2009లో నా పుస్తకాలూ! – 1

2009లో నా పుస్తక పఠన విశేషాలను పంచుకునే ప్రయత్నం. పుస్తకం.నెట్ అనే బాధ్యత ఉంది కాబట్టి, ఏడాది మొదట్లో “పుస్తకం కోసమైనా ఎక్కువ రాయాలి” అనుకున్నాను. కానీ పుస్తకం బాధ్యత అందరూ తలా కొంచెం తీసుకొనేసరికి నాలోని బద్ధకం తారాస్థాయికి చేరి నేను చదివిన వాటిలో చాలా తక్కువ పుస్తకాల గురించి రాయటం జరిగింది. చదవటంలోకి బద్ధకం ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి, పరిస్థితులూ అనుగ్రహించాయి కాబట్టి, ఈ వ్యాసం నిడివి ఎక్కువ ఉండే సూచనలే ఉన్నాయి. కావున తామెల్లరూ భోజనతాంబూలాలు స్వీకరించిన తర్వాత ఇది చదవటం మొదలెట్టమని మనవి. (ఈ లోపు బద్దకం నన్ను పూనేస్తే.. మీకు చాలా శ్రమ తప్పినట్టే!)

(మొత్తానికైతే వీరి గురించి రాశాను: Italo Calvino, Kurt Vonnegut, Milan Kundera, Gulzar, Nani Palkhivala, Mihaly’s Flow)

Italo Calvino రచనలు: నేను తరచుగా చూసే ఒక ఫోటో బ్లాగులో, ఒక ఫోటో కింద ఈ వాక్యాలు కనిపించాయి.

‘I would like to swim against the stream of time: I would like to erase the consequences of certain events and restore an initial condition. But every moment of my life brings with it an accumulation of new facts and each of these new facts brings with it its consequences; so the more I seek to return to the zero moment from which I set out, the further I move away from it; though all my actions are bent on erasing the consequences of previous actions and though I manage to achieve appreciable results in this erasure, enough to open my heart to hopes of immediate relief, I must, however, bear in mind that my every move to erase previous events provokes a rain of new events, which complicate the situation worse than before and which I will then, in their turn, have to try to erase. Therefore I must calculate carefully every move so as to achieve the maximum of erasure with the minimum of recomplication’

ఫోటో కింద ఈ వాక్యాలను విరగొట్టి చేసి ఒక దాని కింద పెట్టుండం వల్ల.. “ఆహా.. భలే ఉందే కవిత” అనుకొని చివర్ననున్న కవి పేరు నోట్ చేసుకున్నా. కాల్వినో పుస్తకం క్రాస్‍వర్డ్ లో కనిపించే సరికి, ఓ చలికాలపు మాసంలో నేను చెయ్యాల్సిన రైలు ప్రయాణానికి “If on a winter’s night, a traveler” పుస్తకం కొన్నాను. ఆ రైలు ప్రయాణంలో ఈ పుస్తకాన్ని ఆస్వాదించాను. second person నరేషన్ లో నే చదివిన మొదటి పుస్తకం ఇదే!

ఇప్పుడీ పుస్తకం కథ చెప్పాలంటే: ఇటాలో కాల్వినో రచించిన ఈ పుస్తకాన్ని కొనటానికని “మీరు” (యు) ఓ పుస్తకాల కొట్టుకెళ్లి “If on a winter’s night, a traveler” కొని ఇంటికి తీసుకెళ్తారు. పుస్తకం చదవటం మొదలెడతారు. మధ్యలో ప్రింటింగ్ తప్పులు ఉండడం వల్ల, మీరీ కాపీ కొట్టుకెళ్లి మార్చుకొస్తారు. అందులో ఏమో ఏకంగా వేరే పుస్తకంలో పేజీలు ఉంటాయి. మీకా కథ నచ్చుతుంది. అందుకని అసలదేం పుస్తకమో అని వెతకడం మొదలెడతారు. ఇలా మీరు మొత్తానికి “If on a winter’s night, a traveler” పుస్తకం ఎలా చదివారు అన్నది తక్కిన కథాంశం. చదువుతున్నంత సేపూ నాకు Mind bogglingly good అనిపిస్తూ ఉండింది. కానీ ఈ పుస్తకం గురించి రాయాలనుకున్న ప్రతీ సారి పుస్తకం తెరవడం, మళ్లీ చదవటం, మళ్లీ mind bogglingly good అననుకోవటం, మళ్లీ రాయాలనుకోవటం, మళ్లీ చదవటం – ఒక లూప్ లో పడిపోయాను. ఈ రచనలో నాకు చాలానే నచ్చాయి, నిజానికి ప్రతి చిన్న విషయమూ నచ్చింది. కాకపోతే ఆ నచ్చటాన్ని ఎలా ప్రదర్శించాలో అర్థం కాదు. అక్కడక్కడా బోర్ కొట్టే అవకాశం ఉన్నా, “If on a winter’s night, a traveler” ఒక అద్భుతమైన రచన. అందులోని కథ, కథనం, శైలి, భాష అన్నీ అనితర సాధ్యం. ఆసక్తిగల వారు పుస్తకం మొదటి చాప్టర్ ఇక్కడ చదవచ్చు.

కాల్వినో ఇటాలియన్ రచయిత. ఆయన రచనలన్నీ దాదాపు అనువాదాలు అయ్యాయి అనుకుంటాను. వింటేజ్ క్లాసిక్స్ ద్వారా లభ్యమయ్యే ఆ అనువాదాలు, కాస్త ఖరీదు ఎక్కువ అనిపించచ్చు. అంతగా పేరు వినని రచయిత, ఇంత ఖర్చు పెట్టి కొనడమెందుకని నేనూ కాస్త తటపటాయించాను మొదట్లో. “If on a winter’s night, a traveler” చదివాక మాత్రం, ఇహ ఆగేది లేదనుకుంటూ “Mr. Palomar” అన్న పుస్తకం చదివాను. పాలొమర్ అనే వ్యక్తి ఒక హాలిడేకి వెళ్లినప్పుడు అతడు చూసిన వింతలూ, విశేషాలూ, అతడి నగరానికి సంబంధించిన కొన్ని వ్యాసాలూ, పాలొమర్ ఒంటిగా ఉన్న వేళల్లో కొన్ని వ్యాసాలూ ఉంటాయి. ఈ పుస్తకం గురించి ఇలా రెండు ముక్కల్లో చెప్పి దానికి అన్యాయం చెయ్యలేను. దీనిపై ఒక వ్యాసం నేను రాసే లోపు, మీరిది చదువుకోండి.

రెండు ముక్కల్లో చెప్పకూడని ఇటాలో మరో రచన “Cosmicomics”. కథలు మనం ఎప్పటినుండి వినటం లేదూ? ఎన్ని కథలు చదువలేదు. ఛాన్స్ ఇవ్వాలే కానీ, మనం ఎన్నేసి కథలు అల్లేయం! అలాంటిది మీరిలాంటి కథలు ఇంతకు ముందు చదవుండరు అని బల్లలు బద్దలుగొట్టి మరీ చెప్తే, మీరేమంటారు? బాబోయ్.. కథలా ఇవి?! క్రియేటివిటీకి పరాకాష్ట! ప్రతీ కథ ఒక సైంటిఫిక్ సూత్రంతో మొదలవుతుంది. ఉదా: మొదటి కథ, మొదట్లో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు అన్న ప్రతిపాదన ఉంటుంది. “అవును, చంద్రుడు చాలా దగ్గరగా ఉండేవాడు. అప్పుడు మేం నిచ్చెనేసుకొని చంద్రుని మీదకెక్కి ఆడుకునే వాళ్లం.” అంటూ కథ చెప్తాడు Qfwfq. ఆ చెప్పటం కూడా ఏం చెప్తాడని?! ఊపిరాడనివ్వడీ కబుర్ల పుట్ట, బడాయి బాబూ! ఎన్నేసి వింతలూ, విశేషాలనీ! అబ్బాయిలూ.. జాగ్రత్తగా వినండి, భూమికింకా ఆకర్షణ శక్తి లేనప్పుడు, విశ్వంలో ఏదో ఒక పాయింట్ నుండి అలా అనంతంలోకి పడిపోతూ, మీతో పాటు మీ మనసు దోచిన సుందరి కూడా పడుతుంటే, ఆమెని అలా చూస్తూ అలా గాల్లో తేలుతుంటే.. ఓ సారి ఊహించుకోండి. ఇదో కథ మాట! చదవాలనిపించటం లేదూ? 🙂 (పుస్తకం ధర వెయ్యి రూపాయలు, నేను హైద్ లాంcalvinoడ్మార్క్ లో కొన్నాను. ఆన్‍లైన్ లో దొరకచ్చు. కమాన్.. గాల్లో ఆమె, మీరూ.. అలా, అలా తేలుతూ, మర్చిపోకండి!)

ఈ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా సార్లు చిన్నపిల్లలా చప్పట్లు కొట్టేశాను. గట్టిగట్టిగా నవ్వేశాను. భారీగా నిట్టూర్చాను. మనం ఉంటాయని ఊహించుకోడానికి కూడా సిద్ధపడలేని ప్రదేశాల్లోకి, పరిస్థితుల్లోకి తీసుకెళ్లి, అక్కడ మనకో ప్రతినిధిని నిల్పి కథ నడిపిస్తూ మనల్ని మనకి చూపించారు రచయిత అనిపించింది. ఇది పిల్లల పుస్తకం కాదు. చిట్టుక్కుమని వెళ్లిపోయిన బాల్యం తాలూకూ వాసనలు ఇంకా వీడక, జీవితానికి అలవాటుపడుతున్న వారి కోసమే ఈ రచన అనిపించింది. బహుశా, నేనా స్టేజిలో ఉండడం కూడా కారణం కావొచ్చు.

ఇటాలో రచనలు సాధారణంగా పుస్తకాలు ఇచ్చే అనుభూతిని కన్నా ఎక్కువనిపిస్తాయి నావరకూ.  ఆయన మొదటి పుస్తకంలో “you” అన్నప్పుడల్లా నన్నే అంటున్నారేమో అన్నంతగా లీనమై చదవటం వల్లో ఏమో, ఇటాలో పుస్తకాలు నాకు ఓ మనిషితో మాట్లాడిన అనుభవాన్ని ఇస్తాయి. Mr. Palomar చదివేటప్పటికి నిశ్శబ్ధం మీద తిరుగుబాటు మూడ్ లో ఉన్నాను. అందులో “పాలొమర్ సైలెన్స్” అన్న వ్యాసం కనిపించేసరికి మొదటదే చదవాలనుకున్నాను. పేజీ తెరచి అక్కడున్నది చదివితే నాకు తిక్కరేగిపోయింది. పుస్తకాలు నచ్చితే చదవటం, లేకపోతే పక్కకు పెట్టేయటం. బా నచ్చిన వాటిని మహా అయితే అప్పుడప్పుడూ అపురూపంగా తడమడం. అంతే! కానీ ఓ పుస్తకం మీద అలిగాను, మొదటిసారిగా, సైలెన్స్ మీద వ్యాసం చదివి. “సిల్లీ మీ!” అని ఇప్పటికీ అనిపించదు. అవును, నా మనోభావాలు దెబ్బతిన్నాయనే అనిపిస్తుంది. అలక తీరి పుస్తకం చదివేసరికి చాలా రోజులు పట్టింది. ఇహ, Cosmicomics గురించైతే చెప్పద్దూ! నన్ను మొత్తంగా ఆవహించేసాయి ఆ రచనలు! చదివినవి మూడు పుస్తకాలే అయినా, గత ఏడాది నేను కాల్వినో చదివుండకపోతే, ఆ స్థానంలో మరో ముప్ఫై పుస్తకాలు వేసుకున్నా ఆ వెలితి తీరేది కాదు. They were soulful experience  for me.

You Might Also Like

6 Comments

  1. Purnima

    Wow! Rushdie speaking on Calvino’s Cosmicomics.. can’t get better..

    http://www.npr.org/templates/story/story.php?storyId=93376041

    I quote:

    “If you have never read Cosmicomics, you have before you 12 of the most joyful reading experiences of your life.”

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! […]

  3. రామ

    చాలా బాగుంది. మీరు చదివిన పుస్తకాల మాటేమో కాని, మీ సమీక్షలు చాలా తొందరగా చదివించాయి. తరవాతి పేజి నెంబర్ మీద నొక్కి, “ఇంకా లోడ్ అవదు ఏమిటిరా బాబూ” అనుకున్నా రెండు సార్లు :). విపులం గా వ్రాసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో నాకు రెఫెరెన్సు గా తప్పక పనికి వస్తుంది ఈ లిస్టు (మొన్న చదివిన జంపాల గారి లిస్టు కూడా – ఇవన్నీ చూస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం లో ఎన్ని చెయ్యచ్చో తెలుస్తోంది – కొండొకచో కిందటి ఏడాది నేను ఏమి చేసి ఉండల్సిందో కూడా).

  4. Rao S Vummethala

    Nice article. The author successfully takes along with her. Good work.
    Keep it up Poornima garu!

  5. సౌమ్య

    Good article!!

Leave a Reply