2009లో నా పుస్తకాలూ! – 1

Nani Palkhivala:

“GOWTHAM MODEL SCHOOLS – We create leaders!” – ఎఫ్. ఎం. లో తొలిసారిగా శ్రద్ధ పెట్టి విన్నప్పుడు “ఓహ్.. యు క్రియేట్ లీడర్స్?! ఇప్పటికి ఎంత మందిని క్రియేట్ చేశారు? అసలు లీడర్స్ అంటే ఎవరు? Are leaders born? Or can they be created? మన దేశంలో ఇప్పుడున్న లీడర్స్ ఎవరు? పదవులున్న వాళ్లంతా లీడర్సేనా?” అంటూ ఆపకుండా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. వాటికి ప్రశ్నలు వెత్తుక్కోడానికి మెదడు పాపం, కాస్త శ్రమ పడుతుంది అని స్ఫురించగానే చేతిలో రిమోట్ ద్వారా ఛానల్ ని మార్చినట్టు నా ఆలోచనల్నీ చట్టుక్కున మార్చేశాను. ఇప్పుడు “భారతదేశమూ – అందలి నాయకులూ” అన్న వ్యాసరచన పోటీకి ఏమీ వెళ్లడం లేదు కద అని మెదడుకి ముసుగు కప్పి పక్కకు పెట్టాను.

NaniPalkhivalaఅలా పక్కకి పెట్టేసిన మెదడుని ఎడా-పెడా, ఎటూ- ఇటూ బంతాట ఆడుకున్న మహానుభావుడు “నానీ పల్ఖివాలా”. నేనీ ఏడాది మొదట్లో “Two Alone – Two Together” అనే పుస్తకం చదవటం మొదలెట్టాను. అందులో నెహ్రూ- ఇందిరల మధ్య తమ జీవితకాలంలో రాసుకున్న ఉత్తరాలన్నీ ఉంటాయి. (దీనికి సోనియా గాంధీ ఏడిటర్). ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇందిరా గాంధీ పై శ్రేష్టమైన బయోగ్రఫీ ఏదో తెల్సుకోవాలన్న కుతూహలంలో ఒక ఫ్రెండ్ ని అడిగితే, ఆయన నాకు నానాభోయ్ గురించి పరిచయం చేశారు. డబ్భై, ఎనబ్భై దశకాల్లో ప్రతీ బడ్జెట్ సమావేశానికీ ఇద్దరి స్పీచుల కోసం భారతీయులు ఎదురుచూసేవారట! ఒకటేమో, ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశ పెట్టడం అయితే, రెండోది నానీగారి ఉపన్యాసం. వికీలో వీరిని గురించి చదివిన తర్వాత, ఫ్లిప్‍కార్ట్ పుణ్యమా అని ఆయనది “We, the Nation” అన్న పుస్తకం శ్రమ లేకుండానే దొరికేసింది. “We, the People” అనే ఈయన మరో రచన కూడా చదివాను.

చదవటం మొదలెట్టాక తెల్సొచ్చింది ఆయన పుస్తకాలంటే ఎలా ఉంటాయో, ఆయన మాటల్లో పదును ఎలాంటిదో. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ ఎలాంటిదో?! కాఫ్కాది ఒక కోట్ ఉంటుంది: A book should serve as the ax for the frozen sea within us. ఈయన పుస్తకాలు అలాంటి పనులే చేసి కూచుంటాయి. స్కూల్లలో, కాలేజీల్లో బలలెక్కి ఉపన్యాసాలు దంచి, ఏదో ఉద్దరించే తీరాలన్న తీర్మాలన్నీ ఉద్యోగం – బతుకు – బాధ్యతల బరువుతో అణగదొక్కేసి, స్నేహితులూ – సినిమాలూ అంటూ కాలం సాగదీస్తూ, దేశం ఉల్లిక్కిపడినప్పుడల్లా ఇరవై నాలుగు గంటల టీవీ ఛానళ్ళ ముందు నోరెళ్ళబెట్టుకొని చూస్తూ, మరో పక్కన బిపీ టాబ్లెట్లూ వేసుకొని ఏ తెల్లారు ఝామునో కునుకు తీసి,  పొద్దున్నే ఆదరాబాదర లేసి “మమల్ని ఎవరూ భయపెట్టలేరు” అనే డొంకతిరిగుడు కారణాలతో మభ్య పెట్టుకుంటూ షరా మామూలుగా రోజు గడిపేసే సగటు భారతీయుడిని నిలదీసి, నిక్కదీసి అడిగే వాక్యాలెన్నో ఉంటాయి ఈయన పుస్తకాల్లో. అసలు, ఈ సరికే నేనీ పుస్తకాలు సరిగ్గా పరిచయం చేసుండాల్సింది. తప్పక రాస్తాను, త్వరలో!

అనుకోకుండా ఓ పుస్తకాల కొట్టుకు వెళ్లినప్పుడు అనుకోకుండానే పల్ఖివాలా గారి బయోగ్రఫీ దొరికింది. ఇది ఎం.వి కామత్ గారు రచించారు. ఇందులో పల్ఖీవాలా జీవిత చిత్రంతో పాటు, ఆయన అనేక ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ప్రముఖులతో జరిగిన ప్రత్యుత్తరాలు కూడా పొందుపరిచారు. ఉదా: అప్పట్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని మార్చమని అడిగినప్పుడు ఆయన మధ్యా, మన్మోహన్ సింగ్ గారి మధ్య ఉత్తరాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయాలెన్నో తెలుస్తాయి.

You Might Also Like

6 Comments

  1. Purnima

    Wow! Rushdie speaking on Calvino’s Cosmicomics.. can’t get better..

    http://www.npr.org/templates/story/story.php?storyId=93376041

    I quote:

    “If you have never read Cosmicomics, you have before you 12 of the most joyful reading experiences of your life.”

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! […]

  3. రామ

    చాలా బాగుంది. మీరు చదివిన పుస్తకాల మాటేమో కాని, మీ సమీక్షలు చాలా తొందరగా చదివించాయి. తరవాతి పేజి నెంబర్ మీద నొక్కి, “ఇంకా లోడ్ అవదు ఏమిటిరా బాబూ” అనుకున్నా రెండు సార్లు :). విపులం గా వ్రాసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో నాకు రెఫెరెన్సు గా తప్పక పనికి వస్తుంది ఈ లిస్టు (మొన్న చదివిన జంపాల గారి లిస్టు కూడా – ఇవన్నీ చూస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం లో ఎన్ని చెయ్యచ్చో తెలుస్తోంది – కొండొకచో కిందటి ఏడాది నేను ఏమి చేసి ఉండల్సిందో కూడా).

  4. Rao S Vummethala

    Nice article. The author successfully takes along with her. Good work.
    Keep it up Poornima garu!

  5. సౌమ్య

    Good article!!

Leave a Reply