Resources: Book Sneeze – బ్లాగర్ల కొరకు పుస్తక సమీక్షా కార్యక్రమం.
అమెరికన్ పుస్తక విపణిలోని పెద్ద పబ్లిషర్లలో థామస్ నెల్సన్ ఒకటి. తమ ప్రచురణల ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు థామస్ నెల్సన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. అదే Book Sneeze – బ్లాగర్ల కొరకు పుస్తక సమీక్షా కార్యక్రమం.
మీరు పుస్తకపఠనాభిలాష కలిగిన బ్లాగరులై ఉంటే, పుస్తక సమీక్షలు వ్రాయటం మీరు ఆస్వాదిస్తే, ఈ కార్యక్రమం మీలాంటి వారి కోసమే. Book Sneeze సైటులో థామస్ నెల్సన్ వారు తమ ప్రచురణలనుంచి ఎన్నుకున్న పుస్తకాల ను కొన్నింటిని కాటలాగ్ చేసి ఉంచారు. మీరు ఆ సైటులో సభ్యత్వాన్ని నమోదు చేసుకుని, అందుబాటులో ఉన్న పుస్తకాల్లోంచి ఒకటి ఎన్నుకుంటే, థామస్ నెల్సన్ వారు ఆ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తారు. మీరు చెయ్యవలసిందల్లా, ఆ పుస్తకాన్ని చదివి మీ బ్లాగులోనూ, ఇంకా ఏదేని ఒక పుస్తక విక్రయ సైటులోనూ (ఉదా: amazon.com, barnesandnoble.com, booksamillion.com, borders.com) ఒక సమీక్ష వ్రాయాలి. సమీక్ష వ్రాసిన టపాల లంకెలను తిరిగి Book Sneez కు సమర్పిస్తే, మరో పుస్తకాన్ని తెప్పించుకోవటానికి అర్హులౌతారు. మీరు సమర్పించిన లంకెలు వారు తమ సైటులో ఉటంకిస్తారు. తద్వారా మీ బ్లాగుకు నూతన పాఠకులకూ చేరుతుంది (well.. If that matters to you)
ఉచితంగా పుస్తకాలు దొరుకుతాయని కాదు గానీ, ఈ మొత్తం ఆలోచన నాకు బాగా నచ్చింది. MBA వాళ్ళు అప్పుడప్పుడూ మాట్లాడుతుంటారు చూడండి win-win situation అని, ఇదే! మనదేశపు పబ్లిషర్లు దీన్ని కాపీ కొట్టేంతగా థామస్ నెల్సన్ వాళ్ళ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను!!
మీలో ఆసక్తి ఉన్నవారు ఇక్కడ నొక్కి, సభ్యులు గా నమోదు కండి. ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాలు ఇవీ. ప్రస్తుతానికి జాబితా చిన్నదే అయినా, నిస్సందేహంగా త్వరలోనే మరిన్ని పుస్తకాలు చేరుస్తారు. ఇంకేం మరి, ఒక పుస్తకాన్ని తెప్పించుకుని, సమీక్ష రాసి పడేసి (పన్లో పని గా దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి పుస్తకం.నెట్ లో వెయ్యటం మర్చిపోకండి ) ముందుకు దూసుకెళ్లండి.
అన్నట్టు సమీక్షలు ఎలా ఉండాలి అన్న విషయం పై వారికి కొన్ని ఆలోచనలున్నాయి – ఇక్కడ చూడండి.
రంజన్
బూక్ స్నీజ్ లో సమీక్షలు రాస్తానో లేదో తెలియదు కాని పుస్తకం.నెట్ లో మాత్రం నేను చదివిన పుస్తకాల సమీక్షలు రాయాలని ఎంతో కుతూహలంగా ఉంది.త్వరలో నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నాను.
RK
@Purnima: Most of the books listed at the moment are not that great, but surely the list will grow.
Purnima
I think those reviews can be posted here, without any translations as such.
But I didn’t find the books cater to my tastes.
perugu
Fine..Good scheme..Hope to see reviews there and
Translations here..
cbrao
బాగుంది. నేను కూడా ఇలాంటి పధకం ప్రవేశ పెడతాను.
సౌమ్య
Interesting!!!