2020లో నా పుస్తకాలు: అమిధేపురం సుధీర్

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

పుస్తక పఠనం- 2020 

2020 లో కొంచం తక్కువే చదివినా, కొన్ని మంచి పుస్తకాలు చదవగలిగాను. కాలక్షేపానికి చదివిన నవలలని వదిలి మిగిలిన పుస్తకాల గురించి ఇక్కడ వివరిస్తాను.

1. నల్లమల ఎర్రమల దారులలో యాత్ర – పరవస్తు లోకేశ్వర్.

ఇంతకు ముందు వీరివే ‘చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర ‘, ‘సిల్క్ రూట్ లో సాహస యాత్ర ‘ చదివి వున్నాను కాబట్టి ఈ పుస్తకం కొన్నాను. రాయలసీమ ప్రాంతంలో పర్యటించాలనుకుంటున్న వారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.  ఒక మంచి టూరిస్ట్ గైడ్ పుస్తకంలా వుంది.

2. ఉపనిషద్ రత్నావలి (నాలుగు భాగాలు) – సత్యనారాయణ మూర్తి

ఉపనిషత్తుల గురించి తెలుసుకోగోరే ఆసక్తి వున్నవారికి ఈ పుస్తకం ఒక మంచి రిఫరెన్స్ లా ఉపయోగపడుతుంది.  ఈ పుస్తకాల మీది వ్యాసం ఈ కింది లింక్ లో వుంది.

3. ఉమర్ ఖయ్యాం – లత

ఎంతో ఊహించుకొని చదివి భంగపడ్డ పుస్తకం ఇది. చరిత్ర పరంగా ఉమర్ ఖయ్యాం గురించి చాలా తక్కువ తెలుసు అని తెలిసినా, అతని కవిత్వం గురించీ, రుభాయత్ ల గురించి ఏమైనా వుంటుందేమో అనుకున్నాను. కానీ విపరీతమైన వర్ణనలతో చాలా విసుగు తెప్పించిన పుస్తకం ఇది. 

4. కరెంటు కథ, కాలెండర్ కథ, రాకెట్ కథ, సౌర శక్తికి సంకెళ్ళు, ప్రపంచానికి ఆఖరి ఘడియలు,  ఇంకా టెలిఫోన్ కథ – మహీధర నళినీ మోహన్

చాలా ఆలస్యంగా వీరి గురించి తెలిసినా, గత సంవత్సరం నేను బాగా అనందించిన రచనలు వీరివి. అత్యంత సరళంగా చాలా విషయాలు చెప్పారు. చాలా మంచి శైలి అనిపించింది. వీరి పుస్తకాల మీద నా వ్యాసం ఈ కింది లింక్ లో. (ఈ వ్యాసం వ్రాసిన తర్వాత, టెలిఫోన్ కథ చదివాను, అందుకే ఆ వ్యాసం లో ఈ పుస్తకం గురించి లేదు).

5.  ‘జీవ శాస్త్ర విజ్ఞానం, సమాజం’ & ‘ప్రకృతి – పర్యావరణం’ – కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ 

ఈ రెండు సైన్స్ పుస్తకాలూ ప్రస్తుత సమస్యలని స్పృషిస్తూ సమకాలీనకంగా వున్నాయి. ఈ రచనలలో వున్న ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే, ఇవి టెక్స్ట్ బుక్స్ లా అనిపిస్తాయి. శైలి అంత సులభంగా వుండదు. అయినా విషయపరంగా ఇవి చాలా మంచి పుస్తకాలు.

6. నా పేరు బాలయ్య’ – వై. బి. సత్యనారాయణ & ‘సాయంకాలమైంది’ – గొల్లపూడి మారుతీ రావు

వెంట వెంటనే చదివిన ఈ రెండు పుస్తకాలు ఒక చిత్రమైన భావనని కలిగించాయి. రెండూ చాలా 

మంచి రచనలు. రెండింటి మీద కలిపి నా బ్లాగులో నేను వ్రాసుకున్న చిన్న వ్యాసం ఈ కింది లింక్ లో,

ఇవే కాక నేను చదివిన మరికొన్ని పుస్తకాలు, వాటి మీద పుస్తకం.నెట్ లో ప్రచురితమైన వ్యాసాలు,

7. `సూక్ష్మ క్రిమి అన్వేషకులు – జమ్మి కోనేటి రావు

8. Half Lion: Vinay Sitapati – లింక్ –

http://pustakam.net/?p=21025

9. Aadhaar: A Biometric History of India’s 12-digit Revolution – Shankkar Aiyar, లింక్ – http://pustakam.net/?p=20973

10. Bud Loftus: An Irish-American’s Journey – Bernard T. Loftus

11. Dawood’s Mentor – Hussain Zaidi

12. నాగావళి నుంచి మంజీర వరకు – రావి కొండల రావు

13. అమెరికా ప్రజల చరిత్ర – హోవార్డ్ జిన్

14. నవల వెనుక కథ – మల్లాది వెంకట క్రిష్ణ మూర్తి

2019 లో భగవద్గీత ని చదివాను, అలాగే 2020 లో ఖురాన్ ని తెలుగులో చదివాను. బైబిల్ తెలుగు పుస్తకం కూడా తెచ్చాను. ఇక ఈ సంవత్సరం అది చదవాలి.

You Might Also Like

Leave a Reply