పుస్తకం
All about booksపుస్తకభాష

May 16, 2009

Will Durant – The Case for India

More articles by »
Written by: రవి

ఆంగ్ల సాహిత్యం మీద నాకు అభినివేశం కాదు కదా, పెద్ద పరిచయం కూడా లేదు. గొప్ప రచయిత, చరిత్రకారుడూ అయిన Will Durant పేరు ఈ మధ్యనే విన్నాను. తలవని తలంపుగా ఈ రచయిత పుస్తకం నాకు ఒకరిద్వారా బహుమతిగా లభించటంతో, ఉత్సాహంతో చదివేను.

ఈ రచయిత పుస్తకం సమీక్షించడానికి, లేదా పరిచయం చేయడానికి, చరిత్ర, నాగరికత వంటి విషయాలపై గొప్ప పరిజ్ఞానం ఉన్న వ్యక్తులయితే పూర్తి న్యాయం చేకూరుతుంది. అయితే “పుస్తకం” లో సామాన్య పాఠకుడి ప్రతిస్పందనలకూ, రచనలకూ ప్రోత్సాహం ఉంటున్నది కనుక, ఆ వెసులుబాటును ఉపయోగించుకుంటూ, ఈ వ్యాసం రాస్తున్నాను.

ఈ రచయిత అమెరికా దేశస్థుడు. ఈ పుస్తక రచనా కాలం 1929. భారత దేశంలో స్వరాజ్య పోరాటం గొప్ప ఊపులో జరుగుతున్న సమయం అది. అలాగే గాంధీ పేరు వాడవాడలా వినిపిస్తున్న రోజులు. సరిగ్గా ఆ సమయంలో, ఈ అమెరికా రచయిత తను రాయబోయే పుస్తకం (The story of civilization) కోసం భారతదేశం వచ్చాడు. ఈ పుస్తకానికి ప్రేరణ రచయిత మున్నుడిలో చెబుతాడు.

తన పుస్తకానికి విషయం కోసం భారతావనికి వచ్చిన రచయిత, ప్రపంచ జనాభాలో 5 వ వంతు పేదరికంలోనూ, దాస్యం లోనూ మగ్గటం చూసి చలించిపోయాడు. అంతటి దాస్యత్వంలోనూ అహింసా వాదంతో స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికిన గాంధీ ని గమనించాడు. తన చారిత్రక రచనా వ్యాసంగాన్ని ఒకింత పక్కన పెట్టి భారతదేశాన్ని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నం లో ఎన్నో ఉద్వేగాలకు లోనయ్యారు. 1820 వరకు ప్రపంచ దేశాలలో అత్యంత ధనిక దేశమైన భారతదేశం  తర్వాత కాలంలోఒకానొక నిరుపేదదేశంగా మార్చబడింది.బ్రిటిష్ భారతఆక్రమణ ప్రపంచ చరిత్రలో అతి హేయమైన నేరమని చెబుతారు.

ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి.
1. For India
2. Gandhi
3. The Revolution
4. The case for England
i. England speaks
ii. India answers
Conclusion.

మొదటి అధ్యాయంలో రచయిత భారతదేశం గురించి వ్రాయటానికి మొదలు పెడుతూ, మొదటి ప్రకరణంలో, తను ఈ దేశం గురించి వ్రాయటానికి తగనని కాస్త వినమ్రంగా చెబుతారు. బ్రిటిష్ వారు best gentle men అనీ, అలానే worst imperials అంటారు.

బ్రిటిష్ వారు భారతదేశం వెనుకబడ్ద దేశమని, వారికి చదువు, నాగరికత నేర్పిన ఘనత తమదేనని అన్న సందర్భాలకు రచయిత బదులు చెబుతూ, భారతదేశం, అనేక సంస్కృతులకు, నాగరికతలకు, భాషలకు పుట్టినిల్లని, వారికి నాగరికత నేర్పడం హాస్యాస్పదమని ఇలా బ్రిటిష్ వారి భారత ఆక్రమణను సమర్థించుకునే ఉటంకింపులకు సరైన సమాధానం చెబుతూ, భారతావనిని మదర్ ఇండియా అని ఉటంకిస్తారు.

ఇక భారతదేశంలో కులవ్యవస్థ అన్న ప్రకరణంలో, 4 కులాల గురించి చెబుతూ, నిజమైన బ్రాహ్మణులు -బ్రిటిష్ బ్యూరోక్రసీ, నిజమైన క్షత్రియులు – బ్రిటిష్ సేన, నిజమైన వైశ్యులు – బ్రిటిష్ వ్యాపారులు, నిజమైన శూద్రులు, అస్పృశ్యులు – హిందువులు అని (బ్రిటిష్ వారికి ఎత్తిపొడుపుగా) సాధికారికంగా, సమగ్రంగా వివరిస్తారు. ఈ ప్రకరణంలో రచయిత అనేక ఆధారాలను (Facts & Figures) మన ముందుంచుతారు. ఈ లెక్కలు చూస్తే, మన ఇప్పటి పేదరికానికి ఒకానొక బలీయమైన కారణం బ్రిటిష్ వారి పరిపాలన అని అనిపించకమానదు. ఒక (బ్రిటిష్ ప్రభుత్వపు వ్యక్తి) అంచనా ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఓ అర్ధ శతాబ్దంలో దోచుకున్న సొత్తు విలువ $40,000,000,000 ! భారతదేశం సాంఘికంగా, వాణిజ్య పరంగా ఎలా దోచుకోబడింది అన్నది సోదాహరణంగా మరో 2 ప్రకరణాలలో వివరించబడింది.

ఇక రెండవ అధ్యాయం పూర్తిగా గాంధీకి కేటాయించబడింది. గాంధీ గురించిన విషయాలు సాధారణంగా అందరికీ తెలిసినవే. అయితే రచనా కాలం 1929 అవటం వల్లనేమో తెలియదు, గాంధీ వెల్లువలో పడి ఆయనను బుద్ధుడితో పోలుస్తూ, గాంధీని ఒక “రిలిజియస్ ఫిగర్” చేశారనిపిస్తుంది. అక్కడక్కడా గాంధీ “గ్రామ స్వరాజ్యం’ గురించిన ఉటంకింపులు మాత్రం ఇప్పటి సమాజానికి కూడా కనువిప్పుల్లాగా అనిపిస్తాయి. ఈ అధ్యాయం చివరి ప్రకరణంలో గాంధీ మీద విమర్శలను ప్రస్తావించారు.

మూడవ అధ్యాయం లో తిరుగుబాటు మూలాలు, పోకడలు, బ్రిటిష్ వారి అణగద్రొక్కుడు విధానాలు వివరించబడ్డాయి. ముఖ్యంగా జులియన్ వాలాబాగ్ సంఘటన చదువుతుంటే, పాఠకుడికి ఆవేశం తన్నుకు రావడం తథ్యం. అలాగే బ్రిటిష్ వారి హింసను సత్యాగ్రహులు ఎలా మౌనంగా భరించి ప్రాణాలర్పించింది కూలంకషంగా వివరించారు. అయితే 1857 లో మొదలయిన విప్లవాన్ని దాని మూలాల గురించి రచయిత విస్మరించినట్లు తోస్తున్నది.

చివరి అధ్యాయం లో (హోం రూలు నిరాకరణకు కారణంగా) బ్రిటిష్ వారి వాదన, భారత దేశపు సమాధానం వివరించబడ్డాయి.బ్రిటిష్ వారి వాదన నీత్సియన్ రక్షణ పద్ధతిలో సాగుతుంది. అంటే – “Right of the stronger to use the weaker for his purposes.”అన్న సూత్రం ఆధారంగా. భారతదేశాన్ని ఎంతో మంది ఆక్రమించారు, అయితే ఇక్కడ వేడిమి కారణంగా వారెవరూ, వారి అస్తిత్వాన్ని నిలుపుకోలేకపోయారు. బ్రిటిష్ వారి వాదన ప్రకారం, భారతాన్ని వారు ఆక్రమించకపోయి ఉంటే, ఫ్రాన్స్, చైనా లేదా మరేదైనా దేశం ఆక్రమించి ఉండేది. బ్రిటిష్ వారు ఇక్కడ అనేక మూఢ నమ్మకాలను రూపుమాపటానికి కృషి చేశారు. ఒక అంచనా ప్రకారం అప్పట్లో 20 లక్షల మంది వివాహితులు (పదేళ్ళ లోపు), అందులో 10 లక్షల మంది విధవలు, ఇంకా వర్ణ వివక్షత, నిరక్షరాస్యత మొదలైనవి రాజ్యమేలుతున్న తరుణంలో బ్రిటిష్ వారి పాలన వాటిని రూపుమాపటానికి పూనుకున్నది.ఇంకా నీటిపారుదల సౌకర్యాలు (సుక్కూర్ బారేజ్ వల్ల 2 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం), టెలిగ్రాఫ్, టెలిఫోను, పోస్టల్ వ్యవస్థ, రైలు రవాణా సౌకర్యాలు వంటివి బ్రిటిష్ హయాంలో జరిగాయి. భారతదేశం నుంచి తరలించ బడ్ద సొమ్ము, కేవలం బ్రిటిష్ వారు భారతదేశంలో పెట్టిన పెట్టుబడికి నామమాత్రపు వడ్డీ మాత్రమే.భారతదేశం ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది.

అందుకే హోం రూలు సాధ్యపడదు.

భారతదేశపు సమాధానం అన్న ప్రకరణంలో – బ్రిటిష్ వారు, ఆ మాటకొస్తే, మరే దేశస్థులు, మూఢ నమ్మకాలలో తీసిపోరని, Idiot Man అన్న ప్రొఫెసర్ రిచెట్ పుస్తకాన్ని ఉటంకిస్తారు రచయిత. ఏటా కాళి కి ఇచ్చే బలుల కన్నా, చికాగోలో వధింపబడుతున్న పశువుల సంఖ్యే అధికం. వివక్షత విషయానికి వస్తే, వివక్షత ఎక్క్డడ లేదు? ఓ నల్లవాడికి, తెల్లవాడికి, అలాగే ఓ బ్రిటిష్ అధికారికి, మామూలు ఉద్యోగికి మధ్య, ఓ యూరోపియన్ కు ఓ ఆసియా వాడికి మధ్య ఉన్నదేమిటి?అలాగే 15 లక్షల మంది చిన్న పిల్లలు అమెరికా కర్మాగారాలలో పనిచేస్తున్నారు. వారిని పోలిస్తే, శిశు వివాహాల విషయమే పాటి? ప్రతి నాగరికతలోనూ తప్పొప్పులు సహజం. తప్పులను మాత్రమే వెతకటం కుత్సితత్వాన్ని తప్ప, విశాలత్వాన్ని సూచించదు. అలాగే మూఢ నమ్మకాల మీద, విధవా పునర్వివాహాల మీద బ్రిటిష్ వారికన్నా ముందు గళమెత్తిన వారు బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వారు.

ఇక పుస్తకం చివర ముగింపులో సూత్రీకరిస్తూ, గాంధీ, ఠాగూర్, జగదీశ్ చంద్రబోస్, సరోజిని నాయుడు వంటి వ్యక్తులు జన్మించిన దేశం దాస్యంలో మగ్గటం బాధాకరమని, హోం రూల్ భారతదేశానికి న్యాయమేనని, అయితే బ్రిటిష్ వారు ఆ తర్వాత కూడా న్యాయమైన పద్ధతిలో వ్యాపారం కొనసాగించవచ్చనీ చెబుతారు రచయిత.

ఈ పుస్తకానికి విశ్వకవి ఠాగూర్ వ్యాఖ్య వ్రాశారు (చివరి అట్టపై).

ఈ పుస్తకం UK లో నిషేధించబడింది(ట).  స్ట్రాండ్ బుక్ స్టాల్ వారి ప్రచురణ ఇది.About the Author(s)

రవి16 Comments


 1. […] ఏం తెలీకుండానే పుస్తకం కొనేశాను – విల్ డ్యూరంట్ ’ఎ కేస్ ఫర్ ఇండియా’ వేసిన స్ట్రాండ్ వారు వేశారంటే, ఈ […]


 2. […] పుస్తకం అది. విల్ డ్యూరాంట్ రాసిన A Case for India అన్నది. అదే ఊపులో మరో పుస్తకం “The Men who […]


 3. సౌమ్య గారు, మీరు తప్పక వ్యాసం రాయండి. ఈ పుస్తకం చదవకపోయినా, మరింత మంచి insight పాఠకులకు దొరుకుతుంది. అలానే మొదటి సారిగా పుస్తకంలో ఒకే పుస్తకానికి ఇద్దరు పరిచయం రాసే పద్ధతికి శ్రీకారం చుట్టినట్టూ ఉంటుంది. 🙂


 4. సౌమ్య

  Hmm… పుస్తకం చాలా బాలన్స్డ్ గా రాసారు. దాని గురించి ఎటువంటి సందేహమూ లేదు! నేనింకా ఈ పుస్తకం గురించి పుస్తకం లో రాయాలా వద్దా అన్నది ఆలోచిస్తూ ఉన్నాను 🙂 సామాన్య పాఠకుల జనాభా లెక్కలోకే వస్తా కనుక, నా వ్యాసం కూడా ఇంచు మించు ఇలాగే ఉండొచ్చని ఆలోచిస్తున్నా….


 5. […] నాన్నగారు. ఈమధ్య విల్ డ్యూరంట్ రాసిన “A case for India” ప్రచురించాము. దీని వెనుక ఓ కథ ఉంది. […]


 6. kvrn

  it is wonderful book by a great historian. I thank Ravi garu for his beautiful introduction. is it still banned in England?


 7. చదవాల్సిన పుస్తకం! పరిచయం చేసినందుకు నెనర్లు!


 8. Gopalam గారు,

  వివక్ష – నామవాచకం (noun)
  వివక్షత – క్రియ (verb).


 9. Gopalam

  Kindly pardon my typing error in the comment. Bhashaభాష.


 10. Gopalam

  అభినివేశం భాశలో, పరిచయం భాషతో ఉంటాయి.

  వివక్షకు వివక్షతకూ తేడా ఏమిటి?

  I am not trying to find faults.
  I am expressing general doubts!
  Language is being treated very unkindly, particularly on the net and TV!!
  That is my anguish!
  I may be wrong with the to references mentioned above in Telugu.
  Kindly let me know!


 11. వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు.

  రేరాజ్ గారు,

  “కానీ పెద్దగా ఎక్కువమంది చూసినట్టు లేదు”.

  వ్యాసమా? పుస్తకమా? వ్యాసమయితే దానికి ఇంకా సమయం ఉందనుకుంటున్నాను.

  పుస్తకం అయితే, దానికి కొన్ని obvious reasons. 1. ఈ పుస్తకం 1929 లో వ్రాయబడింది. పైగా UK లో నిషేధం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడా ఆ పుస్తకాన్ని రానీయకుండా చేసి ఉండవచ్చు. అప్పట్లో అమెరికన్ పుస్తకాన్ని, భారతీయులు చదివే అవకాశం దుర్లభం. కానీ ఈ పుస్తకాన్ని గాంధీ, ఠాగూర్ వంటి వారు చదివారు.

  ఇక పోతే, ఈ రచయితకు అమెరికన్ ప్రభుత్వం “మెడల్ ఆఫ్ ఫ్రీడం” (అత్యున్నత అవార్డు) తో సత్కరించింది. ఈ రచయిత చాలా గొప్ప చరిత్రకారుడు, మానవతా వాది, తాత్వికుడు.


 12. బాలెన్స్ గానే పుస్తకమూ ఉన్నట్టుంది -మీ వ్యాసం ఉన్నట్టే ఉంది; ఫైనల్ గా అది భారతీయులనే సమర్ధించింది కాబట్టి,బ్రిటీష్ వారు బ్యాన్ చేసినా చేసి ఉంటారు.నా కైతే బానే ఉంది.

  కానీ పెద్దగా ఎక్కువమంది చూసినట్టు లేదు!

  If may say one more para :
  చరిత్రలో “X” వర్గాలవారు, “ఫలాన” వాళ్ళని అణిచివేశారు అని చదువుతాము; అది కేవలం ఓ చరిత్రకారుని భాష. ఆ రోజుల్లోనూ, ఆ “X” వర్గం వారిలో , ’ మా వల్లనే “ఫలాన” వాళ్ళు అణచ బడుతున్నారు ’ అని అందరూ తెలుసుకోరు. ఎవరో కొందరు “X” వర్గంవారు ఆ విషయం గ్రహించి, అది తమ స్వార్ధానికి వాడుకోకుండా, వారే “ఫలాన” వారి తరఫున పోరాడి, బాలెన్స్ ని తిరిగి కాపాడుతూ వచ్చారు; అణిచివేయబడ్డ “ఫలాన” వారిలోనూ కొందరు, ఆ అణచివేతని గుర్తించి, ప్రతిఘటించి, తమ వారి దాస్య శృంఖలాలు తెంచేందుకు ప్రాణాలు సైతం బలి ఇచ్చారు; వీరిద్దరూ కాక, మధ్య మధ్యలో వేరే ఎవరో ఏ “గన్నాయి” గాడిగానో వచ్చి, అదే నిస్వార్ధంతో “ఫలాన” వారి తరఫున నిలబడి పోరాడిన వారూ ఉన్నారు; అదీ చరిత్ర! – కాలగమనంలో, ఒకోసారి “గన్నాయి” వర్గంవాళ్ళూ ఆయా పరిస్థితులని, తమ స్వార్ధాలకి వాడుకోవటం కలదు.

  అందుకే ఇప్పుడు “జరుగుతున్న చరిత్ర” లో, “అణచివేత” ఏ రూపాల్లో ఉందో తెలుసుకోవటం చాలా అవసరం.

  థాంక్యూ.


 13. Purnima

  చదవాల్సిన పుస్తకం! పరిచయం చేసినందుకు నెనర్లు!


 14. sam

  very thank you for introducing a great book.


 15. Interesting. చదవాల్సిన పుస్తకమన్నమాట.


 16. Kumar

  Thank you very much  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1