You can quote me on that!

You can quote me on that
-Greatest Tennis quips, insights and zingers
by Paul Fein
Publishers: Potomac Books Inc, USA
ISBN: 1-57488-925-7

ఈ పుస్తకం ఒక టెన్నిస్ జర్నలిస్టు కూర్చిన సంకలనం. ఇందులో వివిధ సందర్భాల్లో వివిధ టెన్నిస్ తారలు ఇచ్చిన స్టేట్మెంట్లు, పరస్పరారోపణలు, ఆట గురించి అభిప్రాయాలు, వ్యక్తిగతాలు – ఇలా రకరకాల “కొటేషన్లు” ఉన్నాయి. ఇలా ఏళ్ళ తరబడి వివిధ పత్రికల నుండీ, చాణెళ్ళ నుండీ వారి రికార్డుల నుండీ కొన్ని వేల కొటేషన్లు సేకరించి, వాటిని చక్కగా శ్రమ కోర్చి వర్గీకరించారు. అంతే. టూకీగా ఇదే ఆ పుస్తక పరిచయం.

అయితే, జాన్ మెకన్రో, జిం కొరియర్, జిమ్మీ కానర్స్, బోరిస్ బెకర్, బోర్గ్ -ఇలాంటి వారు ఉన్నంత సేపూ వివాదాస్పద వ్యాఖ్యలకీ కొదువలేదు, వాటి ద్వారా కలిగే కాలక్షేపానికీ కొదువలేదు. కనుక, కాసేపు సంబంధిత విభాగం తెరిచి చదివితే చాలు ;). నేను టెన్నిస్ చూడ్డం మొదలుపెట్టే నాటికి ‘జెంటిల్మెన్’ సంప్రాస్ నా హీరో. కనుక, అతనికి ముందు తరంలో, ముఖ్యంగా మెకెన్రో లాంటి ఆటగాడు కోర్టులో ఇంత అతిశయంగా, ఇంత అసహనంగా ప్రవర్తించేవాడు అని తెలిసి ఆశ్చర్యపోయాను. అలాగే, అప్పట్లో హిందూలో మెకన్రో వ్యాసాలు వచ్చేవి అప్పుడప్పుడూ. దానికి తోడుగా మెకెన్రో నవ్వుతున్న ఫొటో ఒకటి ఉండేది. నా మనసులో మెకెన్రో అంటే అదే ముద్ర పడిపోయింది. ఒక్క దెబ్బతో మెకన్రో అంటే నా మనసులో ఉన్న ముద్ర మారిపోయింది! :))

అలాగని, ఈ పుస్తకం లో ఇలాంటి కబుర్లు తప్ప వేరే ఏం లేవు అనుకునేరు! చాలా ఉంది. గొప్ప క్రీడాకారులు చెప్పిన జీవిత సత్యాలున్నాయి. కొంతమంది పాతతరం క్రీడాకారుల, క్రీడాకారిణుల జీవిత విశేషాల గురించి ఉన్నాయి. బిల్లీ జీన్ కింగ్, రాయ్ ఎమర్సన్ ఇలా ఆనాటి వాళ్ళ నుండి, మొన్న మొన్నటి జెనిఫర్ కాప్రియాతి వరకు ఆసక్తికరమైన కథనాలు కొన్ని ఉన్నాయి. కాప్రియాతి క్రీడాజీవితం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఒక బాల తారగా దూసుకొచ్చి, వ్యసనాలకి బానిసై పాతాళం చేరుకుని, కొన్నేళ్ళ తరువాత మళ్ళీ గెలిచింది. అయితే, ఈ పుస్తకంలో ఆమె వివిధ దశల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు ఒక చోట చదవడం వల్ల, మరోసారి ఇదంతా గుర్తొచ్చింది. అన్నా కౌర్నికోవా వార్తా విశేషాలు కూడా ఉన్నాయి. ఇవి చదువుతూ ఉంటే, అప్పట్లో మరో రష్యన్ తార – ’నాకు అన్నా కౌర్నికోవా అవ్వాలని లేదు, గెలవాలని ఉంది’ అనడం గుర్తొచ్చింది. కాసేపటికి ఆ స్టేట్మెంట్ కూడా ఇందులో కనిపించింది! ఈ పుస్తకం బహుశా 2003 లో వచ్చిందనుకుంటా. ఫెదరర్ ప్రస్తావన నామమాత్రంగా ఉంది. ఇక ప్రస్తుతపు స్టార్ల ప్రస్తావనే లేదు. విలియమ్స్ సోదరీమణులు-మార్టినా హింగిస్ ఈ కాలం నాటి కథలైతే చాలానే ఉన్నాయి.అలాగే, బిల్లీ జీన్ కింగ్, మార్టినా నవ్రాతిలోవా వంటి వారి గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ఇది కాక, టెన్నిస్ చరిత్రలో కొంతమంది ఇదివరలో నేను వినని వారి గురించి కూడా కొన్ని కథలు తెల్సుకున్నాను.

మీకు టెన్నిస్ అంటే ఆసక్తి ఉంటే ఈ పుస్తకం చదవడం తప్పనిసరి. అయితే, ఇది ఏకబిగిన చదివే తరహాది కాదు..కొటేషన్ల సంకలనం కనుక. అప్పూడప్పుడూ అలా తిరగేస్తూ ఉంటే, బోరు కొట్టదు, ఎప్పటికీ. పైగా, ఈ పుస్తకంలో దాదాపు టెన్నిస్ పై వచ్చిన అన్ని పుస్తకాల ప్రస్తావనా వచ్చేసినట్లుంది. కనుక, వాటి గురించి కూడా తెలుస్తుంది. కొంతమంది వాళ్ళ ఆత్మకథలు రాసారన్న విషయం కూడా నాకు ఇది చదువుతూంటేనే తెలిసింది.

ఇలాగే తెలిసిన ఒకట్రెండు విషయాలు:
“Helen Wills Moody, who during the zenith of her brilliant career, from 1927 to 1933, not only won every match she played—158 straight— but also every set to achieve the perfection she coveted.”
-అద్భుతం! చదువుతూంటేనే వావ్! అనిపిస్తోంది!

“Margaret Court, who captured a record sixty-two Grand Slam titles in singles, doubles, and mixed doubles between 1960 and 1975.”

-పదిహేనేళ్ళలో అరవై రెండు టైటిళ్ళా!

పుస్తకం నుండి కొన్ని కొటేషన్లు:


“Unlike other sports, in tennis if you are getting killed, you are expected to stay out there and continue to get killed.”

—Actor and comedian Bill Cosby

“He has that comfortable middle-class look about him. The English middle class basically don’t have the stomach for a fight.” —1987 Wimbledon champion Pat Cash, on why he thinks Tim Henman lacks the right stuff to win a major tournament, in the New York Times Magazine (2002)
(ఇది మాతరం నిజమండోయ్! పాపం బ్రిటన్లు మాత్రం ప్రతిసారి టిం హెన్మన్ గెలుస్తాడనే అనుకునేవారుగా అప్పట్లో!)

“I would never feel like I could have a relationship with a person I’m in competition against that would allow them to understand me completely. You’re always guarded.”
—Andre Agassi, explaining why he can’t be friends with Pete Sampras

“The Steffi Graf era is over.”
—German Davis Cup coach Boris Breskvar, after unseeded Lori McNeil upset Graf in the first round at Wimbledon. Graf went on to win seven
more Grand Slam titles. (1994)

“If I ever lost to a fourteen- or fifteen-year-old, I’d die right on the court.”
—Pam Shriver, before losing to fourteen-year-old Gabriela Sabatini at the Family Circle Cup (1985)

“Tracy, I want you to know that I’m going to be much more famous than you.”
—Pete Sampras, age ten, to Tracy Austin at their club in Los Angeles, after she won her second U.S. Open title (1981)

“Sports for me is when a guy walks off the court, and you really can’t tell whether he won or lost, when he carries himself with pride either way.”
—Jim Courier

“I like it, but I miss my puppy back in Florida.”
—Fourteen-year-old Jennifer Capriati, asked if she liked Wimbledon (1990)

“How old do you have to be before people forgive you for your past?”

-Andre Agassi, a changed man at thirty-one (2001)

“A woman’s place is in the bedroom and in the kitchen, in that order.”
—Male chauvinist and tennis hustler Bobby Riggs, before losing to Billie Jean King in their “Battle of the Sexes” at the Houston Astrodome (1973)

ఫ్లిప్కార్ట్ కొనుగోలు లంకె ఇక్కడ.
పుస్తకం మీకు ఆన్లైన్ లో ఎక్కడన్నా దొరకొచ్చు, ప్రయత్నించండి. 😉

You Might Also Like

Leave a Reply