First Person Singular

First Person Singular – Short Story Collection by Haruki Murakami

వ్యాసకర్త: పద్మవల్లి

నేను చదివేవన్నీ నాకు పూర్తిగా అర్థమవుతాయని ఎపుడూ అనుకోను. నా అవగాహనకి చాలా అవధులు ఉన్నాయి. కొంతమంది రచనలు నాకు పూర్తిగా అర్ధంకావు అని తెలిసినా సరే చదవడానికి ఇష్టపడతాను. తెలుగులో నన్ను తిప్పలు పెట్టేవాళ్ళు త్రిపుర, పతంజలి శాస్త్రిగారు లాంటి కొందరు. నేను చదివిన రచయితలందరిలో మురకామీ ఈ లిస్టులో పైన ఉంటారు. అప్పటికప్పుడే అర్థమవుతున్నట్టే ఉండి, సడెన్ గా రూట్ మార్చి పూర్తిగా వేరే విషయం మీద tangent అయిపోతాడీయన. ఏమీ అర్ధం కావడం లేదే ఇది వదిలేసి ముందుకి వెళ్దాం అనుకుంటానా, హఠాత్తుగా ఏదో ఆసక్తికరమైన రెండు లైన్స్ కనిపిస్తాయి. వాటినీ, వాటి రిలవెన్సీ అర్ధం చేసుకోవాలంటే చచ్చినట్టూ వెనుక స్కిప్ చేసి వచ్చినవన్నీ ముందుకన్నా జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది. Spaghetti code లా కనిపిస్తూనే, ప్రతిసారీ కొత్త కోణాలేవో చూపిస్తూనే ఉంటారు. మాస్టర్ స్టోరీ టెల్లర్ ఊరికినే అయ్యాడా మహానుభావుడు!!

మురకామీ నవలలు చదవడం కన్నా, కథలు చదవడం నాలాంటి వాళ్లకి సులభం. అర్థం కానప్పుడు, లింక్ తెగినప్పుడు వెనక్కి వెళ్లి పదే పదే చదువుకోడం ఈజీ, లేదా వదిలేసి తరువాతి కథ కన్నా వెళ్లిపోవచ్చు. (ఇప్పటి వరకూ అలా వదిలేసింది ఏమీ లేదు కానీ, ఒక ఆప్షన్. అంతే.) కొన్నేళ్ళ క్రిందట వచ్చిన Men Without Women చదివి, head over heels అంటారే అలా పడిపోయాను ఆయన కథలకి. ఒకే థీమ్ తో వ్రాసిన ఆ కథలు చాలా నచ్చేసాయి. దాదాపు మూడుసార్లు చదివి, చదివించాను కూడా. (ఈ మధ్యే అదే పేరుతో హెమింగ్వే కూడా ఎప్పుడో 1920ల్లో రాసారని చూసి వెదికి చదివాను, కానీ అందులో కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి నన్ను.)

‘First Person Singular’ కొత్తగా వచ్చిన మురకామీ కథల సంపుటి. ఇంగ్లీష్ లోకి అనువాదం చేసినది Philip Gabriel. ఇందులో ఎనిమిది కథలు ఉన్నాయి. అన్నిటిలోనూ యవ్వనం, జ్ఞాపకాలు, అనుబంధాలు, ఒంటరితనం, క్లాసికల్ సంగీతం, తాత్వికత, మిస్టరీ మొదలైనవి కథాంశాలు. వీటితో పాటు కాస్త wierdness కూడా అంటిపెట్టుకుని ఉంటుంది వీటిల్లో. అన్నికథలూ ప్రథమపురుషలో చెప్పినప్పటికీ, అందులో కథకుడు రచయితేనా కాదా, అవి అతని జ్ఞాపకాలా లేక కల్పితాలా అనేది చెప్పడం కష్టం. అన్నిటిలోనూ కథాకాలం, కొన్ని రిఫరెన్సులూ అది రచయిత స్వంత అనుభవమేమో అనిపిస్తాయి. ఒక్క కథలో మాత్రం తన పేరు డైరెక్ట్గా వాడతారు, పైగా ఆయన రచనా కాలానికి అందులో ఇచ్చిన సంఘటనలకీ చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ పుస్తకం లోని కథల్లో నాలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆన్లైన్ లో ఉన్నాయి. వాటికి లింక్స్ ఆ కథలు ప్రస్తావించిన చోట ఇచ్చాను.

Cream: కథకుడు తన జీవితంలో ఎన్నో ఏళ్ళ క్రిందట జరిగిన ఒక సంఘటన గురించి తన స్నేహితుడికి చెపుతాడు. పద్దినిమిదేళ్ళ వయసులో, అతనికి మరీ అంత పరిచయం లేని ఓ అమ్మాయి అతనిని తన మ్యూజిక్ కాన్సర్ట్ కి ఆహ్వానిస్తుంది. కాన్సర్ట్ హాల్ వెదుక్కుంటూ వెళ్ళిన అతనికి, ఎక్కడో ఊరి చివర కొండ మీద జనసంచారం లేని ప్రదేశంలో, పాడుబడి తాళాలు వేయబడ్డ ఒక హాల్ కనిపిస్తుంది. తను కాన్సర్ట్ వివరాలు సరిగానే విన్నాడా లేక ఆమె తనని ఆటపట్టిస్తుందా అని ఆలోచిస్తూ అక్కడ ఒక పార్క్లో కూర్చొన్న అతని దగ్గరికి ఓ ముసలాయన వచ్చి సంభాషణ మొదలుపెట్టి వింత ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానాలు ఆలోచిస్తుండగానే ఆయన మాయమయిపోతాడు. ఆ సంభాషణ అప్పుడు కథకుడికి అర్ధం కాదు, పైగా జరుగుతున్నవాటిగురించి తాను కలగంటున్నానేమో అనుకుంటాడు. తరువాత చాలా ఏళ్ళకి జీవితంలో అలలు వచ్చి పోతుంటే నెమ్మదిగా ముసలాయన మాటలకి అర్ధం తెలిసినట్టు అనిపిస్తుంది.

A circle with many centers but no circumference. That circle does indeed exist. But not everyone can see it. If you put such an intense effort, that you feel like you’re sweating blood – that’s when it gradually becomes clear what that circle is. If you achieve that difficult thing it becomes the cream of your life. The most important essence of life – that’s the crème de la crème. It means the best of the best. The rest is just boring and worthless.”

Things like this happen sometimes in our lives. Inexplainable, illogical events that nevertheless are deeply disturbing. I guess we need to not think about them, just close our eyes and get through them. As if we were passing under a huge wave. “

On a Stone Pillow: కథకుడు కాలేజీలో చదువుకొనేటప్పుడు ఒక రెస్టారంట్లో పార్ట్ టైం పని చేస్తూ ఉంటాడు. అక్కడ తనకన్నా కొన్నేళ్ళు పెద్దదయిన ఓ అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. ఆమె పేరు కూడా అతనికి సరిగా తెలీదు. అనుకోకుండా ఒక రాత్రి అతని ఎపార్ట్మెంట్లో ఇద్దరూ గడుపుతారు. ఆ రోజే ఆమెకు ఆ ఉద్యోగంలో ఆఖరురోజు కూడానూ. తరువాత ఇద్దరికీ అవతలి వాళ్ళు గుర్తుండరనీ, అది ఒక one night stand గానే ఉండిపోతుందనీ అనుకున్నాడు. మర్నాడు ఆమె వెళ్ళేముందు ఆమె రాసిన పోయెట్రీ పంపుతానని అతని అడ్రస్ తీసుకుంటుంది. అన్నట్టుగానే తను రాసి, స్వయంగా ప్రింట్ చేసుకున్న కవితల పుస్తకం పంపుతుంది. ఏళ్ళు గడిచిపోయాయి. అతనికి ఆమె పేరు కానీ, మొహం గానీ సరిగా గుర్తులేవు ఇప్పుడు. పుస్తకం మీది ఆమె పేరు అసలు పేరు అవునో కాదో కూడా తెలీదు. ఆమె ఇంకా బ్రతికి ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఆమె కవితలు మాత్రం ఇప్పటికీ అతనికి గుర్తున్నాయి. వాటిని చదివిన అతి తక్కువ మందిలో బహుశా తనొక్కడే వాటిని ఇంకా గుర్తు పెట్టుకున్నాడేమో అని ఆశ్చర్యపోతుంటాడు (వాటిని లిమిటెడ్ గా ప్రింట్ చేసి, నంబర్లు వేసి, కొంతమందికి మాత్రమే ఇస్తుంది. ఇతని పుస్తకం మీది నంబర్ 28.) రాత్రి గడిస్తే ఇక గుర్తుండదు అనుకున్న ఆమే, ఏళ్ళ తర్వాత కూడా ఆమె కవితల ద్వారా తనకి గుర్తుండటం గురించి ఆశ్చర్యపోతుంటాడు.

మన జ్ఞాపకాలు చాలా వింతగా పనిచేస్తాయి. మనకి బాగా కావాల్సినవాళ్ళ గురించినవే కొంతకాలం తరువాత వివరాలు చెరిగిపోతాయి. కానీ అనుకోకుండా ఎక్కడో ఏ బస్టాప్ లోనో, సినిమా హాల్లోనో దూరంనుంచి చూసిన ఓ మనిషో, ఓ సంఘటనో అతి చిన్న వివరంతో సహా బాగా గుర్తుండిపోతుంది. వాళ్ళతో మనకేం సంబంధం లేకపోయినా, ఆ సంఘటనలో మనం లేకపోయినా, వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచీ వాళ్ళ హావభావాలూ లేదా ఏ చేతులు తిప్పిన విధమో, లేక మెడ పక్కకి తిప్పి నవ్విన ఓ నవ్వో, ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా నిన్ననే జరిగినంత తాజాగా గుర్తుకొస్తుంది. Deja Vu. దీనికి సైకాలజీలో ఏమన్నా రీజనింగ్ ఉందేమో నాకు తెలీదు.

Weather you cut it off

Or someone else cuts it off

If you put your neck on the stone pillow

Believe it – you will turn to dust”!

Charlie Parker Plays Bossa Nova: కథకుడు కాలేజీ రోజుల్లో, కాలేజీ మేగజైన్ కి ఒక మ్యూజిక్ ఆల్బం మీద పరిచయం రాసాడు. దానికోసం ఒక ఇమాజినరీ ఆల్బం ని, జాజ్ లెజెండ్ గాయకుడు Charlie Parker ఇతర ఫేమస్ గాయకుల పాటలు పాడినట్టు కల్పించి, రికార్డ్ మీద పాటల జాబితా వివరాలతో సహా రివ్యూ రాసేశాడు. అప్పటికి చార్లీ పాడటం మానేసి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏళ్ళవుతోంది. ఎడిటర్ ఏమాత్రం అనుమానం లేకుండా ప్రచురించేసి, తర్వాత ఈ ప్రాక్టికల్ జోక్ మీద చార్లీ అభిమానుల నుంచి తిట్లు తిన్నాడు. కథకుడు మాత్రం తను వేసిన జోక్ కి నవ్వుకుని మర్చిపోయాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత, న్యూయార్క్ లోని ఒక రికార్డ్స్ స్టోర్లో అదే ఆల్బం చూస్తాడు కథకుడు. అది నిజమా లేక తనలానే ఎవరన్నా ప్రాక్టికల్ జోక్ గా ఫేక్ రికార్డ్ చేసి అమ్మేసేరా అని అనుమానించి కొనకుండా వెళ్ళిపోతాడు అప్పటికి. మర్నాడు మనసు మార్చుకుని స్టోర్ కి వెళ్లి అడిగితే, ‘అసలలాంటిది నేనెప్పుడూ చూడనేలేదు నా షాప్ లో, నీకు గనక ఎక్కడన్నా దొరికితే నాకూ దాన్ని వినాలనుంది’ అంటాడు ఓనర్. కొన్నేళ్ళు గడిచాక ఛార్లీ కథకుడి కలలోకి వచ్చి, అప్పుడు ఊహల్లో అయినా Boss Nova (Bossa Nova: a style of Brazilian music derived from samba but placing more emphasis on melody and less on percussion) స్టైల్ మ్యూజిక్ పాడే అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.

మేజిక్ రియలిజం టచ్ ఉన్న కథ ఇది. అయితే కొన్ని వాక్యాలు కథలోని ఎసెన్స్ ని చూపిస్తాయి. ఒక్కసారి మన జీవితాలని గురించి అలోచించుకొనేలా చేస్తాయి. ఈ నిమిషంలో జీవించడమనేది చాలా ముఖ్యం. రేపు అనేది ఒక రికామీ.

I was only 34 when I died. I’d only begun things myself. But then I looked around me and it was all over.“ “Death always comes on suddenly. But it also takes its time. Like the beautiful phrases that come into your head. It lasts an instant, yet those instants can draw out forever. The concept of time is lost there. In that sense, I might have been dead even as I lived out my life. But actual death is a crushing. What’s existed until then suddenly and completely vanishes. Returns to nothingness. In my case, that existence was me.”

With the Beatles: ఇది కూడా ఏళ్ళు గడిచినా మనల్ని అంటిపెట్టుకుని ఉండే కొన్ని జ్ఞాపకాల గురించిన తలబోతల కథ. కథకుడు హైస్కూల్ రోజుల్లో, ఒకరోజు పెద్దగా వెలుతురు లేని స్కూల్ హాల్లో నడిచి వెళ్తున్న ఓ అమ్మాయిని చూసాడు. ఆ అమ్మాయి అందమయిన మొహం, నడుస్తుండగా అటూ ఇటూ ఊగుతూ ఎగిరి పడుతున్న ఆమె స్కర్ట్, పొడుగాటి నల్లని జుత్తూ, గుండెలకి అపురూపంగా (దాని మీదే ఆమె జీవితం ఆధార పడిందేమో అన్నంతగా) హత్తుకున్న బీటిల్స్ రికార్డ్ ఆల్బం మీది ఫోటో, అన్నీ అతనికి అలా గుర్తుండిపోయాయి. ఆమెను చూసింది ఒక్క పది సెకన్లు మాత్రమే, మళ్ళీ ఎదురుపడనే లేదు. పేరు తెలీదు, ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు. అపుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. తరువాత అతను కాలేజీలో చదివేటప్పుడు కొన్నాళ్ళు ఇంకో అమ్మాయిని డేట్ చేస్తాడు. ఆ సమయంలో ఒకసారి ఆమె అన్నని కలిసి మాట్లాడినపుడు జరిగిన సంభాషణ బట్టి, ఆ అబ్బాయికున్న genetic disorder కారణంగా అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలున్నాయేమో అనుకుంటాడు. తరువాత ఆ గర్ల్ ఫ్రెండ్తో కూడా విడిపోయి, టోక్యోలో చదువూ, ఉద్యోగం, పెళ్ళీ జరిగి స్థిరపడతాడు. ఇది జరిగిన 18 ఏళ్ళ తర్వాత అనుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ అన్న కలిసి, ఆమె కొన్నేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెపుతాడు. తను ఆమెతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెలో ఆ ఆలోచనలున్న ఛాయలు కనిపించలేదే అనుకుంటాడు కథకుడు. అంత దగ్గరగా ఉన్నా ఆ అమ్మాయి గురించి తనకేమీ తెలీదేమో అనుకుంటాడు.

ఇక్కడ రెండు విషయాలు. మనకి బాగా తెలుసు అనుకున్న మనుషుల గురించి కూడా నిజంగా మనకసలేమీ తెలీదన్నది. అదే ఆ అమ్మాయి అన్న కూడా చెపుతాడు, నా చెల్లెలి గురించి నాకేమీ తెలీదనుకుంటాను అని. ఒక్కోసారి మనకి తెలీని వాళ్ళ గురించిన జ్ఞాపకాలే మనకి అతుక్కుపోతాయి, మన జీవితమే వాటి మీద ఆధారపడినట్టు. విచిత్రమైనవి ఈ మనసూ అలోచనలూనూ.

అంతే కాకుండా కాలంలో ఇరుక్కుపోవడం. మనకి నచ్చిన, మెచ్చిన జ్ఞాపకాల్లోనే మన మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. ఎప్పుడూ పిల్లలు ఎంత పెద్దగా అయిపోయారో అనో, ఇంకెవరిలోనో ఎన్ని మార్పులోచ్చేసాయనో అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళతో పాటే మనమూ పెరుగుతున్నామనీ, మనలోనూ మార్పులొస్తాయనీ గుర్తించము. ఆ పదహారేళ్ళ పసిడి వయసులోనే ఇరుక్కుపోయి, అక్కడే భ్రమిస్తూ ఉంటుంది మన మనసు. రియాలిటీ అనేది రిలేటివిటీ లేకుండా పోతుంది.

I think what makes me feel sad about the girls I knew growing old is that it forces me to admit, all over again, that my youthful dreams are gone forever. The death of dream can be, in a way, sadder than that of a living being. Sometimes it all seems so unfair.”

Normally, the darkness that people hold within themselves is unseen. It erupts when you don’t expect it, in a form and a place you can’t anticipate, and, in most cases, by the time it becomes apparent it’s too late to do anything about it.” – Author in an interview.

Confessions of a Shinagawa Monkey: ఇది దాదాపు పదేహేనేళ్ళ క్రితం వ్రాసిన Shinagawa Monkey అనే కథకి కొనసాగింపు. ఈ కథ ప్లాట్ ఎంత సిల్లీగా అనిపిస్తుందో, అంత ఆలోచింపచేసే కథ. బహుశా one of the best in the collection. కథకుడు పని మీద పైవూరికి వెళ్ళినపుడు అక్కడ ఒక లాడ్జిలో బస చేస్తాడు. అక్కడ ఒక మాట్లాడే (మగ) కోతి పనిచేస్తుంటుంది. ఈయన పూల్ లో స్నానం చేస్తుంటే, కోతి వచ్చి సహాయం కావాలా అని అడిగి వీపు రుద్దుతుంది. రాత్రి పని అంతా అయ్యాక, బీర్స్ తీసుకుని తన రూమ్ కి వస్తే కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అంటాడు కథకుడు. ఆ రాత్రి కబుర్లలో కోతి తన కథ, తన ప్రేమల గురించీ, ప్రేమించిన వాళ్ళని పొందలేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలతో ఎలా జీవితం గడుపుతుందో చెపుతుంది(తాడు). కోరుకున్నది దొరకలేదనో, దొరికి చేజారిపోయిందనో జీవితాన్నినాశనం చేసుకునేవాళ్ళనీ, చేసినవాళ్ళనీ చూస్తుంటాం. అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమ మనిషిని నిలబెట్టాలి కానీ నాశనం చెయ్యకూడదు కదా. అది మన జీవితానికి చీకటిలో కూడా వెలుగునివ్వాలి. గుండెని నులివెచ్చగా తాకుతుండాలి. ఆ ప్రేమ మనకి ఉందన్న ధైర్యాన్ని, ఒక బలాన్ని ఇవ్వాలి.

కోతి చెపుతుంది, ‘నేను ఇష్టపడిన వాళ్ళని పొందటం అనేది జరగని పని అని నాకు తెలుసు, కాబట్టి నిరాశపడకుండా వాళ్ళ వస్తువుల/జ్ఞాపకాల ఆసరాతో జీవితం గడపాలని ప్రయత్నిస్తున్నాను. దానికోసం ఒక కొత్త మార్గం కనిపెట్టాను. నేను ఇష్టపడిన వాళ్లది, వాళ్ళ పేరున్న ఏదో ఒక ID Card దొంగతనం చేస్తాను. ఆ పేరు వైపు కాసేపు తదేకంగా చూస్తాను, అప్పటి నుంచీ ఆ పేరులో ఒక భాగం నాదయిపోతుంది. వాళ్ళు అప్పుడప్పుడూ వాళ్ళ పేరు మర్చిపోతుంటారు. వాళ్ళ పేర్లే నా జీవితానికి ఆసరా’ అని. Magic realism at its best? ఎంత సిల్లీగా ఉందో అంత గొప్పగానూ అనిపిస్తుంది. ఎవరికీ ఏ హానీ లేని దొంగతనం. (ఈయనదే Scheherazade అనే కథలో, అమ్మాయి తను ఇష్టపడిన అబ్బాయి ఇంట్లో ఎవరూ లేనప్పుడు దూరి, అతని పెన్సిళ్ల నుండీ మొదలు పెట్టి, లోపలి బనీన్ వరకూ తీసుకుపోయి దాచుకుంటుంది. )
“I believe that love is the indispensable fuel that allows us to go on living. Someday that love may end. Or it may never amount to anything. But even if love fades away, even if it’s unrequited, you can still hold on to the memory of having loved someone, of having fallen in love with someone. And that’s avaluablesourceofwarmth. Without that heat source a person’s heart – and a monkey’s heart too – would turn into a bitterly cold, barren wasteland. A place where not a ray of sunlight falls, where the wildflowers of peace, the trees of hope, have no chance to grow. I treasure the names of those seven beautiful women I loved here in my heart. I plan to use these memories as my own little fuel source I burn on cold nights to keep me warm as I live out what’s left of my own personal life.”

It may well be the ultimate form of romantic love. But it’s also the ultimate form of loneliness. Like two sides of a coin. The two extremes are stuck together and can never be separated.”

Carnaval: (A piano solo written in 1834 by Robert Schumann, representing masked revelers at Carnival, a festival before Lent.)

కథకుడుకి ఒక యువతితో పరిచయమవుతుంది. ఆమె అందగత్తె కానప్పటికీ, ఆమెలో మనుషుల్ని ఆకర్షించి నిలబెట్టుకునే ఏదో ఆకర్షణ శక్తి, తెలివీ ఉన్నాయి. ఇద్దరికీ ఒకే రకమైన సంగీతం మీద అభిరుచులు. ఇద్దరినీ తమకిష్టమయిన ఒకే ఒక్క పాటను ఎంచుకోమంటే ఇద్దరూ Rebert Schumann సెట్ చేసిన Carnaval అనేదాన్నే ఎంచుకుంటారు. ఇద్దరికీ నెమ్మదిగా పరిచయం పెరిగి, తరచూ కలుస్తూ, సంగీతం మీద చర్చలు చేస్తూ, పాటలు వింటూ గడుపుతారు. ఆమెకి పెళ్ళయిన ఆనవాళ్లుంటాయి కానీ ఇతనికి ఆమె భర్త గురించి ఏమీ తెలీదు. ఇతని భార్యకీ కూడా ఆమె అందగత్తె కాకపోవడంతో, అతను ఆమెని తరచుగా కలవటం ఏమీ ఇబ్బంది కలిగించదు. (అనాకారి అవ్వడం వల్ల, అనవసరమయిన అనుమానాలూ భయాలూ కలగలేదు అంటాడు.) అలా ఇద్దరికీ పరిచయం పెరుగుతూ ఉండగా, ఆమె లోని అనాకారితనాన్ని డామినేట్ చేసే వ్యక్తిత్వం బయటపడి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈమె మరీ ఇంత అనాకారి కాకుండా ఉంటే ఎంత బావుండేదో అని కూడా అనుకుంటాడు. ఆలా కొన్ని నెలలు గడిచాక ఆమె కనిపించడం మానేస్తుంది. మరి కొన్ని నెలలకి ఆమె భర్తతో కలిసి చేసిన ఒక ఫ్రాడ్ కేస్ లో టీవీలో వార్తలు వస్తాయి. కొన్ని రోజులకి అదీ ఆగిపోతుంది. ఆమె ఏమయిందో కూడా తెలియదు. కానీ కథకుడిని మనుషులూ, వాళ్ళు ధరించిన ముసుగులూ. బయటకి కనిపించే ప్రవర్తన, ముసుగుల వెనక దాక్కున్న అసలు మొహాల గురించి ఆలోచనలు చుట్టుముడతాయి.

ఇది మనం బాగా రిలేట్ చేసుకోగలిగిన కథ. అలాంటి ఫేక్ మొహాలతో, మాస్క్ ధరించిన ముసుగువీరులతో రోజూ డీల్ చేస్తూనే ఉంటాము. ముసుగులు తొలగేసరికి అప్పటివరకూ మనం చూసినదేదీ నిజం కాదనే సత్యం కాస్త గట్టిగానే తగులుతుంది. అప్పటికే చెయ్యిజారిపోవచ్చు. పై ముసుగులను బట్టి మనం ఏర్పరుచుకున్న అభిప్రాయాలూ, ఇచ్చిపుచ్చుకున్న గౌరవమర్యాదలూ అర్ధంలేనివని తేలిపోతాయి. క్రింది సంభాషణ నాకు చాలా నచ్చింది. మనం ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఆ ముసుగుల వెనకున్న అసలు రూపం ఎప్పటికన్నా బయటపడక తప్పదన్న ఎరుక చాలా ముఖ్యం. ఆ అసలు ముఖాన్ని పసిగట్టగలిగే వాళ్ళుంటారు ఎక్కడో.

All of us, more or less, wear masks because without masks we can’t survive in this violent world. Beneath an evil-spirit mask lies the natural face of an angel, beneath an angel’s mask lies the face of an evil-spirit. It’s impossible to have just one or the other. That’s who we are. And that’s Carnaval.

For some people the mask might become so tightly stuck, that they can’t remove it.”

Yes, that may be true. But even if a mask gets stuck and can’t be removed, that doesn’t change the fact that beneath it the real face remains.”  

Though no one can ever see it.”

There must be people who can. Surely, there must be somewhere.”

ఈ కథలో నాకు నచ్చనది. ఆమెను ‘బొత్తిగా అనాకారి’ అని పదే పదే అంటాడు కథకుడు. బయటికి కనిపించే అందానికీ, మనుషులకుండే చార్మ్ కీ సంబంధం లేదని చెప్పడం ఉద్దేశ్యం కావచ్చు. అయితే, ‘మరీ అంత అందగత్తేం కాదు’ అని చెప్పి ఉండొచ్చు. లేదా ఆ అనాకారితనం ఆమె ముసుగు కింది ప్రవర్తనకి ఒక ఇమేజిరీ కావచ్చు,

The Yakult Swallows Poetry Collection: ఇది మురకామీ మెమోయిర్ అనుకోవచ్చు. కథకుడు ఈ కథలో అసలు పేరుతోనే కనిపిస్తాడు. జపనీస్ సాహిత్యంలో నేను గమనించింది, మనకి క్రికెట్, అమెరికాలో ఫుట్బాల్ లా, వాళ్ళకి బేస్ బాల్ మీదున్న ప్రేమ. దాదాపు అన్ని పుస్తకాల్లోనూ ఇది గమనించాను. ఇందులో కథకుడు తన బాల్యం నుంచీ తనకి బేస్ బాల్ ఆటతో ఉన్న జ్ఞాపకాలూ, తనకి ఇష్టమయిన స్టేడియంలో ( ఆ టీం దాదాపూ ప్రతీ గేమ్ ఓడిపోతుందని తెలిసినా కూడా) సీజన్లో ప్రతీ ఆదివారం ఆట చూడటం, ఆట చూస్తూ అక్కడ తీరిక సమయాల్లో రాసిన పోయెట్రీ కలెక్షన్, తండ్రితో జ్ఞాపకాలు నేమరేసుకోడం … పూర్ నాస్టాల్జియా. అయితే ఇక్కడ కూడా కొన్ని విలువైన విషయాలు కనిపిస్తాయి. ‘మనం గడిపిన ప్రతీ సమయానికీ సంబంధించి, ఇష్టమో కష్టమో కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. మనం సంతోషమయిన వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోడానికి ఇష్టపడతాము. కానీ ప్రతీ దానిలోనూ వెదికి దాచుకోవాల్సినవేవో ఉంటాయి. జీవితాన్ని విజయాలతో మాత్రమే కొలవకుండా ఉండటం చాలా అవసరం.‘

it is important getting used to losing. It’s true that life brings us far more defeats than victories. And real-life wisdom arises not so much from knowing how we might beat someone as from learning how to accept defeat with grace.”

Of course, winning is much better than losing. But winning or losing doesn’t affect the weight and value of the time. It’s the same time either way. We need to cherish it. We need to deftly reconcile ourselves with time, and leave behind as many precious memories as we can – that’s what’s the most valuable.”

First Person Singular: ఇది కూడా జ్ఞాపకాలు, మనం జీవితంలో వివిధ దశల్లో తీసుకునే ఛాయిస్ గురించిన కథ. జ్ఞాపకాలు చాలా సతాయిస్తాయనే సంగతి మనకి తెలిసిందే. అయితే జ్ఞాపకమే లేకపోవడం అనేది ఎలా ఉంటుంది? చాలాసార్లు మనం ఇలా కాకుండా అప్పుడు అలాచేసి ఉంటే బావుండేది అనుకుంటాం. అయితే అలా చెయ్యకపోతే ఇలా ఉండము అనేది చెప్పగలమేమో, కానీ ఇంకోలా చేస్తే ఎలా ఉండేవాళ్ళమో ఖచ్చితంగా చెప్పడం సాధ్యమేనా? ఒక్కోసారి మనకి ఛాయిస్ ఉండకపోవచ్చు, మన ముందున్న ఒకే ఒక్క దారిలోనే వెళ్ళాల్సి వస్తుంది.

కథకుడు ఓ సాయంత్రం ఏమీ తోచక, ఒక బార్ కి వెళ్లి ఒంటరిగా కూర్చుని బీర్ తాగుతూ పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. పక్క టేబుల్ దగ్గర కూర్చొన్న ఒక నడివయసు యువతి హఠాత్తుగా ఇతన్ని పలకరించి, అతను సూట్ వేసుకుని ఒంటరిగా బార్ లో కూర్చుని పుస్తకం చదవడం గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అతను మనం ఇంతకుముందు కలిసామా అని అడిగితే, ఆమె కోపంతో ‘నీకు అది కూడా గుర్తులేదా? నీ స్నేహితురాలికి నేను స్నేహితురాలిని. నువ్వు మూడేళ్ల క్రితం ఆ బీచ్ ఒడ్డున చేసిన దానికి ఆమె నేనూ కూడా నీ మీద కోపంగా ఉన్నాం. నువ్వేమో చేసిన పనికి సిగ్గుపడకుండా అదేమీ గుర్తులేనట్టే ఉన్నావు’ అని తిడుతుంది. ఇతనికి ఆమెవరో, స్నేహితురాలెవరో, మూడేళ్ల క్రిందట ఏం జరిగిందో అంతా అయోమాయం. నోరుమూసుకుని ఇంట్లో కూర్చోకుండా అనవసరంగా బయటకి వచ్చాను అనుకుంటూ, ఆమె చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ బుర్రగోక్కుంటూ వెళ్ళిపోతాడు. మూడేళ్ల క్రితం తను ఎక్కడున్నాడో ఏం చేసాడో ఎంత ఆలోచించినా అతనికి గుర్తు రాదు. ‘తను అలా తప్పించుకుని వచ్చెయ్యడం సరయినదేనా? మళ్ళీ ఇలానే జరిగితే ఎలా ప్రవర్తిస్తాను’ అనుకుంటాడు.

As is true of most people, I imagine, I had experienced a number of turning points in my life, where I could go either left or right. And each time I chose one, right or left. (There were times when there were clear-cut reason, but most of the time there wasn’t. And it wasn’t always like I was making a choice, but more like the choice itself chose me.) And now here I was, a first person singular. If I’d chosen a different direction, most likely I wouldn’t be here.”

ఈ కథలకి ఇంగ్లీష్ అనువాదం, భాష సరళంగా బావుంది. అందరికీ ఒక్కసారి చదివితే అర్ధమయ్యేవి కాదు ఇవి. కనీసం రెండు సార్లు చదవాలి, ఇంకొన్ని సార్లు కథలోని లింకులు పట్టుకుని వెనక్కి వెళ్లి వస్తూ ఉండాలి. అప్పుడే కథలోని మార్మికత వీడి, గొలుసులు కలిసినట్టుంటాయి. కొన్ని కథల్లో రచయితకు క్లాసికల్ మ్యూజిక్ మీద ఉన్న ఇష్టం, విజ్ఞానం వాటి గురించి పెద్దగా తెలీని పాఠకులని overwhelm చేస్తాయి. కొన్నిసార్లు వివరణలూ, సైకలాజికల్ అనాలిసిస్ ఎక్కువయినట్టు అనిపిస్తుంది. (ఇది నవలల్లో ఇంకా ఎక్కువ.) Overall, a tough nut to crack, but totally worth.

ఒక్కోసారి ఈ కథలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈయన అనిపిస్తుంది. అసలీ కథకి ఏమన్నా థీం ఉందా అనిపిస్తుంది చాలాసార్లు. ఏదో నోటికొచ్చిన blabbering అంతా వ్రాసుకు పోతున్నారేమో అని విసుగొస్తుంది కూడాను. మీ కథలకి థీం ఏమిటీ అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.

I’ve hardly ever thought about the theme or the point of the stories I write. I’ve had a number of opportunities to discuss my work with college students in their classes, and the students always seem to end up confused, because they can’t find the theme or the point of my stories. But that doesn’t bother me at all.”

ఇంకేం మాట్లాడతాం! Heller McAlpin (NPR) ఈయన్ని Master of mesmerizing head-scratcher అన్నారు. అది నిజమే, అయితే బుర్ర గోక్కునేది మనం, రచయిత కాదు.

A talk with author about some of these stories:

Haruki Murakami on How Memory Can Trigger a Story

Haruki Murakami on Symbols and When a Monkey Is Simply a Monkey

You Might Also Like

2 Comments

  1. పద్మవల్లి

    Men without Women లో ఒంటరితనం, విషాదం లీలగా ప్రతీ కథలోనూ కనిపిస్తాయి. కానీ ఇందులో ఎక్కువగా మనుషులూ, వారి ప్రవర్తన , మన అనుభవాలూ  మనకి గుర్తుండిపోయే  జ్ఞాపకాలూ వస్తువులు. ముందు దానితో పోలిస్తే మరీ విషాదంగా అనిపించదు. చదవండి. 

  2. leol

    Men without women : stories 2018లో చదివాను. కొన్ని కథలు గుండెని మెలిపెట్టాయి. ఈ పుస్తకం చదవాలని ఉంది కానీ థైర్యం సరిపోవటం లేదు.
    https://www.complete-review.com/reviews/murakamih/first_person_singular.htm

Leave a Reply