పిల్లల పుస్తకాలు కొన్ని..

వ్యాసం రాసినవారు: ప్రియాంక

మనం ఎంతో వేచి చూస్తున్న వేసవి సెలవలు వచ్చేసాయి. చాలా మంది ఊర్లకి వెళ్తారు. అది కాకుండా ఇంకా ఏమి చేద్దాం అనుకుంటున్నారు ? Summer Classes , arts and crafts lessons ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి అన్ని కాకుండా “Summer Reading ” అన్న మాట వినే ఉంటారు. ఈ వేసవి సెలవులలో ఎన్నెన్ని చదవ గలిగితే అన్ని పుస్తకాలని చదవటానికి మంచి సమయం. అస్సలు పుస్తకాలు చదవటం వల్లన వచ్చే ఉపయోగాలు ఏమిటి ? పెద్దలు కొన్ని లక్షల ఉపయోగాలు చెప్పారు. దాంట్లో నాకు బాగా నచ్చిన quote , “బుక్స్ ఓపెన్ యువర్ మైండ్, బ్రోడెన్ యువర్ మైండ్ అండ్ స్త్రెంగ్తెన్ యూ ఆస్ నథింగ్ కాన్”. (Books open your mind, broaden your mind, and strengthen you as nothing else can”).

సరే, మనం ఒక పుస్తకాల షాప్ కి వెళ్తాము పుస్తకాల కోసం. కానీ ఏ పుస్తకాలు చదివితే మంచిది, ఏ పుస్తకం ఎందుకు చదవాలి అన్నది తెలుసుకోవడం చాలా కష్టం. మనకి ఎవరన్నా సలహా ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాము. అందుకని, పిల్లల వయసు వారిగా ఇక్కడ మేము ఒక లిస్టు తయారు చేసాము.

Enid Blyton Series
Ages 7 yrs to 15 yrs:

Enid Blyton అనే రచయిత్రి కొన్ని వేల పుస్తకాలు వ్రాసారు. ఇప్పుడే చదవటం మొదలు పెట్టిన ఫస్ట్ గ్రేడర్స్ నించి పదిహేను ఏళ్ళ వాళ్ళ వరకు చదవగలిగే కథలు. ఆవిడ వ్రాసిన కథలలో మామూలు కథలు ఉన్నాయి కానీ చాలా వరకు mysteries, adventures ఉన్నాయి. ఎనిడ్ వ్రాసిన సీరీస్ లలో Famous Five అన్నది చాలా పేరు ఉన్న సీరీస్. ఒక ఐదు మంది పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్న mysteries ని ఎలా పరిష్కరించారు అన్నది వీటి కథనం.

Nancy Drew Mysteries and Case Files

ఇవి కూడా మిస్టరీ అండ్ అడ్వెంచర్స్ కిందకే వస్తాయి. Famous five లో ఐదు మంది ఉంటే, దీంట్లో నాన్సీ డ్రూ అన్న అమ్మాయి lead character.

Mysteries ని చదవటం వల్ల ఇంగ్లీష్ లోని కొత్త కొత్త పదాలు తెలియటమే కాకుండా ఆ Famous Five or Nancy Drew చిక్కుముడులని ఎలా విప్పారు అని తెలుసుకోవటం ద్వారా పిల్లల మైండ్ కూడా షార్ప్ అయ్యి రెగ్యులర్ లైఫ్ లో కూడా అలా ఆలోచింపచేస్తుంది.

Magic School Bus Series
Age Group: 6 years to 9 years.

ఈ Magic School Bus series లో Ms. Frizzle అనే స్కూల్ టీచర్ ఒక ఎనిమిది మంది పిల్లలని తీసుకుని ఒక “మేజిక్ బస్సు” ఎక్కి సోలార్ సిస్టం (Solar System) కి, మంచం కిందకి ఇలా వేరు వేరు చోట్లకి తీసుకుని వెళ్లి కథల ద్వారా science ని నేర్పిస్తుంది.

Ruskin Bond Series
Age Group: 8 yrs and  above

Ruskin Bond ఎన్నో అవార్డ్స్ పొందిన ఇండియన్ రచయిత. ఇతను అన్ని రకాల పుస్తకాలని వ్రాసారు. జీవితచరిత్రలు , నాన్- ఫిక్షన్, ఫిక్షన్, నవలలు ఇలా అన్ని రకాల పుస్తకాలు వ్రాసారు. ఈయన  పుస్తకాలలో కథ జరిగిన ప్రదేశం యొక్క చెట్లు, చేమలు, అందాలు, పరిసరాలు అన్ని విపులీకరించి వ్రాస్తారు. హిమాలయాల గురించి ఆయన కళ్ళకి కట్టినట్టు గా చెప్పారు. అనుకున్న వెంటనే మనం వేర్వేరు ప్రదేశాలకి వెళ్ళలేము కాబట్టి ఇలాంటివి చదవటం వల్ల ఆ స్థలాల గురించి పిల్లలకి మనకి అవగాహన వస్తుంది.

Roald Dahl Series
Age Group: 3 yrs and above

Roald Dahl ఒక బ్రిటిష్ నవలా రచయిత, చిన్న కథల (short story ) రచయిత మరియు స్క్రీన్ రైటర్ . ఈయన పిల్ల పుస్తకాలు మరియు పెద్ద వాళ్ళ నవలలు కూడా వ్రాసారు. ఎన్నో అవార్డ్స్ గ్రహీత మరి వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత అనిపించుకున్నారు. అల్లరి పిల్లల కథలు, అడ్వెంచర్ కథలు , మంత్రగత్తె (witches ) కథలు, కామెడీ కథలు ఇలా రకరకాల కథావస్తువులతో వ్రాసారు. Roald Dahl రచన లో ఎన్నో కొత్త పదాలను ప్రయోగించారు. మాటలు నేర్చుకుంటున్న వాళ్ళు నోరు తిరగడానికి మరియు fun కోసం కూడా ఈయన పుస్తకాలని చాలా మెచ్చుకుంటారు.

Stuart Little by E.B. White

Age Group: 5 yrs to 8 yrs

ఈ కథ చాలా సరదాగా సాగుతుంది. స్టువర్ట్ లిటిల్ అనే ఎలుక ఎలా పిల్లులని ఎదుర్కొని నిలదొక్కుకుంది అనే కథ ని సినిమాగా కూడా తీసారు.

Titles

Jane Eyre by Charlotte Bronte
To Kill a Mockingbird, by Harper Lee

Frankenstein, by Mary Wollstonecraft Shelley
Lord of the Rings by J R R Tolkien

The Hobbit by J. R. R. Tolkien


Harry Potter సెరీస్
Horowitz: Alex Rider Adventure series


Adams: The Hitchhikers Guide To The Galaxy

Age Group: 10 yrs and above

ఈ పుస్తకాలలో కొన్ని మిస్టరీ, అడ్వెంచర్స్, బ్రిటిష్ వాళ్ళ క్లాసిక్స్ అన్ని ఉన్నాయి. వీటిని చదవటం ద్వారా ఆయా దేశాల వారి జానపద కథలు, సైన్సు adventure స్టోరీస్, అన్ని తెలుస్తాయి.

ఇంతవరకు మనం మామూలు కథల గురించి మాట్లాడుకున్నాము. ఎన్ని contemporary కథలు చదివినా, classics అన్నవి తప్పని సరిగా చదవాలి. వీటిని చదివితే అప్పటి కాలం లో పద్ధతులు ఎలా ఉండేవి, అప్పుడు ఎలాంటి బట్టలు వేసుకునేవారు, సొసైటీ ఎలా ఉండేది ఇలా విషయాలు తెలుస్తాయి. ఈ పుస్తకాలని చదివేము అంటే సన్నిహితులలో కూడా మంచి పేరు ఉంటుంది. 🙂

Classics అని అన్నా అవి కూడా కథలే. ఏదన్నా ఒకటే రకం పుస్తకాలని చదవటం వల్ల పూర్తి లాభం ఉండదు. పేరు తెచ్చుకున్న మనుషుల గురించి  చదివితే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటు వంటి పద్ధతులు ఆచరించడం ద్వారా వారు కోరుకున్న లక్ష్యాలను చేరుకున్నారు అని మనం కూడా తెలుసుకుని ఆచరణ పెట్టడానికి అవకాశం వస్తుంది. మీకు నచ్చి మెచ్చిన గొప్ప వాళ్ళ గురించి పుస్తకాలని తెచ్చి పెట్టండి. అన్ని వయసుల వారికి తగినట్టు గా ఉంటాయి.

డబ్బు అన్నది ఎంత ప్రధానమో మనకి అందరికి తెలిసినదే. దాని విలువ ఎంత చిన్నప్పటి నించి నేర్పించగలిగితే అంత మంచిది. రాబర్ట్ కియోసకి (Robert Kiyosaki) వ్రాసిన “రిచ్ డాడ్ పూర్ డాడ్” అన్న పుస్తకం చాలా మంచింది. పన్నెండు పదమూడు ఏళ్ళ పిల్లల దగ్గరనించి ఈ పుస్తకాన్ని అందరు చదవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అంతం అన్నది ఉండదు 🙂

You Might Also Like

2 Comments

  1. telugu4kids

    “ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అంతం అన్నది ఉండదు”
    ఇంకా చెప్ప్తే వినడానికి సిద్ధం. ఎంత ఎక్కువ చెపితే అంత మంచిది.
    magic school bus పుస్తకాలు మా పిల్లలు చదువుతారు.
    బావుంటాయి.
    Enid blyton, Nancy Drew చిన్నప్పుడు చదివాం.
    ఇక్కడ అవి దొర్కడం కష్టం. India నుంచే తెచ్చుకోవాలనుకుంటాను.
    ఇక్కడ వేరే సిరీస్ దొరుకుతాయి కాని చిన్నప్పుడు చదివినవే కావచ్చు, నిజంగా బావుంటాయి కాబట్టి కావచ్చ్చు. Enid Blyton పుస్తకాలే నచ్చుతాయి ఎక్కువ, నాకు.
    Stuart Little సినిమా కూడా తీశారనుకుంటాను. సరదాగా ఉంటుంది.
    The Hobbit మంచి పుస్తకం. కొంచెం పెద్ద పుస్తకమేమో కదూ, పెద్ద పిల్లలు చదవగలరేమో.
    Black Beauty కూడా ఇష్టంగా చదివారు.

    ఇక, నా గోడు నేను చెప్పకుండా ఉండను కదా…
    తెలుగండీ తెలుగు!!!

    మా పిల్లల English reading log తో పోటీ పడుతూ చదివించడానికి రోజుకో చందమామ కథ చదివి వినిపిస్తున్నాను.
    వాళ్ళ సెలవలకి ఇంకా నెల రోజులుంది. ఈ లోగా మంచివి చెబితే తెప్పించుకుంటాను. Please!
    రుషి బూక్ హౌసె వారివిట పరమానందయ్య శిష్యులు, రామాయణం ఉన్నాయి నా దగ్గర.
    బొమ్మలు, భాష బావున్నాయి. చిన్న పుస్తకాలు, చదవాలినిపించేలా ఉన్నాయి.
    పడాల రామారావు గారు రాసిన పంచతంత్రం కథల పుస్తకం మిగిలిన వాటికంటే నచ్చింది.
    ప్రతిభ పుబ్లికేషన్స్.
    బాలి బొమ్మలతో చందూ జోక్స్ పుస్తకం కూడా పిల్లలను ఏమిటా అది అని చదివేలా చెస్తుంది.
    బుడుగు పుస్తకం మా స్నేహితురాలి దగ్గర చూసాను. కొంటే బాగుంటుందేమో.
    ఇంకా చెప్తారు కదా?

  2. సౌమ్య

    🙂 Good collection for kids.

Leave a Reply