ఉంటాను. పైగా నేను చదివిన బడి అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో హైద్రాబాద్ లో పేరెన్నిక గల పాఠశాలలో అది ఒకటి. “నీదే స్కూల్?” అని ఎవరన్నా అడగగానే సమాధానంతో పాటు ఒక రవ్వ పొగరు కూడా ఉండేది. స్కూల్ ఉండి బయటకొచ్ఛేటప్పటికి అందరికీ పదో తరగతి మార్కుల మీదే కన్ను. మన లెక్కలు ప్రకారం ఎన్ని ఎక్కువ మార్కులు, ఎంత ఎక్కువ మందికి వస్తే ఆ పాఠశాల అంత మంచిదని కదూ? కాకపోతే సంవత్సరాలు గడిచేకొద్దీ, రెస్యుమే లో పదో తరగతి మార్కులు అట్టడుగున మూలుగుతూ, వల్లవేసిన పాఠాల కన్నా, చుట్టూ ఉన్న మనుషులతో, పరిస్థితుల్లో వేగాల్సి వచ్చినప్పుడు మన ఐ.క్యూ కన్నా ఇ.క్యూకి పరీక్ష! పాఠశాల విద్యార్థిగా మన మెదడెంత పదనుగా ఉన్నదానికంటే మనం జీవితంలో మనకున్న పరిమితుల్లో ఏం చెయ్యగలం అన్నదానికి ముడిసరకైన వ్యక్తిత్వం ముఖ్యం. దానికి బీజాలు పడేది స్కూల్లోనే మరి! మన స్కూల్లు వ్యక్తిత్వాలని తీర్చిదిద్దటం మాట అటుంచి, వాటిని మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఆ చర్చకి ఇది అనువైన చోటు కాదు.
మొన్న హైద్రాబాద్ బుక్ ఫేర్‍లో “నేషనల్ బుక్ ట్రస్ట్” వాళ్ళ స్టాల్ లో పుస్తకాలు చూస్తుండగా, నాతో పాటున్న స్నేహం ఓ పుస్తకం తీసి, “ఈ పుస్తకం చదివారా?” అని అడిగారు. నేను చదవలేదన్నాను. పుస్తకం గురించి మరో ముక్క చెప్పకుండా, ఓ కాపీ నా చేతిలో పెట్టి “తప్పక చదవండి! భలే ఉంటుంది. రైలు బడి అన్న కాన్సెప్టుతో బడి నడుపుతుంటారు. ఆ బడిలో చదివిన విద్యార్థిని రాసిన పుస్తకం ఇది. జపాన్ లో కథ” అని ఉత్సాహంగా చెప్పటం మొదలెట్టారు. సరే, చదివి చూద్దాం అని తీసుకున్నాం.
మొన్నెప్పుడో ఏం చెయ్యటానికీ తోచక, ఊరికే కాసేపు చదువుదాం అని మొదలెట్టాను. పూర్తయ్యే వరకూ ఎక్కడా ఆగలేదు. ఇది “టోటో చాన్” అనే చిన్నారి కథ. ఈ చిన్నారిని ఓ స్కూల్ నుండి పంపించేస్తారు. “ఎందుకూ?” అని అడగడానికి వాళ్ళ అమ్మ స్కూల్‍కి వెళ్లినప్పుడు టీచర్ సవాలక్ష కారణాలు – “క్లాసులో చెయ్యొద్దన్న పని చేస్తుంది”, “పిట్టలతో మాట్లాడుతుంది”, “రోడ్డూ పోయే వాళ్లని అరుస్తూ పిలుస్తుంది” – లాంటివెన్నో చెప్తుంది. టోటో చాన్ అమ్మ చాలా కలరవపడుతున్నా పిల్లకి మాత్రం ఏం జరుగుతుందో చెప్పదు. నేరుగా తీసుకెళ్లి వేరే స్కూల్లో వేస్తుంది.
కాకపోతే ఈ పాత స్కూల్ అన్ని స్కూల్లా ఉండదు. ఇక్కడసలు గదులే ఉండవు. ఒక రైలులో బల్లలు, కుర్చీలూ, బ్లాక్‍బోర్డ్ లు అన్నీ ఉంటాయి. ఈ స్కూల్లో చేరటానికి ఇంటర్వ్యూ ఏంటో తెల్సా? ప్రిన్సిపాల్ ముందు మనకి ఏం తోస్తే అది చెప్పటం. ఎంత సేపైనా చెప్పచ్చు, ఆయన వింటూ ఉంటారు. టోటో చాన్ లాంటి వాగుడుకాయే, “అబ్బా.. ఇంకేం చెప్పాలి” అనుకునేంత వరకూ సహనంగా వింటారు. బడిలో చేరాక, రోజూ బడికి వెళ్ళటం ఎంత నచ్చుతుందంటే, ఒక్క రోజు కూడా స్కూల్ మిస్స్ కాకుండా వెళ్లాలనిపించేంత. క్లాసులో పిరీయడ్స్ ఉండవు. రోజుకిన్ని చదువుకోవాలనుంటే, ఏది ఏక్కడైనా మొదలెట్టచ్చు. “అబ్బా.. పొద్దునే మాథ్సా? ఆ టీచరంటే నాకు చచ్చేంత భయమే” లాంటి ఆలోచనలు ఇక్కడుండవు. అలానే చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యంగా ఉండడం, బోలెడేసి పుస్తకాలున్న లైబ్రరీ, బొమ్మలు గీసుకోడానికి కాగితాలు కాకుండా, ఏకంగా నేల మీద గీయడానికి అనుమతి.
ఈ పాఠశాల నిర్వహణలో నాకు నచ్చిన రెండు విషయాలు:
“నిన్ను చెయ్యొద్దన్నానా? మళ్ళీ చేస్తావా ఇలాంటి పని?” అని ఎంత మంది టీచర్లు, తల్లులు గొంతులు చించుకుంటూ పిసివాళ్ళని కొట్టరూ?! ఓ సారి మన టోటో చాన్ కూడా ఛెయ్యద్దన్న . చెయ్యకూడని పని చేస్తుంది. ఓ వస్తువు పోగొట్టుకుంటుంది. పోయిందని ఏడ్వకుండా ఆ వస్తువు వెతకడానికి మరో పని చెయ్యటం మొదలెడుతుంది. దాని వల్ల చాలా చెత్త చెత్తగా మారుతుంది ఆ ప్రదేశం. ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు కనిపిస్తే వాళ్ళని కసిరి, అక్కడి నుండి పంపించేసి, ఆనక నాలుగైదు దెబ్బలు పడేలా చేస్తారు. కానీ ప్రిన్సిపాల్ టోటోని చూడగానే “నీ పని అవ్వగానే ఇదంతా శుభ్రం చేసేస్తావు కదూ” అంటూ వెళ్లిపోతారు. వస్తువూ దొరకదూ, ప్రదేశాన్ని శుభ్రమూ చెయ్యాలి. అంతా అయ్యేసరికి టోటోకి ఆయాసం, నీరసంతో పాటు బుద్ధికూడా వస్తుంది, “ఎందుకా పని చెయ్యటం? ఎందుకు వస్తువు పోగొట్టుకోవడం? ఎందుకు వెత్తుక్కోవటం?” అని.
మరో విషయమేమిటంటే, ఈ స్కూల్ పిల్లలు రోజూ మధ్యాహ్న భోజన విషయంలో ఒక సూత్రం పాటించాలి. దాని పేరు “కొండ నుండి కొంచెం, సముద్రం నుండి కొంచెం”. దీని ప్రకారం పిల్లలకి పెట్టే భోజనంలో నేల పై దొరికే ఆహారం, సముద్రంలో దొరికే ఆహారం సమతుల్యంగా ఉండి పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందివ్వాలని. ఏ కారణాల వల్లనైనా ఏ విద్యార్థి అయినా సరైన ఆహారం తెచ్చుకోకపోతే ప్రిన్సిపల్ భార్యే వాళ్లకి వడ్డిస్తారు. తినడం కూడా “కొన్ని నిమిషాలలో చేసే పని”గా భావించి, పిల్లలు తిన్నా తినకున్నా కొంత వ్యవధిలో మరలా క్లాసుకు వచ్చేయాలని భావించే పాఠశాల్లో చదివుండడం వల్ల అనుకుంటా, నాకీ పాఠశాల ఇంతగా నచ్చింది.
ప్రపంచ యుద్ధం వల్ల ఈ పాఠశాల పూర్తిగా నాశనమయ్యిపోయినా, దాని అవశేషాల్లా మిగిలిన విద్యార్థుల వల్ల పాఠశాల ప్రపంచ ప్రసిద్ధం అయింది. టోటో చాన్ ప్రముఖ టివి ప్రెజంటర్‍గా పేరు తెచ్చుకుంటుంది. అలానే ఆ బడిలో చదివిన తక్కిన పిల్లలు కూడా. వారందరి విశేషాలు పుస్తకం చివర్న జతపరిచారు.
“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” అనిపించేంత అందంగా రాశారు కథని. తెలుగులో వాసిరెడ్డి సీతాదేవిగారి అనువాదం.
నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది. బొమ్మలు కనిపించేలానే లేవు. అచ్చు తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఇక ఫాంటూ, పేపరు సంగతి సరే సరి. వెల ఎంతో నాకు గుర్తు లేదు కానీ, ఇదో అరుదైన రచన, దాచుకోవాల్సిన పుస్తకం. అందుకని అన్నీ బాగున్న పుస్తకాన్నే కొనుక్కోండి. స్కూల్‍కి వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకి మాత్రం ఈ పుస్తకం.. MUST READ. తక్కిన వారు కూడా ఓ మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతికోసం ఈ పుస్తకం చదవచ్చు. ఇదే రచన “రైలు బడి” అన్న పేరుతో కూడా వచ్చిందని విన్నాను.
నా చేత పుస్తకం కొనిపించినవారికి మాత్రం బోలెడంటే బోలెడు థాంక్స్!
ఆంగ్లంలో ఈ రచన గురించి వికీ పరిచయ వ్యాసం.
వల్లూరు మురళి
ఈ ఈబుక్ లింకు పెట్టరా ప్లీజ్…
వల్లూరు మురళి
ఈ పుస్తకం ఎన్నిపర్యాయాలు చదివానో!!! చదివిన ప్రతిసారీ కొత్తదనమే…చదువుతున్నంతసేపూ పరకాయప్రవేశం…
varaprasaad.k
కాసింత ఎవరికైనా అందుబాటులో ఉంటే పాత చందమామ,బాలమిత్ర,బుజ్జాయి లాంటి పాత పత్రికల కథలు పరిచయం చేస్తే బావుంటుంది.అంతేకాదు పుస్తకంలో పిల్లలు కూడా సభ్యులవుతారు.
varaprasaad.k
అందరూ కలసి కొంత మంది పిల్లలతో అయినా చదివిస్తే కాసింత పుణ్యం,పురుషార్థం లభిస్తాయి.కాసింత అలీసంగా ఐనా బాల సాహిత్యాన్ని గుర్తించి నందుకు అభినందనలు.
Srinivas Vuruputuri
బ్లూ మౌంటెన్ స్కూల్ గురించి ఇవాళ్టి హిందూలో వచ్చిన వ్యాసం (Blueprint for a life మీకు నచ్చుతుందేమో…
రోషన్ దలాల్ చెప్పిన ఋషి వాలీ స్కూలు కథ అరవింద్ గుప్తా టాయ్స్>లో దొరుకుతుంది: Forty years of Rishi Valley School
నీల్‌బాగ్ డేవిడ్ గురించి ఇక్కడ.
పుస్తకం » Blog Archive » గడచిన సంవత్సరం, చదివిన పుస్తకాలు, పెరిగిన పరిచయాలు
[…] ‘ఫోకస్’ లో “టోటో ఛాన్” పరిచయం చేసి పూర్ణిమ పూర్తిగా […]
పుస్తకం » Blog Archive » హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి
[…] టోటోచాన్ కు మరో అనువాదం, రైలు బడి అనేక తెలుగు […]
Mamatha
ohh, how I wish to write this in Telugu…
“Railu Badi” is one of my all time favorites. I read it for the first when I was in 6th class and hundreds of times after that. I may be missing something, but I don’t want to touch the original of the book. I just love the language in this translation(Venu and Eswari’s). In our Kurnool engineering college library, there was one single Telugu book and that was “Railu Badi”. I still remember the way I screamed “O my god” when I saw that book there and the looks I received in that silent library. I haven’t seen the book since then and I don’t miss it, as it’s all engraved(along with the pencil sketches) in my mind. aa translationlo aathma lekapovadamemiti?????
Another memory regarding that book: During my first days in US, I met with a Japanese girl. I got soo excited and asked her if she knew “Toto Chan … Tetsuko Kuroyanagi’. She said “oh, her. Nobody cares for her or her books in Japan”. I didn’t talk to that girl again, just felt sad for her.
Purnima: It was yet another beautiful intro. *Thumbs up*.
Sarada
Purnima gaariki,
Chala manchi pusthaka parichayam.
Nenu ee pusthakanni 1999 lo, nenu 9th class chaduvuthunnappudu, chadivanu. Maa pinni govt school teacher ga pani cheseppudu nenu valla school ki velladam jarigindi. Akkada modati saari ee pusthakanni chadivaanu. Chala chala nachi okati konnanu kuda, kaani ekkado pogottukunna. Malli chala rojula tharwatha, 2007 lo maa friend dwara hyderabad lo malli dorikindi. Chala anandam vesindi.
Ippatiki kuda eppudina manasu baagolekapothe oka rendu pages chadivithe chalu, haayiga anipisthundi.
Once again thanks for introducing a very good book to the people.
ramanarsimha
Mr.Chukka Ramaiah`s book “UPADHYA VRUTHILO NA ANUBHAVALU”
is very similar to “TOTOCHAN”.
Everyone should read this book.
BOOK: UPADHYAYA VRUTHILO NA ANUBHAVALU
AUTHOR: CHUKKA RAMAIAH
PRICE: 50/-
AVAILABLE AT: VISHALANDHRA
MY OPINION: This book is very related to GIJUBHAI & TAGORE`s
opinions. This book shd b read to know how 2 behave with children.
E-mail:rputluri@yahoo.com
ramanarsimha
పూర్ణిమ గారు,
టోటోచాన్ – పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
ఇది అందరు చదవాల్సిన పుస్తకం..
telugu4kids
నా స్నేహితురాళ్లకి టోటో చాన్ పరిచయం చేస్తే, ఈ టపా అంతా చదివి స్నేహితురాలి స్నేహితురాలు Chuck and Geck గురించి తెలుసా అని అడిగింది. టపాకి వ్యాఖ్యలు రాసేటప్పుడు పట్టించుకోని నన్ను ఆ request పట్టుబట్టి వెతికేలా చేసింది. ఇక్కడ ఉన్నాయి ఆంగ్ల అనువాదాలు:
http://home.freeuk.com/russica4/
blog search సాయం చేసింది. సూచించిన వారికి ధన్యవాదాలు.
devi
chala manchi pustakam .as a teacher adi chadivi nannu naenu marchu konnanu .
Telugu4kids
I have to apologise for saying kind of loosely, ” I’m more charmed by the little girl, though, than the school itself.” I’m still charmed more by the little girl. But I appreciate the headmaster and the school better now, after reading the book completely. Thanks Purnima, for writing about this book. How did you happen to pick this book to read?
హెచ్చార్కె
వేణూ, ‘రైలుబడి’ నా నెమలీక కూడా. ముందుగా మా అమ్మాయికి ఇష్టమై తన రెకమెండేషన్ మీద చదివి, అందుకు తనకు కృతజ్థతలు చెప్పిన మంచి పుస్తకాల్లో ఇదొకటి. ఆంగ్ల మూలంతో పోల్చి చూసిన వారికి అలా అనిపించిందేమో, తెలుగు (మీ అనువాదం) మాత్రమే చదివిన నాకు… అందులో ఆత్మ లోపించిన ఫీలింగ్ అస్సలు కలగలేదు. ఎంత గొప్ప అనువాదమైనా ఒరిజినల్‍ని పూర్తిగా ఆవిష్కరించలేకపోవచ్చు.
కొత్తపాళీ
I like the way how you turn every little experience into something so intensely personal.
I still find fault with you for closing your blog.
ఎన్ వేణుగోపాల్
మిత్రులకు,
ఇరవై సంవత్సరాల కిందటి ఆర్ద్రమైన జ్ఞాపకాలను గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు. టొటొ చాన్ – లిటిల్ గర్ల్ ఎట్ ది విండో అనే పుస్తకం జిరాక్స్ కాపీ ఇచ్చి ‘అనువాదం చేస్తావా’ అని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకురాలు గీతా రామస్వామి అడిగినప్పుడు అది వేలాది మందికి అభిమాన పుస్తకం అవుతుందని నేను కలలో కూడ అనుకోలేదు. కాని అది చదివి ఎంత ఉప్పొంగిపోయానో చెప్పలేను. వెంటనే అనువాదం మొదలుపెట్టాను. ఆంధ్రపత్రికలో ఉద్యోగం, సంస్థ మూతపడబోతున్న ఆర్థిక పరిస్థితి, ఉపన్యాసాలకోసం బయటికి తిరగడాల మధ్య ఆ అనువాదం మధ్యలో ఆగిపోయింది. అప్పుడు స్నేహితురాలు ఈశ్వరి ప్రోద్బలం మీద నేను అనువాదం డిక్టేట్ చేస్తుంటే తాను రాస్తూ ముగించాం. కాని పుస్తకం కంపోజ్ అయి ప్రెస్ కు వెళ్లేలోపు దురదృష్టకరంగా ఈశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తాను రాసిపెట్టింది గనుక, పుస్తకం బయటికి రాకముందే చనిపోయింది గనుక తనకు అంకితం ఇవ్వాలనుకున్నాను. ఎచ్ బి టి కి ఆ సంప్రదాయం లేదని గీతా రామస్వామి అనడంతో, అనువాదంలో తనపేరుకూడ పెట్టమన్నాను.
రైలుబడి అనే పేరుతో వచ్చిన ఆ పుస్తకం చాల పేరు తెచ్చుకుంది. అప్పుడు పాఠశాల విద్యాశాఖలో అధికారిగా ఉండిన వెంకారెడ్డిగారు ఆ పుస్తకం ప్రతిపాఠశాలకూ చేరాలని చెప్పి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద వేలాది కాపీలు కొనిపించారు.
ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు వాసిరెడ్డి సీతాదేవి గారితో అనువాదం చేయించి టొటొ చాన్ పేరుతో అచ్చువేశారు.
ఇప్పుడు రెండు పుస్తకాలూ మళ్లీ మళ్లీ అచ్చవుతూ అందుబాటులోనే ఉన్నాయి.
ఇన్నాళ్ల తర్వాత చూస్తే, కొందరుమిత్రులు అభిప్రాయపడినట్టు, అనువాదం సరిగాలేదేమో, ఆత్మ రాలేదేమో. కాని అది నా నెమలీక. మళ్లీ ఒకసారి నాకు చూపెట్టినందుకు ధన్యవాదాలు.
భవదీయుడు
ఎన్ వేణుగోపాల్
Prabhakar Mandaara
అద్బుతమైన పుస్తకం. అందమైన పరిచయం.
పూర్ణిమగారికి అభినందనలు.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన –
ఈశ్వరి, వేణుగోపాల్ లు అనువాదం చేసిన – టో టో చాన్ “రైలుబడి ” ప్రతులు ఇప్పటికీ లభిస్తున్నాయి.
118 పేజీల ఈ పుస్తకం ధర కేవలం 25 రూపాయలే. లింకు కోసం దిగువ నొక్కండి.
RAILU BADI
Telugu4kids
“Er.. I guess, my article ended up as a superficial one. I feel it! ”
Not fair at all. Your review made me read it now rather than later.
“మన స్కూళ్ళు వ్యక్తిత్వాలని తీర్చిదిద్దటం మాట అటుంచి, వాటిని మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఆ చర్చకి ఇది అనువైన చోటు కాదు.” ముందే చెప్పేశావు కదా. నేనే నాకు వచ్చిన మొదటి ఆలోచనని ఇక్కడ పెట్టేశాను.
Well, the book is very interesting, fun, lively and thought provoking at the same time. I’m more charmed by the little girl, though, than the school itself. The narrative is lively, and it’s what makes the book so good to read. The little girl keeps popping up in my head and I cann’t help recalling it aloud to my family.
Chilakapati Srinivas
ఇంకాస్త ఇక్కడ –
http://raji-fukuoka.blogspot.com/2009/06/blog-post_10.html
సుజాత
దిలీప్ గారు,
నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్లదే పాత కాపీ ఒకటి ఒక ఫ్రెండ్ ఇంట్లో చూశాను. అదే రైలు బడి అని చెప్పారు ఆమే(కవర్ పేజీ లేదు). ఇప్పుడే నా లైబ్రరీ చెక్ చేశాను.నా దగ్గరున్న రైలు బడి HBT వాళ్ళు వేసిందే! అనువాదం వేణుగోపాల్, ఈశ్వరి గార్లే!సీతాదేవి గారు అనువదించింది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసింది! కానీ ఈ పుస్తకం మీద “తరుణ భారతి గ్రంథ మాల” అని కూడా ఉంది! బహుశా తెలుగు పుస్తకాల సిరీస్ అయి ఉండాలని అనుకుంటున్నాను.
పుస్తకం గొప్పదైనా నాకు ఏమనిపించిందంటే బహుశా ఆ నేటివిటీ ప్రభావం వల్ల కాబోలు, రెంటిలోనూ కొంత “ఆత్మ” లోపించిందని! రెంటిలోనూ ఏది బెటర్ అంటే నేను HBT వారు వేసిందే ఎంచుకుంటాను.
Purnima
Meher, Budugoy: It would be a treat if you guys can pen down on your books as kids. That way, we’ll know about some libraries too. PLEASE TRY!
సుజాత: >> నేషనల్ బుక్ ట్రస్ట్ వారు వేసిందే రైలుబడి.
I don’t know how many versions did NBT publish, but one of them is surely titled “ToTo Chaan” in Telugu. And that is what I read.
Purnima
@తెలుగు4కిడ్స్: >> Ultimately, it is the parents’ call.
Er.. I guess, my article ended up as a superficial one. I feel it! 🙁
Yeah, you’re right when you said, it’s about parents. And the mother of Tottochan is a beautiful personality. The way she treated her daughter all through is so beautiful and inspiring. I just loved the family as a whole, more so the mother.
Thanks for the pdf version. You surely saved my bucks, I wanted to buy one! 🙂
Will read that version too.. and then make a *proper* attempt to write about the book.
తెలుగు4కిడ్స్
I saw the preview in google books.
I found the pdf here:
http://gyanpedia.in/tft/Resources/books/Tottochan.pdf
It caught my attention when Purnima wrote that she is reading it.
I have to finish reading it yet.
My first thoughts are:
Inspite of this book being out there since so many years, how come there are still ADHDs and other alphabet strings attached to little kids, even pre-schoolers in countries like America?
Oh, teachers do work hard and care the best they can.
I understand the intention to catch them young and help them earlier than later. The problem is that a label is needed for everything.
Calling each kid special doesn’t stop the system from classifying into different categories of development. Sometimes, there’s a panic kind of reaction nstead of a nurturing approach.
Thankfully, though, there are also some who do their best from within the system. Those, who have the patience to address the concern rather than classify the kid into this category or that.
Ultimately, it is the parents’ call. Choosing an alternate school is not an easy decision either.
Got to read more of the book.
మెహెర్
@budugoy:
🙂 మొత్తానికి నా అసందర్భ ప్రస్తావన మీకలా అక్కరకొచ్చిందన్నమాట. మీది మంచిర్యాల లైబ్రరీ అయితే, నాది ఆలమూరు లైబ్రరీ. అక్కడ గంటు మొహం పెట్టుకుని ఈసురో దేవుడా అని ఉజ్జోగం చేసే ఒక లైబ్రేరియన్ వుండేవాడు. అతను ఇప్పుడు లేకపోతే, వున్నవాణ్ణి పటాయించగలిగితే, ఏమో, ఇంకా దొరుకుతుందేమో! (అతనికి నేనంటే అస్సలు పడేది కాదు; చందాదారుగా నా హక్కుల్ని వాడి సహనపు పరిధులదాకా వాడుకునే వాణ్ణనీ, పాత అరల్లో ఒద్దికగా సర్దుకున్న దుమ్ముపొర ఊరకే రేగ్గొట్టేవాణ్ణనీ.) అదే కాదు, అక్కడ రష్యన్ వాళ్లవి ఇంకా బోలెడు అనువాద పుస్తకాలుండేవి. గోర్కీ “నా బాల్యం”, “నా బాల్యసేవ”, “నా విశ్వవిద్యాలయాలు”; ఒక యుద్ధపైలట్ కథ “జీవన సమరం”… మెదడు అరలు గట్టిగా కలబెడితే ఇంకా చాలా పేర్లే బయటపడతాయి. ఎక్కువ “రాదుగ” ప్రచురణలనుకుంటా. నాకోసం కాకపోయినా, నా పిల్లల కోసమయినా, ఎప్పుడోకప్పుడు ఆ లైబ్రరీ టేబిల్ మీద పిడిబాకు గుచ్చుతా! గుచ్చుతా!! గుచ్చితీరతా!!! 😛
దిలీప్
@సుజాత:
సుజాత గారూ,
పుస్తకం రెండు వెర్షన్లు అంటే ఒకటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిది (“రైలు బడి” – అనువాదం: వేణుగోపాల్, ఈశ్వరి) మరొకటి నేషనల్ బుక్ ట్రస్ట్ వారిది (“టోటోచాన్” – అనువాదం: సీతాదేవి) కదా?
దిలీప్
budugoy
oh..boy meher..i cant believe this. నేనూ ఈ పుస్తకం చాలా చిన్నప్పుడు బాబాయ్ గారి ఊర్లో లైబ్రరీలో చదివాను. తరవాత ఎంత వెతికినా దొరకలేదు. అసలు ఆ రెండు పేర్లు తప్పితే నాకేం గుర్తు లేదు అదీ కారణం కావొచ్చు. అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి లోకల్ లైబ్రరీలో కూడా బాగా వెతికాను. ఇక్కడ పాతపుస్తకాల షాపుల్లో కూడా వెతికాను. కొన్నెల్లకింద నా బ్లాగులో కూడా అడిగాను. (http://budugoy.blogspot.com/2009/08/blog-post_31.html read my reply to the comments) ఇక్కడికొచ్చాక పబ్లిషింగ్ ఇండస్ట్రీ వెటరన్ తో మాట్లాడుతుంటే తెలిసిందేమంటే అలాంటి పిల్లల అనువాదాలు ఇంకా బోలెడు పెద్దల రష్యన్ అనువాదాలు 89లో రష్యా విచ్ఛిన్నమవకముందువరకూ విశాలాంధ్రలో అమ్మేవారుట. ఇప్పుడు దొరకాలంటే మాత్రం పాత పుస్తకాల షాపులే గతి. ఇదంతా విని నేనెప్పుడో వెతకడం మానేశాను.
మీరన్న బొమ్మలు కూడా నాకు భలే గుర్తు. ఐతే మొన్నే మంచిపుస్తకం వాళ్ళ స్టాల్లో నక్క-కుందేలు కథ అని ఒక రష్యన్ అనువాదం చూశాను. దాంట్లో మళ్ళీ అలాంటి బొమ్మలే కనిపించాయి. ఎనీవే ఎప్పుడో లాగడం మానేసిన తీగని మళ్ళీ కదిలించారు. ఇక మంచిపుస్తకం వాళ్ళని కదిలించి చూస్తాను.
sujji
పుస్తకం గురించి బాగా రాసారు. నేను నాలుగేళ్ల క్రితం చదివాను ఆ పుస్తకాన్ని. ఎలానో పోగొట్టేసుకున్నాను. బుక్ ఫెస్టి లో నాకు కనపడలేదే..
శ్రీకర్ బాబు
రైలు బడి, నిజంగా చాలా మంచి పుస్తకం, నిజానికి మన బ్లాగ్లోకంలో దీని గురించి చాలా ఆలశ్యంగా పరిచయం చేసారు. .. నిజంగా అద్భుతం ఈ పుస్తకం. …. మనసు బాలేనప్పుడు నే చదువుకునే పుస్తకాలలో ఇదొకటి. చిన్నారి టోటో చాన్ పరిచయం, తను కొత్త స్చూల్లో చేరినపుడు ప్రిన్సిపాల్ తో కబుర్లు చెప్పడం, ఒకటేమిటి పుస్తకం మొత్తం ఒక అద్భుతం….
చాలా చక్కని పరిచయం…. ధన్యవాదాలు.
సుజాత
నేషనల్ బుక్ ట్రస్ట్ వారు వేసిందే రైలుబడి.
అసలు పాడైపోయిన రైలు పెట్టెను ఒక స్కూలు గా మార్చాలన్న ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుంది?
ఈ పుస్తకం రెండు వెర్షన్లూ(సీతాదేవి గారిది,నేషనల్ బుక్ ట్రస్ట్ వారిది)నా దగ్గరున్నాయి. బుక్ ట్రస్ట్ వారి అనువాదం ఘోరంగా నిరాశ పరచడంతో సీతాదేవి గారి పుస్తకం కొన్నాను.ఆమె పుస్తకంలో కూడా ఇంకా ఏదో ఉంటే బావుండనే అనిపించింది నాకు.
నా బ్లాగు మొదలుపెట్టినప్పటినుంచీ రాద్దాం రాద్దాం అనుకుని వాయిదా వేస్తున్న పుస్తకం ఇదొక్కటే! సరిగా రాయలేకపోతానేమో అన్న భయంతో!
ఇదొక మంచి పుస్తకం!అంతే..ఇంకేం చెప్పలేను.
మెహెర్
పట్టేసుకున్నాను. 🙂
తెలుగులో దాని పేరు “గెక్ చుక్ అన్నదమ్ముల కథ” కాదు, “చుక్ గెక్ అన్నదమ్ముల కథ”. ఇంగ్లీషు మూలం పేరు “చుక్ అండ్ గెక్” (Chuk and Gek). జపనీస్ కాదు, రష్యన్ కథ. గూగుల్ బ్లాగ్ సెర్చ్ సాయపడింది. రచయిత పేరు Arkady Gaidar.
మెహెర్
పరిచయం బాగుంది.
ఇది చదివాకా నా చిన్నప్పటి ఫేవరెట్ ఒకటి గుర్తొచ్చింది. అదీ జపాన్‌దేనా, లేక రష్యన్‌దా అన్నది మాత్రం గుర్తురావటం లేదు. పేరు మాత్రం తెలుసు: “గెక్ చుక్ అన్నదమ్ముల కథ”. మూలం పేరు ఇలా వుండదనుకుంటా, అందుకే వివరాలు వెదుకుతుంటే గూగుల్ కూడా సాయపడటం లేదు. ఇద్దరు కవలలు తమ తల్లితో మంచు తుఫానులో ఎక్కడికో ప్రయాణించడం గురించిన కథ అని మాత్రం తెలుసు. బాగుంటుంది. అయితే కథ కన్నా ముఖ్యంగా బొమ్మలెంత బాగుంటాయంటే…!!! అవి రంగుల బొమ్మలు కూడా కాదు, ఉత్త పెన్సిల్‌తో వేసినట్టే వుంటాయి. పిల్లలు మంచులో ఆడుకోవడం, రైలు పెట్టెలోపలి భాగం, మంచు తుఫానూ, ఫైన్ చెట్లు, స్లెడ్జ్ బళ్ళూ… ఇలాంటి కొన్ని చిత్రాలేవో ఇంకా నా కళ్ల ముందున్నట్టే వున్నాయి. ఆ అనువాదం (అవే బొమ్మలతో) ఇప్పుడు ప్రచురణలో వుందో లేదో తెలీదు. కానీ చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చదివితే జీవితాంతం మర్చిపోనివ్వని పుస్తకం. కొన్ని పుస్తకాలు చేసే గారడీ ఏంటంటే, తమ కథ చెప్పి ఊరుకోకుండా, అవి చదివినప్పటి స్థలకాలాలూ మన మనస్థితుల స్మృతుల్ని కూడా శాశ్వతంగా మనోఫలకంపై ముద్ర వేసేస్తాయి. ఈ పుస్తకం అలాంటి అనుభూతినే ఇచ్చింది.
Satyam
I read “Chuk and Gek” when I was young, borrowing so many times from the library that the Librarian used to get bored. Especially when I borrow twice on the same day 🙂 It transported a school kid in Kakinada hot weather to snowy Moscow. I am looking for English or Telugu versions. Can anyone point to? I am in Hyderabad now!
budugoy
నిజంగానే ఇదొక అద్భుతమైన పుస్తకం. రైలుబడి చదివి నెట్లో పుస్తకం గురించి చదువుతుంటే ఇంత ఫేమస్ పుస్తకం మనకు ఇంతాలస్యంగా తెలిసిందేమిటా అనుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా బహుభాషల్లో అనువాదం జరిగాక పుస్తకరచయిత్రిని యూనిసెఫ్ రాయబారిగా నియమించారుట.
మన గుజరాతీ బాబు గిజుభాయి బధేకా చరిత్ర చదివినా ఇంచుమించు అదే అనుభూతి కలుగుతుంది. ఈ రైలుబడి మేష్టారు, గిజుభాయి, మరియా మాంటిస్సోరి చరిత్రలు చదువుతుంటే నాకు ఒక పాత పాట గుర్తొస్తుంది. “నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు..”
పూర్ణిమ గారు, చక్కని పరిచయం.
మడత పేజీ
అది “రైలు బడి” గమనించ గలరు.
చక్కటి పరిచయం.ధన్యవాదాలు.