2009లో నా పుస్తకాలూ! – 1

Kurt Vonnegut రచనలు: దేవుడి మీద నా నమ్మకం గురించి పక్కకి పెడితే, మానవ మాత్రుల్లో కొందరిని దేవుడుగా ఇన్స్టాల్ చేయడం లో నాకెలాంటి అభ్యంతరాలు లేవు. క్రికెట్ లో సచిన్ లా, సాహిత్యం లో ఎవరని ఎదురుచూస్తూ ఉన్నా. నచ్చిన రచయితలూ, మా బా నచ్చిన రచయితలూ ఉన్నారే తప్ప.. “నీవే నా సర్వమూ” అన్నంత భారీ రేంజ్ లో ఎవరూ లేకపోయారు. ఓ రోజు ఊసుపోక ఏదో విషయంపై quotations కోసం గూగుల్ చేసాను. అప్పడీ కింద కోట్ కళ్ళబడింది.

“I don’t like film. Film is too clankingly real, too permanent, too industrial for me. … The worst thing about film, from my point of view, is that it cripples illusions which I have encouraged people to create in their heads. Film doesn’t create illusions. It makes them impossible. It’s a bullying form of reality, like the model rooms in the furniture department of Bloomingdale’s.”

“It’s a bullying form of reality..” – అవును, అందుకే నాకు సినిమాలు ఎక్కవు. ఇది చదివే వరకూ ఇదే కారణమని నాకు తెలీలేదు. మనకి తెల్సునన్న సంగతి తెలియజెప్పే వారే గురువు కాబట్టి.. కర్ట్ ని తత్క్షణమే గురువు  స్థానంలో పెట్టేసాను. పెట్టేక, ఒక్క పుస్తకం కూడా చదవకపోతే బాగోదు అనుకుంటూ, “Hocus Pocus”, “Slapstick” అని రెండు రచనలు మొదలెట్టాను.

స్లాప్‍స్టిక్ రచన కర్ట్ తన చెల్లి కోసం రాశారు. ప్రాణాంతకమైన జబ్బు చేసి చివరి దశలో ఉన్న ఆమెకి, తన తదనంతరం పిల్లల్ని చూసుకోవాల్సిన తన భర్తే ఒక ఆక్సిడెంట్ లో చనిపోయారని తెల్సినప్పుడు, “My life is a Slapstick” అని వాపోతారు.  అందుకే అదే పేరు పెట్టి, కర్ట్ ఈ రచన చేశారు. ఇందులో, ఆయనా, ఆయన చెల్లిని మానవులకి పుట్టిన రాక్షసులుగా చిత్రీకరించి, ఆ పిల్ల జీవన విధానాన్ని చెప్తారు.  ఈ పుస్తకంలో ఒక చోట వచ్చే వాక్యం:

I wish that people who are conventionally supposed to love each other would say to each other, when they fight, “Please — a little less love, and a little more common decency.”

ఇది చదవగానే కర్ట్ ని మరో ఆలోచన లేకుండా నా ఆరాధ్యుల లిస్ట్ లో చేర్చేశాను. ఈ వాక్యాన్ని కుదించి, “లెస్స్ లవ్.. మోర్ కామన్ డీసెన్సీ గురూ!” అనే మంత్రంగా చేసేశాను. అంతగా నన్ను ప్రభావితం చేసింది. ప్రేమిస్తున్నాం అనో, సన్నిహితంగా ఉండే చనువు ఉందనో మనం మనవాళ్లతో చాలా సార్లు “taken for granted” గా వ్యవహరిస్తూ ఉంటాం. మనకి వాళ్ల మీద సర్వహక్కులూ రాసిచ్చేసినా, వాళ్లని మన వెర్రి ప్రేమతో ఇబ్బంది పెట్టడం ఎంత వరకూ సమంజసం అన్న విధంగా ఆలోచనలు రేపింది.

“Slapstick may be a very bad book. I am perfectly willing to believe that.” అని కర్ట్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆ పుస్తకం చదవడానికి నేనూ కాస్త ఇబ్బంది పడ్డాను. భాష వల్ల, కొన్ని పదప్రయోగాల వల్ల, అందులో ఉన్న డార్క్ కామెడీ వల్ల అనుకుంటా. ఒకానొక స్టేజిలో పుస్తకం ఆపేద్దాం అనుకున్నాను. అయితే ఈ పుస్తకం కర్ట్ గురించి చాలా ఆసక్తిని రేపింది. ఇది మంచి రచనో కాదో నేను చెప్పలేను కానీ, కర్ట్ ని చదవాలన్న కోరిక మాత్రం బలపడింది.
Hocus Pocus – రచయిత యుద్ధంలో పాల్గొనేటప్పుడు, దొరికిన ప్రతీ చిన్న కాగితం ముక్క మీదా రాస్తూ ఈ నవల్ని రాశారు. అందుకని చాలా చిన్ని చిన్ని పేరాలు ఉంటాయి. నాకు నచ్చిందీ రచన.

వాన్‍గట్ హాస్యం విలక్షణంగా ఉంటుంది. కొన్ని వాక్యాలు చదువుతుంటే, చాలా ఆప్తుడైన కండబలమున్న స్నేహితుడు జోకు చెప్పిన ప్రతీ సారి జబ్బ మీద బలంగా గుద్దినట్టు ఉంటుంది. kurt_vonnegutజోకు బాగుంటుంది కాబట్టి నవ్వు వస్తుంది. కానీ కొట్టాడు కాబట్టి నొప్పి కూడా వస్తుంది. నొప్పీ, నవ్వుల జుగల్బందీ చేయించడంలో కర్ట్ సిద్ధహస్తుడు. దేవుడు మానవుణ్ణి తయారుచేస్తున్నప్పుడు వాన్‍గట్ ని పక్కన పెట్టుకునుంటే “నవ్వేడుపు” అనే కొత్త భావం కూడా పెట్టేవాడేమో. నవ్వు గురించి వాన్‍గట్ అన్న మాటలు, మరో రచన నుండి:

Laughs are exactly as honorable as tears. Laughter and tears are both responses to frustration and exhaustion, to the futility of thinking and striving anymore. I myself prefer to laugh, since there is less cleaning up to do afterward — and since I can start thinking and striving again that much sooner.

మొన్నే కర్ట్ కొడుకు, మార్క్ వాన్‍గట్ వాళ్ల నాన్న గురించి రాసిన ఒక వ్యాసం చదివాను. “కర్ట్ ని చదవటం వల్ల చదవటం ఎలానో, రాయటం ఎలానో తెలుస్తుంది. ఆయన రచనలు చదువుతూ కూడా ఎలా చదవాలి, ఎలా రాయాలి అన్న వాటిపై మీకు ఆసక్తి కలగపోతే, మీరు వేరే ఏమైనా చేస్తుండాలి, చదవటం, రాయటం కాక!” అని అన్నారు.  నిజం! కానీ నేను మాత్రం కర్ట్ కి మరెన్నో కారణాల వల్ల అభిమానిని అయ్యాను. ఆయన దగ్గరో అస్త్రం ఉంది. నవ్వుతూ నవ్విస్తూ నిజాల్ని పుసుక్కుమని చెప్పేయటం. ఆయన రచనలన్నీ నేను ఇంకా చదవకపోయినా, వాటి సారాంశాన్ని “How embarrassing to be human.” అనే ఈ ఒక్క లైనులో పట్టుకోవచ్చేమో అనిపిస్తూ ఉంటుంది.

ఈయన రచనలు నాకు చాలా కీలక సమయంలో పరిచయమయ్యాయి. నా దృక్పథాన్ని ప్రభావితం ఛేశాయి. Kurt Vonnegut is undeniably my find of the year.

You Might Also Like

6 Comments

  1. Purnima

    Wow! Rushdie speaking on Calvino’s Cosmicomics.. can’t get better..

    http://www.npr.org/templates/story/story.php?storyId=93376041

    I quote:

    “If you have never read Cosmicomics, you have before you 12 of the most joyful reading experiences of your life.”

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! […]

  3. రామ

    చాలా బాగుంది. మీరు చదివిన పుస్తకాల మాటేమో కాని, మీ సమీక్షలు చాలా తొందరగా చదివించాయి. తరవాతి పేజి నెంబర్ మీద నొక్కి, “ఇంకా లోడ్ అవదు ఏమిటిరా బాబూ” అనుకున్నా రెండు సార్లు :). విపులం గా వ్రాసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో నాకు రెఫెరెన్సు గా తప్పక పనికి వస్తుంది ఈ లిస్టు (మొన్న చదివిన జంపాల గారి లిస్టు కూడా – ఇవన్నీ చూస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం లో ఎన్ని చెయ్యచ్చో తెలుస్తోంది – కొండొకచో కిందటి ఏడాది నేను ఏమి చేసి ఉండల్సిందో కూడా).

  4. Rao S Vummethala

    Nice article. The author successfully takes along with her. Good work.
    Keep it up Poornima garu!

  5. సౌమ్య

    Good article!!

Leave a Reply