అనగనగా Sam Manekshaw అనే ఒక లీడర్..

సాం మానెక్షా (Sam Manekshaw) అన్న పేరు గూగుల్ చేస్తే, అరక్షణంలో ఆయనెవరో తెల్సిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేశారనో, 1971లో జరిగిన బాంగ్లా యుద్ధానికి నాయకత్వం వహించారనో, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ అనో పరిచయ వాక్యాలు కనిపిస్తాయి. ఇంకాసేపు ఓపిగ్గా అన్వేషిస్తే ఆయనకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుస్తాయి – యుద్ధం ప్రారంభించడానికి ప్రతికూల అంశాలను ఇందిర గాంధికి వివరించడంలో చూపించిన నేర్పు, ఆయన మరణించినప్పుడు వచ్చిన కథనాలు కనిపించచ్చు. వాటిని చదివి, ఆయన గురించి చదవాలన్న ఆసక్తి హెచ్చి, ఆర్నెళ్ళు కష్టపడి, కష్టపెట్టి సాధించుకున్న పుస్తకం “Field Marshall Sam Manekshaw: Soldiering with Dignity.”

పుస్తకంలో ఏముంది?

పుస్తకం కొనేముందు అందులో ఏముందో తెల్సుకోవడం మంచిది. కాని నాకీ పుస్తకం గురించి ఎక్కడా పెద్దగా వివరాలు దొరకలేదు: పుస్తకం పేరు, రచయిత పేరు తక్క!

మామూలుగా జీవిత చరిత్రలు మొదలైనట్టే ఈ పుస్తకం కూడా సాం కుటుంబ నేపథ్యం, ఆయన పుట్టుక, విద్యాభ్యాసం, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు వంటి విషయాల నుండే మొదలయ్యింది. ఈ విశేషాలన్నింటిన్నీ చాలా టూకీగా పరిచయం చేశారనిపించింది.

ఈ పుస్తకాన్ని ముఖ్యంగా రెండు భాగాలుగా విడదీయవచ్చు. ఒకటి బాంగ్లా యుద్ధ సన్నాహాలు, యుద్ధ సమయం. రెండు- ఉద్యోగ పర్వంలో తక్కిన రోజులు. చివరాఖరున పలు వేదికలపై సాం ఇచ్చిన ప్రసంగాలనూ ప్రచురించారు. మధ్యమధ్యన కొన్ని ఫోటోలు.

పుస్తకం ఉపోద్గాతంలోనే సాం ఆర్మీ చీఫ్ గా ఉన్న కాలంలో ఆయనకు మిలిటరీ అసిస్టెంట్ గా పని చేసిన దీపిందర్ సింగ్ ఈ పుస్తకాన్ని రచించారు. “ఆయనతో కలిసి పని చెయ్యటం వల్ల నాకు పరిచయమైన సాం గురించి ఈ పుస్తకంలో రాసాను” అని ముందుగానే రాసారు. “Military Assistant to the Army Chief”, “Travelling with the Chief” లాంటి శీర్షికలు ఆ వాక్యాన్ని నిర్ధారిస్తాయి.

“Prelude to War”, “The War” అనే రెండు ఛాప్టర్లూ ఈ పుస్తకానికి ఆయువుపట్టు. పేర్లు సూచించినట్టే, ఇవి బాంగ్లా యుద్ధానికి సంబంధించినవి. బాంగ్లా యుద్ధాన్ని ఒక ఉన్నత పదవి కలిగిన వ్యక్తి దృష్టి నుండి చూసే వీలు కల్పిస్తుంది. అంటే, యుద్ధంలో ముఖ్యంగా రెండు భాగాలుంటాయనుకుంటే – ఒకటి: ప్రణాళిక, రెండు: కార్యనిర్వహణ, ఈ పుస్తకం ద్వారా మనకి బాంగ్లా యుద్ధంలో విజయం సాధించటానికి సైనికుల సాహసకృత్యాలు గురించి తెల్సేది తక్కువ. విజయానికి మరే ఇతర అంశాలు తోడ్పడ్డాయో వివరంగా తెలుస్తుంది.

పుస్తకం ద్వారా తెల్సే విషయాలు:

పుస్తకం చివర్లో సాం ప్రసంగాలు కొన్ని ఇచ్చారని చెప్పాను కదా! వాటిల్లో ఒకదానిలో ఆయన “లీడర్”కి కావాల్సిన ముఖ్య లక్షణాల గురించి వివరిస్తారు. వాటిని ఆధారంగా తీసుకొనే ఈ పుస్తకం ద్వారా సాం నాయకత్వం ఎంతవరకూ తెలుస్తుందో చూద్దాం.

నాయకులు పుట్టరు, వారిని తయారుచేసుకోవచ్చునని సాం నమ్మిక. అందుకు ఆయన చూపించే ముఖ్య కారణం – లీడర్‍కి తాను పనిచేస్తున్న రంగంలో టెక్నికల్ / వృత్తిపరమైన జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. ఎవరూ ఈ జ్ఞానంతో పుట్టరు. దీన్ని క్రమక్రమంగా అలవరచుకోవాలి. సాం విషయం తీసుకుంటే, ఆయన ఎప్పటికప్పుడు తన మిలిటరీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోడానికే ప్రయత్నించారు. విదేశీ పర్యటనలలో మనకి అనుకూలించే విషయాలను సంగ్రహించి, వాటిని అమలుపర్చడానికి ప్రయత్నించారు. బాంగ్లా యుద్ధ సమయంలో కూడా అందరూ తూర్పు వైపు సరిహద్దుల్లో యుద్ధం చేస్తే చాలుననుకున్నారు. కాని సాం, అందరినీ ఒప్పించి తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‍తో పోరాటానికి పూర్తిగా సిద్ధపడి, చైనా యుద్ధంలో చేరడానికి వీలులేని కాలాన్ని యుద్ధానికి ఎంచుకున్నారు. కాల్పులు జరిగిన వెంటనే వచ్చే సమాచారం బట్టి సైనికులను వెనక్కి పిలిపించటం తగదని నిర్ణయించటంలోనూ యుద్ధ పరిజ్ఞానం కనబరిచారు.

లీడర్ కి కావాల్సిన మరో ముఖ్య లక్షణం, క్షణాల్లో నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉండి, ఆ పైన పర్యవసనాలకి పూర్తి బాధ్యతను వహించటం. దేశ ప్రధాని, మిలిటరీ చీఫ్ ని పిల్చి, పరిస్థితులను వివరించి “ఇక యుద్ధం ప్రకటించాల్సిందే..” అన్న ఉద్దేశ్యంలో ఉన్నప్పుడు, “కుదరదు. ఇప్పుడు గాని మనం యుద్ధం చేస్తే చిత్తుగా ఓడిపోతాం. నాకు కాస్త సమయం ఇస్తే కావాల్సిన ఫలితాలను పొందచ్చు” అని చెప్పే ధైర్యం సాంకి ఉంది. ఒక వేళ ఇందిర గాంధి, సాం సూచనని తిరస్కరించుంటే, ఆయన రాజీనామా చేసుండేవారేమో. ఒక పనిని అప్పగించే ముందు ఆ వ్యక్తిపై పూర్తి నమ్మకం పెట్టి, కార్యనిర్వహణ అంతా ఆయనకే వదిలేయటం కూడా ఇందిర గాంధిలో మెచ్చుకోవాల్సిన లక్షణమే!  (బాంగ్లా యుద్ధం ముందు, సాం, ఇందిరల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను ఈ పుస్తకంలో రెండు ముక్కల్లో తేల్చేయడం నాకు నిరాశ కలిగించింది. చివర్లో ఆయన ఇచ్చిన ప్రసంగంలో ఆ సంభాషణ ఉండటం, ఊరటనిచ్చింది.)

నాయకుడుకి ఉండాల్సిన మరో లక్షణం, నిజాయితీ, పక్షపాతరహిత వైఖరి. ప్రధాని యుద్ధ ప్రతిపాదనను తిరస్కరిస్తూ అప్పటి పరిస్థితులని వివరించడంలోనే కాక, ఆయన పదవీకాలంలో సైనికులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన చాలా నిజాయితీతో వ్యవహరించినట్టు కొన్ని సంఘటనలను పేర్కొన్నారు. ధైర్యంతో వ్యవహరించటానికి మానసిక, శారీరక బలం ఉండాలని ఆయన సూచించారు. ప్రపంచ యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనీ, కొన్ని వివాదాల్లో చిక్కుకొన్నప్పుడు వాటిని ఎదుర్కొని నిలవగలిగారనీ చూచాయిగా చెప్పటం తప్పించి, పెద్దగా ఏమీ లేదు.

పుస్తకంలో సాం నాయకత్వంలో రెండు అంశాలు ప్రస్పుటమవుతాయి. ఒకటి: యుద్ధేతర సమయంలో ఆయన సైనికుల శ్రేయస్సుకోరి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు. రెండు: యుద్ధ సమయంలో సైనికుల మనోబలాన్ని పెంపొందించే విధంగా వ్యవహరించటం. ప్రతి కాంపుకి వెళ్లి ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు చేయడమే కాక, యుద్ధ ప్రణాళికా పరంగా కూడా సైనికులకు తగిన వనరులు సమకూర్చటంలో కూడా శ్రద్ధవహించారు. యుద్ధానంతరం సైనికుల సహాయనిధికి వీలైనన్ని విరాళాలు వచ్చేలా చూశారు.

నిరాశపరిచిన అంశాలు:

౧. ఈ పుస్తకం శీర్షిక “సాం మెనెక్షాతో నేను” అన్నట్టుగా ఉంటే బాగుండేది. దీన్ని సాం జీవిత చరిత్ర అనడానికి వీలు లేదు. కనీసం, నేను అలా అనుకోను. ఆయన జీవిత విశేషాలను కొన్నింటిని తెలియజేస్తుంది, అది కూడా ఆయనకు అత్యంత సన్నిహిత సహచరుని అనుభవాలుగా.
౨. సాం జీవితంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నట్టు చదివాను. ఆయన వ్యవహార తీరు వల్ల కూడా కొన్ని వివాదాలు కలిగేవట. వాటిని గురించి ఈ రచనలో పూర్తిగా దాటవేశారు.
౩. రచనను కొన్ని ఛాప్టర్లుగా విడదీసి, వాటికి పేర్లు పెట్టినా,  పేరుకు తగ్గట్టు విషయాన్ని ఉంచడంలో విఫలమయ్యారు. అంతే కాక, కొన్ని చోట్ల పేరా పేరాకి కూడా సంబంధం లేనట్టుగా అనిపించింది. మధ్యమధ్యన అసందర్భ ప్రస్తావనలు చిరాకు పుట్టించాయి.

ఎందుకు చదవాలీ పుస్తకం?

కొన్ని పదాలను చూస్తుంటే జాలేస్తుంటుంది. వాటికున్న అర్థం ఒకటి, వాటిని వాడే అర్థం వేరొకటి. తెలుగు సినిమా ఇండస్ట్రీ “డిఫెరెంట్” అనే ఆంగ్ల పదాన్ని పొట్టనుబెట్టుకుంది. క్రికెట్ ఆట నెగ్గడానికి చివరి బంతిలో రెండు, మూడు పరుగులు కొట్టినవాడు కూడా “గ్రేట్” అని పిలవబడే ఈ కాలంలో “గ్రేట్” గ్రేట్నెస్ పోయింది. లీడర్ అన్న పదం కూడా అలాంటిదే. భారతదేశంలో అనేకానేకమైన కరువుల్లో నాయకత్వ-లేమి ఒకటి. లీడర్ అన్న పదాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం అనిపిస్తోంది.

చంద్రగుప్త మౌర్య నాయకత్వాన, ౩౦౩ బి.సి. లో గెలిచిన యుద్ధం తర్వాత, భారతదేశం ఒక first-class-enemy పై జయభేరి మోగించింది 1971 బంగ్లా యుద్ధంలోనే. ఆ యుద్ధానికి నాయకత్వం వహించిన మనిషి గురించి తెల్సుకోవడానికి పుస్తక రూపంలో ఉన్న అవకాశం ఇదొక్కటేననుకుంటాను. అందుకు చదవాలి.

(సాం గురించి ఇవి కాక, వేరే పుస్తకాలుంటే తెలుపుగలరు.)

పుస్తక వివరాలు:
Field Marshal Sam Manekshaw: Soldiering with Dignity
Author: Lieutenant General Depinder Singh, PVSM, VSM
Publishers: Nataraj Publishers, New Delhi
Cost: Rs 450

You Might Also Like

5 Comments

  1. srisri

    telugu lo unte vivaraalu naa mail ki pampinchandi plz…..e books kaakunda…inka telugu lo ki anuvadinchina books yevi unna naaku mail ki msg cheyandi plz frnds…

  2. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు

    […] ఫ్రెండ్ వంశీ ఏమో సామ్ మెనెక్షా గురించి పరిచయం చేసి వదిలేసాడు. వెతగ్గా ఆయనపై […]

  3. HalleY

    “చంద్రగుప్త మౌర్య నాయకత్వాన, ౩౦౩ బి.సి. లో గెలిచిన యుద్ధం తర్వాత, భారతదేశం ఒక first-class-enemy పై జయభేరి మోగించింది 1971 బంగ్లా యుద్ధంలోనే.”

    మరి మేజర్ జెనరల్ మహాత్మా గాంధీ నాయకత్వంలో చేసిన యుద్దం ? 😀

  4. Purnima

    @sujata: Can you please let me know what is “it”? I want to be amused too.. 🙂

  5. sujata

    ha ha ha .

    Its just army lingo poornima. Its aaalrighto (alright) for now.

    Good job.

Leave a Reply